నాటక సంస్థలు
తెలుగు నాటకరంగం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో నాటక సంస్థలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆదరణ లేకనో, ఆర్థిక భారం వల్లనో కనుమరుగయ్యాయి. కొన్ని మాత్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలనుండి ఆర్థిక సహాయం పొందుతూ నడుస్తున్నాయి.
సురభి నాటక సమాజం
[మార్చు]నాటక నమాజం అనేవి మొదలు ఆంధ్ర నుంచి మొదలు ఇనవి ఇవి ప్రదేశాలకు పాకింది అందులో భాగంగా తెలంగాణ జిల్లాలలోని వరంగల్ పట్టణంలో జమ్మల మడక కృష్ణమూర్తి గారిచే శ్రీ శారదా నాట్య మండలి స్థాపించడం జరిగింది. 1931 జూన్ 22వ తేదీన, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జమ్మలమడక పున్నయ్య, నాగమ్మ దంపతులకు జన్మించిన కృష్ణమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత. జమ్మలమడక పిచ్ఛయ్య గారికి స్వయానా సోదరుడు. వీరి మరో సోదరుడు నారాయణమూర్తి గారు ఏలూరు పట్టణంలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేశారు. అన్నగారితో కలిసి వీరు జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లకు మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1951లో అన్నగారితో పాటుగా వరంగల్ వచ్చి, ఆనాడు వరంగల్ పట్టణం లోని ఇండస్ట్రీ ఆజంజాహి మిల్లులో క్యాషియర్ గా ఉద్యోగంలో చేరారు. అక్కడ పేకేటి రామచంద్రరావు గారి వద్ద నటనను, టి ప్రసాదరావు గారి వద్ద పద్య సంగీతాన్ని అభ్యసించారు. అనంతరం ఆవటపల్లి సత్యనారాయణరఅవు, వేమూరి శ్రీనివాసమూర్తి గారల వద్ద సాధన చేశారు. నాడు ఆజంజాహి మిల్లు ఉద్యోగుల కాలనీలో శ్రీరామనవమి నవరాత్రులు జరుపుతున్నారంటే, అక్కడికి సమీప గ్రామాలనుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించేది. కోటసచ్చిదానందశాస్త్రి గారి హరికథలు, ఉషశ్రీ గారి రామాయణ, మహాభారత ప్రవచనాలు, మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి పురాణ ప్రవచనాలు, కర్ణాటక సంగీత విద్వాంసుల కచేరీలుఏర్పాటు చేసిన ఘనత కృష్ణమూర్తి కి దక్కింది. దాదాపు 50 సంవత్సరములు నాటకములు వేసిన వారిలో ఒకరు అని చెప్పవచ్చు. వీరు సాంఘిక నాటకములతో మొదలు చేసి దాదాపు అన్ని పౌరాణిక నాటకము వేసి అందులోని అన్ని పాత్రలకు పాత్రధారులకు శిక్షణ ఇచ్చేవారు.
తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్, వరంగల్.
[మార్చు]తెలంగాణా ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేని తెలుగు పౌరాణిక పద్యనాటకాలకు గుర్తింపు తీసుకొనిరావాలనే ఉద్దేశంతో 'తెలుగు పద్యాన్ని బ్రతికించండి - పద్యనాటక మనుగడకు సహకరించండి " అనే నినాదంతో 1998వ సం.లో వరంగల్ నగరంలో ఈ సంస్థ పందిళ్ళ శేఖర్ బాబు చే స్థాపించబడింది. రిజిష్టర్ నెం.2312/2000.ఈ సంస్థ కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేపట్టింది.
చిలుకమర్రి నటరాజ్ అధ్యక్షునిగా, డా. పద్మప్రియ భళ్లముడి ప్రధాన కార్యదర్శిగా 2001లో ప్రారంభమైన ప్రియనటనం డా. భళ్ళమూడి పద్మప్రియ దర్శకత్వంలో కలహాలకాపురం, శాంతి, వ్రణం, కౌముదీ మహోత్సవం మొదలైన ఎన్నో నాటకాలను ప్రదర్శించింది. వివిధ పట్టణాలలో రంగస్థల శిక్షణలు, స్క్రీన్‌ప్లే రేడియో జాకీ కోర్సులు నిర్వహించింది.
