Jump to content

నార్మన్ రాక్‌వెల్

వికీపీడియా నుండి
నార్మన్ రాక్‌వెల్
1921లో రాక్‌వెల్
బాల్య నామంనార్మన్ పెర్సెవెల్ రాక్‌వెల్
జననం(1894-02-03)1894 ఫిబ్రవరి 3
న్యూయార్క్ నగరం, అమెరికా
మరణం1978 నవంబరు 8(1978-11-08) (వయసు: 84)
స్టాక్‌బ్రిడ్జ్, మసాచుసెట్స్, అమెరికా
భార్య / భర్త
    ఐరీన్ ఓ'కానర్
    ​
    ​
    (m. 1916; div. 1930)​
    మేరీ బార్‌స్టో
    ​
    ​
    (m. 1930; died 1959)​
    మేరీ లీట్ "మోలీ" పుండర్సన్
    ​
    ​
    (m. 1961)​
రంగం
  • చిత్రలేఖనం
  • ఇలస్ట్రేషన్
శిక్షణ
  • చేస్ ఆర్ట్ స్కూల్
  • నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్
  • ఆర్ట్ స్టూడెంట్స్ లీగ్ ఆఫ్ న్యూయార్క్
చేసిన పనులు
  • విల్లీ గిల్లిస్
  • రోసీ ది రివెటర్
  • ది ఫోర్ ఫ్రీడమ్స్
  • ది ప్రాబ్లమ్ వి ఆల్ లివ్ విత్
అవార్డులుప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్

నార్మన్ పెర్సెవెల్ రాక్‌వెల్ (ఫిబ్రవరి 3, 1894 – నవంబర్ 8, 1978) అమెరికన్ చిత్రకారుడు. అమెరికా సంస్కృతికి అద్దంపట్టే ఆయన చిత్రాలకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ పత్రిక కోసం ఆయన సృష్టించిన రోజువారీ జీవిత చిత్రాలు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.[1] రాక్‌వెల్ అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో విల్లీ గిల్లిస్ సిరీస్, రోసీ ది రివెటర్, ఫోర్ ఫ్రీడమ్స్ సిరీస్, సేయింగ్ గ్రేస్, ది ప్రాబ్లమ్ వి ఆల్ లివ్ విత్ ఉన్నాయి. బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా (BSA) తో 64 సంవత్సరాల అనుబంధానికి కూడా అతను ప్రసిద్ధి చెందాడు, ఈ సమయంలో అతను వారి మ్యాగజైన్ బాయ్స్ లైఫ్ కోసం కవర్లు, క్యాలెండర్లు, ఇతర దృష్టాంతాలను రూపొందించాడు. ఈ రచనలలో స్కౌట్ ప్రమాణం, స్కౌట్ చట్టాన్ని ప్రతిబింబించే ది స్కౌట్‌మాస్టర్, ఎ స్కౌట్ ఈజ్ రెవరెంట్,[2] ఎ గైడింగ్ హ్యాండ్[3] వంటి ప్రసిద్ధ చిత్రాలు ఉన్నాయి.

రాక్‌వెల్ ఒక నిష్ణాతుడైన కళాకారుడు, తన జీవితకాలంలో 4,000 కు పైగా చిత్రాలను రూపొందించాడు. అతను గీసిన వాటిలో చాలా వరకు పబ్లిక్ కలెక్షన్లలో ఉన్నాయి. టామ్ సాయర్, హకిల్‌బెర్రీ ఫిన్ లతో సహా 40 కి పైగా పుస్తకాలకు బొమ్మలు గీయడానికి ఆయనను నియమించారు. ఐసన్‌హోవర్, కెన్నెడీ, జాన్సన్, నిక్సన్‌ లతో పాటు గమాల్ అబ్దెల్ నాసర్, జవహర్‌లాల్ నెహ్రూ చిత్రాలు వేశాడు. వాటిలో జూడీ గార్లాండ్ చిత్రం కూడా ఉంది. 1973లో కల్నల్ శాండర్స్ చిత్రం అతను చివరిగా వేసిన చిత్రాలలో ఒకటి. 1925, 1976 మధ్య బాయ్ స్కౌట్స్ క్యాలెండర్ల కోసం ఆయన అందించిన వార్షిక రచనలు, బ్రౌన్ & బిగెలో కోసం అతను వేసిన అత్యంత ప్రసిద్ధ క్యాలెండర్ "ఫోర్ సీజన్స్" ముందు వెలవెలబోయాయి. ఇవి 1947 నుండి 17 సంవత్సరాల పాటు ప్రచురించబడ్డాయి, 1964 నుండి వివిధ శైలులు, పరిమాణాలలో పునరుత్పత్తి చేయబడ్డాయి. అతను కోకా-కోలా, జెల్-ఓ, జనరల్ మోటార్స్, స్కాట్ టిష్యూ, ఇతర కంపెనీల ప్రకటనల కోసం కళాకృతులను సృష్టించాడు.[4]

