Jump to content

నార్వేలో వాతావరణ మార్పు

వికీపీడియా నుండి
నార్వేలో 1901 నుండి 2020 వరకు సగటు వార్షిక ఉష్ణోగ్రత క్రమరాహిత్యం యొక్క దృశ్యమానత.

వాతావరణ మార్పుల కారణంగా నార్వేలోని అన్ని ప్రాంతాలూ, అన్ని ఋతువులూ వెచ్చగా, తడిగా మారుతాయని భావిస్తున్నారు.

తలసరి ప్రాతిపదికన, నార్వే మధ్యప్రాచ్యం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారు, ఎగుమతిదారు.[1] 2016లో, లోఫోటెన్ దీవుల సమీపంలో చమురు అన్వేషణ కోసం 56 కొత్త లైసెన్సులు జారీ చేసారు. అయితే, నార్వే విద్యుత్ డిమాండ్‌లో 98% పునరుత్పాదక వనరుల ద్వారా సరఫరా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా జలవిద్యుత్ నుండి, నార్వేలో విస్తారంగా ఉన్న మంచినీటి నిల్వలను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు.[2] ఎలక్ట్రిక్ వాహనాలలో నార్వే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, రవాణా ద్వారా కూడా ఉద్గారాలు అధికంగానే ఉత్పత్తి అవుతున్నాయి.

నార్వేలో వెచ్చని ఉష్ణోగ్రతలు శాశ్వత మంచు, హిమానీనదాల తిరోగమనానికి కారణమవుతున్నాయి. అవపాత నమూనాలలో మార్పులకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పు ముఖ్యంగా నార్వే ఆర్కిటిక్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ దృగ్విషయం కారణంగా జీవవైవిధ్యం, అటవీ ప్రాంతాలు మార్పులకు గురవుతున్నాయి, ఇది దేశ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది. వాతావరణ మార్పుల వల్ల స్థానిక సామీ ప్రజల ఆచారాలు ప్రభావితమవుతున్నాయి.

నార్వే ప్రభుత్వం కార్బన్ సంగ్రహణ, నిల్వతో సహా వాతావరణ మార్పు తగ్గింపు దిశగా అనేక సామాజిక, ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది. విదేశాలలో ఉద్గారాల తగ్గింపు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2030 నాటికి కార్బన్ తటస్థతను సాధించాలని నార్వే భావిస్తోంది. 2050 నాటికి దేశంలో ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని ఇది భావిస్తోంది.[3] 2030 నాటికి దేశీయ ఉద్గారాలలో 1990 స్థాయి నుండి 50% - 55% తగ్గింపును సాధించాలని 2020 లో నార్వే లక్ష్యంగా పెట్టుకుంది.[4]  

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు

[మార్చు]
చిత్రం 1. 2014లో నార్వే శక్తి సమతుల్యతను వివరిస్తుంది.

శక్తి వినియోగం

[మార్చు]

2015 లో నార్వే ఇంధన సరఫరా 17 లక్షల టన్నులకు చేరుకుంది. 1990 తో పోలిస్తే ఇది 311.3% పెరుగుదల.[5] 2015 లో మొత్తం గృహ వినియోగం 213 టెరావాట్-గంటలు (TWh), దీనిలో 89 TWh గృహాలు, సేవలకూ ఖర్చైంది. గృహ వినియోగంలో ఇది 2% పెరుగుదల. తక్కువ ఉష్ణోగ్రతల వలన వేడి చేసుకునేందుకు డిమాండ్ పెరగడం దీనికి కారణం.[6] దీని వలన 2014 నుండి జీవ ఇంధన వినియోగం 7% పెరిగింది. సహజ వాయువు, చమురుకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ కారణంగా, ఉత్తర, బారెంట్స్ సముద్రాలతో పాటు, లోఫోటెన్ దీవుల సమీపంలో మరింత చమురు అన్వేషణకు అనుమతించడానికి 2016 జనవరిలో 56 కొత్త లైసెన్సులను జారీ చేసారు.[7] ఈ ప్రాంతాల పర్యావరణ రేటింగ్‌లను మెరుగుపరుస్తామని, పారిస్ ఒప్పందంలో ఇచ్చిన వాగ్దానం కంటే మెరుగుపరుస్తామని అనేక వాగ్దానాలు చేసినప్పటికీ, ఇది జీవవైవిధ్యం, మత్స్య సంపదకు ముప్పు కలిగిస్తోంది. మరోవైపు, నార్వే విద్యుత్ డిమాండ్‌లో 98% పునరుత్పాదక శక్తుల ద్వారా సరఫరా చేయబడుతోంది. ఇందులో 95% జలవిద్యుత్ నుండి వస్తుంది.[2] దేశంలో విద్యుత్తు, పునరుత్పాదక వనరుల ద్వారా జరుగుతోందనీ, దేశీయంగా ఉత్పత్తి చేయబడినందున దాని ఖర్చు చాలా తక్కువగా ఉందనీ తెలిసినందున, నార్వేలో వినియోగం సగటు యూరోపియన్ కంటే మూడు రెట్లు ఎక్కువ.[5] గృహాల్లో సగటు శక్తి వినియోగంలో విద్యుత్ వినియోగం దాదాపు 77%కి సమానం.

శక్తి నుండి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 2011-2021 ( MtCO2 ) [8] : 12 
2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021
37.1 36.8 37.0 36.1 36.0 35.1 35.1 35.3 34.3 32.9 33.4

2023 లో నార్వే ఉద్గారాలలో గణనీయంగా, 4.7% తగ్గింపును సాధించింది. అంతకు ముందు సంవత్సరంలో 4.89 కోట్ల మెట్రిక్ టన్నుల CO2 నుండి 4.66 కోట్ల టన్నులకు తగ్గింది. ఈ పురోగతి నిరంతర ధోరణిలో భాగం. 1990 తరువాత 2007 లో గరిష్ట ఉద్గారాలు 5.65 కోట్ల టన్నులుగా నమోదయ్యాయి. ఇటీవలి తగ్గింపులో ఒక ముఖ్యమైన అంశం కార్ల ట్రాఫిక్ నుండి ఉద్గారాలు తగ్గడం, దీనికి ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం, జీవ ఇంధనాల ఏకీకరణ కారణమని చెప్పవచ్చు. [9]

రవాణా

[మార్చు]

నార్వేలో ఉత్పత్తి అయ్యే మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో రవాణా రంగం వాటా మూడింట ఒక వంతు (16.5 మిలియన్ టన్నుల CO2). రోడ్డు ట్రాఫిక్ వాటా 10 మిలియన్ టన్నుల CO2. [10] నార్వే రవాణా మిశ్రమం దాని తక్కువ జనాభా సాంద్రత, ఇరుకైన ఆకారం, అనేక చిన్న దీవులతో కూడిన పొడవైన తీరప్రాంతం వలన బాగా ప్రభావితమవుతుంది. పౌర విమానయానం, ప్రజా రోడ్లు, రైలు రవాణా రంగం, జాతీయ రహదారి వ్యవస్థలో భాగమైన ఫెర్రీ సేవలు (అంటే తీరప్రాంతాలు), తీరప్రాంత నిర్వహణ, సముద్ర పర్యావరణం, ఓడరేవు, సముద్ర రవాణా విధానం వంటి వాటికి రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. ప్రజా రవాణా, రోడ్లకు సంబంధించిన పనులను కొన్ని కౌంటీలు, మునిసిపాలిటీలకు అప్పగించే అధికారం కూడా దానికి ఉంది. నార్వేలోని మౌలిక సదుపాయాలలో ఎక్కువ భాగం ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు ఇస్తూంటారు.

