నవంబర్ 2005

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తుత ఘటనలు | 2005 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు
నవంబర్ 2005
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30

పతాక శీర్షికలు


నవంబర్ 30 బుధవారం[మార్చు]

 • తెరాస అసంతుష్ట శాసన సభ్యులుల అల్టిమేటం పనిచేసింది. వారు ప్రస్తావించిన 11 అంశాలపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించేందుకు సిద్ధమని కేసీఆర్‌ ప్రకటించాడు. అందుకు కలిసిరావాలని 'ప్రేమపూర్వకం'గా వారిని ఆహ్వానించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కేసీఆర్‌ కేంద్రమంత్రి నరేంద్ర, తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌తో కలిసి బుధవారం సాయంత్రం ఇక్కడ తన నివాసంలో విలేఖరులతో మాట్లాడాడు. అసంతుష్ట శాసన సభ్యులులు డిమాండ్‌ చేసిన 'క్షమాపణ' పదాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయనిలా అన్నాడు: "ఈ మధ్య తెరాసలోని కొద్ది మంది శాసన సభ్యులులు అపోహలు, అనుమానాలు, సందేహాలు వెలిబుచ్చి వాటి నివృత్తి కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. మనకు అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ సాధన. అదే ప్రాణం. ఊపిరి. ఆ ధ్యేయంతోనే చివరి వరకు నడవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. స్పర్థలు, భేదాభిప్రాయాలు లేని పార్టీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అన్ని పార్టీల్లోనూ ఇలాంటివి సహజమే. పార్టీ అధ్యక్షుడిగా సంస్థలో జరిగే ఏ విషయానికైనా నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభిప్రాయ భేదాలు తలెత్తితే సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాలి."
 • మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాబూలాల్ గౌర్‌ను దింపి తాను మళ్ళీ గద్దెనెక్కాలన్న ఉమాభారతి ఆశలు సగమే ఫలించాయి. ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది గానీ, పదవి ఆమెకు దక్కలేదు. ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంపికచేసింది. దాంతో ఉమ పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిగా, నాయకత్వం ఆమెను సస్పెండ్ చేసి, ఎందుకు బహిష్కరించకూడదో చెప్పమని షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది.

నవంబర్ 29 మంగళవారం[మార్చు]

 • డిసెంబర్ 1 లోగా తాము అడిగిన విధంగా ప్రకటన చెయ్యాలని తెరాస అసంతుష్ట నేతలు కె.సి.ఆర్కు అల్టిమేటం జారీచేసారు. "మీ ప్రకటన కోసం 12 రోజులు ఎదురుచూశాం. మేమెంత ఓపిగ్గా ఎదురుచూసినా... ఎంతగా వెనక్కి తగ్గినా మీరు మాత్రం దిగిరావట్లేదు. ఇక మాకు ఓపిక నశించింది. డిసెంబర్‌ 1లోగా బహిరంగ ప్రకటన చేయండి. మీకిదే చివరి డెడ్‌లైన్‌. ప్రకటన ప్రతిని మీకిప్పటికే ఇచ్చాం. అందులో అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పండి. లేదంటే సభలూ సమావేశాలతో ప్రజల్లోకి వెళతాం. మీ తప్పుల్ని ఎత్తిచూపుతూ మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం. వరంగల్‌లోనే మా మొదటి సభ. ఆ తేదీని డిసెంబర్‌ 3న ప్రకటిస్తాం. ఈ సభల్లో మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ ఐక్య వేదికల పెద్దలు, సీనియర్‌ పాత్రికేయులు... అంతా ప్రసంగిస్తారు. మా మౌనాన్ని బలహీనతగా భావించకండి".

నవంబర్ 28 సోమవారం[మార్చు]

ఇండియా దక్షిణ ఆఫ్రికా మధ్య జరిగిన 4వ ఒక రోజు ఆంతర్జాతీయ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ద్రవిడ్ తన పేరు నిలబెట్టుకున్నాడు.