రాక్‌వెల్ తన జీవితకాలంలో తీవ్రమైన కళా విమర్శకులకు దూరంగా ఉన్నాడు.[5] ఆధునిక విమర్శకుల అభిప్రాయం ప్రకారం అతని చిత్రాలు చాలా మధురంగా ఉంటాయి.[6] పర్యవసానంగా, కొందరు సమకాలీన కళాకారులు రాక్‌వెల్‌ను "తీవ్రమైన చిత్రకారుడిగా" పరిగణించరు. కొందరు విమర్శకులు ఆయనను కళాకారుడు కాకుండా "ఇలస్ట్రేటర్" (బొమ్మలు గీసేవాడు) అని పిలుస్తారు, తనను తాను అలాగే పిలుచుకునేవాడు కనుక రాక్‌వెల్ దీన్ని ఏమీ పట్టించుకోలేదు.[7]

తన చివరి సంవత్సరాల్లో 'లుక్' మ్యాగజైన్ కోసం జాత్యహంకారం పై సిరీస్ వంటి తీవ్రమైన అంశాలను ఎంచుకున్నప్పుడు చిత్రకారుడిగా రాక్‌వెల్ మరింత దృష్టిని ఆకర్షించాడు.[8] పాఠశాలల్లో జాతి సమైక్యత సమస్యకు సంబంధించిన ది ప్రాబ్లమ్ వి ఆల్ లివ్ విత్ అనే చిత్రం దీనికి ఒక ఉదాహరణ. జాత్యహంకార రాతలతో ఉన్న గోడను దాటుతూ రూబీ బ్రిడ్జెస్ అనే బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, ఇరువైపులా శ్వేతజాతీయులైన ఫెడరల్ మార్షల్స్ ఉండడాన్ని ఆ చిత్రం వివరిస్తుంది.[9] 1964లో గీసిన ఈ చిత్రం 2011లో రూబీ బ్రిడ్జెస్ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసినప్పుడు వైట్‌హౌస్‌లో ప్రదర్శించబడింది.[10]

జీవితం

[మార్చు]

తొలి సంవత్సరాలు

[మార్చు]
స్కౌట్ ఎట్ షిప్స్ వీల్, 1913

నార్మన్ రాక్‌వెల్ 1894 ఫిబ్రవరి 3న న్యూయార్క్ నగరంలోని హార్లెమ్‌లో జార్విస్ వారింగ్ రాక్‌వెల్, అన్నే మేరీ దంపతులకు జన్మించాడు.[11] [12][13][14] రాక్‌వెల్‌కు జార్విస్ జూనియర్ అనే సోదరుడు ఉన్నాడు, అతను ఒక సంవత్సరం పెద్దవాడు.[15][16] జార్విస్ సీనియర్ ఫిలడెల్ఫియా టెక్స్‌టైల్ సంస్థ జార్జ్ వుడ్, సన్స్ & కంపెనీ న్యూయార్క్ కార్యాలయానికి మేనేజర్‌గా తన కెరీర్ మొత్తాన్ని గడిపాడు.[15][17][18]

రాక్‌వెల్ 14 సంవత్సరాల వయస్సులో హైస్కూల్ నుండి చేస్ ఆర్ట్ స్కూల్‌కు బదిలీ అయ్యాడు. ఆపై నేషనల్ అకాడమీ ఆఫ్ డిజైన్‌కు, చివరకు ఆర్ట్ స్టూడెంట్స్ లీగ్ ఆఫ్ న్యూయార్క్‌కు వెళ్ళాడు.[19] 18 సంవత్సరాల వయస్సులో అతని మొదటి ప్రధాన కళాత్మక ఉద్యోగం కార్ల్ హెచ్. క్లాడీ పుస్తకం టెల్ మి వై: స్టోరీస్ ఎబౌట్ మదర్ నేచర్ కోసం చిత్రాలు గీయడం.[20]