పట్టణాలు, వాటి చుట్టుపక్కలా ప్రజా రవాణా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఓస్లోలో యూరప్‌లో కెల్లా అత్యంత అధునాతన ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. ఇక్కడ మెట్రో, బస్సు, ట్రామ్, ఫెర్రీ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఇవన్నీ అత్యాధునిక సాంకేతికతతో జోన్ ఆధారిత దూర వ్యవస్థపై ఏకీకృతం చేయబడ్డాయి. అయితే, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో తరచుగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు ఉండవు. దీని వలన అక్కడి నివాసులకు సొంత కారు ఉండాల్సిన అవసర్ం ఉంది. ప్రజా రవాణాకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.[11]

రైలు రవాణా

[మార్చు]

ఒక్కో రైలు సామర్థ్యాన్ని బట్టి, రైళ్లు ఒక్కో కిలోమీటరుకు 18-36 గ్రాముల కార్బన్ డయాక్సైడును ఉత్పత్తి చేస్తాయి.[12] నార్వేలోని ప్రధాన రైల్వే నెట్‌వర్కు అయిన ప్రామాణిక గేజ్ లైన్ల పొడవు 4,087 కి.మీ. వీటిలో 242 కి.మీ డబుల్ ట్రాక్, 64 కి.మీ హై-స్పీడ్ రైలు (210 కిమీ/గం వేగంతో). ఇందులో 2,622 కిమీ (64%) ను విద్యుదీకరించారు. నార్వే విద్యుదుత్పత్తిలో 98% (134TWh) పునరుత్పాదక పద్ధతుల ద్వారా శక్తిని పొందుతున్నందున గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి ఇది వీలు కల్పిస్తుంది.[13] మియోసాకు ఉత్తరాన ఉన్న లైన్లను మాత్రమే విద్యుదీకరణ చేయలేదు. ఈ విద్యుదీకరణ చేయని విభాగాలలో డీజిల్ లోకోమోటివ్‌లు నడుపుతారు. అన్ని పట్టణ రైల్వేలు ట్రామ్‌వేలలోని ఓవర్‌హెడ్ వైర్ల ద్వారా, ఓస్లో టి-బేన్‌లో మూడవ పట్టా ద్వారా 750 V DCని ఉపయోగిస్తాయి. 2015లో రైల్వేలు 7,38,36,237 మంది ప్రయాణికులను 355.5 కోట్ల కి.మీ.ల దూరం రవాణా చేశాయి. వస్తువుల రవాణా ద్వారా 3,15,85,437 టన్నుల సరుకును 349.8 కోట్ల కి.మీ.లు రవాణా చేసారు. [14]

రోడ్డు రవాణా

[మార్చు]
కార్లు
[మార్చు]

విద్యుదుత్పత్తి జల విద్యుత్తు (98%) ద్వారా అత్యధికంగా జరుగుతున్న కారణంగా నార్వే లోని ఎలక్ట్రిక్ కార్ల సముదాయం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన వాటిలో ఒకటి. అందువలన దీనిపై ఆసక్తి క్రమంగా పెరిగి, 2016 చివరి నాటికి నార్వేజియన్ రోడ్లపై ఉన్న మొత్తం కార్లలో 5% (135,000) ప్లగ్-ఇన్‌ కార్లే ఉన్నాయి.[15] ప్రభుత్వ ప్రోత్సాహకాలలో, మళ్ళీ మళ్ళీ వసూలు చేయని వాహన రుసుములన్నిటి నుండి మినహాయింపు (కొనుగోలు పన్ను, కొనుగోలుపై 25% వ్యాట్ లతో సహా) ఇవ్వడం ఒకటి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లకు పన్ను తగ్గింపు, రోడ్ ఫెర్రీలకు ఉచిత ప్రవేశం ఉన్నాయి. కొన్ని మునిసిపాలిటీలలో వీటిని ఉచితంగా పార్కింగు చేయవచ్చు. వీటిని ప్రజా రవాణా మార్గాలలో కూడా ఉపయోగించవచ్చు. ఈ విజయవంతమైన విధానాల వలన నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ఎక్కువైంది. ప్రభుత్వ జాతీయ రవాణా ప్రణాళిక (NTP) పై చర్చించడానికీ, తమ ఆలోచనలను ప్రతిపాదించడానికీ ప్రజలకు అవకాశం కూడా లభించింది. దీని ఫలితంగా 2025 నాటికి అన్ని కొత్త కార్లు; బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు సున్నా ఉద్గార వాహనాలు (అంటే పూర్తిగా విద్యుత్ లేదా హైడ్రోజన్ శక్తితో నడిచేవి) గా ఉండాలని NTP లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, అధిక ప్రజా సబ్సిడీలు, ప్రజా రవాణా మార్గాలలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, సాంప్రదాయ కార్లకు పార్కింగ్ స్థలాల కొరత (ఉద్దేశపూర్వకంగా), ఫెర్రీ ఆపరేటర్లకు ఆదాయ నష్టం వంటి కొన్ని దుష్ప్రభావాలు కూడా దీనికి ఉన్నాయి.

2019 జనవరి-జూన్‌లో నార్వేలో అమ్ముడిన కొత్త కార్లలో దాదాపు సగం ఎలక్ట్రిక్ కార్లు కాగా, 2018 లో అదే కాలావధిలో ఇది పావు వంతు మాత్రమే. 2020 మార్చి నాటికి, నార్వేలో కార్ల అమ్మకాలలో 55.9% ఎలక్ట్రిక్ కార్లు, 26.4% హైబ్రిడ్‌లు.[16] 2023 నాటికి, నార్వేజియన్ రోడ్లపై ఉన్న అన్ని వ్యక్తిగత వాహనాలలో ఎలక్ట్రిక్ కార్లు 24% ఉన్నాయి. విద్యూద్వాహనాలలో తాము ముందుండాలనే దేశపు నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. [9]

బస్సులు
[మార్చు]

ప్రతి కౌంటీ తమ ప్రాంతంలోని ప్రజా రవాణాకు - బస్సు, పడవల రవాణా - బాధ్యత వహిస్తుంది. రైల్వేలు, ప్రాంతీయ విమానయాన సంస్థలు, తీరప్రాంత పడవలు అన్నిటికీ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. 2015 లో బస్సులు 35.6 కోట్ల మంది ప్రయాణికులను 400 కోట్ల ప్రయాణీక కి.మీ.లకు పైగా రవాణా చేశాయి. 2050 నాటికి కార్బన్-న్యూట్రల్‌గా ఉండాలనే వారి ప్రణాళికను నెరవేర్చుకునే ప్రయత్నంలో, CO2 ఉద్గారాలను తగ్గించడానికి ఓస్లో మున్సిపల్ బస్సులను మానవ వ్యర్థాల నుండి సేకరించిన బయోమీథేన్‌తో నడిచేలా మారుస్తోంది.[17]

పౌర విమానయానం

[మార్చు]

విమానం సామర్థ్యాన్ని బట్టి పౌర విమానాలు ఒక్కో కిలోమీటరుకు 220 నుండి 455 గ్రాముల కార్బన్ డయాక్సైడును ఉత్పత్తి చేస్తాయి.[12] నార్వేలో 98 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 51 లో ప్రజా విమానాలు పనిచేస్తాయి. వాటిలో ఒక హెలిపోర్ట్ కూడా ఉంది. ఈ 51 లో 45 ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. వాటిని విమానాశ్రయ నిర్వాహక సంస్థయైన అవినోర్ నిర్వహిస్తుంది. ఐరోపాలో తలసరి అత్యధిక విమాన ప్రయాణాలు చేసే దేశం నార్వే. ఓస్లో నుండి ట్రోండ్‌హీమ్, బెర్గెన్, స్టావాంజర్‌లకు వెళ్లే మార్గాలు అన్నీ ఐరోపాలో అత్యంత రద్దీగా ఉండే పది మార్గాలలో ఉన్నాయి. తక్కువ జనసాంద్రత, కఠినమైన భౌగోళిక ఆకృతి, అంతర్గత, ఉత్తర ప్రాంతాలలో పరిమిత జనాభా ఉన్న ప్రాంతాలలో సరైన రైలు, రోడ్డు మౌలిక సదుపాయాలు లేకపోవడం దీనికి కారణాలు. నార్వేకు ప్రధాన వాయుమార్గం ఓస్లో విమానాశ్రయం (గార్డెర్మోయెన్), ఇది ఓస్లోకు ఉత్తరాన 50 కి.మీ. దూరంలో ఉంది. నార్వేలో ప్రధానమైన రెండు విమానయాన సంస్థలైన స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్, నార్వేజియన్ ఎయిర్ షటిల్ లకు ఇది సేవలు అందిస్తుంది.

జల రవాణా

[మార్చు]

ఫ్యోర్డ్ లంతటాను, స్థిర కనెక్షన్ లేని దీవులకూ ఫెర్రీలే కీలకమైన లింకులు. నార్వేలో ప్రస్తుతం వందకు పైగా ఫెర్రీ కార్లు నడుస్తున్నాయి. 2015 లో పడవలు 1.1 కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేశాయి. 2014 కంటే 10% ఎక్కువ. నార్వే బ్యాటరీలతో నడీచే ఫెర్రీలను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అధిక మొత్తంలో జలవిద్యుత్ ద్వారా శక్తిని పొందుతున్న ఈ ఫెర్రీలను మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసింది.[18] కోస్టల్ ఎక్స్‌ప్రెస్ ( హర్టిగ్రూటెన్ అని పిలుస్తారు) బెర్గెన్ నుండి కిర్కెనెస్ వరకు ప్రతిరోజూ నడుస్తుంది. 35 ఓడరేవులలో ఆగుతుంది. ఇది ప్రాంతీయ జాతీయ స్థాయిలో సంతోషకరమైనదే గానీ, షిప్పింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ నిబంధనల వంటి వారి భారీ అంతర్జాతీయ ఫ్లీట్ల విషయంలో విఫలమైంది.

