నాధ్ ద్వారా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పడమటి భారతదేశంలో రాజస్థాన్‌కు చెందిన ఒక ఊరు నాధ్‌ద్వరా. ఇది అరావళి కొండలలో బనాస్ నది తీరంలో రాజసమండ్ జిల్లాలోఉన్నది. ఉదయపూరుకు ఈశాన్యంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీనాధ్‌జీ విగ్రహ ప్రతిష్ఠితమైన కృష్ణాలయము కారణంగా ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. 14వ శతాబ్ధంలో నిర్మించబడిన ఈ ఆలయములోని అవతార పురుషుడైన కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడి విగ్రహంగా దర్శనమిస్తాడు. మథురలో పూజింపబడుతున్న ఈ విగ్రహము 1672లో మథుర సమీపంలో యమునాతటంలో ఉన్న గోవర్ధనగిరి నుండి తరలించబడి 6 మాసాల కాలం ఆగ్రాలో ఉంది. మొగలు సామ్రాజ్యాధినేత హిందూధర్మ వ్యతిరేకతా విధానాల నుండి రక్షించడానికి తరలించబడింది. నాధ్‌ద్వారా అంటే శ్రీనాధ్‌జీ ద్వారం అని అర్ధం. వల్లాభచార్యుల చేత స్థాపించబడిన పుష్టి మార్గం లేక వల్లభ సంప్రదాయ లేక శుద్ధ ద్వైత సంప్రదాయానికి ఈ వైష్ణవాలయం అయిన నాధ్‌ద్వారా ఒక ప్రతీక. వల్లభాచార్యులు రాజస్థాన్ ప్రజల చేత విఠల్‌జీతో సమానంగా గౌరవాదరణలను అందుకున్నారు. నాధ్‌ద్వారా శ్రీనాధ్‌జీ ప్రతిష్ఠ తరువాత ఇక్కడి దైవమైన శ్రీనాధ్‌జీ పేరుతో కూడా పిలువబడుతుంది.

శ్రీనాధ్‌జీ ఆలయం[మార్చు]

మతవిశ్వాసాలను అనుసరించి నాధ్‌ద్వరా ఆలయ నిర్మాణము శ్రీనాధ్‌జీ నిర్ణయించిన ప్రదేశంలో జరిగిందని భావించబడుతుంది. శ్రీనాధ్‌జీ విగ్రహాన్ని మొగలు సామ్రాజ్య మతవ్యతిరేకత నుండి రక్షించి సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి ఎద్దులబండిలో తీసుకు వస్తున్న తరుణంలో ఒక ఎద్దు కిందకు వాలింది. అలా వాలడం గమనించి వెంట వస్తున్నపూజారులు అది భగవానుడి ఆదేశంగా భావించి అక్కడే ఆలయ నిర్మాణం చేయమని సూచించారు. ఈ ఆలయనిర్మిత ప్రదేశం అప్పుడు మేవార్ రాజైన రాజ్ సింగ్ పాలనలో ఉండేది. ఈ ఆలయము శ్రీనాధ్‌జీ హవేలి అని పిలువబడుతుంది.

ఆలయ రూపురేఖలు[మార్చు]