నవంబర్ 27 ఆదివారం[మార్చు]

 • మున్నేరులో మునిగి పిల్లల మృతి: విజయవాడ రవీంద్రభారతి హైస్కూల్‌కు చెందిన 421 మంది విద్యార్థులను వనభోజనాలకోసం కంచికచర్ల మండలం కీసరకు తీసుకువెళ్ళారు. అక్కడి మున్నేటిలో స్నాలకు దిగిన 15 మంది విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ప్రమాద సమయంలో 40 మంది ఉపాధ్యాయులు ఒడ్డునే ఉన్న మామిడి తోటలో ఉన్నారు. పిల్లల్ని పర్యవేక్షించటంలో వీరి వైఫల్యం వల్లనే దారుణం జరిగిందని తోటి విద్యార్థులు, స్థానికులు అంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు వివరించిన ప్రకారం.. అల్పాహారం తీసుకున్నాక పిల్లలు ఆటపాటలకు ఉపక్రమించారు. టీచర్లు, సిబ్బంది ఎవరికివారు మాటల్లో మునిగిపోయారు. ఈలోగా కొందరు విద్యార్థులు నీళ్లలోకి దిగారు. నీటి లోతు రెండు అడుగులే ఉన్నట్లు తోచింది. అందరూ జంటలుగా చేయి చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా ఆరు నుంచి ఏడు అడుగుల లోతు తగిలింది. ముందున్న వారంతా ఆ లోతు నీళ్లలో మునిగిపోయారు. వెనుక ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అలాగే వెనక్కు వచ్చేశారు. గతంలో ఇసుక కోసం తవ్విన క్వారీల గుంటలు ఈ విషాదానికి పరోక్షంగా కారణమయ్యాయి.

నవంబర్ 26, శనివారం[మార్చు]

 • తెరాసలో సంక్షోభానికి హరీశ్‌రావే కారణనమని కె.సి.ఆర్ మరో మేనల్లుడు ఉమేశ్‌రావు ధ్వజమెత్తాడు. ఆయన ఇలా అన్నాడు: "కేసీఆర్‌వి నియంతృత్వ పోకడలన్న శాసన సభ్యులుల అభిప్రాయం నిజం కాదు. ఆయన నూరుశాతం ప్రజాస్వామ్యవాది. ఎన్నడూ నియంతృత్వంతో వ్యవహరించలేదు. పార్టీలో ప్రస్తుత సంక్షోభానికి కారణం హరీశ్. దీనికే కాదు, అన్ని సమస్యలకూ మూలకారణం హరీశే!! పార్టీలో అల్లుళ్ల ఆధిపత్యం గురించి తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో ఒక్కటి కూడా నన్నుద్దేశించింది కాదు. అన్నీ హరీశ్‌పైనే. ఆయన్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వారు అంటున్నారు. ఇప్పుడే కాదు... హరీశ్ మొదట్నుంచీ వివాదాస్పద వ్యక్తే. అతనిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. శాసన సభ్యులులను ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. వారి నియోజకవర్గ పనుల్లోనూ జోక్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అసమ్మతి శాసన సభ్యులులు కాంగ్రెస్‌కు అమ్ముడు పోయారంటూ దుష్ప్రచారం చేస్తోందీ, వారికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తోందీ కూడా హరీశే. అందుకే వారలా మాట్లాడుతున్నారు."
 • తెరాస అగ్రనేత ఆలె.నరేంద్ర ఇలా అన్నాడు: "కాంగ్రెస్ నేత వెంకటస్వామికి ఏం తెలుసు! ఆయనకు మతిమరుపు ఎక్కువైంది... కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశం చేర్చారంటే... యూపీఏలో అంగీకరించినట్లు. తెలంగాణపై ఏర్పాటైన సబ్ కమిటీ ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా సమావేశమవుతుంది. ఆ తరువాత సోనియాగాంధీకి నివేదిక సమర్పిస్తుంది." తెలంగాణ సాధనకు ఎంతకాలం పడుతుందో చెప్పలేమన్నారు.
 • సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌తో కలిసి నరేంద్ర పర్యటించారు. పర్యటన తరువాత నరేంద్ర ఇలా అన్నాడు: "కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో ముందు చెప్పండి. ఆ తర్వాత ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఢిల్లీలో కేసీఆర్, నేను దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో వైఎస్‌తో చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కటి మినహా ఏవీ అమలు కాలేదు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల విషయంలో కూడా వైఎస్ ప్రభుత్వం మాతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. 610 జీవో అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పోలీసుశాఖలో 610 జీవో అమలు చేయకుండా రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నా, ప్రభుత్వం కానీ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులులు కానీ పట్టించుకోవడం లేదు."