శిలాజ ఇంధనాల ఉత్పత్తి

[మార్చు]

2016 లో చేసిన విశ్లేషణలో, 180 దేశాలలో నార్వే 17 వ స్థానంలో నిలిచింది.[19] అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారులలో నార్వే ఒకటి. మిగతా దేశాల కంటే అతిపెద్ద సావరిన్ నిధిని కలిగి ఉంది. 2015 లో నార్వే, 5.39 కోట్ల టన్నుల గ్రీన్హౌస్ వాయువులను (GHGs) ఉత్పత్తి చేసింది. వీటిలో 1.51 కోట్ల టన్నులకు చమురు, వాయువుల వెలికితీతే కారణం.[6] ఇది ఇంధన సరఫరా, వ్యవసాయం, రోడ్డు ట్రాఫిక్‌లతో సహా మరే ఇతర ఉద్గారాల వనరుల కంటే ఎక్కువగా ఉంది. 2014 నుండి మొత్తం GHG ఉద్గారాలు 6,00,000 టన్నులు పెరిగాయి. 1990 నుండి చమురు, వాయువుల వెలికితీత నుండి ఉద్గారాలు 83.3% పెరిగాయి. మరింత వివరంగా చెప్పాలంటే, CO2 ఉద్గారాలలో 25% పెరుగుదల, మీథేన్‌లో 10% తగ్గుదల, నైట్రస్ ఆక్సైడ్‌లో 38% తగ్గుదల ఏర్పడింది. అంటే 4.47 కోట్ల టన్నుల (Mt) CO 2, 55 లక్షల టన్నుల CH4, 26 లక్షల టన్నుల N2O ఉత్పత్తి అయ్యాయి.[6]

నార్వేజియన్ ఖండాంతర షెల్ఫ్‌లోని పెట్రోలియం, సహజ వాయువులను ప్రాసెసింగ్ ప్లాంట్లకు, ఆ తరువాత ఇతర యూరోపియన్ దేశాలకూ రవాణా చేయడానికి మొత్తం 9,481 కి.మీల పైప్‌లైన్‌లను ఉపయోగిస్తారు.[20]

పారిశ్రామిక ఉద్గారాలు

[మార్చు]

మైనింగ్, క్వారీయింగ్

[మార్చు]

2015లో మైనింగ్, క్వారీయింగ్ పరిశ్రమ 1.2 కోట్ల టన్నుల CO2 కు సమానమైన వాటిని, 6600 కోట్ల యూనిట్లనూ ఉపయోగించింది. 1990 నుండి ఈ ఉద్గారాలు 39% తగ్గాయి. చమురు, గ్యాస్‌ల వెలికితీత తర్వాత ఇది రెండవ స్థానంలో ఉంది. [5] ఈ పరిశ్రమ ఉద్గారాలలో తగ్గుదల ధోరణిని చూపుతోంది గానీ, 2014 - 2015 మధ్య 3.1% పెరుగుదల కనిపించింది.

వ్యవసాయం

[మార్చు]

2015 లో ఎరువుల ఉత్పత్తి, వాడకం పెరగడం వలన CO2, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి.[6] ఇది వ్యవసాయ ఉద్గార కారణాలలో అతిపెద్ద నిష్పత్తి కూడా. వ్యవసాయ రంగం 45 లక్షల టన్నుల CO2 సమానమైన ఉద్గారాలను విడుదల చేసింది. అయితే ఈ ఉద్గారాలు 1990 నుండి క్రమంగా తగ్గుతున్నాయి.

సహజ పర్యావరణంపై ప్రభావాలు

[మార్చు]

ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులు

[మార్చు]
నార్వే కొప్పెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ మ్యాపు - 1980–2016
2071–2100 మ్యాపు[21][22][23]

ఈ శతాబ్దంలో నార్వేలోని అన్ని ప్రాంతాలలో అన్ని సీజన్లు వెచ్చగా ఉంటాయని వాతావరణ దృశ్యాలన్నీ సూచిస్తున్నాయి. [24][25] 2100 నాటికి అల్ప, సగటు అధిక వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 2.3°C, 3.4°C, 4.6°C పెరుగుతాయని అంచనాలు చూపిస్తున్నాయి. ప్రధాన భూభాగం విషయానికొస్తే, పశ్చిమ నార్వేలో అతి తక్కువ పెరుగుదల 3.1°C గా (1.9-4.2) అంచనా వేసరు. అత్యధికంగా ఉత్తరాన ఉన్న ఫిన్‌మార్క్ కౌంటీలో 4.2°C (3.0-5.4) °C లో ఉంటుంది. స్వాల్బార్డ్, జాన్ మాయెన్ వంటి ఆఫ్‌షోర్ భూభాగాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా, కొన్ని అంచనాల ప్రకారం ఇది 8°C డిగ్రీల వరకు ఉండవచ్చు.[26]

శీతాకాలంలో అతిపెద్ద ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని అంచనా వేసారు. అయితే వేసవిలో అతి తక్కువ పెరుగుదల సంభవిస్తుంది. దీని వలన పంటల కాలంలో పెరుగుదల, దేశంలోని పెద్ద ప్రాంతాలలో మంచు కవచం తగ్గుదల కనిపిస్తుంది. [26] అందువల్ల, వెచ్చని రుతువుల నిడివి పెరుగుతుంది. అయితే శీతాకాలం నిడివి తక్కువగా ఉండి, ఉష్ణోగ్రత ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.[24]

పెర్మాఫ్రాస్ట్ కరగడం

[మార్చు]
చిత్రం 2.కార్బన్ సైకిల్ రేఖాచిత్రం వాతావరణం, హైడ్రోస్పియర్, జియోస్పియర్ మధ్య కార్బన్ నిల్వ, వార్షిక మార్పిడిని గిగాటన్లలో - లేదా బిలియన్ల టన్నులలో - కార్బన్ (GtC) చూపిస్తుంది.

వరుసగా కనీసం రెండు సంవత్సరాల పాటు సున్నా డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉండే నేల, రాతి ప్రదేశం, మంచు, సేంద్రీయ పదార్థంతో కూడిన నేల లను పెర్మాఫ్రాస్ట్ అంటారు. పెర్మాఫ్రాస్ట్ ఏర్పడే ప్రాంతాలు ఉత్తరార్ధగోళంలో ~24% విస్తీర్ణంలో (2.3 కోట్ల చ.కి.మీ మేర) ఉన్నాయి. సుమారు 120 సంవత్సరాల క్రితం చిరు మంచు యుగం ముగిసినప్పటి నుండి శాశ్వత మంచు పొరలు వేడెక్కుతున్నాయని, కరిగిపోతున్నాయనీ మోడలింగ్ సూచిస్తుంది.[27]

వాతావరణ మార్పుల సందర్భంలో పెర్మాఫ్రాస్ట్ మూడు ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది - గత కాలపు ఉష్ణోగ్రతల రికార్డులను భద్రపరచే ఆర్కైవ్‌ల లాగాను, క్షీణత ద్వారా, సంబంధిత ప్రభావాల ద్వారా గ్లోబల్ వార్మింగుకు కొలమానం లాగాను, గ్లోబల్ కార్బన్ చక్రంపై తన ప్రభావం చూపుతూ మరింత మార్పుకు దారితీయడం గానూ.

పర్వతాలపై ఉండే వాతావరణ పరిస్థితుల (తేలికపాటి శీతాకాలాలు, చల్లని వేసవికాలం) కారణంగా అక్కడి పెర్మాఫ్రాస్ట్, మిగతా ప్రాంతాల్లో ఉండే పెర్మాఫ్రాస్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. దక్షిణ నార్వేలో, దిగువ పెర్మాఫ్రాస్ట్ సముద్ర మట్టానికి 1300 నుండి 1600 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దేశానికి ఉత్తరాన, పర్వత పెర్మాఫ్రాస్ట్ పశ్చిమాన 900 మీట్యర్ల వద్ద మొదలై, తూర్పున (ఫిన్నిమార్క్ కౌంటీ) 400 మీటర్ల వరకు ఉంటుంది. స్వాల్బార్డ్ ద్వీపసమూహం కూడా దాదాపు 60% పెర్మాఫ్రాస్ట్‌తో కప్పబడి ఉంటుంది. స్కాండినేవియాలో ప్రజలు ఏకంగా పెర్మాఫ్రాస్ట్ మీదనే నివసిస్తున్న ఏకైక ప్రదేశం ఇదే.

