నామా నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నామా నాగేశ్వరరావు
నామా నాగేశ్వరరావు

నామా నాగేశ్వరరావు


పార్లమెంటు సభ్యులు
పదవీ కాలము
2009-2014
ముందు రేణుకా చౌదరి
తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1957-03-15) 1957 మార్చి 15
బలపాల, ఖమ్మం జిల్లా
జీవిత భాగస్వామి చిన్నమ్మ
సంతానము 3; 2 కుమారులు and 1 కుమార్తె
మతం హిందు

నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.

నాగేశ్వరరావు 1957 మార్చి 15న ఖమ్మం జిల్లా బలపాల గ్రామంలో జన్మించారు.[1] 15 వ లోక్ సభకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి సారిగా లోక్ సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి పై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపొయారు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 125000 ఓట్లతో గెలుపొందారు.[2] 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుండి 11,000 ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు.[3]

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో మరియు పార్లమెంటరీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకొబడ్డారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలరు. కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చించటానికి పార్లమెంటు నుండి వెళ్లిన అఖిల పక్ష బృందంలో సభ్యులు.

నాగేశ్వరరావు రాజకీయాలలో ప్రవేశించక మునుపే ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించారు. మధుకాన్ కంపెనీకి ఛైర్మైన్ గా ఉన్నారు.[4] ఈ సంస్థ గ్రనైట్, కాంట్రాక్ట్ లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియూ ఇతరత్రా వ్యాపారాలని నిర్వహిస్తున్నది. 2009 లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని నమోదు చేసినప్పుడు తన ఆస్థుల విలువ 173 కోట్లుగా ప్రకటించాడు. ఈయన లోక్‌సభకు పోటీచేసిన వారందరిలో కెల్లా అత్యంత ధనవంతుడు[5].

మూలాలు[మార్చు]