నవంబర్ 25, శుక్రవారం[మార్చు]

 • పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై జారీచేసిన జీవో-170ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ను సీఎల్పీ మాజీనేత పి.జనార్దనరెడ్డి డిమాండు చేశారు. ఈ జీవో అమలు వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ శాసన సభ్యులులతో ముందుగా చర్చించాలని కోరారు. "పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మహా అయితే 40వేల క్యూసెక్కుల వరకూ పెంచొచ్చు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల నీటివిడుదల సామర్థ్యం కంటే ఇది చాలా ఎక్కువ. వరదనీటిని తీసుకుంటే ఫర్వాలేదు. కానీ రాయలసీమలోని 7.25లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ఉద్దేశ్యాన్ని జీవో-170లోనే చెప్పారు. నీటిపారుదలకు నికరజలాలు (ఎస్యూర్డ్‌ ఇరిగేషన్‌ ఫెసిలిటీ) ఇస్తున్నట్టు దానిలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి నీరిస్తే.. ఆ తర్వాత ఏడాది నుంచీ అక్కడివాళ్లు డిమాండు చేస్తారు. రబీ సీజన్లో వరి వద్దంటే రైతులు విన్నారా? ఒకసారి అలవాటు చేస్తే ఇక అంతే. రాజోలిబండ మళ్లింపు పథకం విషయంలో కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు కొట్లాడుకోవటం మర్చిపోవద్దు. పోతిరెడ్డిపాడు ఫలితంగా సాగర్‌, కృష్ణాడెల్టా ఆయకట్టుకు నీరు తగ్గిపోతుంది. శ్రీశైలం, సాగర్, ప్రకాశం బారేజిలలో పూర్తిస్థాయిలో నీళ్లుంటేనే... పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల జరగాలి. అప్పుడే వరదనీరిచ్చినట్లుగా ఉంటుంది. పోతిరెడ్డిపాడుతో జంటనగరాలకు కృష్ణానీళ్లు తేవటం సాధ్యం కాదు. సాగర్‌, కృష్ణాడెల్టా ఆయకట్టులోనూ ఇబ్బందే. ఈ ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ శాసన సభ్యులులతో ముందుగా ముఖ్యమంత్రి చర్చించాలి. ప్రజలకే కాదు, శాసన సభ్యులుగా నాక్కూడా సందేహ నివృత్తి జరగాలి. కృష్ణాజలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 800 టీఎంసీల్లో ఏప్రాంతానికి ఎంతన్న విషయాన్నీ తేల్చాలి" అని పీజేఆర్‌ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విషయంపై నీటిపారుదలమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన వివరణతో పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు సంతృప్తి చెందిన అంశంపై స్పందిస్తూ..."లక్ష్మయ్య ఏం చెప్పారో, తానేరీతిలో సంతృప్తిచెందాడో కేశవరావు నాకు చెప్పలేదు. శాసన సభ్యులులకైనా విషయం చెప్పాలిగదా! అందుకే నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా"నని పేర్కొన్నారు.

నవంబర్ 23, బుధవారం[మార్చు]

 • ఆంధ్ర ప్రదేశ్లో బుధవారం పోలీసులు, నక్సల్స్‌ మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మృతిచెందారు. ఒక ఆరెస్సైకి గాయాలయ్యాయి.

నవంబర్ 22 2005, మంగళవారం[మార్చు]

నవంబర్ 21 2005, సోమవారం[మార్చు]