ఓస్లో విశ్వవిద్యాలయం, వాతావరణ సంస్థ చేసిన భూమి ఉష్ణోగ్రత కొలతల్లో 1999 నుండి 1°C పెరుగుదల కనిపించింది. నార్వేజియన్ పెర్మాఫ్రాస్ట్ డేటాబేస్ (NORPERM) చూపిన పరీక్షా ప్రదేశాలలో పెర్మాఫ్రాస్ట్ క్షీణతకు స్పష్టమైన ఆధారాలు కనిపించాయి.[27] పర్వత పెర్మాఫ్రాస్ట్ దిగువ పరిమితి, గ్లోబల్ వార్మింగ్‌కు అనుగుణంగా చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే వాటి శాశ్వత మంచు ఉష్ణోగ్రతలు అప్పటికే 0 °C కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుత ధోరణి కొనసాగితే అది కరిగిపోతుంది.

ఇప్పటికే ఉత్తర నార్వేలోని చిత్తడి నేల ప్రాంతాల్లో 1950 ల నుండి నేల మంచు కవచం 50% వరకు తగ్గిపోయిందనే క్షేత్ర స్థాయి విశ్లేషణలు ఉన్నాయి.[27] దీని ఫలితంగా పెర్మాఫ్రాస్ట్ గణనీయంగా తగ్గుతుంది. గతంలో ఘనీభవించి ఉండి, ఇప్పుడు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థం నుండి గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు (పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం) పెరగవచ్చు.

నార్వేలోని పెర్మాఫ్రాస్ట్‌లో ఎక్కువ భాగం జనావాసాలు లేని ప్రాంతాలలో ఉంది. అంచేత, సమాజంపై దీని ప్రభావం పరిమితం గానే ఉంటుంది. అయితే, హిమానీనదాలు, హిమానీనదాల వల్ల ఏర్పడే కోతలూ నార్వేలోని పర్వత ప్రాంతాలను చెక్కడంతో, నిటారైన, అస్థిరమైన వాలులు ఏర్పడ్డాయి.[27] ఈ వాలులు పెర్మాఫ్రాస్ట్ ప్రాంతంలో ఉంటాయి. అటువంటి వాలులు కూలిపోతే రోడ్లు, పట్టణాలూ ప్రభావితమౌతాయి. రాళ్ళు పెద్దయెత్తున ఫ్యోర్డ్‌లు లేదా సరస్సులలో పడితే స్థానికంగా సునామీలు వచ్చే అవకాశం ఉంది. [27]

శీతాకాలంలో గ్లోబల్ వార్మింగ్ వలన ఆర్కిటిక్ సర్కిల్ లోపల లోతైన పర్వతంలో ఉన్న గ్లోబల్ సీడ్ వాల్ట్‌ తెగిపోయింది.[28] మంచు కరగడం వల్ల గ్యాస్, చమురు పైపులైన్లకు పగుళ్లు ఏర్పడతాయి. అస్థిరమైన నేల కారణంగా భవనాలు నెమ్మదిగా కూలిపోతాయి.

హిమానీనదాల తిరోగమనం

[మార్చు]

నార్వేజియన్ ఆర్కిటిక్‌లోని చాలా హిమానీనదాలు స్వాల్బార్డ్‌లో కనిపిస్తాయి. ఇక్కడ హిమానీనదాలకు ~7,000 ఘనకి.మీ ఘనపరిమాణం, 36,000 చ.కి.మీ వైశాల్యమూ ఉంటాయి. ప్రధాన భూభాగంలో హిమానీనదాలు 64 ఘనకి.మీ ఘనపరిమాణం, 1,000 చ.కి.మీ వైశాల్యం మాత్రమే ఉంటాయి. [29] ఆర్కిటిక్ భూ మంచులో 11% స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలోనే ఉండటం వలన, స్వాల్‌బార్డ్‌లోని హిమానీనదాలు సముద్ర మట్టం పెరగడానికి కీలక కారణాలుగా ఉన్నాయి. స్వాల్బార్డ్‌లో మంచు కరగడం విస్తృతంగా ఉంది. ఇది ఆర్కిటిక్ లోను, ప్రపంచవ్యాప్త గానూ ఉన్న ధోరణులకు అనుగుణంగానే ఉంది.[29]

నార్వేలో స్థానిక, జాతీయ స్థాయిలో సముద్ర మట్టం పెరుగుదలకు క్రయోస్పిరిక్ సహకారాన్ని, గ్లోబల్ వార్మింగ్‌కు హిమానీనద ప్రతిస్పందనను, నీటి వనరుల నిర్వహణను అంచనా వేయడానికీ హిమానీనద పరిమాణం, మంచు మందం - వీటికి సంబంధించిన విజ్ఞానం ముఖ్యమైనది. [30] [31] హిమానీనదాలు కరిగినప్పుడు, సాధారణంగా సౌర వికిరణాన్ని ప్రతిబింబించే తెల్లటి ఉపరితలం కరిగిపోయి, వాటి కింద ఉండే నల్లటి ఉపరితలాలు బయటపడతాయి. ఇది పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ యంత్రాంగానికి కారణమై, తద్వారా మంచు మరింత కరిగడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికీ కారణమౌతాయి.

1940, 1990ల మధ్య శీతాకాలపు అధిక సంచితానికి ప్రతిస్పందనగా స్వల్పకాలిక విస్తరణను అనుభవించిన నార్వేజియన్ హిమానీనదాలు తక్కువ హిమపాతం, అధిక వేసవి ఉష్ణోగ్రతల ఫలితంగా తిరోగమనం కొనసాగించాయి. [32] [33] దీని వలన వేసవి ఉష్ణోగ్రత కనీసం 2.3 °C పెరుగుతుందని దీర్ఘకాలిక అంచనాలు వెలువడ్డాయి. 21వ శతాబ్దం చివరి నాటికి గణనీయమైన పెరుగుదల (~16%). ఫలితంగా, నార్వేజియన్ హిమానీనదాలలో 98% దాకా అదృశ్యమయ్యే అవకాశం ఉందని, 2100 నాటికి హిమానీనద ప్రాంతం 34% తగ్గవచ్చనీ అంచనాలు ఉన్నాయి.[33] ఇది 21వ శతాబ్దంలో మిగిలిన కాలంలో ప్రపంచ హిమానీనదాల పరిమాణం నాటకీయంగా తగ్గుతుండడంతో సరిపోతోంది.[25]

అవపాత నమూనాలు

[మార్చు]

బలమైన పశ్చిమ గాలులు సముద్రం నుండి తేమతో కూడిన గాలులను తీసుకువస్తాయి. నార్వేలోని చాలా ప్రాంతాలలో వర్షం/మంచు రూపంలో కురుస్తాయి. అయితే, తీర ప్రాంతాలలో ఏటా 3500 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం కలుగుతూండగా, ఆగ్నేయ నార్వే, ఫిన్మార్క్స్విడ్డాలో 300 మిమీ వరకు అవపాతం కలుగుతుంది.[24][34]

1961–1990తో పోలిస్తే, 2100 వరకు నార్వే ప్రధాన భూభాగంలో వార్షిక అవపాతం 18% (5-30%) పెరుగుతుందని నమూనా వాతావరణ డేటా అంచనా వేస్తోంది. [35] [26] అవపాతం మంచు రూపంలో కాకుండా వర్షం రూపంలో పడటం ప్రారంభమయ్యే శరదృతువులో (+23%) అతిపెద్ద వైవిధ్యం ఉంటుందని అంచనా వేసారు. వేసవిలో అత్యల్పంగా 9% (-3 నుండి 17%) తేడా ఉంటుంది, ఎందుకంటే దాదాపు అవపాతమంతా అప్పటికే వర్షం రూపంలో కురుస్తుంది.[26] [35] నార్వే అంతటా, అన్ని సీజన్లలోనూ తీవ్రమైన సంఘటనలలో భారీ వర్షపాతం, అవపాతం విలువలతో ఎక్కువ రోజులు ఉంటాయని అంచనాలు సూచిస్తున్నాయి. [36] శీతాకాలం, శరదృతువులలో ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఈ ఋతువుల్లో భారీ వర్షపాతం ఉన్న రోజుల సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.[26]

దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, ఈ శతాబ్దం గడిచేకొద్దీ మంచు కాలం తగ్గిపోతూ ఉంటుంది. పశ్చిమ, మధ్య ఉత్తర నార్వేలోని తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లోను, తీర ప్రాంతాలలోనూ 2-3 నెలల తగ్గుదల ఉంటుందని అంచనా వేయబడింది (ప్రస్తుత (1961-1990), భవిష్యత్తు వాతావరణ డేటాను (2071-2100) పోల్చినప్పుడు). శీతాకాలాలు తగ్గుతున్న కొద్దీ, శరదృతువు, వసంతకాలంలో హిమపాతం తగ్గుతుంది. తీరం నుండి ఎత్తు, దూరం పెరుగుతున్న కొద్దీ మొత్తం వార్షిక హిమపాతంలో తగ్గుదల తక్కువగా ఉంటుంది. ఎత్తైన పర్వత ప్రాంతాలలో హిమపాతం స్వల్పంగా పెరగవచ్చు.

