Jump to content

నాన్న (సినిమా)

వికీపీడియా నుండి
సినిమా పోస్టరు

నాన్న 2011లో విడుదలైన డబ్బింగ్ సినిమా. దీని మాతృక తమిళ సినిమా దైవ తిరుమగళ్.[1]

కృష్ణ (విక్రమ్) మేధో వైకల్యం ఉన్న వ్యక్తి. ఇతడు అవలాంచి కొండ ప్రాంతంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కృష్ణ పనిచేసే చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని విక్టర్ అతనిని చూసుకుంటాడు. ఒక రోజు కృష్ణ తాను తండ్రి కాబోతున్నానని గ్రామంలో ఉత్సాహంగా ప్రకటిస్తాడు. ఆ రాత్రి అతని భార్య ఒక కుమార్తెను ప్రసవిస్తుంది. ఆ ప్రసవ సమయంలో ఆమె మరణిస్తుంది.[2]

కృష్ణకు అతని భార్య మరణించిందని అర్ధం కాక, " దేవుని వద్దకు వెళ్ళింది " అని గ్రహించి తండ్రిగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అతను తన కుమార్తెకు నీలా అని పేరు పెడతాడు. నీలాను ప్రేమగా శ్రద్ధతో పెంచుతాడు. నీలా పెరిగినప్పుడు పాఠశాలలో చేర్పించడానికి కృష్ణ అతని యజమాని విక్టర్, అతని ఇతర వికలాంగ స్నేహితుల సహాయం తీసుకుని పాఠశాలలో చేర్పిస్తాడు. ఆమెకు అక్కడి పాఠశాలలోని వైస్-ప్రిన్సిపాల్‌ తో (శ్వేత) స్నేహం ఏర్పడుతుంది. ఆమెను నీలా తల్లిగా భావిస్తుంది.[3]

నీలా తన తండ్రితో ఉన్నపుడు శ్వేత చూస్తుంది. నీలా తండ్రి తాను ఒక ఫొటోలో చూసిన వ్యక్తిగా గుర్తించి, అతను తన సోదరి భానుమతి భర్తే అని తెలుసుకుంటుంది. కృష్ణ తన తెలియనితనంతో నీలాను బాధపెడతాడేమో అన్న భయంతో శ్వేత నీలాను అతనితో ఉండనీయడానికి సంకోచిస్తుంది. ఇంతలో కృష్ణకి, శ్వేతకి కాబోయే భర్త కార్తీక్ కి మధ్య గొడవ జరుగుతుంది.[4]

కృష్ణని వివాహం చేసుకోవడం కోసం భానుమతి తన నుండి దూరమైందని భానుమతి తండ్రి రాజేంద్రన్ చెప్తాడు. కృష్ణ, నీలా తన కుటుంబంలో భాగమనీ, వారిని తనతో తీసుకుని వెళతాననీ అతను విక్టర్ కు చెబుతాడు. విక్టర్ దానికి అంగీకరించి వారిని రాజేంద్రన్‌తో పంపుతాడు. కానీ వారు చెన్నైకి కొంత దూరంలో ఉన్నప్పుడు రాజేంద్రన్ కృష్ణని కారు నుండి బయటకు పంపించి, అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.[5]

దీనితో కలవరం చెందిన కృష్ణ నగరంలో తిరుగుతూ నీలా ఎక్కడా? అని కనిపించిన వారందరిని అడుగుతాడు. చివరికి అతను ఒక కోర్టుకు చేరుకుంటాడు. అక్కడ న్యాయవాది వినోద్‌ను కలుస్తాడు. అతను కృష్ణ ధనవంతుడని భావించి, తన యజమాని అతన్ని కాపాడతానని వాగ్దానం చేస్తాడు. అతను కృష్ణను తన యజమాని అనురాధ రఘునాథన్‌కు పరిచయం చేస్తాడు. కానీ ఆమె, కృష్ణ పిచ్చివాడని గ్రహించి కేసును చేపట్టడానికి వెనుకాడుతుంది. ఈలోగా విక్టర్ కృష్ణని వెతుక్కుంటూ వచ్చి వారి పరిస్థితిని వివరిస్తాడు. అప్పుడు ఆమె ఆ కేసును వాదిస్తుంది.[6]

