నవజీవన్ ట్రస్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవజీవన్
రకంవార్తాపత్రిక
స్థాపించినది11 ఫిబ్రవరి 1933
భాషగుజరాతీ, హిందీ
కేంద్రంఅహ్మదాబాదు

నవజీవన్ ట్రస్టు భారత దేశము లోని అహ్మదాబాద్ అధారిత ప్రచురణ సంస్థ. దీనిని 1929 లో మహాత్మా గాంధీ ప్రారంభించాడు.[1] ఈ సంస్థ ఆంగ్లం, గుజరాతీ, హిందీ, యితర భాషలలో యిప్పటి వరకూ 800కి పైగా పుస్తకాలను ప్రచురించింది.

ప్రారంభంలో నవజీవన్ అనేది మహాత్మా గాంధీ ప్రచురించిన వారపత్రికగా గుజరాత్ లో 1919 (సెప్టెంబరు 7) నుండి 1931 వరకు అహ్మదాబాదు కేంద్రంగా నడుపబడింది.

లక్ష్యము

[మార్చు]
Page of Navjivan magazine dated 6 December 1931

నవజీవన్ అనే పదానికి హిందీ గుజరాతీ, యితర ఇండో ఆర్యన్ భాషలలో "ఒక క్రొత్త జీవితం" అని అర్థం.

ఈ పత్రిక ప్రారంభ ప్రకటనలో ఈ ట్రస్టు యొక్క లక్ష్యం ప్రజలలో శాంతిని పొంపొందించుటకు హింద్ స్వరాజ్ (ఇండియా కొరకు స్వరాజ్) తో పాటుగా ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ఉద్దేశించబడింది. ఈ ట్రస్టు స్వచ్ఛమైన పద్ధతిలో వ్యవసాయదారులము, కార్మికులకు విద్యావంతులను చేయుటకు రూపొంచించబడింది.

నవజీవనాన్ని నిర్వహించుటకు లక్ష్యాలను పరిపూర్ణపరచుటకు స్వరాజ్యం గూర్చి శాంతియుత జీవనాన్ని సాధించుటకు రూపొంచించబడిన వాటిలో ముఖ్యంగా:

  • రాట్నం, ఖద్దరును ప్రచారం చేయుట.
  • అస్పృశ్యతను పారద్రోలడానికి ప్రచారం చేయుట.
  • హిందువుల, ముస్లిం ప్రజల మధ్య ఐక్యత గూర్చి, భారతదేశంలో స్థిరపడిన వివిధ వర్గాల ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రచారం చేయుట.
  • గోవులను సంరక్షించుటకు ప్రజలలో నిర్మానాత్మకమైన మార్గాలను ప్రచారం చేయుట.తోలుశుద్ధి కర్మాగారాలను ప్రారంభించుట, పాల డైరీ, అటువంటి సంస్థల స్థాపన చేయుట కొరకు ప్రచారం చేయుట.
  • మహిళాభివృద్ధికి కొన్ని మార్గాలను ప్రచారం చేయుట. వాటిలో:
1. బాల్యవివాహాలు నిరోధించుట.
2. వితంతు పునర్వివాహం భావనను ప్రచారం చేయుట.
3. మహిళలకు విద్యా వ్యాప్తి చేయుట.
భారతదేశంలో ప్రజల దృష్టిలో ఆంగ్లభాష అసహజసిద్ధమైన ఆకర్షణ పొందుటను గమనించి దాని స్థానంలో హిందీ లేదా హిందూస్థానీ ని స్థాపించాలనే ప్రచారం చేయుట జరిగినది.
  • జర్నలు, పుస్తకాలను ప్రచురించి ప్రజలలో మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిని సాధించుటకు ప్రచారం చేయుట.
  • సంస్థల యొక్క ప్రచారానికి కరపత్రాలను గానీ, పుస్తకాలను గానీ వార్తా పత్రికలలో ప్రచురణలు చేయకూడదు. ఈ సంస్థ యొక్క లక్ష్యాలకు విరుద్ధంగా ఏ సంస్థ యొక్క ప్రచురణలు గానీ పుస్తకాలను గానీ ప్రచురించరాదు.
  • ఒక నిర్వహణా సంవత్సరం తరువాత మూడునెలల తరువాత ఆ సంస్థ కార్యకలాపాల, అకౌంటు వివరాలను ప్రచురించాలి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-15. Retrieved 2016-10-07.