నాగర్‌కర్నూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగర్‌కర్నూల్, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

ఇది చుట్టుపక్క గ్రామాలకు ఈ మండల కేంద్రం ఒక పెద్ద వ్యాపార కూడలి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతంలో సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు.ఒక్కపుడు ఇక్కడ 5 సినిమా హాళ్ళు వుండేవి. కానీ ఇప్పుడు 3 సినిమా హాళ్లు మాత్రమే ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తము 50 దాక ఉన్నాయి.

సరిహద్దులు[మార్చు]

ఈ మండలానికి ఉత్తరమున తాడూరు మండలం, తూర్పున టెల్కపల్లి మండలం, దక్షిణాన పెద్దకొత్తపల్లి, గోపాలపేట మండలాలు, పశ్చిమాన బిజినేపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా[మార్చు]

2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68538. ఇందులో పురుషులు 34960, మహిళలు 33578. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. ఇందులో పురుషులు 37731, మహిళలు 36961. పట్టణ జనాభా 26759, గ్రామీణ జనాభా 47933. జనాభాలో ఇది జిల్లాలో 9వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి కొల్లాపూర్, కల్వకుర్తి, గోపాలపేట్ లకు కూడా రహదారి సౌకర్యం ఉంది.

చరిత్ర[మార్చు]

నాగర్‌కర్నూల్ పూర్వనామం నాగనవోలు. 1883 వరకు ఈ పట్టణం జిల్లా కేంద్రంగా పనిచేసింది. నాగన, కందన సోదరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.వారి పేరిట ఈ పట్టణానికి ప్రస్తుతనామం వచ్చినట్లు కథనం ప్రచారంలో ఉంది.

రాజకీయాలు[మార్చు]

ఈ మండలం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరం మణెమ్మ విజయం సాధించింది.నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ మండల స్థానం (ఎరుపు రంగు)

విద్యాసంస్థలు:[మార్చు]

2008-09 నాటికి మండలంలో 54 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 30 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల:[మార్చు]

మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి, వేరుశనగ, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ[మార్చు]

1972: నాగర్‌కర్నూలులో కొత్త బస్టాండు ప్రారంభమైంది.

1979 మార్చి 10: పుట్టపర్తి సాయిబాబా పట్టణానికి విచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

2011: నాగర్‌కర్నూల్‌ను మేజర్ గ్రామపంచాయతి నుంచి పురపాలక సంఘంగా హోదా పెంచబడింది

2016, అక్టోబరు 11 : ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో చేరింది.

ఇది రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉంది.ఈ పట్టణానికి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాగర్‌కర్నూల్ ఒక జిల్లాగా మారింది, జిల్లాలో నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి మూడు జిల్లా రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.ఇరవై మండలాలతో ఉన్నాయి. ఇది జిల్లా పరిపాలన కేంద్రం.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016

వెలుపలి లంకెలు[మార్చు]