ఆ తర్వాత రాక్‌వెల్ 'బాయ్స్ లైఫ్'కి స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యాడు. ఇందులో అతనికి ఒక కవర్, స్టోరీ చిత్రాల కోసం నెలకు 50 డాలర్ల వేతనం లభించింది. కళాకారుడిగా ఇది అతని మొదటి ఉద్యోగం అని చెబుతారు.[21] 19 ఏళ్ళ వయసులో రాక్‌వెల్ 'బాయ్స్ లైఫ్'కి ఆర్ట్ ఎడిటర్ అయ్యాడు. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్నాడు.[22]

ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ తో అనుబంధం

[మార్చు]
రాక్‌వెల్ గీసిన మొదటి స్కౌటింగ్ క్యాలెండర్, 1925
సాటర్డే ఈవినింగ్ పోస్ట్ కవర్ (సెప్టెంబర్ 27, 1924)
కజిన్ రెజినాల్డ్ స్పెల్స్ పెలోపొంనెసస్. నార్మన్ రాక్‌వెల్, 1918.

నార్మన్‌కు 21 సంవత్సరాల వయసులో వారి కుటుంబం న్యూయార్క్‌లోని న్యూ రోషెల్‌కు మకాం మార్చింది. వారు క్లైడ్ ఫోర్సిత్ అనే కార్టూనిస్ట్‌తో కలిసి స్టూడియోను పంచుకున్నారు, అతను ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్‌లో పనిచేసేవాడు. ఫోర్సిత్ సహాయంతో రాక్‌వెల్ 1916లో పోస్ట్‌కు మొదటి కవర్ పెయింటింగ్‌ను సమర్పించాడు.[23] ఆ తర్వాత బాయ్ విత్ బేబీ క్యారేజ్, సర్కస్ బార్కర్ అండ్ స్ట్రాంగ్‌మ్యాన్, గ్రాంప్స్ ఎట్ ది ప్లేట్, రెడ్‌హెడ్ లవ్స్ హ్యాటీ పెర్కిన్స్, పీపుల్ ఇన్ ఎ థియేటర్ బాల్కనీ, మ్యాన్ ప్లేయింగ్ శాంటా వంటి విజయవంతమైన చిత్రాలు గీశాడు. మొదటి సంవత్సరంలో రాక్‌వెల్ గీసిన ఎనిమిది చిత్రాలు పోస్ట్ కవర్‌పై ప్రచురించబడ్డాయి. మొత్తంగా రాక్‌వెల్ 47 సంవత్సరాలలో ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ కోసం 322 కవర్లను ప్రచురించాడు.[24]

పోస్ట్ కవర్‌పై రాక్‌వెల్ విజయం ఇతర మ్యాగజైన్‌ల కవర్‌లకు కూడా దారితీసింది, ముఖ్యంగా ది లిటరరీ డైజెస్ట్, ది కంట్రీ జెంటిల్‌మన్, లెస్లీస్ వీక్లీ, జడ్జ్, పీపుల్స్ పాపులర్ మంత్లీ, లైఫ్ మ్యాగజైన్.[25]

రెండవ ప్రపంచ యుద్ధం

[మార్చు]
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, 1943

1943లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, రాక్‌వెల్ ఫోర్ ఫ్రీడమ్స్ సిరీస్‌ను గీశాడు, దీనికి ఏడు నెలల సమయం పట్టింది, ఈ సమయంలో అతను పదిహేను పౌండ్ల బరువు తగ్గాడు. ఈ సిరీస్ ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రసంగం నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రసంగంలో రూజ్‌వెల్ట్ సార్వత్రిక హక్కుల కోసం నాలుగు స్వేచ్ఛలను వివరించాడు. రాక్‌వెల్ ఆ తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్,[26] ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ చిత్రాలను గీశాడు.[27]

ఈ చిత్రాలు 1943లో ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ ద్వారా ప్రచురించబడ్డాయి. ఈ నాలుగింటిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అత్యుత్తమమైనదని రాక్‌వెల్ భావించాడు.[28]

ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, 1943

అదే సంవత్సరం అతని స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో అనేక ఒరిజినల్ పెయింటింగ్స్, దుస్తులు కాలిపోయాయి.[29] వాటిని భర్తీ చేయలేకపోయినందున, అగ్నిప్రమాదం అతని కెరీర్‌ను రెండు దశలుగా విభజించింది. రెండవ దశలో ఆధునిక పాత్రలు, పరిస్థితులను చిత్రీకరించాడు.

