Jump to content

నాదియా మురాద్

వికీపీడియా నుండి
నాదియా మురాద్
2018లో మురాద్
2018లో మురాద్
స్థానిక పేరుنادیە موراد
జననంనాదియా మురాద్ బాసీ తాహా
(1993-03-10) 1993 మార్చి 10 (వయసు: 33)[1]
కొచో, సిన్‌జార్ జిల్లా, ఇరాక్
క్రియాశీలక సంవత్సరాలు2014–ప్రస్తుతం
సంస్థనాదియాస్ ఇనీషియేటివ్
ప్రసిద్ధియాజిదీల నరమేధం బాధితురాలు, దాన్నించి తప్పించుకుని బయటపడింది
Notable work(s)ద లాస్ట్ గర్ల్: మై స్టోరీ ఆఫ్ కేప్టివిటీ, అండ్ మై ఫైట్ అగైనెస్ట్ ద ఇస్లామిక్ స్టేట్ (2017)
భార్య / భర్త
అబిద్ షమ్‌దీన్
​
(m. 2018)​
పురస్కారాలు
See list:
Honoursనేషనల్ అర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్ (2026) France

నాదియా మురాద్ బాసీ తాహా (కుర్దిష్: نادي مراد بيسي طها) (అరబిక్: نادية مراد بسی طها, జననం 1993 మార్చి 10) ఇరాక్‌లో పుట్టి జర్మనీలో స్థిరపడ్డ యాజిదీ మానవ హక్కుల కార్యకర్త.[2][3][4] 2014లో ఇస్లామిక్ స్టేట్ చేసిన యాజిదీల మారణహోమంలో ఇరాక్‌లోని తన స్వస్థలమైన కొచో నుండి ఆమె అపహరణకు గురైంది. అదే సమయంలో ఆమె సముదాయానికి చెందిన చాలామందిని ఊచకోత కోశారు.[5] తన కుటుంబంలో చాలామందిని ఆ ఊచకోతలో కోల్పోయాకా, వేలాదిమంది ఇతర యాజిదీ మహిళలు, బాలికలతో పాటుగా మురాద్‌ని ఇస్లామిక్ స్టేట్ సెక్స్ బానిసగా బంధించి ఉంచింది.

నాదియా ఇరాక్‌లోని సింజార్ జిల్లాలో యాజిదీలు ఎక్కువగా ఉండే కోచో గ్రామంలో జన్మించింది.[6][7] ఆమె కుటుంబం యాజిదీ మతస్తులు, వ్యవసాయదారులు. యాజిదీలు కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన కుర్దిష్ భాష మాట్లాడే ఒక మైనారిటీ మతస్తులు.[8] ఆమె తల్లిదండ్రుల 11 మంది సంతానంలో అత్యంత చిన్నది. ఆమె తండ్రి 2003లో మరణించాడు[9] 2014 ఆగస్టు 15న, ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు 600 మందికి పైగా యాజిదీలను చంపి, యువతులను, బాలికలను బానిసలుగా బంధించి తీసుకుపోయారు. హత్యకు గురైనవారిలో నాదియా తల్లి, ఆరుగురు అన్నలూ, సవతి అన్నలూ ఉండగా, బానిసగా దొరికినవారిలో నాదియా ఉంది.[10]

ఆమెను మోసుల్ నగరంలో బానిసగా ఉంచి, ఆమెను హింసించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇల్లు తాళం వేసి లేని సమయంలో ఆమె తప్పించుకుని పక్కింటివారి సహాయంతో ఇస్లామిక్ స్టేట్ నియంత్రణలో లేని ప్రాంతానికి తప్పించుకుపోయింది.[11] 2014 సెప్టెంబరులో కానీ, నవంబరులో కానీ ఐఎస్ఐఎస్ ప్రాంతం నుంచి తప్పించుకుని కుర్దిస్తాన్ ప్రాంతంలోని దూహాక్ నగరంలోని శరణార్థి శిబిరానికి చేరుకుంది.[12]

