నవ్య సాహిత్య పరిషత్తు
వ్యావహారిక తెలుగు భాష వ్యాప్తి కోసం 1933 లో వ్యావహారిక భాషావాదులు ఏర్పాటు చేసిన సంస్థ, నవ్య సాహిత్య పరిషత్తు. వ్యావహారిక భాషలో రచన చేయడాన్ని ప్రోత్సహించి, అందరికీ అర్ధమయ్యే సాహిత్యాన్ని ప్రజలకు అందించడం దీని ప్రధాన ఆశయం.
గురజాడ మరియు గిడుగుల సాహిత్య కృషి ప్రధానంగా "నవ్య సాహిత్య పరిషత్" స్థాపనకు, "ప్రతిభ" పత్రిక స్థాపనకు కారణమైంది. ఆ రోజుల్లో వేటూరి వారు కూడా వారితో చేతులు కలిపిన వ్యక్తి. [1]
చరిత్ర
[మార్చు]గిడుగు రామమూర్తి, చిలుకూరి నారాయణరావు వంటి వ్యవహార భాషావాదులు 1933 మార్చిలో బరంపురంలో సమావేశమై అభినవాంధ్ర పండిత సభ పేరుతో పరిషత్తును ఏర్పాటు చేసారు. ఈ సంస్థ రెండవ సమావేశం 1933 డిసెంబరులో రాజమండ్రిలో రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అభినవాంధ్ర పండిత సభను నవ్యసాహిత్య పరిషత్తుగా మార్చారు. కేంద్ర కార్యాలయాన్ని గుంటూరులో పెట్టాలని నిర్ణయించారు.
గ్రంథాలు
[మార్చు]- నవరస గంగాధరము : [2]
మూలాలు
[మార్చు]- ↑ "Vyavahara Telugu Udyamam | PDF | Languages | Language Arts & Discipline". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2025-10-08.
- ↑ Navya Sahitya Parishat, Guntur. Nava Rasa Gangadharamu Of Jagannath With Telugu Translation, 1942 Navya Sahitya Parishat, Guntur.