కెరీర్ చివరి రోజుల్లో

[మార్చు]

1940ల చివరలో రాక్‌వెల్ శీతాకాలంలో ఓటిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్‌గా గడిపేవాడు. అప్పుడప్పుడు అతని సాటర్డే ఈవినింగ్ పోస్ట్ కవర్‌లకు విద్యార్థులు మోడల్స్‌గా ఉండేవారు.[30]

1959లో అతని భార్య మేరీ గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించిన తర్వాత,[31] రాక్‌వెల్ కొంతకాలం పాటు పనికి దూరంగా ఉన్నాడు. ఆ విరామ సమయంలోనే అతను తన కుమారుడు థామస్‌తో కలిసి రాక్‌వెల్ ఆత్మకథ, మై అడ్వెంచర్స్ యాస్ యాన్ ఇలస్ట్రేటర్ ను రూపొందించాడు, ఇది 1960లో ప్రచురించబడింది. పోస్ట్ ఈ పుస్తకం నుండి కొన్ని భాగాలను వరుసగా ఎనిమిది సంచికలలో ప్రచురించింది, మొదటి దానిలో రాక్‌వెల్ ప్రసిద్ధ ట్రిపుల్ సెల్ఫ్-పోర్ట్రెయిట్ ఉంది.[32]

స్టాక్‌బ్రిడ్జ్‌లోని నార్మన్ రాక్‌వెల్ స్టూడియో

పోస్ట్ కోసం రాక్‌వెల్ వేసిన చివరి చిత్రం 1963లో ప్రచురించబడింది. 322 కవర్ పెయింటింగ్‌లు ప్రచురించబడిన 47 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధానికి ఇది ముగింపు పలికింది.[24] రాబోయే 10 సంవత్సరాలు 'లుక్' మ్యాగజైన్ కోసం పెయింటింగ్ వేశాడు, ఇక్కడ అతని పని పౌర హక్కులు, పేదరికం, అంతరిక్ష పరిశోధనలపై అతని ఆసక్తులను చిత్రీకరించింది.

బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా కోసం అతని చివరి కమిషన్ ది స్పిరిట్ ఆఫ్ 1976 అనే క్యాలెండర్ ఇలస్ట్రేషన్, రాక్‌వెల్ వయస్సు 82 ఉన్నప్పుడు ఇది పూర్తయింది, పత్రికలు, గైడ్‌బుక్‌లు, క్యాలెండర్‌లు, ప్రచార సామగ్రి కోసం 471 చిత్రాలను రూపొందించిన సుదీర్ఘ అనుబంధానికి ఇది ముగింపు. బాయ్ స్కౌట్స్‌తో ఆయనకు 64 సంవత్సరాల అనుబంధం ఉంది.

"మన దేశం స్పష్టమైన, ఆప్యాయత కలిగిన చిత్రాల" కోసం 1977లో అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ చేత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను రాక్‌వెల్ పొందాడు. రాక్‌వెల్ కుమారుడు జార్విస్ ఈ అవార్డును స్వీకరించాడు.[33]

మరణం

[మార్చు]
స్టాక్‌బ్రిడ్జ్ స్మశానవాటికలో రాక్‌వెల్ సమాధి

రాక్‌వెల్ ధూమపాన ప్రియుడు, 1978 నవంబర్ 8న 84 ఏళ్ల వయసులో ఎంఫిసెమాతో మసాచుసెట్స్‌లోని స్టాక్‌బ్రిడ్జ్‌లోని తన ఇంట్లో మరణించాడు.[34] రాక్‌వెల్ అంత్యక్రియలకు ప్రథమ మహిళ రోసలిన్ కార్టర్ హాజరయ్యారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
రాక్‌వెల్ (సుమారు 1920–1925)

