నాగం జనార్ధన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగం జనార్థన్ రెడ్డి
నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్థన్ రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి
నియోజకవర్గం నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1948-05-22) 1948 మే 22 (వయసు 75)
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం నాగపూర్ గ్రామం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఎన్.సుగుణ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమారై.
అక్టోబరు 14, 2009నాటికి

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నాగం జనార్ధన్ రెడ్డి మే 22, 1948న జన్మించాడు. ఆయన స్వస్థలం నాగర్ కర్నూల్ మండలంలోని నాగపూర్ గ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది. మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందినాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించాడు. తెలంగాన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా సమర్పించి తెలంగాణ నగరాను స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. నాగం జనార్దన్‌రెడ్డి 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. ఆయన తండ్రి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవాడు. ఆయన తండ్రి పేరు వెంకటస్వామి, తల్లి నారాయణమ్మ. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివాడు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో జరిగింది. తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించాడు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశాడు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు మొత్తంపై 5 సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురి అయ్యారు.2013 జూన్ 3న హైదరాబాదులో జరిగే బహిరంగ సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరారు.[2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
  • తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు.

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 04-06-2013


బయటిలింకులు[మార్చు]