నర్రా విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్రా విజయలక్ష్మి (అక్టోబర్ 24, 1953) ప్రముఖ రంగస్థల నటి. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.

జననం

[మార్చు]

వీరు 1953, అక్టోబర్ 24 న శ్రీమతి నర్రా యశోదమ్మ, రామస్వామి దంపతులకు జన్మించారు. ఈవిడకు చిరుప్రాయంలో భరతనాట్యంలో శిక్షణ ఇచ్చిన గురువు వేదాంత జగన్నాథశర్మ. నాటకరంగ గురువు ఎర్రంనేని చంద్రమౌళి.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

1967లో జీవనశ్రీ రచనకు ఎర్రంనేని చంద్రమౌళి దర్శకత్వంలో రవీంద్రభారతిలో ప్రదర్శించిన ‘దేవాంగపిల్లలు’ నాటిక ద్వారా రంగస్థల నటనకు నాంది పలికారు. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు.

సత్యహరిశ్చంద్ర, భూకైలాస్, మాయాబజార్, బాలనాగమ్మ, కన్యాశుల్కము, వరవిక్రయము, దైవశాసనము, కప్పలు, సంఘం చెక్కిన శిల్పం, నటనాలయం, పసుపు బొట్టు పేరంటం, పుణ్యస్థలి, కళ్ళు, తెర వెనుక, కంచికి చేరనొ కథ, పైడిరాజు, మహానటి మొదలగు నాటిక/నాటకాల్లో నటించారు. కాగా అనేక తమిళ, హిందీ నాటకాలలో కూడా నటించారు. మంచి నటిగా గుర్తింపబడి ప్రముఖ సాంస్క తిక సంస్థలచే సత్కారాలు అందుకొన్నారు. ప్రభుత్వ సాంస్కృతికశాఖ వారిచే వివిధ సందర్భాల్లో నాలుగుసార్లు సత్కరింపబడ్డారు. ఢిల్లీలోని శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్సు వారిచే, ముంబాయి, కలకత్తా, పూణే, నాగపూర్, హస్సాన్, భోపాల్ లోని సాంస్కృతిక సంస్థల సత్కారాన్ని పొందారు. యువ కళావాహిని – హైదరాబాదు వారు కీ.శే. శశికుమార్ శ్యాండిల్యా స్మృత్యర్థం ప్రధానం చేసే ‘బంగారు పతకాన్ని’ అందుకున్నారు. ఉత్తమ రంగస్థల నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈవిడ సినీరంగ ప్రవేశం కూడా గావించారు. మెకన్సాస్ గోల్డ్ చిత్ర దర్శకుడు జేమ్సు జావర్ దర్శకత్వంలో శశికపూర్ నిర్మించిన ఆంగ్ల చిత్రం Heat and Dust లోనూ, మరెన్నో తెలుగు సినిమాల్లో నటించారు. గౌంతంఘోష్, శ్యామ్ బెనగల్, మృ ణాల్ సేన్ తదితర ప్రముఖ సినీ దర్శకుల చిత్రాలలో నటించారు. ఈవిడ దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.

మూలాలు

[మార్చు]

విజయలక్ష్మి నర్రా, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 100.