నారాయణ విద్యాసంస్థలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Narayana Group Of Schools Narayana Group Of Educational Institutions
225px
స్థానం
సమాచారం
స్థాపన1979
స్థాపకులుడాక్టర్ పి.నారాయణ
Websiteనారాయణ గ్రూప్ వెబ్‌సైట్
నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ, నెల్లూరు

నారాయణ విద్యాసంస్థలు అనగా ప్రాథమిక విద్య నుండి ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యను అందించే ఒక విద్యా సమూహం. నారాయణ విద్యా సంస్థలను డాక్టర్ పి.నారాయణ స్థాపించారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన విద్యా సంస్థలలో

చరిత్ర[మార్చు]

1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్‌గా మొదలైన ఈ సంస్థ రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేది. ప్రారంభించింది మొదలుగా గుర్తింపు పొందిన నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఆధ్వర్యంలో 1983 నాటికి పూర్తిస్థాయి విద్యాసంస్థగా అవతరించింది. 1985 నాటికి అత్యుత్తమ విద్యను అందించే సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అది ఈ విద్యాసంస్థ పురోగతికి ప్రారంభం. ఆరోజు నారాయణ ప్రదర్శించిన దార్శనికత నేటికీ తన శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. 1990లో ఉన్నత పాఠశాల ప్రారంభించారు. 1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్సియల్ కాలేజిని స్థాపించారు. 1999లో జూనియర్ కాలేజిని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఐఐటీ-జేఈఈ కోచింగ్ కేంద్రాలను స్థాపించారు. 1990ల చివర్లో నారాయణ విద్యాసంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 1998లో నెల్లూరులో 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో దంతవైద్య కళాశాలను స్థాపించారు. 2002లో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూలు, అనంతపూర్, రాజమండ్రి, కాకినాడ పట్టణాల్లో ప్రారంభించారు. రాజస్థాన్ లోని కోటలో సంస్థ ఏర్పర్చిన పిఎమ్‌టి, ఐఐటి-జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యాసంస్థల నేతృత్వం మరింత బలోపేతమయింది. ఈ సంస్థ 2004-05లో కరెస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిలభారత టెస్ట్ సీరీస్‌ ఆన్‌లైన్ వెర్షన్‌ను ప్రారంభించింది. నారాయణ విద్యాసంస్థలన్నింటికీ వెన్నెముకగా నిలిచినవారు డాక్టర్ పి.నారాయణ. ఈయన నేతృత్వంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 550 పైగా కేంపస్‌లలో మూడు లక్షల 75 వేల మంది విద్యార్థులు ఏటా చదువుకుంటున్నారు. 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నారాయణ గ్రూప్ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యకు చిరునామాగా మారింది.

మూలాలు[మార్చు]