నార్టియాంగ్ దుర్గా ఆలయం
| నార్టియాంగ్ దుర్గా ఆలయం | |
|---|---|
| జయంతి | |
నార్టియాంగ్ దుర్గా ఆలయం-బయటి దృశ్యం | |
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 25°34′01″N 92°12′32″E / 25.567°N 92.209°E |
| దేశం | |
| రాష్ట్రం | మేఘాలయ |
| జిల్లా | వెస్ట్ జైంటియా హిల్స్ జిల్లా |
| ప్రదేశం | West Jaintia Hills district |
| సంస్కృతి | |
| దైవం | దుర్గ |
| ముఖ్యమైన పర్వాలు | దుర్గాపూజ |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | బెంగాలీ దేవాలయ నిర్మాణ శైలి |
| చరిత్ర, నిర్వహణ | |
| స్థాపితం | అహోంల కాలంలో |
| నిర్మించిన తేదీ | c. 1600 CE |
| దేవస్థాన కమిటీ | కేంద్ర పూజ కమిటీ |
| నిర్వహకులు/ధర్మకర్త | మేఘాలయలోని హిందూ సమాజం |
నార్టియాంగ్ దుర్గా ఆలయం ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా లో ఉన్న ఒక హిందూ దేవాలయం.[1] ఇది మేఘాలయలో ఉన్న ఒక చారిత్రక దేవాలయం. షిల్లాంగ్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారి 6 ద్వారా సుమారు 2 నుండి 2.5 గంటల సమయం పడుతుంది.[2]
ఆలయ విశేషాలు
[మార్చు]నార్టియాంగ్ దుర్గా ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. హిందూ మతానికి చెందిన శక్తివాద భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఇది 600 సంవత్సరాల పురాతనమైనది. మేఘాలయలోని జైంతియా కొండలలోని హిందువులు ఈ ఆలయాన్ని దుర్గాదేవికి శాశ్వత నివాసంగా నమ్ముతారు.[3] దుర్గా పూజ సందర్భంగా దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ ఆలయానికి వస్తుంటారు.[4] నర్టియాంగ్ దేవి ఆలయంలోని శక్తిని జయంతిగా, భైరవుడిని కామదీశ్వరూడిగా పూజిస్తారు.[5] ఈ దేవాలయ సమీపంలో, నడిచే దూరంలో, శివాలయం ఉంది, ఇక్కడ ఆలయం లోపల పూర్వంనుంచి ఉన్న పురాతన ఫిరంగుల అవశేషాలు కనపడతాయి. ఈ పరిసరాల్లో ఒక హిందూ ఆలయం ఉంది, అక్కడ అభ్యసించే పూజారులు జైంతియాపూర్ నుండి వచ్చిన అసలు పూజారుల వారసులు.
ఇక్కడ ఆలయ దర్శనం ఉచితం. ఉదయం 6 గం. కు ఆలయం తెరుస్తారు. అక్టోబరు నుంచి మార్చి నెలవరకు ఈ ఆలయ సందర్శనానికి అనుకూలంగా ఉంటుంది.[6]
ప్రాముఖ్యత
[మార్చు]నార్టియాంగ్ దేవి ఆలయాన్ని శక్తి పీఠం అని నమ్ముతారు. ఇది శక్తికి సంబంధించి అత్యంత పూజ్యనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి, ఈ శక్తిపీఠాలు పరాశక్తి పవిత్ర నివాసాలు. దక్ష యజ్ఞం పురాణం శక్తిపీఠాల ఆవిర్భావం గురించి తెలియ చేస్తుంది. సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది, శివుడు సతీదేవి శరీరాన్ని మోశాడు. సతీదేవి 51 శరీర భాగాలు శివుడు సంచరించిన మార్గంలో పడిపోయాయి. ప్రతి ఆలయంలో శక్తితో పాటు సంబంధిత పురుష శక్తి ప్రతిరూపం అయిన కాలభైరవుని ఆలయాలు ఉన్నాయి. నర్టియాంగ్ దేవి మందిరంలోని "శక్తి" ని 'జయంతి' అని, "కాలభైరవు" ని 'కామదీశ్వరుడు' అని పిలుస్తారు. సతీదేవి ఎడమ తొడ జైంతియా కొండలలోని నార్టియాంగ్ వద్ద పడిందని నమ్ముతారు.[3] అందువల్ల ఈ దేవతను జైంతేశ్వరి అని పిలుస్తారు.
చరిత్ర
[మార్చు]కొన్ని శతాభ్దాల క్రితం జైంతియా రాజు ధన్ మాణిక్ (1596–1612) జైంతియా రాజ్యానికి 'నార్టియాంగ్' ను వేసవి రాజధానిగా చేశారు. రాజు జాసో మాణిక్ హిందూ కోచ్ రాజు నార నారాయణ కుమార్తె లక్ష్మీ నారాయణను వివాహం చేసుకున్నాడు. ఆమె జయంతియా రాజు జాసో మాణిక్, అతని తెగపై ప్రభావం చూపించింది. దుర్గాదేవికి ప్రచండ భక్తురాలు కాబట్టి ఆమె హిందూ మతంలో శక్తి వాదాన్ని స్వీకరించిందని నమ్ముతారు.