గాలి వేగం

[మార్చు]

2100 సంవత్సరానికి వేసిన అంచనాలు (1961–1990 తో పోలిస్తే) సగటు గాలి వేగంలో పెద్దగా మార్పులు ఉండవని సూచిస్తున్నాయి. [26] మార్పులు సహజ వైవిధ్య పరిధిలోనే ఉంటాయని, దృష్టాంతాన్ని బట్టి విభిన్న ప్రభావాలను చూపుతాయని భావిస్తున్నారు.[37] నార్వేజియన్ సముద్రంపై తీవ్రమైన జియోస్ట్రోఫిక్ గాలుల వేగం 2-6% తగ్గుతుందని అంచనా వేసారు. అయితే ఉత్తర ఐరోపాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో 2-4% పెరుగుదల కనిపిస్తుంది.

సముద్ర మట్టంలో పెరుగుదల

[మార్చు]

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే, నార్వే, స్వాల్బార్డ్ లలో సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఎటువంటి నాటకీయ ప్రభావాలూ ఉండవు. మునుపటి మంచు యుగం తర్వాత భూమి ఇంకా పైకి లెగుస్తూనే ఉండడాం, తీరం సాపేక్షంగా నిటారుగా ఉండడం దీనికి కారణాలు.

మునుపటి మంచు యుగం చివరిలో, 3 కి.మీ. వరకు మందంతో మంచు పొర ఉత్తర ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాలను కప్పివేసింది. మంచు కరిగినప్పుడు, భూమి పెంకును మాంటిల్‌లోకి నొక్కివేసిన మంచు పొర బరువు తగ్గడాంతో పెంకు మళ్ళీ పైకి లెగవడం ప్రారంభమైంది. మంచు కరిగిన వెంటనే ఒక్కసారిగా భూమి ఉద్ధరణ జరిగినప్పటికీ, ఇది మరో 10,000 సంవత్సరాల వరకు లెగుస్తూనే ఉంటుందని అంచనా.

2100 సంవత్సరం వరకూ నార్వే వద్ద సముద్ర మట్టంలో పెరుగుదల, ప్రపంచ సగటు మట్టంలో పెరుగుదల కంటే సుమారుగా 10 సెం.మీ. ఎక్కువ ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.[29] డేటాల్లో గొప్ప అనిశ్చితి ఉన్నప్పటికీ, ఈ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 10–90 సెం.మీ. పెరుగుదల ఉండవచ్చని IPCC లెక్కించింది.[25] 2009 లో NOU క్లైమేట్ అడాప్టేషన్ నిర్వహించిన ఇతర అధ్యయనాల్లో, 2100 వరకు ఉత్తర నార్వేలో సముద్ర మట్టంలో 40–95 సెం.మీ. పెరుగుదల, భూమి ఉద్ధరణతో సరిపోతుంది. దీని వలన తీరప్రాంతంలో మౌలిక సదుపాయాలు దెబ్బతినే అవకాశం - ముఖ్యంగా తుఫానుల సమయంలో - ఎక్కువగా ఉంటుంది.[29]

ప్రజలపై ప్రభావం

[మార్చు]

వ్యవసాయం

[మార్చు]

వెచ్చని వాతావరణం నార్వే వ్యవసాయానికి లాభాలు, నష్టాలు రెండూ తెచ్చిపెడుతుంది. తేలికపాటి వాతావరణానికి అనుగుణంగా ఉండే కొత్త రకాల మొక్కలతో కలిసి అధిక ఉష్ణోగ్రతలు, మంచి పంటలను అందిస్తాయి. సంవత్సరానికి రెండు పంటలు పండించవచ్చు. వాతావరణ మార్పుల ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది, ఇప్పటికే అవపాతం మొదలైన వాటిలో స్థానికంగా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో మంచు కరగడం వల్ల పంటలు ఎండిపోయి చనిపోవచ్చు. తడి ప్రాంతాలలో, అవపాతం మరింత పెరిగితే పంటలు ఫంగస్ దాడికి లోనౌతాయి.

అడవులు

[మార్చు]

వాతావరణ మార్పుల కారణంగా నార్వేలో ఉత్పాదక అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ దీని వలన సమస్యలూ లేఖపోలేదు. తేలికపాటి శీతాకాలాల్లో చెట్ల నిరోధకత, మంచును తట్టుకునే శక్తీ తగ్గిపోతుంది. తేలికపాటి శీతాకాలాల్లో గడ్డకట్టడం, కరగడం అనే చక్రీయ స్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చెట్లను దెబ్బతీస్తాయి. కొత్త తెగుళ్లు వేగంగా ఉత్తరం వైపు కదులుతాయి కాబట్టి తెగుళ్ల దాడి, వ్యాధులూ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో కీటకాలు ఒక తరాన్ని పునరుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు యూరోపియన్ స్ప్రూస్ బార్క్ బీటిల్ వేసవిలో అదనపు దాడితో స్ప్రూస్ చెట్లను దెబ్బతీస్తుంది.

ఉపశమనం, అమలు

[మార్చు]

విధానాలు, చట్టాలు

[మార్చు]
COP19 లో ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్స్ కోసం నిధులు ప్రకటించిన US, UK, జర్మనీ, నార్వే, ఇండోనేషియా ప్రతినిధులు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ 2015 (ద్వైవార్షిక నివేదిక) ప్రకారం, 141 దేశాలతో పోలిస్తే నార్వే వాయు రవాణా మౌలిక సదుపాయాలలో 9 వ స్థానం లోను, రైల్‌రోడ్ మౌలిక సదుపాయాల నాణ్యతలో 35, గ్రౌండ్ & పోర్ట్ మౌలిక సదుపాయాలలో 56, రోడ్ల నాణ్యతలో 74 స్థానాల్లోనూ ఉంది. [38]

అయితే, నార్వే ఉద్గారాలలో 1/3 వంతు రవాణా నుండి వస్తున్నాయని గుర్తించి, జాతీయ రవాణా ప్రణాళిక (NTP) ఉద్గార రహిత రవాణా వ్యవస్థను సాధించడానికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించింది.[10]

2025 నాటికి, అన్ని కొత్త ప్రైవేట్ కార్లు, బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఉద్గారాలను విడుదల చేయని వాహనాలై ఉండాలి. కొత్త భారీ వ్యాన్లు, 75% కొత్త సుదూర బస్సులు, 50% కొత్త ట్రక్కులు 2030 నాటికి సున్నా-ఉద్గారాలను సాధించాలి. అదేవిధంగా, 2030 నాటికి స్వల్పదూర సముద్ర షిప్పింగ్‌లోని అన్ని ఓడలలో 40% జీవ ఇంధనాలను ఉపయోగించాలి లేదా సున్నా-ఉద్గారాల వద్ద లేదా అంతకంటే తక్కువ ఉండాలి. 2030 నాటికి జీవ ఇంధనాలు ఏటా 170 కోట్ల లీటర్ల శిలాజ ఇంధనాల స్థానంలో వస్తాయి. ఇది ఒక్కటే GHGలలో 50 లక్షల టన్నుల CO2 కు సమానమైన తగ్గింపును అందిస్తుంది.

