Jump to content

నాదెండ్ల బ్రహ్మం చౌదరి

వికీపీడియా నుండి

నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ (TDP) కీలక నేతలలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ ప్రస్తుత ఛైర్మన్.

రాజకీయ జీవితం

[మార్చు]

నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనను ప్రభుత్వం 'ఏపీ కమ్మ కార్పొరేషన్' ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఆయన 2026 జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బ్రహ్మం చౌదరి వివాహం 2026 జూలై 6న మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్‌లో శ్రీమతి కోట గౌతమి శ్వేతతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆరోగ్య పరిస్థితి

[మార్చు]

వివాహం జరిగిన రెండు వారాలకే, 2026 జూలై 15 (బుధవారం) రాత్రి బ్రహ్మం చౌదరి తీవ్రమైన తలనొప్పి తో అస్వస్థతకు గురయ్యారు.[1] [2]పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌ (మెదడు పక్షవాతం) వచ్చినట్లు నిర్ధారించారు. ఆయన చిన్నమెదడులో మూడు చోట్ల రక్తం గడ్డకట్టినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

వెంటనే ఆయన్ను తాడేపల్లి లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బ్రహ్మంచౌదరికి అస్వస్థత". EENADU. Retrieved 2026-07-18.
  2. ABN (2026-07-17). "కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బ్రహ్మంకు బ్రెయిన్‌ స్ట్రోక్‌". Andhrajyothy Telugu News. Retrieved 2026-07-18.