 • సోమవారం ఉదయం మందాడి స్వయంగా నరేంద్ర కార్యాలయానికి వెళ్ళీ, మాట్లాడేందుకు తన నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పార్టీ నేతలు ప్రకాశ్, విద్యాసాగరరావులతో కలసి నరేంద్ర మందాడి నివాసానికి చేరుకున్నారు. నారాయణరావు పటేల్, జయప్రకాశ్‌రెడ్డి మినహా తెరాస అసమ్మతి శాసన సభ్యులులంతా అక్కడే ఉన్నారు. కేసీఆర్‌పై దుగ్యాల తీవ్రంగా విరుచుకుపడ్డారు. "కేసీఆర్ తోక పట్టుకుని ఉద్యమాన్ని ఈదేందుకు మేం సిద్ధంగా లేం. ఆయన నేతృత్వంలో నిజంగానే తెలంగాణ వస్తుందా? అదే జరిగితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. ఉద్యమం ఆయన అబ్బసొత్తో, తాతసొత్తో కాదు. కేసీఆర్ చెప్పినట్టల్లా విని, తలొంచుకు బతకాల్సిన అవసరం మాకు లేదు. కింద మంటపెట్టి పైకి తీయగా మాట్లాడుతున్నాడాయన. వరంగల్ భేటీలో అనామకులతో మమ్మల్ని ఇష్టమొచ్చినట్టు తిట్టించాడు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భేటీని రద్దు చేయించేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించినా పార్టీలోని కొన్ని శక్తుల ఒత్తిడి వల్ల విఫలమయ్యానని నరేంద్ర సర్ది చెప్పాడు.
 • "కేసీఆర్ తీరు పట్ల శాసన సభ్యులుల్లోనే కాదు... ఒకరిద్దరు ఎంపీల్లోనూ అసంతృప్తి ఉంది. అంతమాత్రాన మనమిలా జనాల్లో పడటం సరికాదు. ఎల్పీ మీటింగ్ పెట్టుకుందాం. అందులో కేసీఆర్‌ను నిలదీద్దాం. ఎదిరిద్దాం. సమాధానం చెప్పేదాకా నిర్బంధిద్దాం. కేసీఆర్ ఎలాంటి వాడైనా, ఉద్యమం కోసం ఆయన నాయకత్వాన్ని అంగీకరిద్దాం" అంటూ దుగ్యాలను అనునయించేందుకు నరేంద్ర బృందం ప్రయత్నించింది.
 • అందుకు దుగ్యాల తీవ్రంగా ప్రతిస్పందించాడు. "కత్తి బంగారుదని చెప్పి, దాంతో మెడ కోసుకుంటామా? ఆయన నాయకత్వంపై నమ్మకమున్న వారు ఉండండి. మేం మాత్రం ఉండం. ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సింది చెబుతాం. ఇది ఖాయం. వరంగల్‌లోనే త్వరలో సభ పెడతాం. దానికి మీరూ రండి. వరంగల్ సభలో కిరాయి మనుషుల్తో మమ్మల్ని తిట్టించారు. మేం మాత్రం చెప్పాలనుకున్నది నేరుగా ప్రజలకే చెబుతాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇవి నా ఒక్కని మాటలు కావు. మా అందరి అభిప్రాయాలు. ఇతర శాసన సభ్యులులను నేనేదో ప్రలోభపెడుతున్నట్టు మాట్లాడుతున్నారుగా! నే వెళ్తున్నా. వారితోనే విడిగా మాట్లాడండి అంటూ చివాలున లేచి వెళ్లిపోయాడు.

నవంబర్ 20 2005, ఆదివారం[మార్చు]

 • అనంతపురం పల్లెబాట కార్య్క్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి]] ఇలా అన్నాడు: "సాగునీటి విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. రైతులకు నాపై నమ్మకముంది. వారి విశ్వాసం కోల్పోతే.. అసలు రాజకీయాల్లోనే ఉండను"
 • మాజీ క్రికెటర్ ఒకరితో తనకు సంబంధాలున్నట్లు అబూ సలీం చెప్పాడు అని సి.బి.ఐ. వర్గాలు తెలియజేసాయి.
 • కేసీఆర్ నియంతృత్వ పోకడలను త్వరలో ప్రజల మధ్యకు తీసుకు వెళ్లనున్నట్లు తెరాస అసంతృప్త శాసన సభ్యులులు మందాడి సత్యనారాయణరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, కంభంపాటి లక్ష్మారెడ్డి, బండారు శారారాణి, దుగ్యాల శ్రీనివాసరావు ప్రకటించారు. బాపురావు కోవర్టు ఆపరేషన్ బూటకమని, దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. "మీకు ఉద్యమాన్ని కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేనేలేదు. అదే ఉంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడే నికృష్టుల్ని, విగ్రహాల దొంగల్ని, దొంగప్లాట్ల విక్రయదారులను, ప్రజల్లో వీసమెత్తు గౌరవంలేని అర్భకుల్ని ఏరికోరి వేదికపైకి పిలిచి మాట్లాడిస్తారా? వారు మమ్మల్ని బండబూతులు తిడుతుంటే చప్పట్లతో రెచ్చగొడతారా? అందులోనే మీ అసలు ఉద్దేశం తేటతెల్లమైంది. జిల్లాలో పార్టీ కార్యాచరణను రూపొందించేందుకే సభ అన్న మాటల్ని గాలికొదిలారు. మా లేఖకు సమాధానమిచ్చే సాహసం లేక కార్యకర్తల్ని రెచ్చగొట్టి మాపైకి ఉసిగొల్పారు. మమ్మల్ని వారిచేత రాళ్లతో కొట్టించి చంపాలని పథకం వేశారు. కసిదీరా తిట్ల పురాణం చదివించారు. మీది దుష్ట సంకల్పం. కక్ష సాధింపు ధోరణి. మీ నిజస్వరూపాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. భేటీలో మా ప్రస్తావనే రానివ్వబోమన్న పార్టీ నాయకత్వం అందుకు భిన్నంగా మాపై అన్నివిధాలా దాడికి దిగింది. గ్రామ బహిష్కరణ విధించాలంటూ పిచ్చిపిచ్చి బెదిరింపులతో మమ్మల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. దొంగల్లా తప్పించుకుంటున్నామంటూ నీచంగా దూషించింది. బుజ్జగింపు ప్రయత్నాలంటే ఇవేనా? కలుపుకుపోయే ప్రయత్నమంటే ఇదేనా? నిజానికి మమ్మల్నా సభకు పిలవనేలేదు. తప్పిదాల్ని ఎత్తిచూపడం, దిద్దుకొమ్మనడం, పార్టీని పునర్నిర్మించాలనడం, ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలనటం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆందోళనలు చేయాలనటం నేరమా? ద్రోహమా?" అంటూ మందాడి కన్నీరు పెట్టారు.