ఒక పురాణం ప్రకారం, ఒక రోజు రాత్రి దేవత జాసో మాణిక్కు కలలో కనిపించి, ఆ ప్రదేశం ప్రాముఖ్యతను తెలియజేసి, తన గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. దీని తరువాత, నార్టియాంగ్లోని జైన్తేశ్వరి ఆలయాన్ని స్థాపించారు. ఆలయం ప్రదేశం వ్యూహాత్మకంగా నిర్మించాడు. ఈ ఆలయం ప్రాంగణంలో ఫిరంగులు వంటి ఆయుధాల ఉనికి, ఇది జయంతియా రాజుల కోటలో భాగమని సూచిస్తుంది.[1]

1835లో బ్రిటిష్ వారు జైంతియా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఈ ఆలయం ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు మతపరమైన, సామాజిక కార్యకలాపాలకు కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రదేశం నిర్లక్ష్యానికి గురైంది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, ఈ చారిత్రక ఆలయాన్ని పునరుద్ధరించడానికి పరిరక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత పురావస్తు సర్వే సంస్థ పరిరక్షణ పనులను చేపట్టింది.[6] చిరపుంజిలోని శ్రీ రామకృష్ణ మిషన్ వారు ప్రజల నమ్మకాన్ని, సాంస్కృతిని సంప్రదాయాన్ని, వారసత్వాన్ని పరిరక్షించడానికి ఈ ఆలయాన్ని పునరుద్దించారని ఆలయంలో తాపడం చేసిన ఫలకం (1987) తెలియ చేస్తోంది.
ఆరాధన
[మార్చు]
ఈ ఆలయంలో ఆచారాలు సమతుల ప్రదేశాలలోని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించరు, కానీ ఇవి హిందూ, పురాతన ఖాసీ సంప్రదాయాల మిశ్రమమైన ఒక ప్రత్యేకమైన పద్ధతి. దేవతలు, దేవతల బొమ్మలను ఉపయోగించకూడదనే ఖాసీ ఆచారానికి అనుగుణంగా, ఈ దుర్గాదేవి విగ్రహం బంతి పువ్వులతో అలంకరించబడిన అరటి కాండం వలె ఉంటుంది. స్థానిక అధిపతి లేదా సియీం ఆలయ ప్రధాన పోషకుడిగా పరిగణిస్తారు.
దుర్గాపూజ ఈ ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ. దుర్గా పూజ సమయం (సెప్టెంబర్-అక్టోబర్)లో అరటి మొక్కను అలంకరించి దేవతగా పూజిస్తారు. అత్యంత ఉత్సాహభరితమైన వేడుకలు, ప్రత్యేక ఆచారాలతో నాలుగు రోజుల ఉత్సవాల ముగింపు తరువాత, ఈ మొక్కను మైంటు (Myntdu) నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా దేవతకు తుపాకీ వందనం కూడా చేస్తారు. నేటికీ, దుర్గాపూజ సమయంలో, సయీమ్ మేకలు బలి ఇస్తాడు.
మేఘాలయలోని హిందూ సమాజానికి అధికారిక ప్రతినిధి అయిన కేంద్ర పూజ కమిటీ ఆలయ సంరక్షకునిగా వ్యవహరిస్తుంది. ఇది ఆలయ రోజువారీ ఖర్చులలో ఎక్కువ భాగాన్ని భరిస్తుంది, ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ పురాతన ఆలయంలో నిర్వహించే దుర్గాపూజ ప్రాచుర్యం పొందడానికి కూడా వీరిదే బాధ్యత. ప్రతి శరదృతువులో బెంగాల్ సంస్కృతి, ఖాసీ-జయంతియా కొండల కలయికతో ప్రత్యేకమైన రీతిలో దుర్గా పూజ జరుగుతుంది. ఈ ఆలయాన్ని వారసత్వ ప్రదేశంగా ప్రకటిస్తామని 2017లో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు.[7]
- నార్టియాంగ్ దుర్గా ఆలయం - చిత్రమాలిక
-
నార్టియాంగ్ దుర్గా ఆలయం - ముందు దృశ్యం
-
నార్టియాంగ్ దుర్గా ఆలయం బయట నుండి దృశ్యం
-
నార్టియాంగ్ దుర్గా ఆలయం లో దుర్గా దేవి
-
సతీదేవి శరీరం మోస్తున్న శివుడు
ఇవి కూడా చూడండి
[మార్చు]- శక్తిపీఠాలు
- కామాఖ్య దేవాలయం (ఈశాన్య రాష్ట్రం, గువహటి లోని శక్తిపీఠం)
- కామాఖ్యాదేవి (ఈశాన్య రాష్ట్రం, గువహటి లోని శక్తి, దేవత )
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Talukdar, Prasanta (2020-09-12). "History lessons from Nartiang". The Shillong Times (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-18.
- ↑ "Nartiang Megalith". Meghalaya Tourism. Retrieved 2026-01-02.
- ↑ 3.0 3.1 "Jayanti Shakti Pith, Meghalaya". ambaji.org. Archived from the original on 7 November 2017. Retrieved 5 November 2017.
- ↑ Das, Manosh (15 October 2010). "Lofty Himalayas notwithstanding, the tribal people of Nartiang in the Jaintia Hills of Meghalaya truly believe that their scenic little hamlet is the "permanent abode" of Goddess Durga. Perched atop a hillock is the more than 600-year old and ancient Durga bari - a simple house made of stones and wood complete with tin roofing. Revered as one of the 51 Shakta pithas, the temple has been drawing a large number of pilgrims from all over the country on occasion of Durga Puja". The Times of India. Retrieved 5 March 2020.
- ↑ "Serpent goddess revered in Meghalaya village | Guwahati News". The Times of India.
- ↑ 6.0 6.1 "Nartiang Durga Temple Nartiang". Inheritage Foundation. Retrieved 2026-01-02.
- ↑ "500-yr-old Durga temple to be declared heritage site: Rijiju".