Jump to content

నార్వేలో విద్య

వికీపీడియా నుండి
నార్వే లో విద్య
నార్వే విద్య, పరిశోధనా
మంత్రిత్వ శాఖ
విద్యా బడ్జెట్ (N/A)
బడ్జెట్N/A
సాధారణ వివరాలు
ప్రధాన భాషలునార్వేజియన్ (బోక్మల్, నైనోర్స్క్)
వ్యవస్థ రకంజాతీయ
ప్రస్తుత వ్యవస్థKunnskapsløftet, since the 2006–2007 academic year
అక్షరాస్యత (2015[1])
మొత్తం100%
పురుషులు100%
స్త్రీలు100%
నమోదు
మొత్తంn/a
ప్రాథమిక99.9% (graduating)
ద్వితీయN/A
ద్వితీయ స్థాయి తరువాత82% (graduating)
Attainment
ద్వితీయ స్థాయి విద్యN/A
ద్వితీయ స్థాయి తరువాత విద్యN/A

నార్వేలో 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ విద్య తప్పనిసరి. పాఠశాలలను ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య అనే రెండు విభాగాలుగా విభజించారు. నార్వే లోని మెజారిటీ పాఠశాలలు మునిసిపల్ పాఠశాలలు. వీటికి స్థానిక ప్రభుత్వాలు నిధులు సమకూర్చి, వాటిని నిర్వహిస్తాయి. నార్వే పౌరులందరికీ హక్కుగా ప్రాథమిక, దిగువ మాధ్యమిక పాఠశాలలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.[2]

ప్రాథమిక, దిగువ మాధ్యమిక విద్య పూర్తయ్యాక, విద్యార్థులకు ఉన్నత మాధ్యమిక విద్యలో నమోదుకు అర్హత వస్తుంది. ఇది విద్యార్థులను ఉన్నత విద్య లేదా వృత్తి విద్యకు సిద్ధం చేస్తుంది.[2]

నార్వేలో విద్యా సంవత్సరం ఆగస్టు మధ్య నుండి మరుసటి సంవత్సరం జూన్ చివరి వరకు ఉంటుంది. డిసెంబరు మధ్య నుండి జనవరి ప్రారంభం వరకు ఉండే క్రిస్మస్ సెలవులు నార్వేజియన్ విద్యా సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తాయి.

నార్వేలో విద్యారంగ చరిత్ర

[మార్చు]

నార్వేలో వ్యవస్థీకృత విద్య సా.పూ. 2000 నాటిది. 1153 లో నార్వే ఆర్చ్ డియోసెస్ అయిన కొద్దికాలానికే, ట్రోండ్‌హీమ్, ఓస్లో, బెర్గెన్, హమార్‌లలో పూజారులకు విద్యను అందించడానికి కేథడ్రల్ పాఠశాలలు నిర్మించారు.

1536 లో డెన్మార్కుతో నార్వే ఏకీకరణ తరువాత 1537లో జరిగిన నార్వే సంస్కరణ తరువాత, కేథడ్రల్ పాఠశాలలను లాటిన్ పాఠశాలలుగా మార్చారు. అన్ని మార్కెట్ పట్టణాల లోను అటువంటి పాఠశాలలు ఉండటం తప్పనిసరి చేసారు.[3]

1736 లో పిల్లలందరికీ విద్య తప్పనిసరి చేసారు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత, నడిచే బడులు (యాంబ్యులేటరీ పాఠశాలలు - omgangsskoler) స్థాపించే వరకు అది క్రియాశీలంగా లేదు. 1827 లో నార్వే ఫోక్‌స్కోల్ (ప్రజా పాఠశాల) ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో 1889 నుండి కనీసం ఏడు సంవత్సరాలు, 1969 నుండి కనీసం తొమ్మిది సంవత్సరాల విద్య తప్పనిసరి. 1970 లు, 1980 లలో, ఫోక్‌స్కోల్‌ను రద్దు చేసి, గ్రున్‌స్కోల్‌ను ('ఫౌండేషన్ స్కూల్') ప్రవేశపెట్టారు.