రాజేంద్రన్‌పై అను హెబియస్ కార్పస్ కేసు దాఖలు చేస్తుంది. కానీ అతని న్యాయవాది భాష్యం అని తెలుసుకున్నప్పుడు ఆమె ఆశను కోల్పోతుంది. అతడు తీసుకున్న ఏ కేసూ ఓడిపోలేదు. ఆ తర్వాత కేసు హైకోర్టులో విచారణకు వస్తుంది. ఇరు పక్షాలు బిడ్డ సంరక్షణ కోసం వాదిస్తాయి. చివరగా భాష్యం కృష్ణని తన కూతురిని ఎలా పెంచగలడు, ఆమెకు ఆర్థికంగా ఎలా మద్దతు ఇవ్వగలడు అని అడుగుతాడు.[7]

తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆప్యాయతను చూసిన తర్వాత, భాష్యం స్వచ్చందంగా కేసును ఉపసంహరించుకుని, నీలాను కృష్ణకు అప్పగించి, కోర్టు నుండి బయటకు వెళ్తాడు. తన కుమార్తెతో కొంత సమయం గడిపిన తర్వాత కృష్ణ, ఆమెను తిరిగి శ్వేత వద్దకు తీసుకువెళ్ళి, ఆమెకు నీలాను అప్పగిస్తాడు. తద్వారా ఆమె ఆర్థిక స్థిరత్వంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుతుందని, ఆమె పెద్దయ్యాక డాక్టర్ కావచ్చని కృష్ణ అభిప్రాయం. తర్వాత కృష్ణ ఊటీకి వెళ్లి విక్టర్ చాక్లెట్ ఫ్యాక్టరీలో తన ఉద్యోగంలో కొనసాగుతాడు.[8]

నటీనటులు

[మార్చు]
  • విక్రమ్ - కృష్ణ[9]
  • బేబి సారా - నీల
  • అనుష్క - అనురాధ
  • అమల పాల్ - శ్వేత
  • నాజర్ - బాష్యం
  • సంతానం - వినోద్
  • వై.జి.మహేంద్ర
  • ఎం.ఎస్.భాస్కర్
  • సచిన్ కడేకర్
  • ప్రియ
  • మాస్టర్ అమ్రేష్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎ.ఎల్.విజయ్
  • సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
  • కధ: విజయ్
  • పాటలు: అనంత శ్రీరామ్
  • నిర్మాణ సంస్థ: ఎస్.కె.పిక్చర్స్[10]
  • విడుదల:2011.

మూలాలు

[మార్చు]
  1. "'I like to portray human values in my films' - Rediff.com Movies". Rediff.com. 2011-07-14. Retrieved 2012-11-08.
  2. "Amala wants a success streak". The Times of India. 2011-01-06. Archived from the original on 2012-06-16. Retrieved 2011-09-09.
  3. "Amala Paul to play Vikram's wife!". Sify. Archived from the original on 2010-11-11. Retrieved 2011-09-09.
  4. "Vikram is Deiva Thirumagan". Sify. Archived from the original on 2011-03-19. Retrieved 2011-09-09.
  5. "Chiyaan returns as 'Deiva Thirumagan'". The New Indian Express. 2011-04-04. Archived from the original on 4 March 2016. Retrieved 2011-09-09.
  6. "Vikram gives up Deiva Magan!". The Times of India. 2011-03-19. Archived from the original on 2012-08-26. Retrieved 2011-09-09.
  7. "Chiyaan returns as 'Deiva Thirumagan'". The New Indian Express. 2011-04-04. Archived from the original on 4 March 2016. Retrieved 2011-09-09.
  8. "Plans For Deiva Thirumagan Audio Launch - Deiva Thirumagan - Vikram - Anushka - Vijay - Amala Paul - Tamil Movie News". Behindwoods.com. 2011-04-05. Retrieved 2011-09-09.
  9. ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
  10. Disability Etiquette: Treat Everyone with Respect (ny.gov)