నారాయణ్‌ రాణె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:COI

నారాయణ్‌ రాణె (మరాఠీ: नारायण राणे) (1952 ఏప్రిల్‌ 10న జన్మించారు) భారత్‌లోని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం రెవెన్యూ మంత్రి, మరియు మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి[1]. జూలై 2005లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరే వరకూ, శివసేనలో సభ్యుడు. రాజకీయాల్లోకి రావడానికి ముందు ముంబై సబర్బన్‌లోని చెంబుర్‌ ప్రాంతంలోని హన్యా-నార్యా గ్యాంగ్‌లో ఆయన సభ్యుడు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్య అమ్మకపు పన్ను విభాగంలోనూ ఆయన పనిచేశారు. పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను, 2008 డిసెంబరు 6న ఆయనను భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారు. అయితే తనని క్షమించాలంటూ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన తర్వాత, 2009, ఫిబ్రవరి 19న ఈ బహిష్కరణను రద్దు చేసారు.

వృత్తి జీవితం[మార్చు]

2005, జూలై 3న రాణెను శివసేన నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత 21 రోజులకు ఆయన మహారాష్ట్ర శాసనసభను కూడా వదిలేశారు. దీని వెనక ఉన్న కారణం, ఆయన పార్టీని మరియు పార్టీ అధినేత బాలా‌సాహెబ్‌ థాకరేను మరియు ఆయన కుమారుడు ఉద్ధవ్‌ థాకరే అభివృద్ధిని పక్కకు నెట్టివేయడమే. దీని తర్వాత అంతా నాటకీయంగా జరిగింది. చాలా ఆలోచనల తర్వాత ఆయనను భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుని, మహారాష్ట్ర ప్రభుత్వంలో బలమైన మంత్రిపదవి ఇచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. కొంకన్‌ ప్రాంతంలోని మాల్‌వన్‌ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్‌ తరఫున శాసనసభకు మళ్లీ ఎన్నిక కావలసి వచ్చింది. శివసేన ప్రణాళిక ప్రకారం ఈయనకు గట్టి పోటీ ఇచ్చినా, 50 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన శివసేన శాసన సభ్యులలో చీలిక తెచ్చారు. ఓ దశలో రాష్ట్రంలో తమ జూనియర్‌ భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాల్సిన స్థితి ఏర్పడింది. అయితే రాణెకు సంబంధించిన అభ్యర్థులు వరుసగా ఓడిపోవడంతో దీనికి అడ్డుకట్టపడింది. శివసేన, ముఖ్యంగా ఉద్దవ్‌ థాకరే, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించగలిగారు.

2007లో, శాసనసభ ఉప ఎన్నికల్లో ముంబై నుంచి ఈయన అభ్యర్థులు ఓడిపోయారు. ముంబై పురపాలక సంఘ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయారు. శివసేన మరియు, బిజెపి వరుసగా మూడోసారి ఇక్కడ విజయం సాధించాయి.

2007 డిసెంబరులో ముఖ్యమంత్రి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, బహిరంగంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తమ పార్టీకే చెందిన విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వెళ్లారు.

ప్రహార్[మార్చు]

‌ముఖ్యమంత్రి పదవి ప్రస్తుతానికి దూరంగా ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నారాయణ్‌ రాణె, ప్రహార్‌ అనే దినపత్రికను ప్రారంభించడం ద్వారా 'ముఖ్య' పదాన్ని ముందు చేర్చుకున్నారు. ఈ పత్రిక 2008, అక్టోబర్ 8న స్టాండ్స్‌లోకి వచ్చింది. NCP అధ్యక్షుడు శరద్‌పవార్‌ మరియు మహారాష్ట్ర సహకార మంత్రి పతంగరావ్‌ కదమ్‌ల సమక్షంలో దినపత్రిక డైరెక్టర్లు ఈ పదాన్ని చేర్చారు.

