నల్లగుంట్ల (కొమరోలు)
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°18′58″N 79°00′07″E / 15.316°N 79.002°ECoordinates: 15°18′58″N 79°00′07″E / 15.316°N 79.002°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 10.12 కి.మీ2 (3.91 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,273 |
• సాంద్రత | 220/కి.మీ2 (580/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 912 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523369 ![]() |
నల్లగుంట్ల, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 369., ఎస్.టి.డి. కోడ్ = 08405.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
కొమరోలు 5 కి.మీ,దద్దవాడ 6 కి.మీ,ఇడమకల్లు 6 కి.మీ,కొంగలవీడు 9 కి.మీ,తాటిచెర్ల 10 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
కొమరోలు 4.6 కి.మీ,గిద్దలూరు 12.7 కి.మీ,రాచెర్ల 17.2 కి.మీ,బెస్తవారిపేట 28.7 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన గిద్దలూరు మండలం,ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కలసపాడు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
- శ్రీ సీతారామాలయం:- ఈ గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ సీతారామాలయం ధ్వజస్తంభ, అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2016,మే-12వ తేదీ గురువారంనాడు, తిరిగి పునఃప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. [6]
- నల్లగుంట్ల సమీపంలోని మందల నరవ వద్ద వెలసిన శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మే నెల 10వ తేదీ శుక్రవారం, వైశాఖ శుక్ల దశమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [2]
- శ్రీ పెద్దమ్మ ఆలయం.
- శ్రీ అంకలమ్మ ఆలయం.
- శ్రీ పోలేరమ్మ ఆలయం:- వర్షాలు కురిసి గ్రామంలో సుఖశాంతులు వర్ధిల్లాలని గ్రామస్థులు 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు చల్లకడవల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు కడవలకు ప్రత్యేకపూజలు నిర్వహించి శ్రీ పెద్దమ్మ ఆలయం, శ్రీ అంకలమ్మ ఆలయం. శ్రీ పోలేరమ్మ ఆలయాలలో నైవేద్యాలు సమర్పించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు[మార్చు]
(1) నల్లగుంట్ల గ్రామ సమీపంలోని మందల నర్వ సర్వే నం. 591 లో, సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో, తెల్లరాతి నిక్షేపాలు ఉన్నాయి. ఈ తెల్లరాయిని ఎక్కువగా గాజు సంబంధిత పరిశ్రమలలో ఉపయోగించెదరు. [5]
(2) 2017,జులై-2న విడుదల చేసిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షా ఫలితాలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ మేడం జ్యోతింద్రారెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల కుమార్తె సబితారెడ్డి, రాష్ట్రస్థాయిలో 804 వ ర్యాంక్ సాధించింది. [7]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,273 - పురుషుల సంఖ్య 1,189 - స్త్రీల సంఖ్య 1,084 - గృహాల సంఖ్య 582;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,326.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,195, మహిళల సంఖ్య 1,131, గ్రామంలో నివాస గృహాలు 525 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,012 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-10; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-3; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-26; 14వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-30; 11వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016,మే-13; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017,జులై-4; 5వపేజీ.