సాంప్రదాయికంగా ఫిన్మార్క్, హెడ్మార్క్ వంటి పేద కౌంటీలలో తప్పనిసరి ప్రాథమిక విద్య వరకు మాత్రమే చదివిన వారి వాటా అత్యధికంగా 38% ఉంది.[4]

2003 నాటి స్వతంత్ర పాఠశాలల చట్టంతో నార్వేలో ప్రైవేట్ పాఠశాల విద్య అందుబాటులోకి వచ్చింది.[5] అయితే, దేశంలో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ఇటువంటి పాఠశాలలు చాలా తక్కువ. ప్రైవేట్ పాఠశాలలు అంతర్జాతీయంగా ఉపయోగించే, గుర్తించబడిన పాఠ్యాంశాలను బోధించాలి, లేదా ప్రత్యామ్నాయ విద్యా విధానం-ఉదాహరణకు, మతపరమైన బోధనా విధానంపై - స్థాపించాలి.[6] ఈ పాఠశాలలు ప్రభుత్వం ఆమోదం పొందాలి, భారీగా గ్రాంట్-ఎయిడెడ్ అయి ఉండాలి. నైపుణ్యం లేదా మేధస్సు వంటి అంశాల ఆధారంగా ఇవి విద్యార్థులను ఎంపిక చేయకూడదు.[7]

నార్వేజియన్ పాఠశాల వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు: ప్రాథమిక పాఠశాల (వయస్సు 6–12), దిగువ మాధ్యమిక పాఠశాల (వయస్సు 13–16), ఉన్నత మాధ్యమిక పాఠశాల (వయస్సు 16–19). తొలి రెండు విద్యాస్థాయిలు తప్పనిసరి. వీటిని సాధారణంగా grunnskole (పునాది విద్యాశాలలు) అంటారు.

6–16 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల తప్పనిసరి. 1997 కి ముందు, నార్వేలో తప్పనిసరి విద్య 7 సంవత్సరాల వయస్సులో మొదలయ్యేది. విద్యార్థులు దిగువ మాధ్యమిక స్కూల్‌లో చేరినప్పుడు తరచుగా పాఠశాలలు మారవలసి ఉంటుంది. ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చేరినప్పుడు దాదాపు ఎల్లప్పుడూ పాఠశాల మారవలసి ఉంటుంది - చాలా పాఠశాలలు ఒక స్థాయిని మాత్రమే అందిస్తాయి కాబట్టి

ప్రాథమిక పాఠశాల (1–7 తరగతులు, 6–12 సంవత్సరాల వయస్సు)

[మార్చు]
నార్వేలోని ఒక దిగువ మాధ్యమిక పాఠశాల

ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో, విద్యార్థులు ఎక్కువ సమయం విద్యాసంబంధ క్రీడలు ఆడుతూ, సామాజిక నిర్మాణాలు, వర్ణమాల, ప్రాథమిక కూడికలు, తీసివేతలు, ప్రాథమిక ఆంగ్ల నైపుణ్యాలను నేర్చుకుంటారు. 2–7 తరగతులలో, వారికి గణితం, ఇంగ్లీష్, సైన్స్, మతం (క్రైస్తవ మతంపై మాత్రమే కాకుండా అన్ని ఇతర మతాలు, వాటి ఉద్దేశ్యం, వాటి చరిత్రపై కూడా దృష్టి సారించడం), సౌందర్యశాస్త్రం, సంగీతం, ఐదవ తరగతిలో భూగోళ శాస్త్రం, చరిత్ర, సామాజిక అధ్యయనాలను పరిచయం చేస్తారు. ఈ స్థాయిలో అధికారిక గ్రేడ్‌లు ఇవ్వబడవు. అయితే, ఉపాధ్యాయులు తరచుగా పరీక్షలపై వ్యాఖ్య, విశ్లేషణ కొన్నిసార్లు అనధికారిక గ్రేడ్‌లు ఇస్తారు. గ్రేడ్లను ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపించాలి. విద్యార్థి సగటు కంటే ఎక్కువగా ఉన్నాడా లేదా పాఠశాలలో అతనికి కొంత సహాయం అవసరమా అని ఉపాధ్యాయుడికి తెలియజేయడానికి పరిచయ పరీక్ష కూడా ఒకటి ఉంటుంది.