రాణె పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చిన 'ప్రహార్'‌ మరాఠీ దినపత్రిక-మహారాష్ట్ర ఆర్థిక మంత్రి నారాయణ్‌ రాణె యొక్క ప్రచురణ. ఈయనే ఈ మరాఠీ దినపత్రికకు 'ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌'.పాతకాలపు జర్నలిస్ట్‌ అలహద్‌ గోడ్బోలె ఈ 'ప్రహార్'కు సంపాదకులు.

రాణె ఈ పత్రిక గురించి మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన, మార్పులు తెచ్చేందుకు దినపత్రిక ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని, మహారాష్ట్ర అభివృద్ధికి తాను దానిని వాడబోతున్నానని అన్నారు.దినపత్రిక మొదటి పేజిలో ఆయన సంతకంతో కూడిన సంపాదకీయాన్ని ప్రచురించారు. ఇందులో ఆయన, 'నేను ఒక రాజకీయ నాయకుడిని. గత 40 ఏళ్లలో అనేక రాజకీయ పదవులు పొందిన అనుభవం ఉంది. 39 ఏళ్ల పాటు శివసేనలో పనిచేసిన తర్వాత, కాంగ్రెస్‌లో చేరాను. ఇది నా జీవితంలో విధివిలాసం అని భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

రాజకీయ శత్రుత్వం[మార్చు]

ఏప్రిల్‌ 19న, ప్రముఖ మీడియా CNN IBN‌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. రత్నగిరి ప్రాంతంలోని కంకావిళి సమీపంలో అంకుశ్‌ రాణె అనే నారాయణ్‌రాణె సహచరుడి మృతదేహం లభించింది. ఈ వ్యక్తి హత్య వెనక శివసేన రాజ్యసభ సభ్యుడు నారాయణ్‌ రాణె ప్రమేయం ఉందని ఆరోపణ వచ్చింది. శివసేన అధికార ప్రతినిధి దీనిని ఖండించారు. ఇప్పటికి కూడా ఆ మృతదేహం అంకుశ్‌ రాణాదే అని పోలీసులు నిర్దారించలేదు. దీనికి కారణం మృతదేహాన్ని కనుగొన్న సమయంలో అది ఛిద్రమై ఉంది. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని కొడుకు నితేశ్‌ రాణె తీసుకుని, తమ కుటుంబం కార్యకలాపాలు గురించి ఏమైనా చూపించినా, తమను అప్రజాస్వామిక వాదులుగా చిత్రించినా ఊరుకోబోమని సినిమాల నిర్మాతలను బెదిరించారు.


మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నిక కావడం

  • 1990-1995
  • 1995-1999
  • 1999-2004
  • 2004-2005 మధ్యవరకూ
  • 2005 ఉప ఎన్నిక

నిర్వహించిన బాధ్యతలు

  • 1996-1999 రెవెన్యూ మినిస్టర్, డైరి డెవెలప్-మెంట్, అనిమల్ హస్బెండ్రీ, ఫిషరీస్, ఖర్లాండ్స్, స్పెషల్ అస్సిస్టన్స్ & రీహాబిలేషన్.
  • 1999 మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
  • 2005-2008 రెవెన్యూ మినిస్టర్
  • 2009- మినిస్టర్ అఫ్ ఇండస్ట్రీస్, రెవిన్యూ

సూచనలు[మార్చు]

అంతకు ముందువారు
Sudhir Joshi
Minister of Revenue
15 June 1996 – 1 February 1999
తరువాత వారు
Diwakar Raote
అంతకు ముందువారు
Manohar Joshi
Chief Minister of Maharashtra
1 February 1999 – 17 October 1999
తరువాత వారు
Vilasrao Deshmukh
అంతకు ముందువారు
Vilasrao Deshmukh
Minister of Revenue
16 August 2005 – 6 December 2008
తరువాత వారు
Patangrao Kadam
అంతకు ముందువారు
Ashok Chavan
Minister of Industry
20 February 2009 – 9 November 2009
తరువాత వారు
Rajendra Darda
అంతకు ముందువారు
Patangrao Kadam
Minister of Revenue
9 November 2009 –
తరువాత వారు
incumbent