నర్సింగ్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్సింగ్ యాదవ్
Narsingyadav.jpg
నర్సింగ్ యాదవ్
జననం (1968-01-26) 1968 జనవరి 26 (వయస్సు: 52  సంవత్సరాలు)
భారతదేశం హైదరాబాదు, భారత దేశం
ఇతర పేర్లు నర్సింగ్
ప్రముఖ పాత్రలు క్షణ క్షణం
మనీ
మనీ మనీ
ఠాగూర్
ఐతే
పోకిరి

నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు.[1] ఇతడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నర్సింగ్ యాదవ్ హైదరాబాదులో రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని న్యూ సైన్సు కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివాడు. ఆయన భార్య చిత్ర యాదవ్. కుమారుడు రుత్విక్.

సినిమా[మార్చు]

నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం. నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. తర్వాత చిరంజీవి తన సినిమాలు చాలా వాటిలో అవకాశం ఇచ్చాడు.[3]

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

 1. ఎటాక్ (2016)
 2. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
 3. విశాఖ ఎక్స్ ప్రెస్ (2008)
 4. వియ్యాలవారి కయ్యాలు (2007)
 5. యమదొంగ (2007) ... యమకింకరుడు
 6. ఆట (2007)
 7. జగడం (2007)
 8. గుండమ్మ గారి మనవడు (2007)
 9. సైనికుడు (2007)
 10. దేశముదురు (2007)
 11. పోరంబోకు (2007)
 12. అన్నవరం (2007)
 13. అమ్మచెప్పింది (2007)
 14. 4 బాయ్స్ (2007)
 15. రూమ్ మేట్స్ (2006)
 16. పోకిరి (2006) .... రౌడీ దాసన్న
 17. పౌర్ణమి (2006) .... నౌకరు
 18. నువ్వే (2006) .... కథానాయిక తండ్రి
 19. పైసాలో పరమాత్మ (2006)
 20. హంగామా (2005)
 21. అందరూ దొంగలే దొరికితే (2005)
 22. శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ (2005)
 23. అనుకోకుండా ఒకరోజు (2005) .... మాచవరపు అబ్బులు
 24. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
 25. లేత మనసులు (2004)
 26. మధ్యాన్నం హత్య (2004)
 27. అడవి రాముడు (2004)
 28. మాస్ (2004)
 29. శంకర్‌దాదా M.B.B.S (2004)
 30. సై (2004)
 31. ఠాగూర్ (2003)
 32. జానీ (2003)
 33. ఐతే తెలుగు సినిమాలు 2003 .... మంత్రి
 34. అదృష్టం (2002)
 35. ఇడియట్ (2002).... రౌడీ, రాజకీయనాయకుడు
 36. వలయం (2002).... రాజకీయ నాయకుడు
 37. హైదరాబాద్ (2001) .... నర్సింగ్
 38. మాస్టర్ (1997)
 39. అల్లరి ప్రేమికుడు (1994) .... రౌడీ
 40. గాయం (1993) .... నర్సింగ్
 41. మాయలోడు (1993)
 42. క్షణ క్షణం (1991) .... నర్సింగ్

హిందీ[మార్చు]

 1. దౌడ్ (1997) .... ఇన్స్ పెక్టర్ రాణా

మూలాలు[మార్చు]

 1. "మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెబ్ సైటులో నర్సింగ్ ఫ్రొఫైలు". maastars.com. MAA. Retrieved 28 September 2017.
 2. "తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్". nettv4u.com. Retrieved 28 September 2017.
 3. "వర్మ మొదటి మెట్టయితే.. చిరంజీవి రెండో మొట్టు: నర్సింగ్ యాదవ్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 28 September 2017.

బయటి లింకులు[మార్చు]