నాగిశెట్టి (కార్టూనిస్ట్)
స్వరూపం
| నాగిశెట్టి కార్టూనిస్ట్ | |
|---|---|
| జననం | 1962 ఆగస్టు 29 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
| నివాస ప్రాంతం | విజయవాడ |
| ఇతర పేర్లు | నాగిశెట్టి |
| భార్య / భర్త | అరుణారాణి |
| పిల్లలు | కుమార్తె ధీరజ |
నాగిశెట్టి తెలుగు కార్టూనిస్ట్.
జీవిత విశేషాలు
[మార్చు]'నాగిశెట్టి' కలం పేరుతో కార్టూన్లు వేస్తున్న ఈయన పూర్తి పేరు నాగిశెట్టి వెంకట రమణమూర్తి, సాంబశివరావు, కవిత దంపతులకు 1962 ఆగస్టు 29 న విజయవాడలో పుట్టాడు. బి.ఎస్సీ., ఎం.ఏ. డిగ్రీలలో పట్టాపుచ్చుకొని, తొలుత 'ఈనాడు' వారి న్యూస్ టైం ఇంగ్లీష్ దినపత్రికలో ఉద్యోగంలో చేరి, తర్వాత ఎస్.బి.ఐ. లో బ్యాంక్ ఉద్యోగిగా, పిమ్మట ఆంధ్రా బ్యాంక్ లో మేనేజర్ గా విజయవాడలో పదవీవిరమణ చేశాడు.
కార్టూనిస్టుగా
[మార్చు]పదవ తరగతి నుండి కార్టూన్లు గీయడం ప్రారంభించించాడు. ఈయన గీసిన నాలుగు కార్టూన్లు ఒకేసారి జ్యోతి మాసపత్రికలో మొదటిగా 1981 అచ్చయ్యాయి. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషా పత్రికలు కూడా వీరి కార్టూన్లు ప్రచురించాయి.
కార్టూన్ పుస్తకం
[మార్చు]- నవ్వులు గ్యారంటీ -2024[1]
బహుమతులు-అవార్డులు
[మార్చు]- 'తానా' కార్టూన్ల పోటీలో బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్ 2023[2]
- ఉత్తమ జర్నలిస్టుగా (కార్టూన్ విభాగంలో) 'నారద ఆవార్డ్-2022'
ఇతర లింకులు
[మార్చు]- ↑ "నవ్వులు గ్యారెంటీ: Navvulu Gyarenti- Nagisetty Cartoons (Telugu) | Exotic India Art". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2026-01-24.
- ↑ ABN (2023-01-16). "TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే." Andhrajyothy Telugu News. Retrieved 2026-01-24.