రాక్‌వెల్ జూలై 1, 1916న ఐరీన్ ఓ'కానర్‌ను వివాహం చేసుకున్నాడు.[35] ఓ'కానర్ రాక్‌వెల్ యొక్క మదర్ టక్కింగ్ చిల్డ్రన్ ఇన్‌టు బెడ్కి మోడల్. ఈ దంపతులు జనవరి 13, 1930న విడాకులు తీసుకున్నారు.[36]

విడాకుల తర్వాత డిప్రెషన్‌కు గురైన రాక్‌వెల్ తన పాత స్నేహితుడు క్లైడ్ ఫోర్సిత్‌కు అతిథిగా కొంతకాలం కాలిఫోర్నియాలోని అల్హంబ్రాకు వెళ్ళాడు. అక్కడ స్కూల్ టీచర్ మేరీ బార్‌స్టోను కలుసుకున్నాడు, ఏప్రిల్ 17, 1930న ఆమెను వివాహం చేసుకున్నాడు.[37] వివాహం అయిన కొద్దికాలానికే దంపతులు న్యూయార్క్‌కు తిరిగి వచ్చారు. వారికి జార్విస్, థామస్, పీటర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.[38]

1953లో, రాక్‌వెల్ కుటుంబం స్టాక్‌బ్రిడ్జ్‌కు మకాం మార్చింది, తద్వారా అతని భార్య ఆస్టెన్ రిగ్స్ సెంటర్‌లో చికిత్స పొందే అవకాశం లభించింది.[39] రాక్‌వెల్ కూడా సైకియాట్రిక్ చికిత్స పొందాడు. ఆగష్టు 25, 1959న మేరీ గుండెపోటుతో అనుకోకుండా మరణించింది.[40]

రాక్‌వెల్ తన మూడవ భార్య, పదవీ విరమణ పొందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు మేరీ లీట్ "మోలీ" పుండర్సన్ (1896-1985) ను అక్టోబర్ 25, 1961న వివాహం చేసుకున్నాడు.[41]

1961 నుండి అతని మరణం వరకు, రాక్‌వెల్ మండే ఈవెనింగ్ క్లబ్ అనే పురుషుల సాహిత్య బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. అతని అంత్యక్రియలలో, క్లబ్‌కు చెందిన ఐదుగురు సభ్యులు జార్విస్ రాక్‌వెల్‌తో పాటు పాల్‌బేరర్‌లుగా పనిచేశారు.[42]

ప్రధాన కళాకృతులు

[మార్చు]
  • బాయ్ విత్ బేబీ క్యారేజ్ (1916)
  • చిల్డ్రన్ డ్యాన్సింగ్ ఎట్ ఏ పార్టీ (1918)
  • ది లవ్ సాంగ్ (1926)
  • ది ఫోర్ ఫ్రీడమ్స్ (1943)
    • ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ (1943)
    • ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ (1943)
    • ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్ (1943)
    • ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ (1943)
  • రోసీ ది రివెటర్ (1943)
  • సో యూ వాంట్ టు సీ ది ప్రెసిడెంట్! (1943)
  • లిటిల్ గర్ల్ అబ్సర్వింగ్ లవర్స్ ఆన్ ఎ ట్రైన్ (1944)
  • వి, టూ, హావ్ ఎ జాబ్ టు డు (1944)
  • వర్కింగ్ ఆన్ ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (1946)
  • ది డగౌట్ (1948)
  • టఫ్ కాల్ (1948)
  • సేయింగ్ గ్రేస్ (1951)
  • వాకింగ్ టు చర్చ్ (1953)
  • ది యంగ్ లేడీ విత్ ది షైనర్ (1953)
  • బ్రేకింగ్ హోమ్ టైస్ (1954)
  • ఎట్ ది ఆప్టోమెట్రిస్ట్ (1955)
  • మ్యారేజ్ లైసెన్స్ (1955)
  • ది స్కౌట్‌మాస్టర్ (1956)
  • ది రూకీ (1957)
  • ది రన్‌అవే (1958)
  • ట్రిపుల్ సెల్ఫ్-పోర్ట్రెయిట్ (1960)
  • గోల్డెన్ రూల్ (1961)
  • ది కొన్నోయిసెర్ (1962)[43][44]
  • ది మ్యారేజ్ కౌన్సెలర్ (1963)
  • గ్రోత్ ఆఫ్ ఏ లీడర్ (1964)
  • ది ప్రాబ్లమ్ వి ఆల్ లివ్ విత్ (1964)
  • మర్డర్ ఇన్ మిస్సిస్సిప్పి (1965)
  • న్యూ కిడ్స్ ఇన్ ది నైబర్‌హుడ్ (1967)
  • రష్యన్ స్కూల్‌రూమ్ (1967)
  • ది స్పిరిట్ ఆఫ్ 1976 (1976)

