అక్షాంశ రేఖాంశాలు: 23°40′30″N 68°32′19″E / 23.675086°N 68.538627°E / 23.675086; 68.538627

నారాయణ్ సరోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?నారాయణ్ సరోవర్
గుజరాత్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°40′30″N 68°32′19″E / 23.675086°N 68.538627°E / 23.675086; 68.538627
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) కచ్ జిల్లా


నారాయణ్ సరోవర్,ప్రధాన ఆలయ గోపురం
రాంచోద్రాయ్ జీ ఆలయం

నారాయణ్ సరోవర్ ను నారాయణ్ సర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఉంది. ఇది హిందువుల తీర్థ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుండి పురాతన కోటేశ్వర్ ఆలయం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

దీనిని 90 వ దశకంలో మహారావు దేశాల్ జి రాణి నిర్మించింది.[1][2]

ఆలయాలు

[మార్చు]

పవిత్ర నారాయణ్ సరోవర్ ఒడ్డున ఆది నారాయణుడి పురాతన ఆలయం ఉంది. కోటేశ్వర్ శివాలయం నారాయణ్ సరోవర్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణ్ సరోవర్‌ దగ్గర త్రికం జీ, లక్ష్మీనారాయణ, గోవర్ధన్నాథ్ జి, ద్వారకానాథ్ జి, ఆది నారాయణ్, రాంచోద్రాయ్ జి, లక్ష్మి జి మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను కచ్ మహారాజు మూడవ దేశాల్జీ నిర్మించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు దర్శనం కోసం ఇక్కడకు వస్తారు. చెరువులు, దేవాలయాలు, పురాతన వాస్తుశిల్పం, కళ-పనితనంతో ఇక్కడి ప్రదేశాలు నిండి ఉన్నాయి.[3] [2]

ప్రత్యేకత

[మార్చు]

ఈ సరస్సు పంచ సరోవర్ లలో ఒకటి. హిందూ వేదాంతశాస్త్రం ప్రకారం, మన్ సరోవర్, బిందు సరోవర్, నారాయణ్ సరోవర్, పంప సరోవర్, పుష్కర్ సరోవర్ అనేవి ఐదు పవిత్ర సరస్సులు. వీటిని అన్నింటినీ కలిపి పంచ్-సరోవర్ అని పిలుస్తారు. భారతదేశంలోని పవిత్ర నదులలో ఒకటైన సరస్వతి నది నారాయణ్ సరోవర్ సమీపంలో సముద్రంలో కలుస్తుంది. ఈ సరస్సు లోని నీరు సరస్వతి నది పవిత్ర నీటి తో నిండి ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం ఇప్పటికీ హిందువుల ఐదు పవిత్ర సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది.[4]

ఉత్సవాలు

[మార్చు]

చైత్ర మాసం (ఏప్రిల్-మే), కార్తీక మాసం (నవంబర్-డిసెంబర్) నెలల్లో సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ వివిధ ఉత్సవాలు నిర్వహిస్తారు. పశ్చిమ భారతదేశం నుండి, వేలాది మంది యాత్రికులు ఈ సరస్సు ఒడ్డున అంత్యక్రియల కార్యక్రమాలు చేయడానికి వస్తారు.[5]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. pp. 245–248.
  2. 2.0 2.1 Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers : Page :27 by Raja Pawan Jethwa. (2007) Calcutta.
  3. [1] Encyclopaedia of tourism resources in India, Volume 2 By Manohar Sajnani
  4. One outlet of the Saraswati into the sea was at Lokpat which was also a major seat of learning and a port. Further downstream was Narayan Sarovar which is mentioned in the Mahabharta as a holy place.
  5. Ward (1998-01-01). Gujarat–Daman–Diu: A Travel Guide. ISBN 9788125013839.