నల్లమలలో యురేనియం అన్వేషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు
కడపవైఎస్ఆర్ జిల్లా జిల్లాలో నల్లమల అడవులు

దక్షిణ భారతానికే తలమానికం అయిన నల్లమల అడవులు దట్టమైన అభయారణ్యాలతో, అరుదైన జంతు జాతులు, ఎటు చూసినా కొండలు లోయలతో ఎత్తైన చెట్లను కలిగి జీవ వైవిధ్యానికి ఊపిరిగా ఉంది. నల్లమల అభయారణ్యం లో అధికారులు ప్రజలకు తెలియకుండా ఎన్నో వందల బోర్లు వేశారని ఇది యురేనియం అన్వేషణ నమూనాల కోసమని ప్రజలు ఆలస్యంగా గుర్తించారు.

నేపధ్యం[మార్చు]

పచ్చని నల్లమల అడవులు బూడిదగా మారిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్​లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్​ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. డ్రిల్లింగ్​యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్​మ్యాప్ సిద్ధం చేశారు.

నల్లమల అభయారణ్యం లో యురేనియం అన్వేషణకు, వెలికితీత కు ప్రయత్నాలు జరిగాయి. [1]

యురేనియం వెలికితీత ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి, తెలుగు జాతికి, ప్రజల ఆరోగ్యంపై కూడా ఎన్నటికీ తీరని చేటు చేస్తుంది. యురేనియం వెలితీస్తే ఈ ప్రాంతములొని వన్య ప్ర్రాణులకు, అరుదైన వ్రుక్ష జాలనికి, ఆదివాసీలకు , విశాలమైన అడవికి, నదీ ప్రవాహకాలకు ఎంతొ ముప్పు జరుగుతుంది. నదులు కలుషితం అవుతాయి. ప్రజల జీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఎన్నడూ చూడని శారీరక వ్యాధులకు తెలుగు వారందరూ గురి అవుతారు. యురేనియం భూమిలో ఉన్నంత వరకు ఏమి కాదని, కాని ఒక్కసారి భూమిలోనుండి వాతావరణం లోకి వస్తే దాని రేడియొ ధార్మికత గాలిలో నీటిలో కలిసి జీవావరణం దెబ్బతింటుందని తెలుగు రాష్ట్రాలలోని పర్యావరణ వేత్తలు, ప్రజలు ఆందోళన చెందారు.

యురేనియం వెలికితీత వల్ల కలిగే నస్టాలు[మార్చు]

 1. 4000 లోతైన బోర్లు అమ్రాబాద్ పులుల అభయారణ్యం లో వేయడం వల్ల అడవి నాశనం అవుతుంది.
 2. ఈ అన్వేషణ వల్ల నాగార్జున సాగర్ జలాశయం లోని నీరు, భూగర్భ జలాలు తాగునీరు విషతుల్యం అవుతాయి.
 3. రోడ్లు ఇంకా దీని తర్వాత జరిగే అభివృద్ది కార్యకలాపాల వల్ల అడవులు క్షయానికి గురికాబడుతాయి.
 4. అరుదైన జీవరాసులు, వృక్షాలు ఒక్కటేమిటి మొత్తం జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతాయి.
 5. ఝార్ఖండ్లోని జాదుగూడలో జరిగినట్టుగా దీని నుండి వెలువడే అణుధార్మికత కారణంగా చుట్టు పక్కల నివాసం ఉండే మనుషుల జీవితాలకు హాని జరుగుతుంది.

ప్రజా ఉద్యమము[మార్చు]

ప్రసార సాధనల్లోనూ ప్రజలు, నాయకులు, సినీ ప్రముఖులు దీని దుష్ప్రభావాలపై గళమెత్తారు. సామాజిక మధ్యమాలలోనూ ప్రజలు దీని గురించి #SaveNallamla హష్టాగ్ తో నిరసన తెలిపారు. యురేనియం సర్వే గురించి తెలియగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. వీలైన చోట్ల అడ్డుకున్నారు.

యురేనియం మైనింగ్ వల్ల అడవి చుట్టూ ఉన్న కృష్ణానది కలుషితం అవుతుందని కూడా ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక్కడ అడవులలో జరుగుతున్న అనేక అగ్ని ప్రమాదాలు, ఎక్కడంటే అక్కడ బోర్లు వేసి నమూనాలు తీసుకు వెళ్ళడం పై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నల్లమలలో యురేనియం అన్వేషణకు భారత ప్రభుత్వం అనుమతించరాదని కోరుతూ శాసన సభ తీర్మానం చేసింది.

