Jump to content

నారాయణ్ జగదీశన్

వికీపీడియా నుండి
నారాయణ్ జగదీశన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-12-24) 1995 డిసెంబరు 24 (వయసు: 30)
కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–ప్రస్తుతంతమిళనాడు
2020–2022చెన్నై సూపర్ కింగ్స్
2023కోల్‌కతా నైట్‌రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 52 64 66
చేసిన పరుగులు 3,373 2,728 1,475
బ్యాటింగు సగటు 47.50 46.23 31.38
100s/50s 10/14 9/9 0/10
అత్యధిక స్కోరు 321 277 88
క్యాచ్‌లు/స్టంపింగులు 133/14 49/8 26/7
మూలం: ESPNcricinfo, 2025 మార్చి 15

నారాయణ్ జగదీశన్ (జననం 24 డిసెంబర్ 1995) భారతీయ క్రికెటర్, అతని సన్నిహితులు & సహచరులు జగ్గీ అని పిలుస్తారు. ఆయన దేశీయ క్రికెట్‌లో తమిళనాడు తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతాడు.

దేశీయ కెరీర్

[మార్చు]

నారాయణ్ జగదీశన్ అక్టోబర్ 27, 2016న 2016–17 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్ -క్లాస్ అరంగేట్రం చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆయన 2017 జనవరి 30న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో తమిళనాడు తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. ఆయన 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.

నారాయణ్ జగదీశన్ జనవరి 2018లో 2018 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆయన 2020 అక్టోబర్ 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

నారాయణ్ జగదీశన్ జనవరి 2021లో 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 364 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫిబ్రవరి 2021లో పంజాబ్‌పై సెంచరీతో సహా 217 పరుగులు చేసి, 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

నారాయణ్ జగదీశన్ ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని మళ్ళీ కొనుగోలు చేసింది.

నారాయణ్ జగదీశన్ 21 నవంబర్ 2022న చిన్నస్వామి స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు తరపున నారాయణ్ జగదీసన్ 147 బంతుల్లో 277 పరుగులు చేసి లిస్ట్ ఎ క్రికెట్‌లో అలీ బ్రౌన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. ఆయన పురుషుల లిస్ట్ ఎ క్రికెట్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.[1] గతంలో ముగ్గురు బ్యాటర్లు వరుసగా నాలుగు సెంచరీలు సాధించారు - 2014–15లో కుమార సంగక్కర, 2015–16లో అల్విరో పీటర్సన్, 2020–21లో దేవదత్ పాడిక్కల్.

నారాయణ్ జగదీశన్ 2022 డిసెంబర్ 16న 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం అతన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

నారాయణ్ జగదీశన్ జూలై 2025లో మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కుడి పాదం విరిగిన రిషబ్ పంత్ స్థానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జాతీయ జట్టుకు అతను తొలి కాల్-అప్ పొందాడు.[2][3]

2025లో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టులో స్థానం పొందాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్". Sakshi. 21 November 2022. Archived from the original on 2 October 2025. Retrieved 2 October 2025.
  2. ↑ "పంత్ స్థానంలో టీమ్‌ఇండియాలోకి.. నారాయణ్ జగదీశన్‌ రికార్డులివీ". Eenadu. 29 July 2025. Archived from the original on 2 October 2025. Retrieved 2 October 2025.
  3. ↑ "Narayan Jagadeesan: All about India's new keeper replacing Rishabh Pant and record holder of world's highest score in one-day cricket". The Economic Times. 25 September 2025. Archived from the original on 25 September 2025. Retrieved 2 October 2025.
  4. ↑ "గిల్‌ డిప్యూటీగా రవీంద్ర జడేజా.. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా ఇదే". Eenadu. 25 September 2025. Archived from the original on 2 October 2025. Retrieved 2 October 2025.