నాగార్జున ఉల్లిగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగార్జున ఉల్లిగడ్డ అనగా లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం అర్జీనియా నాగార్జునే (Urginea Nagarjune). ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కను తొలిసారిగా 1982 లో కొప్పుల హేమాద్రి, స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు [1] . ఈ మొక్కను ఎర్ర ఉల్లిపాయ లేదా ఎర్ర ఉల్లిగడ్డ ( Red Onion) అని కూడా పిలుస్తారు. దీని సమీప రకమైన అర్జీనియా ఇండికా (Urginea Indica / అడవి ఉల్లి) ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతుంది, మరో సమీప రకమైన అర్జీనియా మారిటిమా (Urginea Maritima) ఎలుక సంహారిణిగా ఉపయోగపడుతుంది. అయితే నాగార్జున ఉల్లిగడ్డ యొక్క ఔషధ గుణ వివరాలు ఇంకా తెలియవలసివున్నది.

ఆకారం[మార్చు]

ఈ మొక్క ఆకులు సమాంతర ఈనులతో పొడవుగా మొలకెత్తుతున్న ఖర్జూరపు ఆకులను పోలి ఉంటాయి, పువ్వులు గుత్తులుగా ఉండి తెలుపు రంగులో ఉంటాయి. సబ్ గ్లోబోస్ (Sub-globose) ఆకారంలో ఉండే దుంప ఎర్రగా ఉంటుంది.

ప్రస్తుత స్థితి[మార్చు]

నాగార్జున ఉల్లిగడ్డ బైయోపైరసీ వల్ల అడవుల్లో అంతరించిపోతోంది. ఇటీవల ఈ జాతి రక్షణ ప్రదేశాల్లో కూడా ఉండుటలేదు[2]. కొంత మంది మాత్రం ఎర్ర ఉల్లిపాయను చాలా విలువైన మొక్కగా మరియూ రైస్ పుల్లర్ గా భావిస్తారు.

మూలాలు[మార్చు]

  1. National Conference on Forest Biodiversity Resources: Exploitation Conservation & Management, 21-22 March 2006, CBFS, Madurai Kamaraj University : Madurai - 625 021
  2. Gap Analysis for Protected Areas of Andhra Pradesh, India for conserving biodiversity - C. Sudhakar Reddy

లంకెలు[మార్చు]

http://www.tribalmedicine-hemadriz.com/index.html[permanent dead link]