కార్బన్ సంగ్రహణ, నిల్వ (CCS)

[మార్చు]

ప్రస్తుతం, నార్వేజియన్ ప్రభుత్వం తన CCS విధానంలో ప్రధాన లక్ష్యాన్ని సాంకేతిక అభివృద్ధికి, ఖర్చు తగ్గింపులకూ దోహదపడే చర్యలను గుర్తించడంగా నిర్దేశించుకుంది. 2020 నాటికి కనీసం ఒక పూర్తి స్థాయి కార్బన్ సంగ్రహణ ప్రదర్శన ప్లాంట్‌ను నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు.[39]

పెట్రోలియం, ఇంధన శాఖా మంత్రి (మొత్తం బాధ్యత), గాస్నోవా SF (ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, క్యాప్చర్ స్టోరేజ్), గాస్కో AS (రవాణా) పూర్తి స్థాయి CCS ప్రాజెక్టుల కోసం మూడు సంభావ్య ప్రదేశాలను గుర్తించారు. అవి - బ్రెవిక్ (నార్సెమ్ AS)లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, పోర్స్‌గ్రన్ (యారా నార్జ్ AS)లోని హెరోయ్స్‌లో అమ్మోనియా ప్లాన్, క్లెమెట్‌స్రుడ్ (ఓస్లోలోని వేస్ట్-టు-ఎనర్జీ ఏజెన్సీ) వద్ద ఒక వ్యర్థాల పునరుద్ధరణ ప్లాంట్.[39] అయితే, స్టాటోయిల్, గాస్నోవాలు ఓడ ద్వారా చేరుకోగల ఆన్‌షోర్ సౌకర్యం, 'స్మెహీయా'కు పైప్‌లైన్‌ను నిర్మించడం CO2 నిల్వకు ఉత్తమ పరిష్కారంగా పరిగణిస్తున్నాయి. వారి ప్రకటనలో వారు "అటువంటి గొలుసు కోసం ప్రణాళిక, పెట్టుబడి ఖర్చులు 720, 1260 కోట్ల క్రోనర్‌ల మధ్య ఉంటుందని అంచనా ఉంది" అని చెప్పారు. అందువల్ల, కనీసం 2022 వరకు పూర్తి స్థాయి ప్రాజెక్టు సాకారం కాదు.

కార్బన్ తటస్థంగా మారడం

[మార్చు]

2007 ఏప్రిల్ 19 న లేబర్ పార్టీ వార్షిక సమావేశంలో ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, 2012 నాటికి నార్వే, క్యోటో ఒప్పందం కంటే 10 శాతం ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించనున్నట్లు ప్రకటించాడు. 2020 నాటికి 30% ఉద్గార కోతలను సాధించడానికి ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు. 2050 నాటికి నార్వే కార్బన్ తటస్థంగా మారాలని ఆయన ప్రతిపాదించాడు. ఇతర ధనిక దేశాలు కూడా అలాగే చేయాలని పిలుపునిచ్చాడు.[40] ఈ కార్బన్ తటస్థతను కార్బన్ ఆఫ్‌సెట్టింగ్ ద్వారా పాక్షికంగా సాధించవచ్చు. ఈ ప్రతిపాదనను గ్రీన్‌పీస్ విమర్శించింది. చమురు, గ్యాస్ ఎగుమతుల వల్ల కలిగే 50 కోట్ల టన్నుల ఉద్గారాలకు నార్వే బాధ్యత వహించాలని కూడా అది పిలుపునిచ్చింది.[41] నార్వే లోని ప్రపంచ వన్యప్రాణి నిధి కూడా కార్బన్ ఆఫ్‌సెట్‌ల కొనుగోలు ఆమోదయోగ్యం కాదని భావించింది. "నార్వే విదేశాలలో వాతావరణ కోటాలను కొనుగోలు చేస్తే చైనా మౌనంగా అంగీకరిస్తుందని నమ్మడం రాజకీయంగా పిండమరణమే" నని అది చెప్పింది.[42] సంకీర్ణ ప్రభుత్వంలోని యూరోపియన్ యూనియన్ వ్యతిరేక సభ్యుల ఒత్తిడి కారణంగా స్టోల్టెన్‌బర్గ్ చర్య తీసుకోవలసి వచ్చిందని నార్వేజియన్ పర్యావరణ కార్యకర్త బెల్లోనా ఫౌండేషన్ భావించింది. ఈ ప్రకటనను "సరుకు లేని ప్రవచనాలు" అని వర్ణించింది.[42]

2008 జనవరిలో నార్వేజియన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి 2030 నాటికి కార్బన్ తటస్థంగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. కానీ ప్రభుత్వం స్వదేశంలో ఉద్గారాలను తగ్గించే ప్రణాళికల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు; ఈ ప్రణాళిక ఇతర దేశాల నుండి కార్బన్ ఆఫ్‌సెట్‌లను కొనుగోలు చేయడంపై ఆధారపడి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చాలా విజయవంతమైన విధానం తప్ప, ఉద్గారాలను తగ్గించడానికి వాస్తవానికి నార్వే చేసింది చాలా తక్కువ.[43]

సమాజం, సంస్కృతి

[మార్చు]

ప్రజా అవగాహన, క్రియాశీలత

[మార్చు]
Protesters gathered in a square holding banners and Earth-coloured balloons.
ఓస్లోలో జరిగిన 2015 గ్లోబల్ క్లైమేట్ మార్చ్‌లో నిరసనకారులు.

రెండు కథనాలు వ్యాప్తిలో ఉన్నట్లు అనిపిస్తుంది: ఒకటి, ప్రపంచ వాతావరణ మార్పు, పర్యావరణ సమస్యలలో నార్వే ప్రపంచ నాయకుడిగా ఉండాలని కోరుకుంటుంది. రెండవది నార్వే లోని చమురు, గ్యాస్ నిల్వలకు అనుకూలంగా ఉంటుంది. అధిక డిమాండ్ కారణంగాను, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో శక్తి అందుబాటులో లేని పేదలకు సహాయం చేయడానికి గానూ చమురు, గ్యాస్‌లను మరింత ఎక్కువగా వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొంటుంది.[44] ఈ ద్వంద్వత్వం నార్వే ప్రజలకు రెండు విభిన్న దృక్కోణాలను చూపిస్తుంది. వాతావరణ మార్పు సమస్య పట్ల ప్రజల్లో చర్చ, చొరవ, ఉత్సాహం లేకపోవడానికి ఇది ఒక కారణం కావచ్చు.[45]

శాస్త్రీయ చర్చ

[మార్చు]

వాతావరణ మార్పు ఉందా లేదా అనే దాని గురించి నార్వేజియన్లు చర్చించడం లేదు; అది ఖాయంగా ఉందనే వారు భావిస్తారు. బదులుగా, మానవ చర్యలు గ్రహాన్ని ప్రభావితం చేస్తున్న సమయ ప్రమాణాలు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో గణనీయమైన పెరుగుదలకు, అంటే ఉపరితల ఉష్ణోగ్రతల గ్లోబల్ వార్మింగ్‌కు మన గ్రహం ఎంత త్వరగా స్పందిస్తుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కార్బన్ సంగ్రహణ, నిల్వ, [46] బయోఎనర్జీ,[47] ఆఫ్‌షోర్ పవన శక్తి వంటి వివిధ వాతావరణ సాంకేతిక పరిష్కారాల స్థిరత్వం గురించి శాస్త్రీయ సమాజం పత్రికలలో చర్చించింది.[48]

నార్వేజియన్ వాతావరణ పరిశోధకులను అనేక రంగాలలో ప్రపంచ నాయకులుగా ఉండడం, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రచురణలను (తలసరి) ప్రచురించడం పెరుగుతోంది.[49] ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) వర్కింగ్ గ్రూప్ నివేదికలకు, ఇతర ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన సంస్థలకూ రచయితలుగా పనిచేస్తున్న నార్వేజియన్ పరిశోధకులు అధిక సంఖ్యలో ఉండటం ద్వారా కూడా ఇది నిరూపితమైంది.

ప్రజా సమాచార వ్యవస్థలు

[మార్చు]

నార్వే, రాజకీయంగా స్థిరత్వం ఉన్న, చిన్న ఉత్తర యూరోపియన్ దేశం. దేశంలో గణనీయమైన సంక్షేమ పథకం ఉంది. నార్వేజియన్ మీడియా కూడా ప్రజా, ప్రభుత్వ నిధులపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజకీయ అంశాలపై పౌరుల జ్ఞానానికి అధిక ఆదరణ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనివలన, నార్వే లోని ఇంధన వనరుల లభ్యతతో కలిపి, ఇది ప్రత్యేకంగా ఆసక్తికరమైన అధ్యయన రంగంగా మారింది. చమురు, గ్యాస్ పరిశ్రమతో ముడిపడి ఉన్న భారీ ఆర్థిక ప్రయోజనాల ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తుంది, ఇది నార్వేజియన్ పెట్రో-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క ప్రజాదరణకు, వాతావరణ శాస్త్రం పట్ల సందేహం గురించి ప్రజా చర్చకు దారితీసింది.[50][51] మరోవైపు, నార్వేజియన్ల అద్భుతమైన స్వభావం, పునరుత్పాదక ఇంధన సంపదపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన ఉన్న కారణంగా, పర్యావరణ ఆందోళనకు సంబంధించిన సుదీర్ఘ చరిత్ర ఉంది.[52] ఈ ద్వంద్వవాదం వాతావరణ మార్పు పట్ల సందేహాల అంతర్లీన ప్రవాహానికి దారితీసింది. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది: వాతావరణ సమస్య అంత ముప్పు అయితే, రాజకీయ నాయకులు దాని గురించి ఎందుకు ఏమీ చేయడం లేదు? ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వానికి దాని వాతావరణ విధానానికి గాను పెద్ద క్రెడిటేమీ దక్కడం లేదు.[53]