నవంబర్ 19 2005, శనివారం[మార్చు]

 • "తెలంగాణాకు ద్రోహం చేస్తే నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూడా వెనుకాడం. నీ అంతు చూస్తాం. చంద్రబాబుకు గోరీ కట్టినట్టే తెలంగాణలో నీకూ గోరీ కడతాం" అంటూ కేంద్ర మంత్రి, తెరాస అగ్ర నేత ఆలె నరేంద్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిని వరంగల్‌లో ఏర్పాటు చేసిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో హెచ్చరించారు. మనసు మార్చుకుని చర్చలకు రావాల్సిందిగా అసంతుష్ట శాసన సభ్యులులకు ఆయన ఆహ్వానం పలికారు. "వైఎస్! నువ్వు నిజాయితీగా పాలిస్తున్నావా? తెలంగాణ ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నావు. గోదావరి జలాలను కృష్ణా ద్వారా కృష్ణా డెల్టాకు.. కృష్ణా జలాలను రాయలసీమకు పంపిస్తున్నావ్. మరి తెలంగాణ ఏమైపోవాలి? ఎండిపోవాలా? ఆంధ్రా ప్రాజెక్టులకు నిధు లు కేటాయించి.. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్యాకేజీలు తెచ్చుకోమంటున్నావ్. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు లేవు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రీ ఇంత ద్రోహం చేయలేదు. మాతో ఇలాంటి ఆటలా? తెలంగాణకు, తెరాసకు ద్రోహం చేస్తే ఖబడ్దార్!" అని హెచ్చరించారు.
 • బెంగుళూరులో జరిగిన రెండో ఒకరోజు క్రికెట్ పోటీలో భారత్ దక్షిణాఫ్రికాను ఆరు వికెట్లతో ఓడించింఇ, ప్రస్తుత పోటీల శ్రేణిని 1-1 తో సమానం చేసింది

నవంబర్ 18 2005, శుక్రవారం[మార్చు]

 • పరిటాల రవీంద్ర హంతకుడిగా స్వయంగా తనే చెప్పుకున్న మొద్దు శీను గడిచిన కొంతకాలంగా భార్యబిడ్డలతో న్యూఢిల్లీలో అజ్ఞాతంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తెలిసిందని ఈనాడు[permanent dead link] రాసింది.
 • కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి చేసిన స్వల్పమార్పుల్లో భాగంగా ఎస్.జైపాల్ రెడ్డిని సమాచార ప్రసార శాఖ నుండి పట్టణాభివృద్ధి శాఖకు మార్చారు.

