నారాయణ్ పాటిల్
| నారాయణ్ పాటిల్ | |||
| పదవీ కాలం 23 నవంబర్ 2024 - | |||
| ముందు | షిండే సంజయ్మామ విఠల్రావు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కర్మలా | ||
| పదవీ కాలం 2014 - 2019 | |||
| ముందు | బాగల్ షామల్ దిగంబరరావు | ||
| తరువాత | సంజయ్‌మామ విఠల్‌రావు షిండే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఎన్‌సీపీ - ఎస్‌పీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
| నివాసం | మహారాష్ట్ర, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నారాయణ్ గోవిందరావు పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్మలా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నారాయణ్ గోవిందరావు పాటిల్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర ఎన్నికలలో కర్మలా శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి రష్మీ బాగల్‌పై 257 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయనకు 2019 మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్‌మామ విఠల్‌రావు షిండే చేతిలో 5,494 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
నారాయణ్ పాటిల్ 2022లో తిరిగి ఏకనాథ్ షిండే శివసేన పార్టీలో చేరాడు.[4] ఆయనకు 2024 మహారాష్ట్ర ఎన్నికలలో కర్మలా శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) పార్టీలో చేరి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్‌మామ విఠల్‌రావు షిండేపై 16085 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "नारायण पाटील शिंदे गटात सामील, म्हणून मी एकनाथ शिंदेंसोबत , पाटलांचं स्पष्टीकरण". TV9 Marathi. 28 June 2022. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- ↑ "Karmala Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Karmala". 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.