నల్లికీచు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నల్లికీచు, లేక నలికండ్లపాము. దీన్ని నలికండ్లపము అనికూడా అంటారు. సంస్కృతంలో దీనికి రక్తపుచ్ఛిక అని పేరు. పురుగులను,చీమలను తింటుంది.
యాభయి సంవత్సరాల క్రితం వరకు చిన్నపిల్లలు నల్లికీచు కనబడితే "నల్లికీచు నాగుబాము నన్నేమి చెయ్యబాక నిన్నేమి చెయ్యను" అంటూ పాట పాడేవారు. ఈ సరీసృపాన్ని తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో పాలబిందె ,పాలపిందె అని కూడా అంటారట. రాయలసీమలో నలికిరి అంటారట. నలికిరి నలికిరి నాగుబాము తమ్ముడా నన్నేమి చేయొద్దు అని అక్కడ పిల్లల పాట.. ఇగ్లీషులో నల్లికీచును peninsular rock agama (‘Peninsular Rock Agama’ is a type of garden lizard) అని వ్యవహరిస్తారు. కొండ ప్రాంతాల్లో, సాధారణంగా ఇళ్ళలో, తోటల్లోదక్షిణ భారతదెశం అంతటా కనిపిస్తుంది. తూర్పు కనుమల్లో కనిపిస్తుంది. తలమీద, వళ్ళంతా పొలుసులుంటాయి. దృఢమైన కాళ్ళు, తోకవరకు పొలుసులు, వెన్నునుంచి శరీరం రెండువైపులకు ఇంటి కప్పులాగా వంగి ఉంటుంది. తోకవద్ద కాస్త చదునుగా ఉంటుంది. దృఢమయిన ముందు కాళ్ళమీద నిలబడి బస్కీలు తీసినట్లు తలపైకి కిందికీ ఎత్తుతూ ఊగుతూ ఉంటుంది. పక్షులను చుస్తే శరీరాన్ని నేలకు అదిమి flatగా చేస్తుంది. అడనల్లికీచులు, డింభకాలు బురదమట్టి రంగులో ఉంటాయి. వాటి పెదవులవద్ద పసుపుపచ్చగా ఉంటుంది. మగ నల్లికీచులు బ్రీడింగ్ ఋతువులో నిగనిగలాడుతూ కాంతివంతమైన రంగుల్లో ఎండకు రాళ్ళపైన, బండలపైనా సేదతీరుతూ కనిపిస్తాయి. చీమలను, చిన్న చిన్న పురుగులను తింటాయి. కలుగులో, రాళ్లమధ్య గుడ్లుపెడతాయి. photo కృష్ణానది ఎడమగట్టున, తెలంగాణలో సారపల్లి అనే చెంచుపల్లెలో తీసినది. నల్లికీచు శరీరంలో వేడిపుట్టదు. అదుకని వేడిగా ఉండె బండలు, రాళ్ళు, యెండ పడె ప్రదెశాలు ఉన్న చొటనె అవి కనిపిస్తాయి.
బెంగళూరు IISc బెంగుళూరువారి పరిశొధనలొ నగరీకరణవల్ల ఈ సరీస్రుపం కనిపించకుండా పొతొందని భావించారు. నగరాల్లొ ఇవి నివాసం ఉన్న చొటులను కాస్త ఉష్ణప్ర దెశాలని భావించవచ్చు.