నాగర్‌హోల్ జాతీయవనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nagarhole National Park
IUCN category II (national park)
IndianElephant.jpg
Elephant in musth at Nagarhole
ప్రదేశంMysore District, India
సమీప నగరంMysore, India
భౌగోళికాంశాలు12°5′0″N 76°15′0″E / 12.08333°N 76.25000°E / 12.08333; 76.25000Coordinates: 12°5′0″N 76°15′0″E / 12.08333°N 76.25000°E / 12.08333; 76.25000
విస్తీర్ణం643 km²
స్థాపితం1988
నాగర్హొళెలో మచ్చల జింక
నాగర్హొళె నేషనల్ పార్కులో మగ అడవిదున్న
ఏరియా మాప్
ఆసియన్ అడవికుక్కలను చూడడానికి నాగర్హొళె మంచి స్థలం

మూస:Fixbunching

రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ గా కూడా గుర్తించబడిన నాగరహొళె నేషనల్ పార్క్ (కన్నడ : ನಾಗರಹೊಳೆ ರಾಷ್ಟೀಯ ಉದ್ಯಾನವನ),దక్షిణ భారత దేశంలోని కర్నాటకలో మైసూర్కి 94 kilometers (58 mi)కి.మీ.దూరంలో ఉంది. అది కొడగు జిల్లా నుండి మైసూర్ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్ నేషనల్ పార్కుకి వాయువ్యంగా ఉన్న నాగరహొళె నేషనల్ పార్కుకి బందీపూర్ నేషనల్ పార్కుకి మధ్యనున్న కబినీ జలాశయం ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్ పాలకులు దీనిని ప్రత్యేకమైన హంటింగ్ రిజర్వ్ (పరిరక్షించబడిన వేట ప్రాంతం)గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి.

కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్కు 643 చ.కిమీ.మేర వ్యాపించి ఉంది. బందీపూర్ నేషనల్ పార్కు,870 చకిమీ మదుమలై నేషనల్ పార్కు 320 చకిమీ మరియు వాయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చుఅరీ344 చకిమీతో కలిపి మొత్తం 2183 చకిమీ మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.

నాగ ' అంటే సంస్కృతం లో 'పాము', హొళె అంటే కన్నడ మఱియు బడుగ బాషలలో 'వాగు'. ఈ రెండు పదాల నుండి నాగరహొళె అన్న పదం పుట్టింది. దీనికి నాగులేఱు అని తెలుగులో సమానార్థకం చెప్పుకోవచ్చు. 1955లో స్థాపించ బడిన ఈ పార్కు దేశంలో అత్యుత్తమంగా నిర్వహించబడుతోన్న పార్కులలో ఒకటిగా గుర్తించ బడింది. నాగరహొళె 47 కి.మీ. దూరంలో ఉన్న హన్సూరులో అరణ్య శాఖకు చెందిన ఉప సంరక్షకుని కార్యాలయం ఉంది. ఇక్కడి వాతావరణం ఉష్ణముగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాల నిష్పత్తి ఉన్న ఈ పార్కులో బందిపూర్ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల జనాభా అధికంగా ఉంటుంది.

నీలగిరి బయోస్ఫియర్ (జీవావరణము) రిసర్వ్లో ఈ పార్కు ఒక భాగము. పడమటి కనుమలు, నీలగిరి సబ్ క్లస్టర్ (6,000+ km²), నాగర్హోలె నేషనల్ పార్కు - ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి UNESCO ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.[1]

టెర్రైన్ (నిర్ణీత ప్రయోజనములకు తగినదని నిశ్చయించబడిన స్థలం)[మార్చు]

ఈ అడవి వెస్టర్న్ ఘాట్స్ పర్వత పాదం నుండి కొండ వైపు మరియు దక్షిణం వైపు కేరళ వరకు వ్యాపించి ఉంది. ఈ అడవి వృక్ష సంపద గురించి చెప్పాలంటే దక్షిణ భాగాన తేమతో కూడిన డెసిడ్యూఅల్ (కాలానుగునంగా ఆకులు రాల్చు) అడవి (టెక్టోనా గ్రాండిస్, డల్బెర్జియా లాటిఫోరియా), తూర్పు భాగాన, పొడిగా ఉండే ఉష్ణారణ్యం (రైటియా టింక్టోరియా, అకేషియా), మరియు ఉపపర్వత లోయలో బురదతో కూడిన అడవి (యూజనియా)ఉన్నవి. ఎర్రకలప, టేకు, గంధం, సిల్వర్ ఓక్ ఈ ప్రాంతంలో ముఖ్య వృక్షాలు. బందీపూర్ సరిహద్దులకి దగ్గరగా ఉన్న దక్షిణ భాగాలు సాధారణంగా వాయువ్య భాగాల కంటే పొడిగా ఉంటాయి.

జంతు మరియు వృక్షజాలం[మార్చు]

నాగార్హోలేలో ఒక పెద్ద ఏనుగుల జనాభా ఉన్నది; పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్ జింక, చీతల్ (మచ్చలున్న జింక), కామన్ మున్జాక్ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్ జింక, వైల్డ్ బోర్ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్, లయన్ టేల్డ్ మకాక్స్ మరియు బోన్నెట్ మకాక్స్ ఈ పార్కులోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్కు బయట చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్ మరియు నీలగిరి లంగూర్స్ కనపడతాయి.

దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డేసీడ్యూస్ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురద కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి. పొడిగా ఉండే డేసీడ్యూస్ అడవిలో టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్, లాగర్స్ట్రామియా లాన్సిఒలాటా, టేరోకార్పుస్ మార్సుపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా మరియు ఎంజీసుస్ లాతిఫోరియా (పాస్కల్ ఎట్ అల్. 1982) మొదలగు వృక్ష జాతులతో కూడిన వృక్ష సంపద ఉంది. ఇతర వృక్ష జాతులలో లాగార్స్త్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్ మలబారికం, స్క్లీషేరా ట్రైజూగా మరియు ఫైకస్ జాతికి చెందినా వృక్షాలు కనిపిస్తాయి. పొదలు, మొక్కలు, పొదలలో పెరుగుతూ కనపడే జాతులు - కైడియా కాలిసినా, ఏమ్బ్లీకా అఫీషినాలిస్ మరియు గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్ అతిగా వృద్ధి చెందు లాంటానా కామరా మరియు యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. బురదతో కూడిన అడవి భాగంలో యూజనియా అధికంగా కనిపిస్తే, తేమతో కూడిన డెసిడ్యూస్ అడవుల్లో సాధారణంగా కనపడే ఎనోజీసస్ లాటిఫోరియా, కాసియా ఫిస్ట్యూలా, బూటియా మోనో స్పర్మా, డెన్డ్రోకాలమస్ స్ట్రిక్టస్, రైటియా టింక్టోరియా, అకేషియా SP, లాంటి వృక్ష జాతులు పొడిగా ఉండే డెసిడ్యూస్ అడవుల్లో కూడా కనపడతాయి. ఎర్రకలప (డల్బెర్జియా లాటిఫారియా), టేకు (టెక్టొనియా గ్రాండిస్) వృక్షాలే కాక, వాణిజ్య పరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం (సంటాలం ఆల్బం), సిల్వర్ ఓక్ (గ్రేవీలియా రోబస్టా) కూడా కనపడతాయి. (లాల్ మొదలైనవారు. 1994, ఇస్లాం అండ్ రహ్మాన్ 2004).

అతి ముఖ్యమైన జాతులైన పులి (పాంధేరా టైగ్రిస్), ఇండియన్ బైసన్ లేదా గౌర్ అంటే అడవి దున్న (బోస్ గౌరస్) మరియు ఆసియన్ ఏనుగులు (ఎలిఫాస్ మాక్జిమాస్) చాలా పెద్ద మోతాదులో పార్కు లోపల కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ కాన్సర్వేషన్ సొసైటీకి చెందిన ఉల్హాస్ కారంత్ నాగర్హోలె అడవుల్లో చేసిన అధ్యయనం ప్రకారం, ఆసక్తికరంగా, వేటాడే జాతులకి చెందిన జంతువులు పులి, చిరుత (పంధేరా పార్డస్) మరియు అడవికుక్కలు (కుఆన్ ఆల్పినస్) సమతుల్యమైన సాంద్రత కలిగి ఉన్నాయని తేలింది (PA తాజా సమాచారం 2000). ఈ పార్కులో తోడేళ్ళు (కానిస్ ఆరియస్), బూడిద రంగు ముంగిస (హీర్పేస్టాస్ ఎడ్వార్డి), ఎలుగు బంట్లు (మెలర్సస్ ఆర్సినస్), చారల సివంగి (హైనా హైనా), మచ్చల జింక లేదా చీతల్ (యాక్సిస్ యాక్సిస్), సామ్బర్ జింక (సెర్వస్ యూనికలర్), మొరిగే జింక (మ్యూనిటేకాస్ మున్జాక్), నాలుగు కొమ్ముల జింక (టెట్రాసెర్పస్ క్వాడ్రికార్నస్) మరియు అడవి పందులు (సస్ స్క్రోఫా) కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇతర క్షీరద నివాసుల్లో కామన్ ఫాం సివెట్ (పారాడోక్సికస్ హెర్మాఫ్రాడిటస్) అంటే పునుగు పిల్లి జాతి, బ్రౌన్ మాన్గూస్ (హెర్పెస్ టస్ బ్రాకి రస్) అంటే ముంగిస జాతి, స్ట్రైప్డ్ నెక్డ్ మాంగూస్ (హెర్పెస్టస్ విట్టికోలిస్) అంటే ముంగిస జాతి, బ్లాక్ నేప్డ్ హేర్ (లెపస్ నిగ్రికోలిస్) అంటె చెవుల పిల్లి లెదా కుందేలు జాతి, ఇండీన్ పాంగోలిస్ (మానిస్ క్రాసికౌడాటా) అంటే పొలుసులుండు చీమలు తిను జంతువు, రెడ్ జైంట్ ఫ్లాఇంగ్ స్క్విరల్ (పెటారిస్టా పెటారిస్టా) అంటే ఉడుత జాతి, ఇండియన్ పోర్సుపైన్ (హిస్ట్రిక్స్ ఇండీకా) అంటే ముళ్ళ పంది జాతి మరియు ఇండియన్ జెయింట్ ఫ్లైయింగ్ స్క్విరల్ (పెటారిస్టా ఫిలిపెన్సిస్) అంటే ఉడుత జాతికి చెందిన వివిధ జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. (లాల్ మొదలైనవారు. 1994, ఇస్లాం అండ్ రహ్మాన్ 2004).

