నాచన సోమన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. ఆయన ఉత్తర హరివంశం కావ్యాన్ని రచన చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు.

కాలం[మార్చు]

నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో వాదోపవాదాలు జరిగాయి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం సా.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనావేస్తున్నారు.[1]

రచనలు[మార్చు]

నాచన సోమన రచించినవాటిలో ప్రఖ్యాతిపొందినది, ప్రస్తుతం లభిస్తున్నది ఉత్తర హరివంశం గ్రంథమే.

మూలం[మార్చు]

  1. బేతవోలు, రామబ్రహ్మం (జనవరి 2000). "నాచన సోమన-ఉత్తర హరివంశం (జనార్దనుని రాయబారం)". పద్యకవితా పరిచయం-1 (2 ed.). రాజమండ్రి: అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్. pp. 120–152.
"https://te.wikipedia.org/w/index.php?title=నాచన_సోమన&oldid=3496284" నుండి వెలికితీశారు