"మారణహోమం, సామూహిక దురాగతాలు, మానవ అక్రమ రవాణాల బాధితులైన మహిళలు, పిల్లలు బాధలు మాన్పుకుని (హీలింగ్), జీవితాలను, సముదాయాలను పునర్మించుకోవడానికి సహాయపడేందుకు" ఆమె నాదియా ఇనీషియేటివ్‌ అనే లాభాపేక్ష రహిత సంస్థని నెలకొల్పింది. 2014లో వేలాదిమంది యాజిదీ పురుషులు, మహిళలు, పిల్లలను ఇస్లామిక్ స్టేట్ చంపడమో, అపహరించడమో చేసిన సింజార్ ఊచకోత దీన్ని స్థాపించడానికి ఆమెను ప్రేరేపించింది.[13]

2016లో నాదియాని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వారు మానవ అక్రమ రవాణా బాధితుల డిగ్నీటీకి మొట్టమొదటి గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమించారు.[14] 2018లో ఆమెకు, కాంగోకి చెందిన గైనకాలజిస్టు డెనిస్ ముక్వెగేకి సంయుక్తంగా "లైంగిక హింసను యుద్ధాల్లోనూ, సాయుధ పోరాటాల్లోనూ ఆయుధంగా ఉపయోగించడాన్ని అంతం చేయడానికి వారు చేస్తున్న కృషికి" నోబెల్ శాంతి బహుమతి లభించింది.[15]నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ఇరాకీ, మొదటి యాజిదీ నాదియానే.[16]

  1. ↑ "Nadia Murad on Instagram". Instagram. 10 March 2022. Retrieved 23 April 2022.
  2. ↑ Siddique, Haroon; Maclean, Ruth (5 October 2018). "Nobel peace prize 2018 won by Denis Mukwege and Nadia Murad – as it happened". The Guardian.
  3. ↑ "Nobel Peace Prize awarded to Denis Mukwege and Nadia Murad". Deutsche Welle. 5 October 2018. Retrieved 2 September 2021.
  4. ↑ "Iraqi Yazidi human rights activist Nadia Murad gets married". Ekurd.net. 20 August 2018. Archived from the original on 3 January 2019. Retrieved 23 April 2022.
  5. ↑ Westcott, Lucy (19 March 2016). "ISIS sex slavery survivor on a mission to save Yazidi women and girls". Newsweek. Retrieved 22 September 2016.
  6. ↑ "Who is the Nobel Peace Prize 2018 winner Nadia Murad?". The National. 5 October 2018.
  7. ↑ "Nadia Murad: One woman's fight against 'Islamic State'". Deutsche Welle. 10 December 2018. Retrieved 2 September 2021.
  8. ↑ Murad Basee Taha, Nadia (16 December 2015). "Nadia Murad Basee Taha (ISIL victim) on Trafficking of persons in situations of conflict – Security Council, 7585th meeting". United Nations Television (UNTV). Archived from the original (Video) on 26 December 2018. Retrieved 21 September 2016.
  9. ↑ "Nadia Murad's Mission to Protect Survivors". 21 February 2024. Archived from the original on 1 December 2024. Retrieved 26 November 2024.
  10. ↑ "Appointment Ceremony of Ms. Nadia Murad Basee Taha As UNODC Goodwill Ambassador for the Dignity of Survivors of Human Trafficking on the Occasion of the International Day of Peace". United Nations Television (UNTV). 16 September 2016. Archived from the original (Video) on 26 December 2018. Retrieved 21 September 2016.
  11. ↑ Alter, Charlotte (20 December 2015). "A Yezidi Woman Who Escaped ISIS Slavery Tells Her Story". Time. Archived from the original on 2 July 2019. Retrieved 18 December 2016.
  12. ↑ Collard, Rebecca (13 July 2018). "He Helped Iraq's Most Famous Refugee Escape ISIS. Now He's the One Who Needs Help". Time (in ఇంగ్లీష్). Archived from the original on 30 October 2018. Retrieved 11 November 2018.
  13. ↑ "Nadia Murad". Forbes. Retrieved 5 October 2018.
  14. ↑ "Human trafficking survivor Nadia Murad named UNODC Goodwill Ambassador". United Nations. Retrieved 7 August 2023.
  15. ↑ "Announcement" (PDF). The Nobel Peace Prize. Archived from the original (PDF) on 5 October 2018. Retrieved 5 October 2018.
  16. ↑ "Nobel Peace Prize winner Nadia Murad". BBC News. 5 October 2018.