ముఖ్యమైన విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్కులో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటిల్లో సీఘ్రంగా అంతరించి పోతున్న జాతులకి చెందిన ఓరియంటల్ వైట్ బాక్డ్ వల్చర్ (జిప్స్ బెంగాలెన్సిస్) అంటే రాబందు జాతి, వల్నరబుల్ లెస్సర్ అడ్జూటంట్ (లెప్టొపిలోస్ జవానికస్) అంటే బెగ్గురు కొంగ జాతి, గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ (ఆక్వీలా షాంగా) అంటే గ్రద్ద జాతికి చెందినది, మరియు నీలగిరి వుడ్ పిజియన్ (కొలంబియా ఎల్ఫిన్ స్తోనై) అంటే, పావురము జాతికి చెందిన పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్ (అన్ హీగా మెలనొగాస్టర్), అంటే కొంగ జాతి, ఓరియంటల్ వైట్ ఐబిస్ (త్రెస్కియోర్నిస్ మెలనోసిఫలస్) అంటే కొంగ జాతి, గ్రేటర్ గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ అంటే చాపలు పట్టె గ్రద్ద జాతి, మరియు రెడ్ హెడెడ్ వల్చర్ (సార్కొజిప్స్ కాల్వస్) అంటే రాబందు జాతికి చెందిన పక్షులు కూదా కనిపిస్తాయి. స్థల విశిష్టమైన జాతులలో బ్లూ వింగ్డ్ పారాకీట్ (సిట్టాక్యూలా కొలంబైడస్) అంటే చిలుక జాతి, మలబార్ గ్రే హార్న్ బిల్ (ఒసిసెరాస్ గ్రేసియస్) అంటే వడ్రంగి పిట్ట జాతి, మరియు వైట్ బెల్లీడ్ ట్రీపై (డెండ్రొ సెట్టాలూకో గాస్ట్రా) అంటే కాకిజాతికి చెందిన పక్షులు ఉన్నాయి. 15 బయోం 10 (ఇండియన్ పెనిన్సులా ట్రాపికల్ మాఇస్ట్ ఫారెస్ట్) లోని యెడు జాతులు మరియు 59 బయోం 11 ఇండొ మలయన్ ట్రాపికల్ డ్రైజోన్) లోని 21 జాతులు ఇక్కడి నుండి గుర్తింపు పొందాయి. ఇక్కడ కనపడె కొన్ని పక్షుల్లో వైట్ చీక్డ్ బార్బెట్ (మెగాలైమా వైరైడిస్), ఇండియన్ స్కైమైటార్ బాబ్లర్ (పొమాటోర్షినస్ హార్స్ఫీల్డై) ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణంగా కనపడె పేయింటెడ్ బుష్ క్వైల్ (పెండిక్యూలా ఎరిథ్రోరైంచా) అంటే కొలంకి పిట్ట, సర్కీర్ మల్ఖొవా (ఫెనికొఫస్ లెషెనాల్టియా), ఆషి ప్రైనియా (ప్రైనియా సొషలిస్) అంటే పిచ్చుక జాతి, ఇండియన్ రాబిన్ (సాక్సికొలైడస్ ఫ్యూలికేటా) అంటే పాలపిట్ట జాతి, ఇండియన్ పీఫౌల్ (పావా క్రిస్టేటస్) అంటే నెమలి జాతి, మరియు యెల్లో లెగ్డ్ గ్రీన్ పిజియన్ (టైరాన్ ఫీనికొప్టెరా) అంటే పావురం జాతికి చెందిన పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. లాల్ మొదలైనవారు 1994, ఇస్లాం అండ్ రహ్మాని 2004).

సాధారణంగా కనపడె సరీసౄపాలలో వైన్ స్నేక్ (అహెతుల్లా నేస్యూటస్), కామన్ వుల్ఫ్ స్నేక్ (లైకొడొన్ ఆలికస్), రాట్ స్నేక్ (టైయాస్ మ్యూకొసస్), బాంబూ పిట్ వైపర్ (ట్రైమెరస్యురస్ గ్రామినూస్), అంటే సెంజెర జాతి, రసెల్స్ వైపర్ (డాబయియా రూసెలై) అంటే సెంజెర జాతి, కామన్ క్రైట్ (బాగరస్ కేరులస్) అంటే కట్లపాము జాతి, ఇండియన్ రాక్ పైథాన్ (పైథాన్ మోలురస్) అంటే కొండ చిలువ జాతి, ఈందియన్ మానిటర్ లిజార్డ్ (వారనస్ బంగాలెన్సిస్) మరియు కామన్ టోడ్ (బ్యూఫో మెలనొస్టిక్టస్) (లాల్ మొదలైనవారు. 1994, ఇస్లాం అండ్ రహ్మాన్ 2004).

.

బెంగళూరుకి చెందిన అశోకా ట్రస్ట్ ఫర్ రిసర్చ్ ఇన్ ఇకాలజి అండ్ ది ఎన్వైరన్మెంట్ కి చెందిన పరిశోధకులు ఈ ప్రాంతంలోని కీటకాల జనాభాకు సంబంధించిన బయొడైవర్సిటీ (జీవ భిన్నత్వం) పై విస్తృతమైన అధ్యయనాలు చేసారు. ఈ పార్కు యొక్క కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్ బీటిల్స్ అంటె పేడపురుగులు, 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమల్లో హార్పెగ్నథొస్ సాల్టేటర్ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు; ఇవి ఒక మీటరు యెత్తు ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్రా జాతికి చెందిన చీమలు అడవికి ఆరోగ్యసూచకంగా ఉపయొగపడవచ్చు, ఎందుకంటే, ఇవి చెదపురుగులని తిని బ్రతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండె ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తాయి. ఏనుగు పేడ మీద మాత్రమే బ్రతికే హీలియోకొప్రిస్ డొమినస్, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆంథొఫేగస్ డామా) కామన్ డంగ్ బీటిల్, చాలా అరుదుగా కనిపించె ఆంథొఫేగస్ పాక్టోలస్ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతుల్లో ఉన్నాయి. ¹