దిగువ మాధ్యమిక పాఠశాల (8–10 తరగతులు, 13–16 సంవత్సరాల వయస్సు)

[మార్చు]

విద్యార్థులు 12 లేదా 13 సంవత్సరాల వయస్సులో దిగువ మాధ్యమిక పాఠశాలలో ప్రవేశించినప్పుడు, వారి పని ఆధారంగా వారికి రేటింగ్ ఇవ్వడం మొదలౌతుంది. వారి గ్రేడ్‌లు, దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారు అనేవాటిని బట్టి వారు ఎంచుకున్న ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చేరాగలరో లేదో తేలుతుంది. ఎనిమిదో తరగతి నుండి, విద్యార్థులు ఒక ఐచ్ఛికాన్ని, ఒక భాషనూ ఎంచుకోవచ్చు. సాధారణంగా బోధించే భాషలు జర్మన్, ఫ్రెంచి, స్పానిష్ అలాగే అదనపు ఇంగ్లీష్, నార్వేజియన్ అధ్యయనాలు. 2006 ఆగస్టు విద్యా సంస్కరణకు ముందు, విద్యార్థులు భాషలకు బదులుగా ప్రాక్టికల్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకునే వీలుండేది. 1999 లోను, ఆ తరువాతా జన్మించిన విద్యార్థులు మరోసారి ప్రాక్టికల్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. లేదా దిగువ మాధ్యమిక స్కూల్ ప్రారంభించిన తర్వాత కెరీర్ స్టడీస్, తద్వారా రెండు ఎలక్టివ్‌లను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఒకే మునిసిపాలిటీలో కూడా, పాఠశాలల మధ్య ఐచ్ఛికాలు గణనీయంగా మారుతూ ఉంటాయి.

ఒక విద్యార్థికి ఏదైనా నిర్దుష్ట సబ్జెక్టులో ప్రాథమిక/మధ్యతరగతి పాఠశాలలో తదుపరి బోధన నుండి మినహాయింపు లభిస్తే, అతను/ఆమె ఆ సబ్జెక్టులో 10 వ తరగతి పరీక్ష ముందుగానే రాయవచ్చు.

2009 లో పదిహేనేళ్ల వయస్సు గలవారిలో నార్వే, ఇతర స్కాండినేవియన్ దేశాల కంటే OECDల అంతర్జాతీయ విద్యార్థి అంచనా కార్యక్రమంలో మెరుగ్గా రాణించారు. 2006 నుండి గణనీయమైన మెరుగుదల కనిపించింది. అయితే, గణితంలో మాత్రం అగ్రభాగాన ఉన్న 10% మంది, షాంఘైలో టాప్-స్కోరింగ్ విద్యార్థుల కంటే మూడు సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని అంచనా వేసారు.[8]

దిగువ మాధ్యమిక స్థాయిలో (నార్వేలో) బోధించిన సామాజిక శాస్త్రవేత్త సానా సరోమా ఇలా విమర్శించింది (2024): "బాగా మందంగా ఉండేవారి కోసం మందమతుల కోసం ఆగుతాం"; ఇంకా, "తల్లిదండ్రులే ప్రాథమిక జ్ఞానాన్నంతటినీ తల్లిదండ్రులే అందించాలి" అని ఆమె చెప్పింది.