స్పందించిన ప్రముఖులు, రాజకీయ పక్షాలు[మార్చు]

విజయ్ దేవరకొండ: ప్రముఖ యువ నటుడు విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాలలో యురేనియం అన్వేషణను వ్యతిరేకించారు. ప్రసార మాధ్యమాలు , సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాలలో యురేనియం పై తన అభిప్రాయాన్ని ఆందోళనను తెలిపారు. "యురేనియం కొనవచ్చు, అడవులను కొనగలమా ?" అని ప్రశ్నించారు. ""యురేనియం తవ్వకాలతో నల్లమలలోని కొన్ని వేల ఎకరాలలో అటవీ ప్రాంతం ధ్వంసం కానుంది. మనం సరస్సులను , సహాజవనరులను నాశనం చేసుకున్న ప్రాంతాలలో అతివృస్టి అనా వృస్టి చూశాం. తాగునీటి వనరులు కూడా కలుషితం అయ్యాయి ఎక్కడా స్వచ్చ మైన గాలి దొరకడం లేదు . చాలా నగరాల్లో నీరు కూడా సరిగ్గా దొరకడం లేదు. కానీ మనం మాత్రం ఇంకా మిగిలి ఉన్న ఆ కొన్ని సహజ వనరులను నాశనం చేసేందుకు పథకాలు వేస్తున్నాము. తాజాగా నల్లమలను నాశనం చేసే పనిలో పడ్డాము. యురేనియం కావాలంటే కొనుక్కోండి..యురేనియం కోనుక్కోవచ్చు, కానీ అడవులను కొనచ్చా ?పీల్చడానికి గాలి .. తాగడానికి నీరు లేనప్పుడు ...యురేనియం, విద్యుత్ శక్తి తో ఏం చేసుకుంటాం ?"" అని తెలిపారు.

శేఖర్ కమ్ముల : ప్రముఖ తెలుగు దర్శకులు శేఖర్ కమ్ముల కూడా సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

సమంతా అక్కినేని: సమంతా అక్కినేని కూడా సేవ్ నల్లమల ఉద్యమానికి ట్వీట్ ద్వారా మద్దతు తెలిపారు.

పవన్ కళ్యాణ్ : ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రయత్నం పై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు, దీని గురించి రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీని వల్ల తెలుగు ప్రాంతపు జీవావరణానికి కలిగే నష్టాన్ని, ఎదుర్కోవాల్సిన విధానాన్ని చర్చించారు. జనసేన పార్టీ కూడా యురేనియం అన్వేషణ ను ఎండగట్టింది.

తెలుగు దేశం పార్టీ: నాయకత్వం కూడా సామాజిక మాధ్యమాల్లో నల్లమలలో యురేనియం వెలికితీతపై ఆందోళనను తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, భూమా అఖిల ప్రియ కూడా దీనిని ఖండించారు.

రేవంత్ రెడ్డి : తెలంగాణ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై నల్లమలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. దీనిపై ఎంతకైనా పోరాడుదామని పిలుపునిచ్చారు. "తెలంగాణ కాంగ్రెస్ " కూడా దీనిపై తీవ్ర వ్యతిరేఖత తెలిపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "యురేనియం వెలికి తీస్తే నల్లమల ప్రాంతమే కాకుండా తెలంగాణ మొత్తం ప్రభావితం అవుతుంది" అని ఆన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ లో పర్యటించిన ఆయన"యురేనియం వెలికి తీయడం వల్ల నల్లమలలోని అరుదైన వన్య ప్రాణులు, ఔషద మొక్కలు, గిరిజన జాతులకు నష్టం వాటిల్లి వాటి తవ్వకాలతో వెలువడే అణు ధూళితో కృష్ణా జలాలు కలుషితం అవుతాయని, ప్రజలు సంఘటితం అయి సర్వే కు వచ్చే అధికారులను అడ్డుకోవాలని, యురేనియం సర్వే అనుమతులను విరమించే వరకు భాజపా, తెరాస లను బహిష్కరించాలని" అన్నారు.

'కోదండరాం : తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ కోదండరాం కూడా నల్లమల ప్రజల కోసం అక్కడకు ప్రయాణించే మార్గంలో పోలీస్ వారిచే అడ్డగించబడ్డారు.

మూలాలు[మార్చు]

 1. "నల్లమల ఉద్యమం.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే." news18. 2019-09-13.[permanent dead link]
 1. https://telugu.news18.com/news/telangana/fire-in-the-nallamala-forest-in-telangana-bn-487944.html[permanent dead link]
 2. https://telugu.oneindia.com/news/andhra-pradesh/central-government-conducting-survey-in-nallamala-forest-area-for-uranium-mining-says-reports/articlecontent-pf233357-253380.html[permanent dead link]
 3. https://intercontinentalcry.org/india-authorities-approve-uranium-exploration-in-nallamala-forest-sparking-protests/
 4. https://web.archive.org/web/20191222065532/https://www.thenewsminute.com/article/india-s-rush-nuclear-power-may-destroy-nallamala-forest-ecosystem-107155
 5. https://www.drishtiias.com/daily-updates/daily-news-analysis/uranium-mining-in-nallamala-forest[permanent dead link]
 6. https://blog.forumias.com/10-pm-quiz-upsc/
 7. https://blog.forumias.com/current-affairs/
 8. https://www.youtube.com/watch?v=GHtHmp7r628
 9. https://telugu.samayam.com/telangana/news/let-us-unite-against-uranium-mining-in-nallamalla-revanth-reddy-call-for-pawan-kalyan/articleshow/71067515.cms
 10. https://www.msn.com/te-in/news/telangana/%E0%B0%85%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%86%E0%B0%97%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF/ar-AAFZPwI?li=AACbLlL[permanent dead link]