వాతావరణం మరియు జీవపర్యావరణ శాస్త్రము[మార్చు]

కనువిందు చేసే బ్రహ్మగిరి పర్వతాల నేపథ్యంలో ఇంతకుముందు నాగర్హొళె నేషనల్ పార్కుగా గుర్తింపబడిన రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు 1955 లో స్థాపించబడింది, ఇది కర్ణాటక లోని కొడగు జిల్లాలో ఉంది. ఈ పార్కు నీలగిరి బయొస్ఫియర్ రిజర్వ్ లోని ఒక భాగము, ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడం కోసం దీని పేరు ప్రతిపాదించడం జరిగింది. 12o15'37.69"E లాటిట్యూడ్ మరియు 76o17'34.4"N లాంగిట్యూడ్ మధ్య ఇది ఉంది. ఎత్తు 687–960 m. మధ్య ఉంటుంది. 1988 నాటికి ఈ పార్కులో సంరక్షించిన స్థలం 643.39 చదరపు కి.మీ.కి పెంచారు. ఏటా 1440 మి.మీ. వర్షపాతం నమోదయ్యే ఈ పార్కులో జలవనరులు లక్ష్మణ్ తీర్ధ నది, సరతి హొళై, నాగర్హోళై, బళ్ళె హళ్ళ, కబినీ నది, నాలుగు శాశ్వత జీవ సరస్సులు, 41 కృత్రిమమైన జలాశయాలు, ఎన్నో బురదగుంటలు, తారక ఆనకట్ట మరియు కబినీ రిజర్వాయర్ నుండి లభ్యమగుచున్నవి. (లాల్ మొదలైనవారు. 1994)

గిరిజన మరియు స్థానిక నివాసులు[మార్చు]

ఈ అడవికి ప్రథమ నివాసులైన జేను కుటుంబాలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆదిమ గిరిజన తెగకి చెందిన వారు. వారి సాంప్రదాయ పధ్ధతులు, ఆచార కర్మలకు సంబంధించిన పధ్ధతులు క్రమంగా కనుమరుగైపొతున్నాయి. పర్యావరణ పరిరక్షణము, గిరిజనులని జాతీయ జీవన స్రవంతిలో భాగంగా చేసే ప్రక్రియ వంటి అనేక కారణాల వల్ల ప్రభుత్వం నేషనల్ పార్కులోనికి వీరి ప్రవేశాన్ని నిరోధిస్తోంది.

భారత ప్రభుత్వపు హోం మంత్రిత్వ శాఖ జేను కురుబా, కొరగ తెగలని, కర్ణాటకలోని ఆదివాసీ తెగలుగా గుర్తించింది. జేను కురుబాలు అడవిలో ఆహార పదార్థాలు, తేనె సేకరిస్తారు; ఇది వారి సంప్రదాయ వృత్తి. కన్నడ భాషలో జేను అంటె తేనె, కురుబా అంటే గొర్రెల కాపరి. కురుబా అన్న పదం కన్నడ భాష లోని కురి అన్న పదం నుండి వచ్చింది. కురి అంటె గొర్రె అని అర్థం. కురుబా అన్న పదం గొర్రెల కాపరుల సముదాయానికి చెందని సముదాయాలకి కూడా వర్తిస్తుంది. వాళ్ళు భిన్నమైన ఆకృతి కలిగిన కన్నడ భాష మాట్లాడతారు. దానిని జేను-నుడి అంటారు. బయటివారితో కన్నడభాష, ఇంట్లో వాళ్ళతో, బంధువులతో జేను నుడి మాట్లాడతారు. వీళ్ళు కన్నడ లిపిని ఉపయోగిస్తారు. 1981 జనాభా లెక్కల ప్రకారం 34747 మంది జేను కురుబాలు ఉన్నారు అందులో 17867 మగ మరియు 16880 ఆడవారు ఉన్నారు.

ఇతర గిరిజన తెగలతో సమానంగా అడవంతా వెదజల్లినట్లినట్లుగా ఉంటారు. వీరు చెట్లెక్కడంలో సిధ్ధహస్తులు, ఇంకా ఒడిసె, విల్లు, బాణం వంటి ఆయుధాలు ప్రయోగించడంలో నిపుణులు. పూర్తిగా ఒక జీవన శైలినే ప్రతిబింబించే వీరి జీవనవిధానం వల్ల వీరు అడవి పట్ల బలమైన భావాత్మకమైన అనురాగం కలిగి ఉండి, అడవిని దేవతగా కొలుస్తారు. వారి దుస్తులు, ఆహారం, దేవుని కొలిచే పధ్ధతులు, ఇల్లు, ఔషధాలు, నిలువ ఉంచే వస్తువులు, సామాను - అన్నీ కూడా అడవితో సంబంధం ఉన్నవే అయి ఉంటాయి. నాగరిక ప్రపంచంతో సంబంధం కోరుకోని ఈ గిరిజన తెగలలోని కొందరు ఇంకా గడ్డి, రెల్లు, బంకమన్నుతో కట్టిన గుడిసెలలోనే జీవిస్తారు.

