నసీరుద్దీన్ అహ్మద్
| అలీఫా అహ్మద్ | |||
| పదవీ కాలం 2022 – 2025 ఫిబ్రవరి 2 | |||
| ముందు | హసనుజ్జమాన్ షేక్ | ||
|---|---|---|---|
| తరువాత | అలీఫా అహ్మద్ | ||
| పదవీ కాలం 2011 – 2016 | |||
| ముందు | ధనంజయ్ మోదక్ | ||
| తరువాత | హసనుజ్జమాన్ షేక్ | ||
| నియోజకవర్గం | కలిగంజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | కలిగంజ్, నదియా జిల్లా, పశ్చిమ బెంగాల్ 1954 | ||
| మరణం | కోల్‌కతా 2025 ఫిబ్రవరి 2 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
| సంతానం | అలీఫా అహ్మద్[1] | ||
| నివాసం | కలిగంజ్, నదియా, పశ్చిమ బెంగాల్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నసీరుద్దీన్ అహ్మద్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కలిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నసీరుద్దీన్ అహ్మద్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కలిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌ఎస్‌పి అభ్యర్థి శంకర్ సర్కార్‌పై 17178 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2016 శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి హసనుజ్జమాన్ చేతిలో 1227 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
నసీరుద్దీన్ అహ్మద్ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కలిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అభిజిత్ ఘోష్ పై 46,987 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మరణం
[మార్చు]నసీరుద్దీన్ అహ్మద్ 2025 ఫిబ్రవరి 2న కోల్‌కతాలోని పలాసి ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "TMC names late MLA's daughter candidate for Kaliganj bypolls". The Times of India. The Times of India. 28 May 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Veteran TMC MLA Nasiruddin Ahmed dies" (in ఇంగ్లీష్). The Indian Express. 2 February 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
- ↑ "Veteran TMC MLA Nasiruddin Ahmed dies of cardiac arrest in West Bengal". The Times of India. 2 February 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.