ఈ ఆలయము బృందావనములోని నందమహారాజ ఆలయా శైలిలో నిర్మించబడింది. అందువలన ఇది నందాభవన్ లేక నందాలయం అని కూడా పిలువబడుతుంది. ఆలయగోపురం మీద ఉన్న కలశంలో సుదర్శనచక్రంతో ఏడు జెండాలు కూడా ఎగురుతుంటాయి. ఈ ఏడు జెండాలు శ్రీకృష్ణుని ఏడుగురు సఖులకు గుర్తుగా ఉంది. ఈ ఆలయం ప్రబలంగా శ్రీనాధ్‌జీ కి హవేలి (శ్రీనాధుని భవనము) ఎందుకంటే సాధారణ ఇల్లులాగా ఈ ఆలయములో ప్రయాణించడానికి అనువుగా ఒక రధము ఉంటుంది. (ఒక సందర్భంలో శ్రీనాధ్‌జీ సింఘర్‌కు తీసుకు వచ్చిన రధము వంటిది), పాలకొరకు ఒక సామాను గది(దూద్ ఘర్), తాంబూలము కొరకు ఒక సామానుగది(పాన్ ఘర్), తీపిపదార్ధాలకొరకు మరియు పంచదార కొరకు ఒక సామానుగది (మిష్రిఘర్ లేక పెదఘర్), పూలకొరకు ఒక సామానుగది(ఫూల్ ఘర్), ఒక వంటగది(ఇక్కడ వంట చేయబడుతుంది )దీనిని రసోయీ ఘర్ అంటారు, ఒక ఆభరణ శాల (ఘనాఘర్), ఒక ఖజానా (ఖర్చా భండార్), అశ్వశాల, ఒక హాలు(బైఠక్), ఒక స్వర్ణ మరియు రజత తిరగలి (చక్కి), ఈ ఆలయానికి ప్రాకారంలో మదన్ మోహన్ మరియు నవనీత్‌జీ ఉపాలయాలు ఉన్నాయి.

శ్రీనాధ్‌జీ విగ్రహం[మార్చు]

ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలు తో గోవర్ధన గిరిని ఎత్తుతూ కుడి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆలయంలో ఉన్నది నల్లని చలువరాతితో చెక్కబడిన శిల్పము. ఈ శిల్పములో శ్రీకృష్ణుడితో రెండు ఆవులు, ఒక సింహము, రెండు నెమళ్ళు, ఒక పాము మరియు ఒక చిలుక ఉంటాయి.

ఆలయం లోని ఉత్సవాలు మరియు సంప్రదాయాలు[మార్చు]

ఈ ఆలయానికి జన్మాష్టమి సందర్భంగా భక్తులు ప్రవాహముగా వస్తారు. అలాగే దీపావళి మరియు హోలి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ దైవం జీవించి ఉన్నట్లు భావించి ఆరాధించబడుతుంది. ఆలయం లోని మూల విరాట్టుకు రోజూ వారిగా స్నానం, వస్త్రధారణ, భోజనము (ప్రసాదము) లతో సాధారణ జీవితంలో ఉన్నట్లు విశ్రాంతి వేళలు ఉంటాయి. ఈ దైవాన్ని బాలకృష్ణుడిగా భావించి పిల్లల కొరకు తీసుకునే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ఈ ఆలయ పూజారులు వల్లాభాచార్య వంశీకులుగా భావించబడుతున్నారు. వల్లభాచార్యుడు గోవర్ధనగిరిలో ఈ విగ్రహాన్ని కునుగొని ఇక్కడకు తెచ్చి ప్రతిష్ఠించాడని ప్రతీతి.

ఆలయంలో ప్రధాన ఆకర్షణలు హారతి మరియు అలంకారము, వస్త్రధారణ. స్వామికి వేళకు తగిన వస్త్రధారణ జరుగుతుంది. నేతపంచె, జరీ కండువా, రత్నఖచిత ఆభరణాలు వాడతారు. స్వామికి అరాధనతో చద్దులు, గోవులను కాయడానికి ఉపయోగించే కర్ర, పూలు, పండ్లు మొదలైనవి నైవేద్యంగా భక్తి గీతాలను ఆలాపిస్తూ సమర్పిస్తారు. స్వామిని చూడడానికి జాఖి అని పిలువబడే ఒక పరదాను తెరచి చూపిస్తారు.

చరిత్ర[మార్చు]

భౌగోళికం మరియు ప్రయాణ వసతులు[మార్చు]

నగరం[మార్చు]

జనాభా[మార్చు]

కళాకారులు మరియు మేళాకారులు[మార్చు]

నివాసులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

పరిశీలనకు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]