నవంబర్ 17 2005, గురువారం[మార్చు]

 • విరసంపై నిషేధం ఎత్తివేత, ఉత్తర్వులు జారీ <b\>. విప్లవ రచయుతల సంఘంపై (విరసం) రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజాభద్రత చట్టం కింద ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టి.కె.దివాన్ పేరుతో గురువారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విరసం న్యాయబద్ధం కాని సంస్థగా పేర్కొంటూ... ఆగస్టు 17న ప్రభుత్వ జీవో నెం.373 విడుదల అయింది. దీనిపై జస్టిస్ టి.ఎల్.ఎన్.రెడ్డి అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ... సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 15 వరకు విచారణ జరిపి, విరసం న్యాయబద్ధంకాని సంస్థగా పేర్కొనడానికి సరైన కారణాలు లేవని తేల్చింది. దీంతో ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
 • మొద్దుశీను దొరికాడు: తెలుగుదేశం శాసన సభ్యులు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దుశీను హైదరాబాదు శివార్లలోని చందానగర్‌లో ఓ లాడ్జీలో మకాం వేసి, బాంబు తయారు చేస్తూ, ఉదయం 11.30 గంటలకు ప్రమాదవశాత్తూ అది పేలడంతో గాయపడ్డాడు. గుర్తుతెలియని వ్యక్తిగా ఆసుపత్రికి తరలాడు. తర్వాత, అతడే మొద్దుశీను అని తెలిసింది. ప్రస్తుతం మొద్దుశీను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స పొందుతున్నాడు. అతన్ని సీబీఐకి అప్పగించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. సీబీఐ బృందం చెన్నై నుంచి బయలుదేరింది. పరిటాల రవిని తానే హత్య చేసానని చెప్పుకోవడం వలన, రవి హత్యలో మొద్దుశీను కీలక వ్యక్తి అయ్యాడు. అతడు పెదవి విప్పితే ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. అతణ్ని ఆసుపత్రిలోనే చంపేస్తారేమోనని తెలుగుదేశం అనుమానాలు వ్యక్తంచేస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి వీటిని అర్థంలేని మాటలుగా కొట్టేసాడు.ఈనాడు
 • తెరాస సంక్షోభం: తెరాసలో సంక్షోభం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరి విమర్శలు ఈరోజూ సాగాయి. మీడియా ముందు కాకుండా మగతనం ఉంటే బయటకొచ్చి మాట్లాడాలని నరేంద్ర అసమ్మతినేతలకు సవాలు విసిరాడు. మగతనం ఉందికాబట్టే బహిరంగ చర్చ కోసం పిలిచామని వారూ అదేరీతిన సమాధానం ఇచ్చారు. అసమ్మతి శాసన సభ్యులుల సంగతి తాడోపేడో తేల్చటానికి శనివారం వరంగల్‌లో తెరాస విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది. ఆరుగురు శాసన సభ్యులులకు మినహా అందరికీ పిలుపులు వెళ్ళాయి. "ఆయనో పెద్ద పొలిటికల్‌ బ్రోకరు. సంక్షోభానికి కారణం ఆయనే" అని కె.సి.ఆర్పై దుగ్యాల ధ్వజమెత్తాడు. తెలంగాణ అభివృద్ధి ఫోరముకు చెందిన ఎన్నారైలు మందాడితో మాట్లాడి, 48 గంటల పాటు ఏ వ్యాఖ్యలూ చేయకుండా ఉండేలా ఆయనను ఒప్పించినట్లు ఈనాడు రాసింది. కేసీఆర్‌ ఓ మెట్టు దిగిరావాలని శనిగరం సంతోష్‌రెడ్డి వ్యాఖ్యానించాడు.ఈనాడు

నవంబర్ 15 2005, మంగళవారం[మార్చు]

 • వరి సాగుపై, ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు విధించాలన్న యోచనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విరమించుకుంది. రబీలో ఏ పంట వేసుకున్నా ఏడు గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు కొనసాగుతుందంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్వయంగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. ఐతే రబీలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ వరి వేయాలనుకుంటే 'శ్రీ' విధానంలో సాగు చేయాలని కోరారు. 'శ్రీ' విధానంతో సాగుచేస్తే వరిని ఆరుతడి పంటగానే గుర్తిస్తామని ప్రకటించారు. రోజుకు ఏడు గంటల చొప్పున తాము ఐదేళ్లూ ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టంచేశారు.