చలనచిత్ర పోస్టర్లు

[మార్చు]
నార్మన్ రాక్‌వెల్ స్టేజ్‌కోచ్ సెట్‌లో మైక్ కానర్స్ చిత్రం వేస్తుండగా (1966)

రాక్‌వెల్ అనేక సినిమా పోస్టర్లకు చిత్రాలు అందించాడు.

  • ది అడ్వెంచర్స్ ఆఫ్ మార్కో పోలో (1938)[45]
  • ది మాగ్నిఫిసెంట్ అంబర్సన్స్ (1942)[46]
  • ది సాంగ్ ఆఫ్ బెర్నాడెట్ (1943)[47]
  • అలాంగ్ కేమ్ జోన్స్ (1945)[46]
  • ది రేజర్స్ ఎడ్జ్ (1946)[46]
  • సిండెర్‌ఫెల్లా (1960)[48]
  • స్టేజ్‌కోచ్ (1966)[49]

సత్కారాలు

[మార్చు]
  • సొసైటీ ఆఫ్ ఇలస్ట్రేటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్, మొదటి ఎంపిక 1958[50]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • జె. సి. లేయెండెకర్

మూలాలు

[మార్చు]
  1. ↑ "About Norman Rockwell". Norman Rockwell Museum. 2014. Archived from the original on July 6, 2014. Retrieved July 18, 2014.
  2. ↑ "A Scout Is Reverent". National Scouting Museum. Boy Scouts of America. 2010. Archived from the original on June 10, 2013. Retrieved July 18, 2014.
  3. ↑ "A Guiding Hand". National Scouting Museum. Boy Scouts of America. 2010. Archived from the original on June 10, 2013. Retrieved July 18, 2014.
  4. ↑ "Collecting Norman Rockwell in magazines with a focus on Norman Rockwell ads" (in అమెరికన్ ఇంగ్లీష్). CollectingOldMagazines.com. Archived from the original on July 22, 2016. Retrieved June 19, 2017.
  5. ↑ Windolf, Jim (February 2008). "Keys to the Kingdom". Vanity Fair. Archived from the original on July 16, 2012. Retrieved April 28, 2012.
  6. ↑ Solomon, Deborah (January 24, 1999). "In Praise of Bad Art". The New York Times Magazine. Archived from the original on March 11, 2013. Retrieved April 28, 2012.
  7. ↑ "Art of Illustration". Norman Rockwell Museum. Archived from the original on January 6, 2009. Retrieved April 28, 2012.
  8. ↑ "Norman Rockwell Wins Medal of Freedom". Mass moments. Archived from the original on March 23, 2012. Retrieved April 28, 2012.
  9. ↑ Miller, Michelle (November 12, 2010). "Ruby Bridges, Rockwell Muse, Goes Back to School". CBS Evening News with Katie Couric. CBS Interactive. Archived from the original on November 13, 2010. Retrieved November 13, 2010.
  10. ↑ Ruby Bridges visits with the President and her portrait. July 15, 2011 – via YouTube.
  11. ↑ "Harlem Legend Norman Rockwell, An American Master, 1894 – 1978," Harlem World, November 23, 2020.
  12. ↑ Boughton, James (1903). Genealogy of the families of John Rockwell, of Stamford, Connecticut 1641, and Ralph Keeler, of Hartford, Connecticut 1939. WF Jones. p. 441.
  13. ↑ Roberts, Gary Boyd; Dearborn, David Curtis (1998). Notable Kin: An Anthology of Columns First Published in the NEHGS Nexus, 1986–1995. Boston, Massachusetts: Carl Boyer in cooperation with the New England Historic Genealogical Society. p. 28. ISBN 978-0-936124-20-9.
  14. ↑ Claridge 2001, pp. 20, 29.
  15. 1 2 Rockwell, Margaret (1998). Norman Rockwell's Growing Up in America. Metro Books. pp. 10–11. ISBN 978-1-56799-598-5.
  16. ↑ SSDI. – SS#: 177-01-3581.
  17. ↑ Claridge 2001, pp. 30, 47, 150.
