Jump to content

నల్గొండ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్
రకం
రకం
నగర పాలక సంస్థ
చరిత్ర
స్థాపితం2026 జనవరి
నిర్మాణం
సీట్లు48 డివిజన్లు
రాజకీయ వర్గాలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
నల్గొండ

నల్గొండ నగరపాలక సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని నగరపాలక సంస్థలలో ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండలో శివారు గ్రామాలను విలీనం చేసి 48 వార్డులతో 2018 ఫిబ్రవరి 3న స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయగా 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనవరి 2026లో 48 డివిజన్లతో నల్గొండను కార్పొరేషన్‌గా ఏర్పాటైంది.[1][2]

పాలక మండలి

[మార్చు]

ప్రజల ద్వారా ఎన్నికయ్యే కార్పొరేటర్లతో పాలక మండలి ఏర్పడుతుంది. పాలక మండలి పదవీ కాలం ఐదేళ్ళు.

నల్లగొండ మహానగర ప్రాంతంలోని 48 వార్డులలో ఒక్కొక్క వార్డు నుండి ఒక్కో సభ్యుని చొప్పున 48 మంది కార్పొరేటర్లు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రజలు ఎన్నుకుంటారు. వీరు కాక నల్గొండ జిల్లా పరిధిలోని ప్రజా ప్రాతినిధ్య పదవి (శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వగైరా) రీత్యా, పాలక మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యులుగా చేరతారు. వీరంతా కలిసి మేయరును ఎన్నుకుంటారు.

2026 ఎన్నికలు

[మార్చు]

నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉండగా జనరల్ 21, జనరల్ మహిళ 13, బీసీ జనరల్ 8, బీసీ మహిళ 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళ 3, ఎస్టీ జనరల్ 1 కేటాయించారు. ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం లక్షా 42 వేల 437 మంది ఓటర్లు ఉండగా మహిళలు 73 వేల 507 మంది, పురుషులు 68 వేల 874 మంది ఉన్నారు. పోలింగ్‌ కోసం 199 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో 32వ డివిజన్‌ నుండి పోటీ చేసిన మున్సిపల్‌ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి సతీమణి బుర్రి చైతన్య రెడ్డిని ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.[3]

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటైన తరువాత తొలిసారి 2026 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగగా 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఐఎన్‌సీ 27, బిఆర్ఎస్ 9, ఎఐఎఫ్‌బి 4, ఎంఐఎం 2, బీజేపీ 1, స్వతంత్రులు 2 స్థానాలను గెలుచుకున్నారు.[4] ఈ ఎన్నికలలో 37 మంది తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.[5][6]

ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో మేయర్‌గా బుర్రి చైతన్య రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా అష్రఫ్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[7][8][9][10]

