నల్లమోతు భాస్కర్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లమోతు భాస్కర్‌రావు
నల్లమోతు భాస్కర్‌రావు


పదవీ కాలం
 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 18, 1953
ముదిగొండ, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకట రామయ్య, లక్ష్మీ కాంతమ్మ
జీవిత భాగస్వామి జయ
సంతానం ఇద్దరు కుమారులు (చైతన్య, సిద్ధార్థ)

నల్లమోతు భాస్కర్‌రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[2] 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటికీ, తెలంగాణ అభివృద్ధి కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.[3]

జననం. విద్య[మార్చు]

ఈయన నల్లమోతు వెంకట రామయ్య, లక్ష్మీ కాంతమ్మ దంపతులకు 1953, మార్చి 18న వరంగల్ జిల్లా, నిడమనూరు మండలం, శాఖాపూర్ గ్రామంలో జన్మించాడు.[4]

ఖమ్మంలోని శ్రీరామ భక్త గెంటాల నారాయణ రావు డిగ్రీ కళాశాలలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

భాస్కర్‌రావుకు జయతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (చైతన్య, సిద్ధార్థ) ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం[మార్చు]

1969లో శ్రీరామ భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా తొలిసారిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆ సమయంలో సుమారు 16 లీగల్ కేసులను ఎదుర్కున్నాడు. చట్టపరంగా ఆరునెలలపాటు నేలకొండపల్లి గ్రామ అధికార పరిధిలో ఉండటానికి పరిమితం చేయబడ్డాడు. మల్లికార్జున్‌తో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌లో సభ్యుడిగా పనిచేశాడు.[6]

రాజకీయ విశేషాలు[మార్చు]

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి పై 6054 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై 30,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8]

నిర్వహించిన పదవులు[మార్చు]

 • మాజీ ఛైర్మన్ - వ్యవసాయ మార్కెట్ కమిటీ నిడమమూరు, నల్గొండ జిల్లా.
 • కుందూరు జానారెడ్డికి సన్నిహితుడు, 1983 నుండి జానారెడ్డి ఎన్నికల విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
 • బి.ఎన్. రెడ్డి, ఎస్. జైపాల్ రెడ్డి, జి. సుఖేందర్ రెడ్డిల విజయాల కోసం మిర్యాలగూడ, నల్గొండ పార్లమెంట్ ఎన్నికలలో 1989 నుండి అతను కీలక పాత్ర పోషించాడు.
 • స్థానిక ఎన్నికలకు (మునిసిపల్, పంచాయత్ రాజ్ ) నాయకత్వం వహించాడు. 2005 నుండి మిర్యాలగూడ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2014 మునిసిపల్ ఎన్నికల్లో, అతని పార్టీ 36 వార్డులలో 33 గెలుచుకుంది, ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రికార్డు.
 • 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
 • 2018 లో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

 1. https://www.news18.com/amp/news/politics/miryalguda-election-result-2018-live-updates-nallamothu-bhaskar-rao-of-trs-wins-1967987.html
 2. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
 3. Panthangi, K. "Congress Assembly Candidates List", New Indian Express, Hyderabad, 8 April 2014 09:33. Retrieved on 23 April 2014
 4. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
 5. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-01.
 6. "Nallamothu Bhaskar Rao | MLA | Shakapuram | Nidamanoor | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-20. Retrieved 2021-08-31.
 7. https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5785
 8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-16. Retrieved 2019-06-16.