  18. ↑ Rockwell, Norman; Rockwell, Thomas (1988). Norman Rockwell, My Adventures as an Illustrator. Abrams. p. 27. ISBN 978-0-8109-1563-3.
  19. ↑ Claridge 2001, pp. 91–93, 99.
  20. ↑ Claridge 2001, p. 102.
  21. ↑ "Norman Rockwell". National Scouting Museum. Boy Scouts of America. 2010. Archived from the original on October 23, 2014. Retrieved July 18, 2014.
  22. ↑ "Rockwell and Csatari: A tour de force". Scouting: 6. March–April 2008.
  23. ↑ Claridge 2001, pp. 130–132.
  24. 1 2 "Norman Rockwell Biography". The Saturday Evening Post. Archived from the original on July 23, 2026. Retrieved July 23, 2026.
  25. ↑ Claridge 2001, p. 151.
  26. ↑ "Terms of Use". Collections. NRM. Retrieved April 28, 2012.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  27. ↑ Claridge 2001, p. 311.
  28. ↑ Claridge 2001, pp. 308–309, 313.
  29. ↑ Caplin, Elliott (1994), Al Capp Remembered.
  30. ↑ Claridge 2001, pp. 131–132.
  31. ↑ Gherman 2000, p. 35.
  32. ↑ Claridge 2001, p. 430.
  33. ↑ Wolley, John T.; Gerhard Peters (June 9, 1980). "Gerald Ford, XXXVIII President of the United States: 1974–1977, Remarks Upon Presenting the Presidential Medal of Freedom, January 10, 1977". The American Presidency Project. www.presidency.ucsb.edu. Archived from the original on February 2, 2014. Retrieved May 22, 2011. But let me again congratulate each and every one of you. I regret that Irving Berlin, Alexander Calder, the late Alexander Calder, and Georgia O'Keeffe were unable to be represented here today. We will of course present their medals to them or to their families at a later date.
  34. ↑ "Norman Rockwell: A Brief Biography". Norman Rockwell Museum. Archived from the original on June 13, 2017. Retrieved June 25, 2017.
  35. ↑ Claridge 2001, pp. 143–145.
  36. ↑ Claridge 2001, p. 214.
  37. ↑ "A personal recollection". City of Alhambra. Archived from the original on April 21, 2012. Retrieved April 28, 2012.
  38. ↑ Claridge 2001, pp. xxii, 230, 246, 262.
  39. ↑ Kamp, David (November 2009). "Norman Rockwell's American Dream". Vanity Fair. Archived from the original on July 16, 2012. Retrieved April 28, 2012.
  40. ↑ Claridge 2001, pp. 426–427.
  41. ↑ Claridge 2001, p. 581.
  42. ↑ "The Club's historic membership roster, part VII: members joining 1942-1961" Archived మే 2, 2014 at the Wayback Machine, Monday Evening Club. Retrieved May 1, 2014.
  43. ↑ Giuliano, Charles (July 15, 2016). "Visual Arts Review: Norman Rockwell Takes On Abstraction". The Arts Fuse. Retrieved September 14, 2025.
  44. ↑ "Norman Rockwell made fun of Jackson Pollock by painting the same way". Trivia Happy. Retrieved September 14, 2025.
  45. ↑ Claridge 2001, p. 265.
  46. 1 2 3 Moline 1979, p. 237.
  47. ↑ Moline 1979, p. 235.
  48. ↑ Moline 1979, p. 162.
  49. ↑ Moline 1979, pp. 162, 237.
  50. ↑ "Hall of fame | Society of Illustrators". www.societyillustrators.org. Archived from the original on April 16, 2020. Retrieved May 7, 2020.

బాహ్య లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Norman Rockwell