నాగర్‌కర్నూల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగర్‌కర్నూల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నాగర్‌కర్నూల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°29′00″N 78°20′00″E / 16.4833°N 78.3333°E / 16.4833; 78.3333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా [[నాగర్‌కర్నూల్ జిల్లా]]
మండల కేంద్రం నాగర్‌కర్నూల్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.49%
 - పురుషులు 64.46%
 - స్త్రీలు 42.14%
పిన్‌కోడ్ 509209

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వీఎన్ గౌడ్, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి, విమోచనోద్యమకారులు పాపయ్య పర్సా, పెంటమరాజు సుదర్శనరావు, పాలెంను అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, రచయిత పెంటమరాజు నరసింగరావు ఈ మండలానికి చెందినవారు.

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. 20 గ్రామపంచాయతీలున్నాయి. మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి. మండల కేంద్రం నాగర్ కర్నూల్. రెవెన్యూ డివిజన్, అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది.

భౌగోళిక సమాచారం[మార్చు]

నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది.

రవాణా సదుపాయాలు[మార్చు]

మహబూబ్ నగర్ నుంచి ఈ పట్టణానికి విరివిగా బస్సు సదుపాయం ఉంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను జడ్చర్ల, మహబూబ్ నగర్.

గణాంకాలు[మార్చు]

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్ కర్నూలుl

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 74,728 - పురుషులు 37,619 - స్త్రీలు 37,109. అక్షరాస్యుల సంఖ్య 40394.[3]

లోక్‌సభ నియోజకవర్గం[మార్చు]

నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పునర్వ్యవస్థీకరణ ప్రకారం (7) వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.

పట్టణములోని కళాశాలలు[మార్చు]

ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు), నాగర్‌కర్నూలు
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • వి.ఆర్.కె.మండల సహకార జూనియర్ కళాశాల (స్థాపన:1988-89)
  • శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాల (స్థాపన:1997-98)

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128

వెలుపలి లింకులు[మార్చు]