భారత ప్రభుత్వం, ఇతర NGOలు చేసిన కౄషి వల్ల గత దశాబ్దంలో ఈ గిరిజనులలో చెప్పుకోదగ్గ జనాభా అడవిలోంచి బయటి ప్రదేశాలలో పునరావాసం కల్పించుకున్నారు. పోషకాహార లోపం, తగినంత ఆహారం లేక పోవటం వల్ల, మూఢ నమ్మకాలతో కూడిన జీవన విధానం వల్ల, అపరిశుభ్ర వాతావరణం వల్ల, శుభ్రమైన నీరు లేక పోవటం వంటి అనేక కారణాల వల్ల అడవిలో జీవించే గిరిజనులకి ఆరోగ్యం చాలా గంభీరమైన సమస్య. నాగరిక సముదాయాలతో పోలిస్తే వీరి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా వీరు తినదగిన వేరు దుంపలనీ, గడ్డలనీ తింటారు. అప్పుడప్పుడూ క్రూర మృగాల మాంసాన్ని కూడా సేవిస్తారు.

జేను కురుబాలు తమ దైనందిన జీవనం కోసం అడవి మీద ఆధారపడతారు. అడవి ప్రాంతాలను ఆక్రమించుకుని జీవనం సాగించె వీరు చరిత్రలో చాలా వరకు నాగరిక జీవన స్రవంతికి దూరంగా, ప్రకృతిలో భాగంగా జీవించారు. అడవితో చక్కటి అనుబంధం కలుపుకోగల వీరికి అడవికి సంబంధించిన విషాయాల పట్ల చెప్పుకోదగ్గ జ్ఞానం ఉంటుంది. వివిధ రకాల జాతులకి చెందిన వృక్ష, జంతుజాలానికి సంబంధించిన జ్ఞానం కూడా మెండుగా ఉంటుంది. తేనె, మైనం, వేరు దుంపలు, గడ్డలు సేకరించడం వీరి ముఖ్య వృత్తిగా ఉండినది. ఇటీవలి కాలంలో వీరు ఆ పదార్ధాలని వ్యవస్థీకరించబడిన వ్యాపారవర్గాలను మాధ్యమంగా చేసుకుని, చట్టపరమైన, చట్టవ్యతిరేకమైన మార్గాలలో బజారులో అమ్ముకోవటం పర్యావరణ పరిరక్షకులకి ఆగ్రహం కలిగించింది.

బెట్టు కురుబా, కడు కురుబా తెగల్లోని చాలా వరకు సాంస్కృతిక గుణగణాలు వీరిలో కూడా కనిపిస్తాయి. వీరు అడవిలో వ్యవసాయం కూడా చేస్తారు. రాగి, అలసందులు, శనగ పప్పు, ఉలవలు, మినప్పప్పు పండిస్తారు.

ఇటీవలి కాలంలో పర్యాటక రంగం అభివృధ్ధి చెందటంవల్ల, వీరి జీవన విధానంలో వ్యాపార ధోరణి పెరిగిపోయి అటవీశ్రేణులు ఖండాలుగా విభజింపబడి పెద్ద ఎత్తున వనోన్మూలనం జరిగింది. గిరిజన తెగలు యెప్పటినుండో సంప్రదాయ జీవన విధానాలకి స్వస్థి పలికి అడవిదొంగల కార్యకలాపాలకి సహకరించడం కోసం అవివేకంగా పక్షులనీ, జంతువులనీ వేటాడటం మొదలుపెట్టారు. జీవించి లేదా చంపబడిన వన్యప్రాణులు, ప్రకృతి సిధ్ధమైన మూలికలు అమ్ముకోవటంలో అడవిదొంగలకి సాయపడుతోన్న ఉదంతాలు యెన్నో వెలుగులోకి వచ్చాయి. వీటిని అటవీసాఖ గుర్తించి అడ్డుకట్ట వేయటంవల్ల చట్టం సంరక్షిస్తోన్న సముదాయానికీ, చట్టాలని అమలు చేసేవారికీ మధ్య ఘర్షణ పెరుగుతోంది . ఈ ఘర్షణ పరిష్కారం కోసం, బయోడైవర్సిటీకి పెరుగుతోన్న ఆపదని దృష్టిలో ఉంచుకుని గత దశాబ్దంలో గిరిజనుల పునరావాసానికీ, అడవిదొంగల కార్యకలాపాలకీ అడ్డుకట్ట వేయడంకోసం అనేక రకాలుగా కృషి జరిగింది. డబ్బుకీ, ఇతర నిత్యావసర వస్తువుల ప్రలోభానికీ లొంగి గిరిజనులు అడవిదొంగలకి అడవిలో తిరగడానికి అవసరమయ్యే జ్ఞానాన్ని ఇచ్చి, వన్యప్రాణులు లభ్యమైయ్యె స్థలాలని చూపించడం వల్ల అడవిదొంగల కార్యకలాపాలు ఎక్కువ అయినాయని గుర్తించారు.

== పునరావాస కార్యక్రమాలు

==

గిరిజనులకి అడవి బయట పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం, కొన్ని NGOలు గత దశాబ్దం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాయి. నాగరిక సమాజంతో సంపర్కంవల్ల గిరిజనుల్లో మారిన జీవన విధానాలు తీవ్రమైన ఆపదగా పరిణమించడం వల్ల పులుల జనాభాను, యేనుగుల ఆవాసాన్ని పరిరక్షించడం కోసం కేంద్రీకరించిన కృషిలో భాగంగా ఈ పునరావాస కార్యక్రమం చేపట్టారు. గిరిజనుల్లో పాత సముదాయాల నుండి ఈ పునరావాస కార్యక్రమానికి ప్రతిఘటన ఎదురైంది కానీ, గత కొన్ని సంవత్సరాలలో ఈ విషయంలో విజయం సాధించడం జరిగింది. అడవి బయట పునరావాసం కల్పించ బడిన గిరిజన జనాభా కోసం, పాఠశాలలు, ఇళ్ళతో పాటు విద్యుత్తు, ఆసుపత్రులు, రోడ్లు, వంటి కనీసవసతులు కల్పిస్తూ ఉన్నారు.

