నాభి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాభి అనగా మానవ శరీరములోని బొడ్డు అని అర్థము. ఈ పదం గణిత, భౌతిక శాస్త్రములలో కూడా వివిధ అర్థాలలో ఉపయోగిస్తారు.

భాషా పరంగా[మార్చు]

నాభి [ nābhi ] nābhi. సంస్కృతం n. The navel. బొడ్డు. Musk, కస్తూరి. Poison, విషము.[1] నాభి or వసనాభి aconite. The central hole in a wheel, రథచక్ర మధ్య రంధ్రము. నాభిక nābhika. n. The navel. T. i. 2. నాభిజన్ముడు nābhi-janmuḍu. n. Brahma, as produced from Vishnu's navel. బ్రహ్మ

భౌతిక శాస్త్రం[మార్చు]

భౌతికశాస్త్రము లో పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence) ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరముగా నుండు కిరణములు పరావర్తనము చెంది కేంద్రీకరించెడి బిందువు లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).

గణిత శాస్త్రము[మార్చు]

గణిత శాస్త్రము లో ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేదసంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనిష్పత్తిలో నుండునట్టి స్థిరబిందువు (Focus).

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాభి&oldid=2879913" నుండి వెలికితీశారు