నారింజ విత్తన నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారింజ చెట్టు
నారింజ పళ్లు
నారింజ పళ్ల విత్తనాలు/గింజలు

నారింజ విత్తన నూనె ఒక శాకతైలం.అనగా కొవ్వు ఆమ్లాలు వున్న నూనె.నారింజ విత్తన నూనెను నారింజ నూనె అని పొరబడే అవకాశం ఉంది. నారింజ నూనె అనేది ఒక ఆవశ్యక నూనె, సుగంధ తైలం.అంతే కాదు ఔషధ గుణాలున్న నూనె. నారింజ నూనెను నారింజ పళ్ల యొక్క తొక్క (peel) నుండి సంగ్రహిస్తారు. కాగా నారింజ విత్తన నూనెను పేరులో వున్న విధంగా విత్తనాలనుండి ఎక్సుపెల్లరు అనే నూనె యంత్రాల ద్వారా లేదా సాల్వెంట్ ఎక్సుట్రాక్సను పద్ధతిలో తీస్తారు. విత్తనాలలో నూనె 56% వరకు ఉంది.కాకపోతే పళ్లలో విత్తనాల శాతం తక్కువగా వున్నందున,, వాటి సేకరణ కష్ట మైన పనికావడంవలన నారింజ విత్తనాల నూండి భారీ స్థాయిలో నూనె ఉత్పత్తి ఇంతవరకు జరుగలేదు. ప్రస్తుతానికి (2018 నాటికి) విత్తనాల నుండి నూనెను సంగ్రహించడం ప్రయోగాలకే పరిమితమైనది.

నారింజ చెట్టు[మార్చు]

నారింజ చెట్టు సతతహరితం.ముదురు ఆకుపచ్చని ఆకులను, కల్గి వుండును.పూలు తెల్లగా వుండును. పూలు 5 రెక్కలు కల్గి వుండును. నారింజ పండు గుండ్రంగా వుండి ఆరెంజీ రంగులో వుండును. ఈ చెట్ల జన్మస్థానం చీనా.ప్రస్తుతం (2018నాటికి) అమెరికాలో నారింజ సాగు అధికంగా ఉంది.[1]

నూనె సంగ్రహణ[మార్చు]

నూనెను విత్తనాల నూండి యంత్రాల ద్వారా లేదా సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలో సంతృప్త, అ సంతృప్త కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు ఉన్నాయి. నారింజ గింజలలో నూనె 56% వరకు ఉంది.నూనె పసుపు రంగులో వుండును.

నూనె[మార్చు]

నూనె పసుపు రంగులో వుండును.

భౌతిక లక్షణాలు[మార్చు]

నూనెలో మిగతా నూనెలకన్నా పెరాక్సైడ్ విలువ ఎక్కువ ఉంది.నూనె యొక్క సాంద్రత, వక్రీభవన సూచిక విలువల ప్రకారం నారింజ గింజలనూనె ఆహార యోగ్యమైనది.

భౌతిక గుణాల పట్టిక[2]

వరుస సంఖ్య భౌతిక గుణం పరిమితి విలువ
1 రంగు పసుపు
2 37C వద్ద భౌతిక స్థితి ద్రవ స్థితి
3 సాంద్రత 0.8812
4 వక్రీభవన సూచిక 1.457
5 అయోడిన్ విలువ 54.19
6 సపోనిఫీకేసను విలువ 190.3.2
7 పెరాక్సైడ్ విలువ 5.8
8 అనసపోనిఫియబుల్ మేటరు 0.7

నూనెలోని కొవ్వు ఆమ్లాలు[మార్చు]

నూనెలో పామిటిక్, స్టియరిక్ సంతృప్తకొవ్వూఆమ్లాలు.ఒలిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లంఅనే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.ఒలిక్ ఆమ్లం తరువాత తరువాత స్థాయిలో లినోలిక్ ఆమ్లం ఉంది.

  • నూనెలోని కొవ్వు ఆమ్లాలు[3]
వరుససంఖ్య కొవ్వు ఆమ్లాలు శాతం
1 పామిటిక్ ఆమ్లం 37.0
2 స్టియరిక్ ఆమ్లం 9.31
3 ఒలిక్ ఆమ్లం 25.5
4 లినోలిక్ ఆమ్లం 23.84
5 అల్ఫా లినోలెనిక్ ఆమ్లం 2.30

వినియోగం[మార్చు]

  • సబ్బుల తయారి పరిశ్రమలలో ఉపయోగించవచ్చును.
  • రంగుల తయారి (paints) ఉపయోగించవచ్చును.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]