పర్యాటకరంగం[మార్చు]

జంతువుల కలయిక కాలంలోనూ మరియు వర్షాకాలంలోను సఫారి యాత్రలు లేకుండా పార్కుని మూసివేస్తారు. ట్రాఫిక్ కదలికలను ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.

బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్ అతిథి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్కులోని RFO ఆఫీస్ దగ్గర కూడా వసతి ఉంది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే వేకువ ఝామున మరియు సాయం సమయంలో సఫారి యాత్ర యేర్పాటు చేస్తారు.

పాఠశాల విద్యార్థుల కోసం తరచు విద్యా శిబిరాలు నిర్వహిస్తారు ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్నది.

== ఆపదలు మరియు పరిరక్షణ కార్యక్రమాలు

==

పెద్ద ఎత్తున గంధపు, టేకు చెట్లను కూలగొట్టడం పశువులు అతిగా గడ్డి మేయడం వల్ల నేషనల్ పార్కుకి ముప్పు సంభవిస్తుంది. కొయ్య, గంధపు చెట్ల దొంగ రవాణా ఇక్కడ అధికంగా జరుగుతూ ఉంటుంది. వీరహోసనహళ్ళి లోని కొళ్ళిహడి, వద్దరమోడు, తట్టికెరె లోనూ, కలహళ్ళి లోని మెట్టియూపె లోను ఉండే ప్లాంటేషన్ స్థలాలలో చెట్లు నరికిన వార్తలు వచ్చాయి. చెట్లు నరికిన వార్తలు వచ్చిన ఇతర ప్రాంతాలలో అరెకట్టి, బద్రి కట్టె, బిదురు కట్టె, వీరన హొసహళ్ళి మరియు మర్హిగోడు శ్రేణులు ఉన్నాయి. జూలై 2002లో, వీరనహొసళ్ళి శ్రేణిలో వందల చట్లని నరకడం జరిగింది. (PA తాజా సమాచారం 2002). ప్రాంతీయ ప్రభుత్వేతర సంస్థలు (NGOలు) అయిన కొడగు యేకీకరణ రంగ (KER), బుడకట్టు కృషికార సంఘం (BKS) మరియు బుడకట్టు హక్కు స్థాపన సమితి (BHSS) చెట్లు నరకడం ఆపటం కోసం పనిచేస్తున్నాయి.

పశువుల్లో వ్యాధులు ప్రబలిన సంఘటనలు కూడా నమోదు కాబడినవి. రాబీస్ వ్యాధి ప్రబలడం వలన నాలుగు పశువులు మృత్యువు వాత పడ్డట్లు, 25-30 పశువులు వ్యాధి బారిన పడ్డట్లు సెప్టెంబర్ 2005 లోని మొదటి వారంలో, పార్కులోని అంతరసంతె ఫారెస్ట్ రేంజి సరిహద్దు దగ్గర్లోని G M హళ్ళిలో తెలియజేయదం జరిగింది. (PA తాజా సమాచారం 2005).

పక్షులు, ఇతర క్షీరదాల దొంగతనం మరొక తీవ్రమైన సమస్య. పెద్దమొత్తంలో ఏనుగుల మృతి గురించి వార్తలు వచ్చాయి, అందులో, 1991-92 మరియు 2004-05 మధ్యలో సుమారు 100 ఏనుగులు, కొడగు మరియు హన్సూర్ ఫారెస్ట్ విభాగంలో మరణించాయి (PA తాజా సమాచారం 2005). యేనుగు దంతాల కోసం వాటిని చంపడం జరుగుతోంది. వైల్డ్ లైఫ్ ఫస్ట్ చేసిన అధ్యయనం ప్రకారం, 1 జనవరి 2000 నుండి 31 అక్టోబర్ 2002 మధ్యలో 77 ఏనుగులు మృతి చెందినట్లు తెలిసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాచురల్ రిసోర్సస్, కాన్సర్వేషన్, ఎడ్యుకెషన్, రిసర్చ్ అండ్ ట్రైనింగ్ (INCERT) 2002లో చేసిన అధ్యయనం ప్రకారం, ఆ సంవత్సరం మొదట్లో ఏడు ఏనుగులు చంపబడ్డాయని తెలిసింది (PA తాజా సమాచారం 2005) డాక్టర్ ఉల్హాస్ కారంత్ మరియు మధుసూదన్ 1996-97 మధ్య చేసిన అధ్యయనం ప్రకారం, కుద్రెముఖ్, నాగర్హోళె నేషనల్ పార్కులలో, వేట వన్యప్రాణికోటికి అతిపెద్ద ముప్పుగా తేలింది. 26 జాతుల వన్యప్రాణులని ఒక్కో ఊరికీ నెలకి 216 వేట దినాల సగటు తీవ్రతతో వేటాడటం జరుగుతోందని, 49 ప్రస్తుత, 19 మాజీ వేటగాళ్ళపై చేసిన సర్వేలో తేలింది. 48 శాతం మంది వేటగాళ్ళు తాము కేవలం వినోదం కోసం వేటాడతామని తెలిపారు. ఒక కేజీ కంటే బరువున్న 16 రకాల క్షీరదాల జాతులని, షాట్ గన్స్ తోటీ, గిరిజనతెగలు ఉపయోగించే సంప్రదాయ పధ్ధతులతోటీ తరచూ వేటాడటం జరుగుతోందని ఈ సర్వేక్షణ వివరించింది (PA తాజా సమాచారం 2003).

