నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు
శేషాచార్లు దంపతుల చిత్రపటం
జననంనల్లాన్ చక్రవర్తి శేషాచార్లు
1927 సెప్టెంబర్ 15
వృత్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రజరీస్ అకౌంట్స్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్
ప్రసిద్ధిప్రముఖ తెలుగు రచయిత.
పిల్లలునలుగురు కుమారులు, ఒక కుమార్తె.
తండ్రిశ్రీమాన్ రామానుజాచార్యులు
తల్లిశేషమ్మ

నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు ప్రముఖ తెలుగు రచయిత.

జీవిత సంగ్రహము[మార్చు]

శేషాచార్లు 1927 సెప్టెంబర్ 15 తేదీన శ్రీమాన్ రామానుజాచార్యులు, శ్రీమతి శేషమ్మ గార్లకు జన్మించారు. వీరి జన్మస్థలం ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం అగ్రహారం. వీరి బాల్యం, విద్యాభ్యాసం మార్కాపురంలో జరిగింది. వీరు ప్రభుత్వ ఉద్యోగిగా సుమారు 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రజరీస్ అకౌంట్స్ శాఖలో పనిచేసి డిప్యూటీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.

తెలుగు సాహిత్యంపై మక్కువతో పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగంలో కృషిచేశారు. వీరు వివిధ అవధానాలలో పృచ్చకునిగా పాల్గొన్నారు. హోమియోపతి మీద విశేష అనుభవం ఉంది.

వీరు 1949 సంవత్సరంలో శ్రీరంగం దేశికాచార్యులు గారి కుమార్తె ఇందిరమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె.

రచనలు[మార్చు]

ముద్రితమైనవి[మార్చు]

  1. శ్రీ వేంకటేశ స్తుతి (సులభశైలి పద్య కుసుమములు) (2006)
  2. వినోద వ్యాస వల్లరి (హాస్య, వ్యంగ్యాత్మక వ్యాసాలు) (2006)
  3. పరాన్న భోక్తలు (హాస్య, వ్యంగ్యాత్మక సులభశైలి పద్య కవితలు) (2006)
  4. చిరుజల్లులు - సిరిమల్లెలు (శేషామాషీలు, హాస్యోక్తులు, శేషోక్తులు) (2006)
  5. అంగట్లో అన్నీ వున్నయ్ (సామాజిక స్పృహతో కూడిన వచన కవితా కదంబం) (2007)
  6. మధ్యతరగతి మౌనరాగం (వర్తమాన సమాజంపై వచన కవితల సంపుటి (2007)

ఇతర రచనలు[మార్చు]

  1. భగవన్నుతి
  2. స్వామి అయ్యప్ప - విశ్వ మానవగీత
  3. కలుపు మొక్కలు
  4. ప్రతిబింబాలు
  5. శేషసూక్తులు - లోకోక్తులు
  6. ఇది కర్మభూమిరా కన్నా
  7. భావతరంగాలు
  8. అన్ని హంగులున్న ఆంధ్రభాష