రమ్య కళారంజని - నల్లగొండ
[మార్చు]ఈ సంస్థ వ్యవస్థాపకులు డా. పడాల బాలకోటయ్య. రి.నెం.20/2002. ఇప్పటివరకు వీరు సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకాన్ని, పుణ్యస్థలం, సద్గతి, ముసుగు నాటికలను రూపొందించిపదులసంఖ్యలో ప్రదర్శనలనిచ్చారు. ఇదే కాకుండా సోదర సంస్థలవారిచే, అలరాసపుట్టిల్లు, ఏ వెలుగులకీప్రస్థానం, ఉషాపరిణయం, శ్రీ కృష్ణతులాభారం వంటి ఎన్నో నాటక ప్రదర్శనలను ఏర్పాటుచేసారు. సురభి జమునా రాయలు కృష్ణుడుగా, జయనిర్మల సత్యభామగా, సురభి కోటేశ్వరి నారదుడుగా నటించిన తులాభారం నాటకం రసజ్ఞుల మన్ననలను చూరగొన్నది. ఇవే కాకుండా మరెన్నో నృత్యనాటికల ప్రదర్శన కూడా ఏర్పాటుచేసారు. ప్రతియేటా 'ప్రపంచ రంగస్థలదినోత్సవం' జరపడంతో పాటుగా ఇప్పటివరకు దాదాపు 78 మంది రంగస్థలనటులు, కళాకారులు, సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు. కళారంగానికి విశిష్టమైన సేవలనందిస్తున్న డా.బాలకోటయ్య గారికి డా. సూరేపల్లి గురునాధం, శేఖర్ రెడ్డి, ఎస్.జయప్రకాశ్, యం.రఘురాములు, జి.నరేందర్, డా.యం.పురుషోత్తమాచార్య, నండూరి కృష్ణమాచార్యులు, యాక అబ్బయ్య, ఆవుల నాగేశ్వరరావు, పి.సి.పి.దాస్, కప్పి సత్యనారాయణ, సత్యవతి, ఎన్.సి.పద్మ, రుక్మిణి, జానకి తదితరులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు.
ఇతర నాటక సంస్థలు
[మార్చు]నాటకాలకు ఆదరణ కరువౌతున్న ఈ రోజులలో కొన్ని సంస్థలు ఈ వినోదాన్ని పోషించి కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. అటువంటి పలు అకాడమీలు.
హైదరాబాద్
[మార్చు]- ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (నాటక సంస్థ), హైదరాబాద్[1]
- కాజా కృష్ణమూర్తి స్మారక కళాసమితి, హైదరాబాద్
- కళారాధన, హైదరాబాద్
- కళాంజలి, హైదరాబాద్
- శ్రీ మురళీ కళా నిలయం, హైదరాబాద్
- అభ్యుదయ నట సమాఖ్య, సికింద్రాబాద్
- పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాద్[2][3]
- గోవాడ క్రియేషన్స్, హైదరాబాదు
- శ్రీ జయా ఆర్ట్స్, హైదరాబాదు
వరంగల్
[మార్చు]ఖమ్మం
[మార్చు]నిజామాబాద్
[మార్చు]- మురళీ కృష్ణ కళా నిలయం, నిజామాబాద్
- జాబిల్లి కల్చరల్ అసోసియేషన్, నిజామాబాద్
- తన్మయి ఆర్ట్స్ థియేటర్, నిజామాబాద్
కరీంనగర్
[మార్చు]నల్గొండ
[మార్చు]అదిలాబాదు
[మార్చు]శ్రీకాకుళం
[మార్చు]- రాయల థియేటర్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా
- శ్రీ సుమిత్ర కళాసమితి, శ్రీకాకుళం
- శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య, శ్రీకాకుళం
- విశ్వ నాటక కళా పరిషత్, ఆముదాలవలస
- శర్వాణీ గ్రామీణ, గిరిజన సాంస్కృతిక సేవా సంఘం, బొరివంక, కవిటి
- కళా క్రియేషన్స్, రాజాం
విజయనగరం
[మార్చు]- కింగ్ ఆర్ట్స్, విజయనగరం
- నటరత్న నాటక పరిషత్, విజయనగరం
విశాఖపట్టణం
[మార్చు]- చైతన్య కళా స్రవంతి, విశాఖపట్నం
- కాశీ విశ్వనాథ క్రియేషన్స్, విశాఖపట్నం
- కళాభారతి - ఎ.ఎస్. రాజా కళా పరిషత్, విశాఖపట్నం
- రావుగోపాలరావు స్మారక నాటక పరిషత్, విశాఖపట్నం
- కె.వి. మెమోరియల్ నాటక కళా పరిషత్, విశాఖపట్నం
- అరుణోదయ కళా పరిషత్, మండి
- ఫ్రెండ్స్ క్లబ్, అనకాపల్లి
- శ్రీపైడిమాంబ కళా పరిషత్, పరవాడ
- త్రయంబక కళా పరిషత్, చోడవరం
- మునుగపాక కళా పరిషత్, మునగపాక
తూర్పు గోదావరి
[మార్చు]- కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం
- రసవాహిని, అమలాపురం
- అల్లూరు సీతారామరాజు కళా పరిషత్, కాకినాడ
- పంతం పద్మనాభం నాటక కళా పరిషత్, కాకినాడ
- నవరస నాటక కళా పరిషత్, కాకినాడ
- సి.ఆర్.సి. కాటన్ కళా పరిషత్, రావులపాలెం
- మయూర నాటక కళా పరిషత్, రామచంద్రాపురం
- నల్లమల్లి మూలరెడ్డి కళా పరిషత్, రామవరం
- ద్రాక్షారామ నాటక కళా పరిషత్, ద్రాక్షారామం
- అపర్ణ నాటక కళా పరిషత్, తాటిపర్తి
- శ్రీ మార్కండేయ నాటక కళా పరిషత్, తాటిపర్తి
- శ్రీ వెంకటేశ్వర నాటక కళా పరిషత్, కొందెవరం
- జాహ్నవి నాటక కళా పరిషత్, అనపర్తి
పశ్చిమ గోదావరి
[మార్చు]- లలితకళాంజలి నాటక అకాడమీ, పాలకొల్లు
- శ్రీ గరికపాటి ఆర్ట్ థియేటర్, ఏలూరు
- బి.వి.ఆర్. కళా పరిషత్, తాడేపల్లిగూడెం
- చైతన్య కళా భారతి, భీమవరం
- కళారంజని, భీమవరం
- గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్, పాలకొల్లు
- యూత్ క్లబ్, కొంతేరు
- సుబ్రమణ్యేశ్వర కళా పరిషత్, తోలేరు
- వీరవాసరం కళా పరిషత్, వీరవాసరం
- వై.ఎం.హెచ్.ఏ. నాటక కళా పరిషత్, ఏలూరు
- హేళాపురి కళా పరిషత్, ఏలూరు
కృష్ణా
[మార్చు]- న్యూస్టార్ మోడరన్ థియేటర్, విజయవాడ
- గీతాంజలి థియేటర్ ఆర్ట్స్, విజయవాడ
- యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ
- అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి
- జనశ్రేణి, విజయవాడ
- సుమధుర కళానికేతన్, విజయవాడ[4]
- తపస్వి కల్చరల్ ఆర్ట్స్, విజయవాడ
- ఆంధ్ర నాటక కళా పరిషత్తు, విజయవాడ
- ఆంధ్ర నాటక కళా సమితి, విజయవాడ
- మహేశ్వరి ప్రసాద్ మెమోరియల్ నాటక కళా పరిషత్, విజయవాడ
- హర్ష క్రియేషన్స్, విజయవాడ
- నాగార్జున కళా పరిషత్, కొండపల్లి
- ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సంస్థ, వెలగలేరు
- మహతి క్రియేషన్స్, విజయవాడ
గుంటూరు
[మార్చు]- గుంటూరు హిందూ నాటక సమాజం, గుంటూరు[5]
- శ్రీరామ విలాస సభ, తెనాలి[6]
- సాహితీ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు
- ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, బాపట్ల[7]
- గంగోత్రి, పెదకాకాని,
- ఉషోదయ ఆర్ట్స్, వెనిగండ్ల
- స్వర్ణభారతి కల్చరల్ ఆర్ట్స్, గుంటూరు
- సాగరి, చిలకలూరిపేట
- సద్గురు కళా నిలయం, గుంటూరు
- ఉషోదయ కళానికేతన్, కట్రపాడు
- అభినయ ఆర్ట్స్, గుంటూరు
- గుంటూరు కళా పరిషత్, గుంటూరు
- ఎన్.టి.ఆర్. కళా పరిషత్, గుంటూరు
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు, పల్లెకోన[8]
- డి.ఎల్. కాంతారావు పోస్టల్ ఉద్యోగుల నాటక కళా పరిషత్, తెనాలి
- ఎన్.టి.ఆర్. నాటక పరిషత్ (పట్టణ రంగస్థల కళాకారుల సమాఖ్య), గుంటూరు
- బొల్లిముంత నాటక పరిషత్, తెనాలి
- పొన్నూరు నాటక కళా పరిషత్, నిడుబ్రోలు
- కోన ప్రభాకరరావు నాటక పరిషత్, బాపట్ల
- లావు వెంకటేశ్వర్లు & కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్, వరగాని, పత్తిపాడు
- చిలకలూరిపేట కళా పరిషత్, చిలకలూరిపేట
- కొండవీటి కళా పరిషత్, లింగారావుపాలెం
- శాంతినికేతన్ కళా పరిషత్, బొప్పూడి
- నరసరావుపేట రంగస్థలి, నరసరావుపేట
- నందమూరి కళా పరిషత్, వినుకొండ
- అభినయ నాటక పరిషత్, పొనుగుపాడు
- డిక్ మాన్ కళా పరిషత్, కొత్తపేట
- ప్రగతి కళామండలి - సత్తెనపల్లి, గుంటూరు జిల్లా[9]
- కొలంకపురి నాటక కళా పరిషత్, కొలకలూరు
- తూళ్ళూరు కళా పరిషత్ - మధు థియేటర్ ఆర్ట్స్, తుళ్ళూరు
- జె.పి. థియేటర్స్, గుంటూరు
- గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక, వెనిగండ్ల
- సూపర్ స్టార్ కృష్ణ చిడ్రన్ ఆర్ట్స్ అకాడమీ, తెనాలి
- పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాలు, ఎడ్లపాడు
- డా. కాసరనేని సదాశివరావు నాటక కళా పరిషత్, గుంటూరు
- భువనచంద్ర టౌన్ హల్ కమిటీ, నరసరావుపేట
ప్రకాశం
[మార్చు]- ఎన్.టి.ఆర్ కల్చరర్ అసోసియేషన్, ఒంగోలు
- పండు క్రియేషన్స్, కొప్పోలు
- భానూదయ, ఒంగోలు
- శ్రీకారం & రోటరీ కళా పరిషత్, మార్టూరు
- అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్, చీరాల[10]
- కళాంజలి, చీరాల
- కళావాణి, నాగులపాలెం, పర్చూరు మండలం
- శ్రీకృష్ణదేవరాయ నాటక కళా పరిషత్, పొదిలి
- దర్శనాపురి నాటక కళా పరిషత్, దర్శి
- ప్రకాశం కళా పరిషత్, కరవది
- కొప్పోలు కళా పరిషత్, కొప్పోలు
నెల్లూరు
[మార్చు]- శ్రీ శ్రీనివాస నాట్యమండలి, నెల్లూరు
- సింహపురి నాటక కళా పరిషత్, నెల్లూరు
- కాళిదాస కళారాధన సమితి, కావలి
- డి.ఆర్. కళా పరిషత్ - నవజ్యోతి ఆర్ట్స్, కావలి
- కళాసాగర్, బుచ్చిరెడ్డిపాలెము
- సాంస్కృతిక సమ్మేళనం, గూడూరు
చిత్తూరు
[మార్చు]- శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్, తిరుపతి
- అభినయ ఆర్ట్స్, తిరుపతి
- శ్రీకాళహస్తి లలిత కళా పరిషత్, శ్రీకాళహస్తి
- సుబ్బరావు నాట్య కళా పరిషత్ (అశ్వం అవార్డు), తిరుపతి
కర్నూలు
[మార్చు]ఇతర నగరాలు
[మార్చు]- కృష్ణా తెలుగు ఆర్ట్ థియేటర్, న్యూఢిల్లీ
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ కరీంనగర్ జిల్లా నాటకరంగం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు (ప్రథమ ed.). జయవీర్ కోటగిరి. p. 62.
- ↑ deccanchronicle, LIFESTYLE, BOOKS AND ART (Mar 24, 2014). "Promoting children's theatre in Hyderabad". Retrieved 22 January 2020.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (9 April 2017). "కళా..పాప్‌కార్న్." Archived from the original on 30 November 2018. Retrieved 22 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా (28 July 2019). "ఆద్యంతం హాస్యపు జల్లులే." Archived from the original on 22 జనవరి 2020. Retrieved 22 January 2020.
- ↑ గుంటూరు హిందూ నాటక సమాజం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 513.
- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
- ↑ తెలుగు నాటక దీపిక ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 6 మార్చి 2017, పుట.14
- ↑ ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్), సాహిత్య వార్తలు, ఖమ్మం సాంస్కృతికం (4 March 2018). "పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Archived from the original on 13 మార్చి 2018. Retrieved 22 January 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ కళా ప్రగతిని నిదర్శనం ప్రగతి కళామండలి, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 20 ఫిబ్రవరి 2017, పుట.14
- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రభూమి, గుంటూరు (4 January 2018). "కళాసాంస్కృతిక రంగ దిక్సూచి అజోవిభొ కందాళం". Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 22 January 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)