నవంబర్ 13 2005, ఆదివారం[మార్చు]

 • పాట్నా సమీపంలోని జహానాబాద్‌పై వెయ్యి మంది నక్సలైట్లు రాత్రి 9 గంటల సమయంలో దాడిచేసి, తమకు కావలసిన ఐదుగురు సహచరులను విడిపించుకున్నారు. వారిలో అతి ముఖ్యమైన మావోయిస్టు పార్టీ బీహార్ శాఖ కార్యదర్శి అజయ్‌కానూ అలియాస్ రవి కానూ కూడా ఉన్నారు. ఈయన రెండేళ్ళ కిందట అరెస్టయ్యారు. నలుమూలల నుంచీ పట్నంలోకి ప్రవేశించిన మావోయిస్టులు పోలీసు క్వార్టర్లు, పోలీసు కార్యాలయం, జిల్లా జైలు, కలెక్టరేట్‌లను ముట్టడించారు. కరెంటు తీసేశారు. పట్టణమంతటా గాడాంధకారం అలముకోగా... ఆ చీకట్లో ధ్వంస రచనను ఆరంభించారు. ఇదే అదనుగా పగిలిన జైలు గోడల నుంచి ఖైదీలు పరారైనట్లు సమాచారం. నిజానికి జైల్లో ఎంతమంది ఉన్నదీ, ఎంతమంది పరారయిందీ అధికారులకే తెలియటం లేదు.
 • సంతోష్‌రెడ్డి తిరిగి తెరాసలో చేరీ చేరగానే పార్టీలో మరో సంక్షోభం మొదలైంది. వరంగల్‌కు చెందిన మందాడి సత్యనారాయణరెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి, కంభంపాటి లక్ష్మారెడ్డిలతో పాటు మరో నలుగురు శాసన సభ్యులులు - గీట్ల ముకుందరెడ్డి, నారాయణరావు పటేల్, సోయం బాపూరావు, జయప్రకాశ్‌రెడ్డి జత కలిశారు. తెలంగాణ ఉద్యమం పట్ల అధినేత కె.సి.ఆర్ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తూ ఈ ఎనిమిదిమందీ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయనకు రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. తెరాసను హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌లో కలిపేందుకు కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించారు. రెండో ఎస్సార్సీ విషయంలోనూ అబద్ధాలతో బుకాయించారు అంటూ వీరు తమ లేఖలో తీవ్రస్థాయిలో ఆరోపించారు.

నవంబర్ 12 2005, శనివారం[మార్చు]

 • తెరాస అధినేత కె.సి.ఆర్‌పై తిరుగుబాటు చేసి ఆయనపై విమర్శలు గుప్పించి, తొలుత సస్పెన్షన్‌కు, తర్వాత బహిష్కరణకు గురైన సంతోష్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. తెరాస నేతలు స్వయంగా వచ్చి సంతోష్‌రెడ్డిని పార్టీ కార్యాలయానికి తీసుకొని వెళ్ళగా, అక్కడ కేసీఆర్, అలె నరేంద్రలతో కలసి సంతోష్‌రెడ్డి సంయుక్తంగా విలేఖరుల సమావేశంతో మాట్లాడాడు.
 • వదోదర (బరోడా) లో శ్రీలంకతో జరిగిన ఏడవ అంతర్జాతీయ వన్డే క్రికెట్ పోటీలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సీరీస్‌ను 6-1 తో కైవసం చేసుకుంది.

నవంబర్ 9 2005, బుధవారం[మార్చు]

 • పూర్వ భారత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ఈరోజు మధ్యాహ్నం మరణించాడు. తీవ్ర అస్వస్థతతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన ఆయన రెండురోజులుగా కోమాలో ఉన్నాడు. కేరళలో 1921లో జన్మించిన నారాయణన్ కొట్టాయం, ట్రివేండ్రంలో ఉన్నత విద్య అభ్యసించాడు. భారత రాయబారిగా వివిధ దేశాల్లో పనిచేసాడు. కేంద్రప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు. అనంతరం శంకర్ దయాళ్‌శర్మ రాష్ట్రపతిగా ఉండగా ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. 1997 జూలై నుండి, 2002 జూలై వరకు భారత 10వ రాష్ట్రపతిగా పనిచేసాడు.
 • భారత్, శ్రీలంకల మధ్య ఈరోజు రాజ్‌కోట్ లో జరిగిన ఆరో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో 7 వన్డేల సీరీస్‌లో భారత్ 5-1 ఆధిక్యం సాధించింది. 35 పరుగులిచ్చి 4 వికెట్లను నేలకూల్చిన భారత బౌలర్ ఆర్పీ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చివరి వన్డే ఈనెల 12న బరోడాలో జరగనుంది.
 • తెరాస నుండి తనను బయటకు పంపేందుకు పార్టీ అధ్యక్షుడుకె.సి.ఆర్ కుట్ర పన్నారని శాసన సభ్యులు మందాడి సత్యనారాయణరెడ్డి ఆరోపించాడు. వరంగల్‌లో శాసన సభ్యులులు దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటూ కె.సి.ఆర్ ప్రజలకు పంచరంగుల సినిమా చూపిస్తున్నారని ఆయన విమర్శించాడు. తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లలో నిజం లేదని తాము ఎప్పటికీ తెరాస లోనే ఉంటామని ఆయన స్పష్టం చేశాడు.