ప్రాజెక్ట్ టైగర్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం పార్కుకి సంబంధించిన అటవీశాఖ ఉద్యోగులలో 25 శాతం మాత్రమే గస్తీ పనికి వినియోగించబడతారు. దీనివల్ల అడవిదొంగతనాలు, చెట్లు నరకడం వంటి పెనుముప్పులు పెరిగిపోయే అవకాశం తీవ్రంగా ఉంది. ప్రాజెక్ట్ నిధులని సక్రమంగా వినియోగించకపోవటం, బందీపూర్, నాగర్హొళె నేషనల్ పార్కులలో అటవీశాఖ ఉద్యోగులకి సరిగ్గా జీతభత్యాలు చెల్లించకపోవటం వంటి వార్తలు అందాయి (PA తాజా సమాచారం 2003, PA తాజా సమాచారం 2005).

త్రాగునీటి సమస్య, అడవిమంటలు (PA తాజా సమాచారం 1998, PA తాజా సమాచారం 2004) కాలానుగుణంగా వచ్చే కరువు వల్ల ఎన్నో వన్యప్రాణులు ఇతర పచ్చటి ప్రదేశాలకి వలస వెళ్ళాయి (PA తాజా సమాచారం 2003, PA తాజా సమాచారం 2004) క్రూరమృగాలు, ఏనుగులు దగ్గర్లో ఉన్న ఊర్ల మీదకు దండెత్తడం, గ్రామస్థులు వాటిని ప్రతిఘటించడం వల్ల మనిషి-జంతువుల ఘర్షణలు పెరిగిపోవటం, పార్కులోని వన్యప్రాణికోటికి మరో ముఖ్యమైన ఆపదగా పరిణమించింది. ఏనుగులు రైతుల పంటపొలాలలోకి రాకుండా నివారించడం కోసం 2001లో కర్ణాటక ప్రభుత్వం, పార్కు చుట్టూ కందకాలు తవ్వడానికీ, సౌర తడికెల నిర్మాణానికీ 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది (PA తాజా సమాచారం 2001).

తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మించ తలపెట్టిన గేట్వే టస్కర్ లాడ్జ్ అనే పర్యాటక గృహం నిర్మాణం జరగకుండా ఆపడం కోసం కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, 1997లో, గిరిజన కార్యకర్తల సముదాయాలు విజయం సాధించాయి (PA తాజా సమాచారం 1998). 125 గ్రామాలు పార్కు లోపల ఉండటంతో NGOలు గిరిజన తెగలను సంరక్షించడానికి చురుకుగా పనిచేస్తున్నాయి. వాటిలో - లివింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ట్రైబల్స్ (LIFT), కూర్గ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (CORD), DEED, FEDINA-VIKASA మరియు నాగర్హొళె బుడకట్టు జనర హక్కు స్థాపన సమితి ఉన్నాయి. స్థానిక గిరిజన జనాభాకి సంబంధించిన 50 గిరిజనులతో ప్రారంభమైన, ప్రపంచబాంకు నిధులు సమకూర్చిన, ఏకో-డెవలప్మెంట్ ప్రాజెక్ట్, 2000 సంవత్సరంలో జరిగిన మొదటి పునరావాస ప్రయత్నం. పునరావాసం కల్పించబడిన కుటుంబాలకి హన్సూర్ దగ్గలో ఉన్న వీర హొసనహళ్ళిలో 5 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీనతా పత్రాలను, ఇళ్ళను ఇచ్చారు. 1550 గిరిజన కుటుంబాలను 15.5 కోట్ల రూపాయల ఖర్చుతో పునరావాసాలకు తరలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాయి. (PA తాజా సమాచారం 2000).

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. UNESCO, వర్ల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంటటివ్ లిస్ట్స్, వెస్టర్న్ ఘాట్స్ సబ్ క్లస్టర్, నీల్గిరీస్. రిట్రీవ్డ్ 4/20/2007 వర్ల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంటటివ్ లిస్ట్స్

సూచనలు

పేరు తెలియని 2004. నాగరహొళె నేషనల్ పార్కు. ఇన్: ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా : ప్రయారిటీ సైట్స్ ఫర్ కాన్సర్వేషన్. (ఇస్లాం, ఎం. జెడ్ అండ్ రహ్మాని, ఎ.ఆర్.). ఇండియన్ బర్డ్ కాన్సర్వేషన్ నెట్వర్క్: బాంబే నాచురల్ హిస్టరీ సొసిఎటీ అండ్ బర్డ్ లైఫ్ ఇంటర్ నేషనల్, UK. pp 578–579.

ఇస్లాం, ఎం. జెడ్ అండ్ రహ్మాని, ఎ.ఆర్. 2004. భారత దేశంలో ముఖ్యమైన పక్షి స్థలాలు (ఆర్నిథాలజీ సైట్స్) : పరిరక్షణకు ప్రాధాన్యతా స్థలాలు ఇండియన్ బర్డ్ కాన్సెర్వేషన్ నెట్వర్క్: బాంబే నాచురల్ హిస్టరి సొసిఎటీ అండ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, UK. 1133 పప్

కాజ్మీర్జాక్, K. 2000. ఎ ఫీల్డ్ గైడ్ టు ది బర్డ్స్ ఆఫ్ ఇండియా, శ్రీ లంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ ది మాల్దీవ్స్. ఓం బుక్ సర్వీస్, న్యూ ఢిల్లీ, ఇండియా. 352 pp.

లాల్. ఆర్. కొఠారి, ఎ. పాండే, పి అండ్ సింగ్, S (eds). 1994. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇన్ : డైరెక్టరి ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ సాంక్చువరీస్ ఇన్ కర్ణాటక: మేనేజ్మెంట్ స్టేటస్ అండ్ ప్రొఫైల్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, న్యూ ఢిల్లీ, ఇండియా. pp 53–62.

