నవీన్ యాదవ్
| వి. నవీన్ యాదవ్ | |||
| పదవీ కాలం 2025 నవంబర్ 14 – ప్రస్తుతం | |||
| ముందు | మాగంటి గోపీనాథ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | జూబ్లీహిల్స్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1983 నవంబర్ 17 యూసుఫ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఎంఐఎం | ||
| తల్లిదండ్రులు | చిన్న శ్రీశైలం యాదవ్, కస్తూరి | ||
| జీవిత భాగస్వామి | వర్ష యాదవ్ | ||
| సంతానం | ఆన్ష్ యాదవ్ | ||
| నివాసం | యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, హైదరాబాద్ | ||
వల్లాల నవీన్‌యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు. ఆయన 2025లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]నవీన్ కుమార్ మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో యూసుఫ్‌గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 9,242 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. నవీన్ యాదవ్ 2015లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో రహ్మత్‌నగర్ డివిజన్ నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ 18,817 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచాడు.[4]
నవీన్ యాదవ్ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు, ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ముహమ్మద్ అజహరుద్దీన్ కోరడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకొని నవంబర్ 15న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5] ఆయన నవ యువ నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో 2025లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నవీన్ యాదవ్ ను అక్టోబర్ 8న కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.[6][7][8][9] ఆయన నవంబర్ 11న జరిగిన ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో విజేతగా, సునీత 74,259 ఓట్లతో రెండవ స్థానంలో, బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.[10][11][12][13]
వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 26న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[14][15]
మూలాలు
[మార్చు]- ↑ "జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు, బీజేపీకి మూడో స్థానం". BBC News తెలుగు. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "నాడు కంటోన్మెంట్.. నేడు జూబ్లీహిల్స్.. జోష్‌లో కాంగ్రెస్." Andhrajyothy. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "జూబ్లీహిల్స్‌పై విజయహస్తం". Eenadu. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "మరింత రంజుగా జూబ్లి హిల్స్ రాజకీయం.. ఎన్నికల బరిలో నవీన్ యాదవ్". TV9 Telugu. 9 November 2023. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "కాంగ్రెస్ గూటికి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్". Andhrajyothy. 15 November 2023. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్". Eenadu. 8 October 2025. Archived from the original on 8 October 2025. Retrieved 8 October 2025.
- ↑ "జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్". Eenadu. 9 October 2025. Archived from the original on 9 October 2025. Retrieved 9 October 2025.
- ↑ "జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?". Eenadu. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "2025 Jubilee Hills Assembly By Poll Result". Election Commission of India. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "గల్లీ కుర్రోడు.. ఎమ్మెల్యే అయ్యాడు!". Andhrajyothy. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "హస్తానికి బస్తీల బ్రహ్మరథం.. పట్టులేని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ హవా". Eenadu. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా నవీన్‌యాదవ్ ప్రమాణ స్వీకారం". Andhrajyothy. 27 November 2025. Retrieved 27 November 2025.
- ↑ "ఎమ్మెల్యేగా నవీన్‌యాదవ్ ప్రమాణస్వీకారం". Eenadu. 27 November 2025. Retrieved 27 November 2025.