నవంబర్ 8 2005, మంగళవారం[మార్చు]

 • ప్రభుత్వం తెలంగాణ రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించాడు. తెలంగాణ రైతుల సమస్యల పట్ల అది తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని ధ్వజమెత్తాడు. ఇందుకు నిరసనగా ఈ నెల 11న తెలంగాణలోని అన్ని రెవెన్యూ కేంద్రాల్లో పెద్దయెత్తున రాస్తారోకో నిర్వహిస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన ప్రకటించాడు. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, అది ఏ రూపైనా తీసుకోవచ్చనీ హెచ్చరించాడు.

నవంబర్ 7 2005, సోమవారం[మార్చు]

 • ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించటం చెల్లదంటూ ఐదుగురు సభ్యుల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు ఇచ్చింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు జరపటం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.ఈనాడు
 • వోకర్ నివేదికలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి నట్వర్ సింగ్ ను ఆ శాఖ నుండి తొలగించారు. రీడిఫ్

నవంబర్ 6 2005, ఆదివారం[మార్చు]

నవంబర్ 5 2005, శనివారం[మార్చు]

 • తెలంగాణా రాష్ట్ర సమితి పూర్తిగా ఏకతాటిపై ఉందని, పార్టీలో ఎలాంటి చీలికకూ ఆస్కారం లేదని తెరాస అధినేత, కేంద్రమంత్రి, కె.చంద్రశేఖరరావు హైదరాబాదులో అన్నాడు.
 • హత్యలు, అపహరణల కేసుల్లో చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న రాష్ట్రీయ జనతా దళ్ పార్లమెంటు సభ్యుడు షాబుద్దీన్‌ను బీహార్ పోలీసులు ఢిల్లీలో ఆయన అధికారిక నివాసంలోనే అరెస్టు ‌చేశారు.

నవంబర్ 4 2005, శుక్రవారం[మార్చు]

 • తెరాసలో అసంతృప్తి చిక్కబడి, పార్టీ సంక్షోభం వైపు పయనిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు పత్రికలకు రాసిన ఒక లేఖలో ఇటీవలి పరిణామాలపై తమ వైఖరిని వెలిబుచ్చారు. పార్టీ నాయకత్వంపై విమర్శ, అదే సమయంలో నరేంద్ర పట్ల సానుకూలత కనబరచారు.
 • కె.సి.ఆర్ అల్లుళ్ళ పెత్తనం పార్టీలో సాగుతున్నదన్న భావన శాసనసభ్యుల్లో ఉన్నమాట నిజమేనని ఆలె నరేంద్ర అన్నారు.
 • కొడవలి సరిగ్గా లేకపోతే కోత ఆపుతామా..... కొడవలినే మారు స్తాం అని తెరాస శాసన సభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి అన్నట్లుగా ఆంధ్రజ్యోతి[permanent dead link] ప్రచురించింది.

నవంబర్ 3 2005, గురువారం[మార్చు]

 • రబీలో వరిసాగుకు ఉచిత కరెంటు ఇవ్వమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించాడు. అధిక నీటి వినియోగం జరిగే వరిని కాక ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి సలహా ఇచ్చాడు.
 • శ్రీలంకపై పూణేలో జరిగిన నాలుగో వన్‌డే క్రికెట్ మాచ్‌లో విజయం సాధించి భారత్ సీరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మాచిలనూ భారత్ గెలుచుకుంది. మరో మూడు మాచిలు జరగనున్నాయి.

నవంబర్ 2 2005, బుధవారం[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_2005&oldid=3723032" నుండి వెలికితీశారు