నారమల్లి శివప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారమల్లి శివప్రసాద్

పదవీ కాలము
2014-ప్రస్తుత
నియోజకవర్గము చిత్తూరు

పదవీ కాలము
2009-2014

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-04) 1950 మే 4 (వయస్సు: 69  సంవత్సరాలు)
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ మతము

నారమల్లి శివప్రసాద్ (Sivprasad) తెలుగు సినిమా నటుడు మరియు తెలుగుదేశం నాయకుడు. 2009,2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం 15వ లోకసభకు చిత్తూరు (ఎస్.సి) నియోజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.

తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.[1]

బాల్యము[మార్చు]

నాగయ్య, చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951న శివప్రసాద్ గారు జన్మించాడు.

విద్య[మార్చు]

ఇతడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించాడు.

కుటుంబము[మార్చు]

ఇతనికి రాజ్యలక్ష్మిగారితో 26 పిబ్రవరి 1972 లో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

అభిరుచులు[మార్చు]

సాహిత్యము, కళలు, సినిమా నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. ఇతడు సినిమాలలో నటించాడు. 2005 లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది.

మూలాలు[మార్చు]

http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4531

  1. http://www.andhrabhoomi.net/content/n-316