అప్పర్ సెకండరీ స్కూల్ (VG1–VG3 తరగతులు, వయస్సు 16–19)

[మార్చు]
నార్వేలో అతిపెద్ద సాండెఫ్‌జోర్డ్ అప్పర్ సెకండరీ స్కూల్

నార్వేలో మాధ్యమిక విద్య ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడి ఉంది: 2007 లో 93% ఉన్నత మాధ్యమిక పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు హాజరయ్యారు.[9] 2005 వరకు నార్వేజియన్ చట్టం ప్రైవేట్ సెకండరీ పాఠశాలలను "మతపరమైన లేదా బోధనా ప్రత్యామ్నాయాన్ని" అందించకపోతే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించింది. కాబట్టి ఉనికిలో ఉన్న ఏకైక ప్రైవేట్ పాఠశాలలు మతపరమైనవి (క్రిస్టియన్), స్టైనర్/వాల్డోర్ఫ్, మాంటిస్సోరి పాఠశాలలు, డేనియల్‌సెన్ లు. మొదటి "ప్రామాణిక" ప్రైవేట్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలు 2005 శరదృతువులో మొదలయ్యాయి.

2017 నాటికి, మాధ్యమిక విద్యలో నుండి ఉత్తీర్ణత పొందిన వారు 73% ఉన్నారు.[10]

1994 కి ముందు, ఉన్నత మాధ్యమిక విద్యలో మూడు శాఖలు ఉండేవి: జనరల్ (భాష, చరిత్ర, మొదలైనవి), వర్తక (అకౌంటింగ్, మొదలైనవి), వృత్తి (ఎలక్ట్రానిక్స్, వడ్రంగి, మొదలైనవి) అధ్యయనాలు. 1994 ఉన్నత పాఠశాల సంస్కరణ ("సంస్కరణ 94") ఈ శాఖలన్నిటినీ ఒకే వ్యవస్థలో విలీనం చేసింది. సంస్కరణ లక్ష్యాలలో ఒకటి, విద్యార్థులందరికీ ఉన్నత విద్యకు అర్హులయ్యేంత పెద్ద మొత్తంలో సాధారణ అధ్యయనాలు ఉండాలి అనేది. అంటే వృత్తి అధ్యయనాలలో ఎక్కువ సిద్ధాంతం ఉండాలి తద్వారా ఎక్కువ క్రెడిట్ కోల్పోకుండా ఒక విద్యా మార్గం నుండి మరొక విద్యా మార్గానికి మారడం సాధ్యమవుతుంది. పాత విధానంలో, జనరల్ స్టడీస్‌కు మారాలనుకుంటే రెండు సంవత్సరాల వడ్రంగి పని వృధా అవుతుంది, కానీ కొత్త విధానంలో కనీసం సగం క్రెడిట్‌ను ఉంటుంది.

ఉన్నత విద్య

[మార్చు]
ట్రోండ్‌హీమ్‌లోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన భవనం.

ఉన్నత విద్య అంటే ఉన్నత మాధ్యమిక పాఠశాల తరువాతది. ఇది సాధారణంగా మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది. చాలా ఉన్నత విద్యా పాఠశాలల్లో చేరాలంటే, ఒక విద్యార్థి జనరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ఉన్నప్పుడు సాధారణ అధ్యయనాలు తీసుకోవడం ద్వారా లేదా 23/5 సూత్రం ద్వారా దీనిని సాధించవచ్చు, 23/5 సూత్రం అంటే విద్యార్థికి 23 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి, పాఠశాల విద్య, పని అనుభవం కలిపి ఐదు సంవత్సరాల ఉండాలి, నార్వేజియన్, గణితం, సహజ శాస్త్రాలు, ఇంగ్లీష్, సామాజిక అధ్యయనాల పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని డిగ్రీలకు రెండవ, మూడవ తరగతులలో ప్రత్యేక ఐచ్ఛిక అంశాలు కూడా అవసరం (ఉదా. ఇంజనీరింగ్ అధ్యయనాలకు గణితం, భౌతికశాస్త్రం.) అధిక శాతం ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. అవి స్వంతంగా బోధన, పరిశోధన, జ్ఞాన వ్యాప్తికి బాధ్యత వహిస్తాయి. విద్య, పరిశోధన మంత్రిత్వ శాఖ కింద ఉన్న వృత్తిపరంగా స్వతంత్ర సంస్థ అయిన నార్వేజియన్ ఏజెన్సీ ఫర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (NOKUT), నార్వేలో ఉన్నత విద్య నాణ్యతను నిర్ధారిస్తుంది.