గతంలో, చాలా మంది వాతావరణ మార్పు వాస్తవమని నమ్మేవారు. అయితే, 'సమతుల్య నివేదిక'పై ప్రాధాన్యత ఇవ్వడంతో అవగాహనలు మారడం ప్రారంభించాయి, దీని ద్వారా శాస్త్రీయ వివాదాలు ఈ సమస్య ఆవశ్యకత గురించి ప్రజలను అస్పష్టంగా మార్చాయి. వాతావరణ మార్పు పట్ల ప్రజల దృక్పథంలో మార్పులు కూడా అనేక ఇతర కీలక అంశాల ద్వారా రూపుదిద్దుకున్నాయి. ప్రకృతిలో మార్పులపై వార్తా మాధ్యమ కవరేజ్, గ్లోబల్ వార్మింగ్ గురించి నిపుణుల అభిప్రాయ భేదాల కవరేజ్ (సైన్స్ డ్రామా), మీడియా పట్ల విమర్శనాత్మక వైఖరులు, రాజకీయ నిష్క్రియాత్మకత, రోజువారీ జీవితానికి సంబంధించి పరిశీలన వీటిలో ఉన్నాయి. దీని వలన కొంతమంది గ్లోబల్ వార్మింగ్ పట్ల ఉన్న ప్రజా జ్ఞానం లేకపోవడం అనేది లేదని, [54] ఈ జ్ఞానాన్ని ఆచరణలోకి అనువదించడమే సమస్యాత్మకంగా ఉందనీ తేల్చారు. మౌలిక సదుపాయాలు, యంత్రాంగాలు లేకపోవడం, పర్యావరణ అనుకూల వస్తువుల ధరలు పెరగడం, ప్రైవేట్ కార్ల వాడకాన్ని ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు లేకపోవడం వల్ల తమ ప్రవర్తన పరిమితం గానే ఉందని ప్రజలు సూచించారు.[53]

ఇంకా, ప్రభుత్వం వద్ద బలమైన చురుకైన విధానాలు లేకపోవడం వల్ల ప్రజా రంగంలో విస్తృత నిరాశ ఏర్పడింది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎలా పరిష్కరించాలో సందేశాలు తరచుగా అస్థిరంగా ఉంటాయి. ఒకవైపు అది భౌగోళికంగా సుదూరంగా ఉన్న సాంకేతిక పరిష్కారాలను సమర్థిస్తూ ఉంటుంది. మరోవైపు, ఉద్గారాలను తగ్గించే ప్రధాన బాధ్యతను ప్రజలు స్వీకరించాలని కోరుతూంటుంది. [54]

దీనికి ఉదాహరణలు విద్యుత్ రోడ్డు రవాణా (ప్రస్తుతం అమలులో ఉంది) కోసం సమగ్ర విధానాల కోసం ప్రజల పిలుపులు, మెరుగైన, చౌకైన ప్రజా రవాణా విధానాలు, భవనాలలో శక్తి సామర్థ్యంపై రాజకీయ మార్గదర్శకత్వం, పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి సంసిద్ధత. [53] దీని ఫలితంగా యువతపై జరిపిన ఒక అధ్యయనంలో ఇలా తేలింది: ప్రపంచవ్యాప్త యవనిక మీద వ్యక్తిగత చర్యలు పెద్దగా లెక్కలోవి కావు. సాధారణ పౌరులకు చర్యలు తీసుకునే సౌలభ్యాన్ని అధికారులు కలిగించడం లేదు. పైగా, పేద దేశాలకు సహాయం చేయాల్సిన బాధ్యత నార్వేకు ఉందని, అదే సమయంలో సమస్యను తగ్గించి, దాని స్వంత చమురు ఉత్పత్తిని కూడా తగ్గించుకోవాల్సిన బాధ్యత నార్వేకు ఉందని వారు నొక్కి చెప్పారు.[55]

వాతావరణ విధానానికి సంబంధించిన మరో పరిశోధనలో, అంతర్జాతీయ వాతావరణ చర్యలకు లభిస్తున్న ప్రజల మద్దతు వెనక, అవతలి వైపు నుండి కూడా అదే విధమైన స్పందన ఉండాలి అనే షరతు అంతర్లీనంగా ఉందా అని విశ్లేషించింది. అంతర్జాతీయ వాతావరణ మార్పులకు ప్రజల నుండి వస్తున్న మద్దతు అమెరికా, కెనడా కంటే నార్వేలో మరింత షరతులతో కూడుకున్నదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనివల్ల ఏకపక్ష వాతావరణ చర్య మద్దతును అంచనా వేయడంలో బహుపాక్షిక సహకారం కోసం జాతీయ సంప్రదాయాల కంటే దేశ పరిమాణం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం వాంటివి చాలా ముఖ్యమైనవని ఒకరు సూచించారు. అయితే, నార్వేలో జరిగిన తాజా అభిప్రాయ సేకరణలు వాతావరణ మార్పు ప్రజల ఎజెండాలో రెండవ అతి ముఖ్యమైన అంశంగా మారిందని గమనించాయి. 2010–2014 లో ఇది ఆరవ స్థానంలో ఉండేది.[56]

స్వాల్‌బార్డ్

[మార్చు]
1750 - 2013 ల మధ్య జాన్ మాయెన్, స్వాల్‌బార్డ్‌లలో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఆర్కిటిక్ ప్రాంతం వాతావరణ మార్పులకు ఎక్కువగా గురవుతుంది. ఎందుకంటే ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు మిగతా ప్రపంచంలో పెరిగే రేటు కంటే రెండు రెట్లు పెరుగుతున్నాయి.[57] శాశ్వత చీకటితో కూడిన శీతాకాలం (అక్టోబరు-ఫిబ్రవరి), శాశ్వత కాంతితో కూడిన వేసవి (ఏప్రిల్-ఆగస్టు) లతో కూడిన స్వాల్‌బార్డ్ లోని ప్రత్యేక వాతావరణం - పర్యావరణంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన వాతావరణాన్ని తట్టుకోవడానికి ప్రత్యేకంగా అనువుగా ఉండే అనేక స్థానిక జాతులు ఉన్నాయి.[58]

