నారీ నారీ నడుమ మురారి (2026 సినిమా)
| నారీ నారీ నడుమ మురారి | |
|---|---|
నారీ నారీ నడుమ మురారి పోస్టర్ | |
| దర్శకత్వం | రామ్ అబ్బరాజు |
| రచన | రామ్ అబ్బరాజు, |
| నిర్మాత | రామబ్రహ్మం సుంకర |
| తారాగణం | శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య |
| సంగీతం | విశాల్ చంద్ర శేఖర్ |
విడుదల తేదీ | 2026 జనవరి 14 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
నారీ నారీ నడుమ మురారి 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు.[1] శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 22న విడుదల చేశారు.[2]
నారీ నారీ నడుమ మురారి ట్రైలర్‌ను 2026 జనవరి 1న విడుదల చేసి,[3] సినిమాను జనవరి 14న విడుదల చేశారు.[4]
ఈ సినిమా ఫిబ్రవరి 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.[5]
నటీనటులు
[మార్చు]- శర్వానంద్
- సంయుక్త మీనన్
- సాక్షి వైద్య
- సునీల్
- నరేష్
- వెన్నెల కిశోర్
- సత్య
- మధునందన్
- సంపత్ రాజ్
- రఘుబాబు
- సుదర్శన్
- గెటప్ శ్రీను
- సిరి హనుమంత్
- శ్రీవిష్ణు (అతిధి పాత్ర)[6][7]
- నారిపెద్ది శివన్నారాయణ
- రజిత
- మధుమణి
- గోపరాజు విజయ్
- సమ్మెట గాంధీ
- లోబో
- టేస్టీ తేజ
- చైతన్య గరికిపాటి
- దియా భర్త ఆర్యగా శ్రీవిష్ణు (అతిథి పాత్ర)
విమర్శకుల స్పందన
[మార్చు]‘’‘తెలుగు వాడి టీవీ’’’ వెబ్‌సైట్ ఈ చిత్రానికి 5లో 3.5 రేటింగ్ ఇచ్చింది. శర్వానంద్ యొక్క ఉత్సాహభరిత నటన, హాస్య ప్రధాన కథనంతో సినిమా వినోదాత్మకంగా సాగుతుందని పేర్కొంటూ, కథ బలంపై కన్నా నటన, హాస్యంపై ఎక్కువగా ఆధారపడిన చిత్రంగా అభివర్ణించింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "నవ్వించడంలోనే సంతృప్తి". NT News. 10 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ఆకట్టుకుంటున్న శర్వా నయా మూవీ టీజర్.. ఈ పండక్కి నవ్వులే నవ్వులు". TV9 Telugu. 22 December 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "సెప్టిక్ ట్యాంక్‌కు, చెత్తకుప్పలకు దూరంగా ఉండాలి.. హైప్ పెంచుతోన్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ట్రైలర్". NT News. 11 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "బాక్సాఫీస్‌కి సంక్రాంతి జోష్". Eenadu. 12 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు". TV9 Telugu. 4 February 2026. Archived from the original on 4 February 2026. Retrieved 4 February 2026.
- ↑ "'నారీ నారీ నడుమ మురారి'లో హీరో శ్రీవిష్ణు - డబుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అయినట్లేగా..." ABP Desam. 4 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
- ↑ "నారీ నారీ నడుమ మురారి'లో శ్రీవిష్ణు సర్ ప్రైజ్". V6 Velugu. 5 January 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
- ↑ "Nari Nari Naduma Murari – Review & Rating". తెలుగు వాడి టీవీ. 2026-01-14. Archived from the original on 2026-01-14. Retrieved 2026-01-14.