నల్లూరి రుక్మిణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లూరి రుక్మిణి

నల్లూరి రుక్మిణి తెలుగు కథా రచయిత్రి, న్యాయవాది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె కథా, నవలా రచయిత్రిగా అందరికీ సుపరిచుతులు. ఆమె భర్త సి.ఎస్.ఆర్.ప్రసాద్ విరసం అధ్యక్షులుగా పనిసేసేవారు. ఆమె కూడా విరసం సభ్యురాలిగా వుంటూ గుంటూరు జిల్లా తో పాటు పరిసర ప్రాంతాలలో జరిగే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలలో మమేకమవుతూ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఎంతో మంది పేదలు, మహిళలకు, కార్మికులకు సాయపడుతున్నారు. ఆమె ‘నర్రెంక సెట్టుకింద’ నవల, "నెగడు" పేరుతో కథా సంకలనం వెలువరించారు. సెగడు సంకలనం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై రాసింది.

ఆమె పల్లెటూరి జీవితం నుంచి రావడం వలన, నలభై ఏళ్ళుగా మధ్యతరగతి జీవితం అనుభవిస్తున్నా ఆమెకు అణగారిన వర్గాల గురించి, వారి జీవితాలలో అనుభవిస్తున్న హింసను గురించి రాయడమే ఇష్టం. ఆమె సామాన్యుల జీవితాలలో ఎటువంటి మార్పులు, వాటి వలన కలుగుతున్న సామాజిక మార్పులు గురించి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక దాడిని కథలలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

2011లో ఒక చేయి 2012లో ఒక చేయి ఆర్నెల్లపాటు విరిగి బాధపడ్డారామె. అందుకే 2012లో రెండే కథలు రాసారు. చర్ల నిజనిర్థారణ తరువాత ప్రవాహం తిరోగమించదు అన్న కథ రాసారు. కిషన్‌జీ చనిపోయిన నేపథ్యంలో ముంజేతులు ఖండించినా అన్న కథ రాసారు. 2012 డిసెంబరులో ‘కంపెనీ తిరునాళ్ళు’ అన్న కథ రాసారు.[2]

కథలు

[మార్చు]

ఈమె రాసిన పత్రికలు అనేక పత్రికలలో ప్రచురితమైనాయి.

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది సంపుటి
అగ్ని స్పర్శ పుస్తకం ప్రత్యేకం 2000-01-01 గీతలకావల
ఆగిసాగిన అడుగులు అరుణతార మాసం 2009-07-01
ఇంకానా...? అరుణతార మాసం 2001-05-01
కడపటి కాపలా విపుల మాసం 2001-06-01
కథ పాతదే...కానీ అరుణతార మాసం 2003-04-01
కుమ్ము ప్రస్థానం త్రైమాసిక 2004-07-01
కృష్ణవేణి అరుణతార మాసం 1998-03-01 గీతలకావల
క్వీన్ విక్టోరియా... ఆంధ్రజ్యోతి ఆదివారం 2008-09-14
గీతలకావల ఆహ్వానం మాసం 1996-11-01 గీతలకావల
గెలవలేని ఆట విపుల మాసం 2002-06-01
గోరంత దీపం సృజన మాసం 1975-01-01 గీతలకావల
చంద్రవంక అరుణతార మాసం 1999-01-01 గీతలకావల
జారుడు మెట్లు పుస్తకం ప్రత్యేకం 2000-01-01 గీతలకావల
తనది గాని తప్పుకు ఆంధ్రప్రభ ఆదివారం 2003-09-21
తల్లికి తల్లి మాతృక త్రైమాసిక 1994-10-01 గీతలకావల
దరి దొరకని వలయాలు అరుణతార మాసం 1997-11-01 గీతలకావల
దొన అరుణతార మాసం 2003-02-01
నెగడు అరుణతార మాసం 2007-05-01
నెత్తురోడుతున్న నేల అరుణతార మాసం 2002-05-01
నేల నీరు ప్రాచీన ప్రపంచం అరుణతార మాసం 2005-03-01
పందేలాట ఆంధ్రప్రభ వారం 2003-03-21
పడగ అరుణతార మాసం 2004-03-01
పుట్టుకురుపు 1 చినుకు మాసం 2010-01-01
పోగులు తెగిన అల్లిక అరుణతార మాసం 2001-11-01
బిగించికట్టిన మూటలు పుస్తకం ప్రత్యేకం 2000-01-01 గీతలకావల
బీటలెత్తిన బీళ్ళశోకం అరుణతార మాసం 2003-05-01
బూమెరాంగీ ఆంధ్రజ్యోతి ఆదివారం 2007-12-23
మిడిసిపాటు ఆంధ్రప్రభ వారం 2001-09-08
ముంపు అరుణతార మాసం 2004-09-01
మృత్యు స్పర్శ అరుణతార మాసం 2003-11-01
మోయలేని నిజాలు అరుణతార మాసం 2003-06-01
సిండికేట్ అరుణతార మాసం 2006-08-01

మూలాలు

[మార్చు]
  1. రచయిత: నల్లూరి రుక్మిణి[permanent dead link]
  2. "కథ చదివితే మనలో ఒక urgeని create చేయాలి: నల్లూరి రుక్మిణి - నల్లూరి రుక్మిణి". Archived from the original on 2013-09-27. Retrieved 2016-11-18.

ఇతర లింకులు

[మార్చు]