ప్రపంచంలోనే అత్యంత వేగంగా కదిలే హిమానీనదాలు స్వాల్‌బార్డ్‌లో ఉన్నాయి. ప్రపంచ రేటు కంటే రెట్టింపు వేగంతో ఇక్కడి భూమి వేడెక్కుతున్నందున, మంచు కింద ప్రవహించే కరిగే నీరు, కింద ఉన్న రాతిపై కందెన లాగా పనిచేయడంతో వెచ్చని కాలంలో హిమానీనదాలు రోజుకు 25 మీటర్ల వేగంతో ముందుకు దూసుకుపోతాయి.[59]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The World Factbook — Central Intelligence Agency". www.CIA.gov. Archived from the original on 16 June 2013. Retrieved 21 May 2017.
  2. 1 2 "Vannkraftpotensialet". nve.no. Archived from the original on 18 January 2017. Retrieved 21 May 2017.
  3. "Norway: Carbon-neutral as soon as 2030". Nordic Energy Research. Retrieved 11 May 2020.
  4. "Norway steps up 2030 climate goal to at least 50 % towards 55 %". Government.no. 7 February 2020. Retrieved 11 May 2020.
  5. 1 2 3 "Emissions of greenhouse gases, 1990-2015, final figures". SSB.
  6. 1 2 3 4 "Production and consumption of energy, energy balance, 2014-2015, final figures". ssb.no.
  7. Vidal, John (2016-01-29). "Norwegian industry plans to up fossil fuel production despite Paris pledge". euractiv.com.
  8. "bp Statistical Review of World Energy" (PDF). www.bp.com (71st ed.). 2022. Retrieved 7 June 2024.
  9. 1 2 Lundgren, Kari (June 7, 2024). "Norway's Emissions Fell Last Year on EV Boom, Metal Output Fall". www.bloomberg.com. Retrieved 2024-06-07.
  10. 1 2 Avinor, Jernbaneverket. "Norwegian Coastal Administration and the Public Roads Administration, 2016. Nasjonal Transportplan 2018-2029". Archived from the original on 3 జూన్ 2020. Retrieved 16 March 2017.
  11. "Record passenger numbers". ssb.no. Retrieved 1 May 2017.
  12. 1 2 Choppin, Simon (2 September 2009). "Emissions by transport type". The Guardian.
  13. Energy, Ministry of Petroleum and (11 May 2016). "Renewable energy production in Norway". Government.no. Retrieved 21 April 2017.
  14. "More passengers and less goods". ssb.no. Retrieved 21 April 2017.
  15. Cobb, Jeff (17 January 2017). "Top 10 Plug-in Vehicle Adopting Countries of 2016". Hybrid Cars. Retrieved 16 March 2017.
  16. Holland, Maximilian (2 April 2020). "Norway EV Market Share Breaks All Records — 75% Of Vehicles Sold Have Plugs!". CleanTechnica. Retrieved 11 May 2020.
  17. Demerjian, Dave (30 January 2009). "Norway or the Highway: Poo Powers Oslo Buses". Retrieved 10 March 2017.
  18. "Batterifergen har måttet stå over avganger. Nå er løsningen klar". Tu.no (in నార్వేజియన్). Retrieved 21 April 2017.
  19. "GLOBAL METRICS FOR THE ENVIRONMENT" (PDF). epi.yale.edu. 2017. Archived from the original (PDF) on 20 జూన్ 2020. Retrieved 25 May 2017.
  20. "The oil and gas pipeline system - Norwegianpetroleum.no". Norwegianpetroleum.no. Retrieved 21 April 2017.
  21. Hausfather, Zeke; Peters, Glen (29 January 2020). "Emissions – the 'business as usual' story is misleading". Nature. 577 (7792): 618–20. Bibcode:2020Natur.577..618H. doi:10.1038/d41586-020-00177-3. PMID 31996825.
  22. Schuur, Edward A.G.; Abbott, Benjamin W.; Commane, Roisin; Ernakovich, Jessica; Euskirchen, Eugenie; Hugelius, Gustaf; Grosse, Guido; Jones, Miriam; Koven, Charlie; Leshyk, Victor; Lawrence, David; Loranty, Michael M.; Mauritz, Marguerite; Olefeldt, David; Natali, Susan; Rodenhizer, Heidi; Salmon, Verity; Schädel, Christina; Strauss, Jens; Treat, Claire; Turetsky, Merritt (2022). "Permafrost and Climate Change: Carbon Cycle Feedbacks From the Warming Arctic". Annual Review of Environment and Resources. 47: 343–371. doi:10.1146/annurev-environ-012220-011847. Medium-range estimates of Arctic carbon emissions could result from moderate climate emission mitigation policies that keep global warming below 3°C (e.g., RCP4.5). This global warming level most closely matches country emissions reduction pledges made for the Paris Climate Agreement...
  23. Phiddian, Ellen (5 April 2022). "Explainer: IPCC Scenarios". Cosmos. Archived from the original on 20 September 2023. Retrieved 30 September 2023. "The IPCC doesn't make projections about which of these scenarios is more likely, but other researchers and modellers can. The Australian Academy of Science, for instance, released a report last year stating that our current emissions trajectory had us headed for a 3°C warmer world, roughly in line with the middle scenario. Climate Action Tracker predicts 2.5 to 2.9°C of warming based on current policies and action, with pledges and government agreements taking this to 2.1°C.
  24. 1 2 3 Environment, Ministry of the (13 January 2012). "NOU 2010: 10 Adapting to a changing climate". Government.no. Retrieved 21 April 2017.
  25. 1 2 3 "Fifth Assessment Report - Synthesis Report". www.ipcc.ch. Retrieved 21 April 2017.
  26. 1 2 3 4 5 6 Førland, Eirik J.; Flatøy, Frode; Hanssen-Bauer, Inger; Haugen, Jan Erik; Isaksen, Ketil; Sorteberg, Asgeir; Ådlandsvik, Bjørn; Benestad, Rasmus E. (8 May 2009). Climate development in North Norway and the Svalbard region during 1900–2100 (Report). hdl:11250/173407.
  27. 1 2 3 4 5 "The Circle 04.15". Retrieved 1 May 2017.
  28. Carrington, Damian (19 May 2017). "Arctic stronghold of world's seeds flooded after permafrost melts". The Guardian.
  29. 1 2 3 4 "New report: Climate Change in the Norwegian Arctic - Implications for life in the North". Norwegian Polar Institute. Retrieved 21 April 2017.
  30. (1 August 2005). "Glacier mass-balance and length variation in Norway".
  31. (2013). "Observations of the Cryosphere".
  32. (1 December 2005). "Seasonal mass-balance gradients in Norway".
  33. 1 2 (1 January 2008). "Norwegian mountain glaciers in the past, present and future".
  34. Vikhamar-Schuler, Dagrun; Hanssen-Bauer, Inger; Førland, Eirik (26 March 2010). Long-term climate trends of Finnmarksvidda, Northern-Norway (PDF) (Report).
  35. 1 2 Sorteberg, Asgeir; Anderson, Marianne Skolem (2008). "Regional precipitation and temperature changes for Norway 2010 and 2025. Bjerknes Centre for Climate Research, Bergen, p.36" (PDF). Archived from the original (PDF) on 13 November 2017.
  36. "Norge og klimaendringer - Climatechangepost.com". Climatechangepost.com. Retrieved 1 May 2017.
  37. North Sea Region Climate Change Assessment. Regional Climate Studies. 2016. doi:10.1007/978-3-319-39745-0. ISBN 978-3-319-39743-6.[page needed]
  38. Crotti, Roberto; Misrahi, Tiffany (2015). The Travel & Tourism Competitiveness Report 2015 (PDF) (Report).
  39. 1 2 Energy, Ministry of Petroleum and (13 July 2016). "Good potential for succeeding with CCS in Norway". Government.no. Retrieved 21 April 2017.
  40. "Speech to the congress of the Labour Party". regjeringen.no. 19 April 2007. Archived from the original on 20 November 2021. Retrieved 9 February 2012.
  41. "Science News | Technology News - ABC News". Abcnews.go.com. 4 December 2011. Archived from the original on 29 June 2011. Retrieved 9 February 2012.
  42. 1 2 Archived 29 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  43. Rosenthal, Elisabeth (22 March 2008). "Lofty Pledge to Cut Emissions Comes With Caveat in Norway - New York Times". The New York Times. Norway. Archived from the original on 18 June 2013. Retrieved 9 February 2012.
  44. (1 March 2014). "Linguistic mediation of climate change discourse".
  45. (17 February 2017). "The polarization of public concern about climate change in Norway".
  46. (2012). "Mediemagneten Mongstad – debatten om CO2-fangst og ‑lagring i norske aviser".
  47. (December 2012). "Curb Your Enthusiasm: On Media Communication of Bioenergy and the Role of the News Media in Technology Diffusion".
  48. (November 2013). "What We Disagree about When We Disagree about Sustainability".
  49. Mila, M (2012). "International Evaluation: Impressed With Norwegian Climate Research. The Research Council of Norway 21st June.".[permanent dead link]
  50. Moe, Espen (2015). Renewable Energy Transformation or Fossil Fuel Backlash. doi:10.1057/9781137298799. ISBN 978-1-349-57116-1.[page needed]
  51. "Til siste dråpe - Helge Ryggvik". Bokkilden (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 2 May 2017.
  52. Politikkens natur. Naturens politikk.
  53. 1 2 3 Ryghaug, Marianne; Skjølsvold, Tomas Moe (2016). "Climate Change Communication in Norway". Oxford Research Encyclopedia of Climate Science. doi:10.1093/acrefore/9780190228620.013.453. hdl:11250/2484441. ISBN 978-0-19-022862-0.
  54. 1 2 Ryghaug, M.; Næss, R. (2012). "Climate change politics and everyday life". In Carvalho, Anabela; Peterson, Tarla Rai (eds.). Climate Change Politics. Cambria Press. pp. 31–57. ISBN 978-1-62196-829-0.
  55. Fløttum, Kjersti; Dahl, Trine; Rivenes, Vegard (13 September 2016). "Young Norwegians and their views on climate change and the future: findings from a climate concerned and oil-rich nation". Journal of Youth Studies. 19 (8): 1128–1143. doi:10.1080/13676261.2016.1145633. S2CID 146900347.
  56. "Klimabarometeret 2016 rapport (pdf)". Archived from the original on 6 August 2016. Retrieved 2 May 2017.
  57. "AR4 WGII Chapter 15: Polar Regions (Arctic and Antarctic)". www.ipcc.ch. Archived from the original on 4 March 2016. Retrieved 11 May 2018.
  58. "BBC Two - Earth's Greatest Spectacles". BBC. Retrieved 11 May 2018.
  59. "BBC Two - Earth's Greatest Spectacles". BBC. Retrieved 11 May 2018.