మీనన్. వి. 2003. ఎ ఫీల్డ్ గైడ్ టు ఇండియన్ మామల్స్. డీకే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పెంగ్విన్ బుక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. 201 pp.

పాస్కల్. జే.పి., శ్యాం సుందర్, ఎస్ అండ్ మెహెర్-హోంజీ, వి.ఎం.1982. ఫారెస్ట్ మాప్ ఆఫ్ సౌత్ ఇండియా: మెర్కారా-మైసూర్. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్, పాండిచేరి, ఇండియా.

PA తాజా సమాచారం.1998. నాగర్హొళె నేషనల్ పార్కులోని తాజ్ రిసార్ట్. అక్టోబరు (18)

PA తాజా సమాచారం. 1998. నాగర్హొళె నేషనల్ పార్కులోని వివాదాలు అక్టోబరు (18)

PA తాజా సమాచారం. 1998. నాగర్హొళె నేషనల్ పార్కులో అడవిమంటలు. అక్టోబరు (18)

PA తాజా సమాచారం. 1999. నాగర్హొళె నేషనల్ పార్కులో అడవిమంటలు . అక్టోబరు (22)

PA తాజా సమాచారం. 2000. 3 నాగర్హోళెలో ఒకే సాంద్రత కలిగిన క్రూర మృగాల జాతులు. ఆగష్టు (26)

PA తాజా సమాచారం. 2000. నాగర్హోళెలో ఇచ్చిన స్థలంలో పునరావాసం కల్పించబడిన గిరిజనులు. డిసెంబర్ (27&28)

PA తాజా సమాచారం. 2001. నాగర్హోళెలో యేనుగుల విపత్తుని యెదుర్కోవటానికి రూ. రెండు కోట్లు. జూన్ 30, 2008

PA తాజా సమాచారం. 2002. నాగర్హోళెలో దొంగతనం గావింపబడిన యేడు యేనుగు దంతములు. అక్టోబరు 2005

PA తాజా సమాచారం. 2002. నాగర్హోళెలో గంధం దొంగరవాణా. అక్టోబరు 2005

PA తాజా సమాచారం. 2003. నాగర్హోళెలో పడిపొతూ ఉన్న నీటిస్థాయి. ఏప్రిల్ 12, 2003

PA తాజా సమాచారం. 2003. నాగర్హోళెలోని ఇకో డివలప్మెంట్ ప్రాజెక్ట్ పై బాంకు విచారణ. ఏప్రిల్ 12, 2003

PA తాజా సమాచారం. 2003. సంరక్షింపబడిన స్థలాలలో వన్యప్రాణికోటికి వేట అతిపెద్ద సమస్య : అధ్యయనం. ఏప్రిల్ 12, 2003

PA తాజా సమాచారం. 2003. నాగర్హోళె అడవులపై లోకాయుక్తా దాడులు. ఏప్రిల్ 12, 2003

PA తాజా సమాచారం. 2004. నీటి ఎద్దడి వలన నాగర్హొళె నుండి వలసపొతున్న జంతువులు. ఏప్రిల్ (47&48): 9.

PA తాజా సమాచారం. 2004. నాగర్హోళెలో చాలా ప్రాంతాలలో ప్రభావం చూపుతోన్న అడవిమంటలు. ఏప్రిల్ (47&48): 8.

PA తాజా సమాచారం. 2004. నాగర్హొళె నేషనల్ పార్కులో అడవిదొంగతనం ఆరోపణలతో పట్టుబడ్డ ఆరుగురు: ఉచ్చులు స్వాధీనం. డిసెంబర్ 11, 2008

PA తాజా సమాచారం. 2005 13 యేళ్ళలో నాగర్హొళె నేషనల్ పార్కులోపల చుట్టు ప్రక్కల వందపైగా యేనుగులు మృతి చెందాయి. ఏప్రిల్ (54): 10.

PA తాజా సమాచారం. 2005 నాగర్హొళెలో దావాగ్ని నివారణకు NGOల కృషి జూన్ 30, 2008

PA తాజా సమాచారం. 2005 నాగర్హొళె ప్రాణికోటికి రబీస్ ముప్పు. 14-అక్టోబర్-05

PA తాజా సమాచారం. 2005 ఏప్రిల్ నుండి జీతభత్యాలు లేని బందీపూర్ మరియు నాగర్హోళె నేషనల్ పార్కు సిబ్బంది. 14-అక్టోబర్-05

1. నాగర్హొళె నేషనల్ పార్క్. http://www.atree.org/nagarahole.html. 8 జనవరి 2008. నాడు వీక్షించబడింది.

సాహిత్యం[మార్చు]

  • కె. కె. గురుంగ్ & రాజ్ సింగ్: ఫీల్డ్ గైడ్ టు ది మామల్స్ ఆఫ్ ది ఇండియన్ సబ్కాంటినెంట్, అకాడెమిక్ ప్రెస్, శాన్ డియెగో, ISBN 0-12-309350-3
  • విలియం రైలీ. లారా రైలీ: నేచర్స్ స్ట్రాంగ్ హోల్డ్స్ .ది వర్ల్డ్స్ గ్రేటెస్ట్ వైల్డ్ లైఫ్ రిసర్వ్స్. ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్, 2005. ISBN 0-15-506372-3
  • http://www.ఎకోఇంఫోఇండియా.org/lldb_రాజీవ్ గాంధీ_np.php

బాహ్య లింకులు[మార్చు]