డివిజన్ విజేత[11][12] రన్నర్ అప్ మెజారిటీ
నెం అభ్యర్థి రిజర్వేషన్[13] పార్టీ ఓట్లు అభ్యర్థి పార్టీ ఓట్లు
1 ఆలకుంట్ల నాగరాజు బీసీ (జనరల్) ఐఎన్‌సీ
2 పెరిక యాదయ్య ఎస్సీ (జనరల్) బిఆర్ఎస్
3 పేర్ల మల్లీశ్వరి ఎస్సీ (మహిళా) బిఆర్ఎస్
4 రత్నగిరి తారకమ్మ ఎస్సీ (మహిళా) బిఆర్ఎస్
5 పున్న జ్ఞానేశ్వరి ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
6 కుందురు దీపిక ఆన్ రిజర్వ్ (మహిళా) బిఆర్ఎస్
7 మారగోని భవాని ఆన్ రిజర్వ్ (మహిళా) బిఆర్ఎస్
8 వజ్జ సంతోషిణి బీసీ (మహిళా) ఐఎన్‌సీ
9 బనావత్ దీప్లా నాయక్ ఎస్టీ (జనరల్) బిఆర్ఎస్
10 పిల్లి కృష్ణంరాజు ఆన్ రిజర్వ్ (జనరల్) ఎఐఎఫ్‌బి
11 పాలకూరి సుమలత ఆన్ రిజర్వ్ (మహిళా) ఎఐఎఫ్‌బి
12 మామిడి క్రాంతి కుమార్ ఎస్సీ (జనరల్) ఐఎన్‌సీ
13 గుమ్ముల జానకి ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
14 బొజ్జ శంకరయ్య ఎస్సీ (జనరల్) ఐఎన్‌సీ
15 దొడ్డి రమేష్ ఎస్సీ (జనరల్) బిఆర్ఎస్
16 పెరిక స్వాతి ఎస్సీ (మహిళా) ఐఎన్‌సీ
17 మందాడి లిఖిత ఆన్ రిజర్వ్ (మహిళా) బిఆర్ఎస్
18 ఆలకుంట్ల ఝాన్సీ రాణి బీసీ (మహిళా) ఎఐఎఫ్‌బి
19 గోగుల గణేష్ ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
20 అల్లి సుభాష్ చంద్రబోస్ ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
21 మొహమ్మద్ ఇబ్రహీం ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
22 అమీనా ఫర్హీన్ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
23 మహమ్మద్ మహాబూబ్ అలీ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
24 గోపగాని స్వాతి బీసీ (మహిళా) బిఆర్ఎస్
25 వంగూరి నవ్య శ్రీ ఆన్ రిజర్వ్ (మహిళా) బీజేపీ
26 గౌసియా బేగం బీసీ (మహిళా) స్వతంత్ర
27 సత్తు రేవతి బీసీ (మహిళా) బీజేపీ
28 గుండెబోయిన పుష్పలత బీసీ (మహిళా) ఐఎన్‌సీ
29 మొహమ్మద్ ఖాజా షమియుద్దీన్ ఆన్ రిజర్వ్ (జనరల్) ఎంఐఎం
30 మారగోని నవీన్ కుమార్ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
31 కౌసర్ ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
32 బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
33 రెగట్టే అండాలు ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
34 ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
35 ఇటికాల మంగమ్మ బీసీ (మహిళా) ఐఎన్‌సీ
36 గంట్ల అనంత రెడ్డి ఆన్ రిజర్వ్ (జనరల్) స్వతంత్ర
37 రామగిరి అఖిల్ ఆన్ రిజర్వ్ (జనరల్) బీజేపీ
38 బోయినపల్లి వేదశ్రీ బీసీ (మహిళా) ఐఎన్‌సీ
39 దాసరి సాయి కుమార్ బీసీ (జనరల్) బీజేపీ
40 బొడ్డుపల్లి లక్ష్మి ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
41 కేసాని వేణుగోపాల్ రెడ్డి ఆన్ రిజర్వ్ (జనరల్) ఐఎన్‌సీ
42 అల్లి నాగలక్ష్మి ఆన్ రిజర్వ్ (మహిళా) ఎఐఎఫ్‌బి
43 ఎండి ఖలీల్ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
44 ముహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
45 ముహమ్మద్ అష్రాఫ్ అలీ బీసీ (జనరల్) ఐఎన్‌సీ
46 మహమ్మద్ రఫియోద్దీన్ ఆన్ రిజర్వ్ (జనరల్) ఎంఐఎం
47 - అబ్బగోని కవిత ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ
48 యమా కవితరాణి ఆన్ రిజర్వ్ (మహిళా) ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "నెరవేరిన నల్గొండ వాసుల కల.. కార్పొరేషన్ గా మారిన నల్గొండ". V6 Velugu. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  2. "మున్సిపల్‌ కార్పొరేషన్‌గా నల్లగొండ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మహానగరంగా మారుస్తూ తీర్మానం అమోదం". NT News. 7 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  3. "నల్గొండ కార్పొరేషన్‌లో ప్రధాన పార్టీల హోరాహోరీ - మేయర్​ దక్కించుకోవడంపైనే దృష్టి". ETV Bharat News. 5 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026. {{cite news}}: zero width space character in |title= at position 55 (help)
  4. "కరములెత్తి.. వరములిచ్చె." Eenadu. 14 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  5. "కొత్తవారే అధికం." Eenadu. 14 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  6. "నీలగిరిలో 37 మంది కొత్త వారే." Sakshi. 14 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  7. "ఉమ్మడి నల్గొండలో మేయర్‌, ఛైర్‌పర్సన్లు వీళ్లే." Eenadu. 16 February 2026. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
  8. "తెలంగాణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక". Zee News Telugu. 16 February 2026. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
  9. "ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే." Andhrajyothy. 16 February 2026. Archived from the original on 17 February 2026. Retrieved 17 February 2026.
  10. "తెలంగాణలోని కొత్త మేయర్లు, డిప్యూటీ మేయర్లు వీరే - కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే?". ETV Bharat News. 16 February 2026. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
  11. "నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు 2026". Eenadu. 13 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
  12. "తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు 2026". Eenadu. 14 February 2026. Archived from the original on 14 February 2026. Retrieved 14 February 2026.
  13. "నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు". Disha Daily. 17 January 2026. Retrieved 15 February 2026.