Jump to content

నారాయణ్ దాస్ అహిర్వార్

వికీపీడియా నుండి
నారాయణ్ దాస్ అహిర్వార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు భానుప్రతాప్ సింగ్ వర్మ
నియోజకవర్గం జలౌన్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి
పదవీ కాలం
2007 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం (1968-07-01) 1968 జులై 1 (వయసు: 57)
సైద్ నగర్, ఓరై, ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
తల్లిదండ్రులు రాజా రామ్, ముల్లి బాయి
జీవిత భాగస్వామి కనక్ లత
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం 1582, న్యూ రాజేంద్ర నగర్, ఒరై, జలౌన్, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

నారాయణ్ దాస్ అహిర్వార్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నారాయణ్ దాస్ అహిర్వర్ 1982లో కాన్షీరామ్ ప్రేరణతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొంతకాలం తర్వాత దళిత శోషిత సమాజ్ సంఘర్ష్ సమితి (DS-4) లో సభ్యుడయ్యాడు. అయన 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించబడినప్పుడు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. నారాయణ్ దాస్ 1992, 2000లో ఒరై అసెంబ్లీ నియోజకవర్గంలో బిఎస్పీ యూనిట్ అధ్యక్షుడిగా ఆ తరువాత 2002లో జలాన్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహిస్తూ  ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అయన 2005లో,  కొంచ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడై 2007లో మాయావతి మెజారిటీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007 నుండి 2011 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో జల్ నిగమ్ బోర్డు సహాయ మంత్రిగా పని చేశాడు.

నారాయణ్ దాస్ ఆ తరువాత బుందేల్‌ఖండ్ డివిజన్ జోనల్ కోఆర్డినేటర్‌గా, కాన్పూర్, వారణాసి, దేవీపటాన్, అజంగఢ్, గోరఖ్‌పూర్, బస్తీ, ఫైజాబాద్‌లకు జోనల్ కోఆర్డినేటర్‌గా  పని చేశాడు. ఆయన ఆ తరువాత పార్టీ విధానంతో విభేదించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు బీఎస్‌పీ ని వీడి  సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భానుప్రతాప్ సింగ్ వర్మపై 53,898 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. "Mayawati's ex-aides, BSP founder members: SP line-up stacked with former rivals" (in ఇంగ్లీష్). The Indian Express. 23 April 2024. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
  3. "Lok Sabha 2024 Election Results: Jalaun" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
  4. "Who Is Narayan Das Ahirwar Who Defeated Union Minister Bhanupratap Singh From Jalaun" (in ఇంగ్లీష్). TimelineDaily. 5 June 2024. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
  5. "जालौन लोकसभा सीट से जीतने वाले समाजवादी पार्टी के नारायण दास अहिरवार कौन हैं, जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
  6. "Narayan Das Ahirwar, Samajwadi Party Representative for Jalaun (SC), Uttar Pradesh - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.