ప్రవేశం పొందిన విద్యార్థుల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉన్న చోట, దరఖాస్తుదారులను ఉన్నత మాధ్యమిక పాఠశాల నుండి వారి తరగతుల ఆధారంగా ర్యాంక్ చేస్తారు. సాధారణంగా అధిక GPA అవసరమయ్యే వైద్య, న్యాయ, ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ప్రాప్యత పొందడానికి, చాలా మంది విద్యార్థులు తమ గ్రేడ్‌లను మెరుగుపరచుకోవడానికి వారి ఉన్నత పాఠశాల పరీక్షలను మళ్ళీ రాస్తారు.

ఉన్నత విద్యను కింది విధంగా విభజించారు:

  • సైద్ధాంతిక అంశాలపై (కళలు, మానవీయ శాస్త్రాలు, సహజ శాస్త్రం) దృష్టి సారించే విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్ (మూడు సంవత్సరాలు), మాస్టర్స్ (ఐదు సంవత్సరాలు), పిహెచ్‌డి (ఎనిమిది సంవత్సరాలు) డిగ్రీలను అందిస్తాయి. విశ్వవిద్యాలయాలు చట్టం, వైద్యం, దంతవైద్యం, ఫార్మసీ, మనస్తత్వశాస్త్రంతో సహా అనేక వృత్తిపరమైన అధ్యయనాలను కూడా అందిస్తాయి. అయితే, ఇవి సాధారణంగా విశ్వవిద్యాలయ సంస్థలోని మిగిలిన వాటితో పెద్దగా సంబంధం లేని ప్రత్యేక విభాగాలు. విశ్వవిద్యాలయాలు బాహ్య గుర్తింపు లేకుండా ఏ స్థాయిలోనైనా తమ సొంత పాఠ్యాంశాలను అందించవచ్చు.
  • విశ్వవిద్యాలయ కళాశాలలు: ఇవి విశ్వవిద్యాలయ డిగ్రీలు బ్యాచిలర్, మాస్టర్, పిహెచ్‌డి స్థాయిలు, ఇంజనీరింగ్ డిగ్రీలు, ఉపాధ్యాయుడు, నర్సు వంటి వృత్తిపరమైన వృత్తులతో సహా విస్తృత శ్రేణి విద్యాంశాలను అందిస్తాయి. విశ్వవిద్యాలయ కళాశాలలు మాస్టర్స్, పిహెచ్‌డి స్థాయిలో అధ్యయన కార్యక్రమాల కోసం NOKUT నుండి గుర్తింపు పొందాలి. [11] గ్రేడింగు విధానం విశ్వవిద్యాలయాలకు ఉన్నట్లే ఉంటుంది.
  • ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ లేదా లలిత కళలు వంటి పరిమిత సామర్థ్యంతో ప్రసిద్ధ విషయాలలో ప్రత్యేకత కలిగిన ప్రైవేట్ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఉన్నత విద్యలో 10%, సెకండరీలో 4%, ప్రాథమిక విద్యలో 1.5% ఉంటుంది.

గ్రేడింగు

[మార్చు]

నార్వేలో బహుళ గ్రేడింగ్ వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని తమకే ప్రత్యేకమైనవి, మరి కొన్ని విదేశీ గ్రేడింగ్ వ్యవస్థలపై ఆధారపడినవీ. విశ్వవిద్యాలయ స్థాయిలో గతంలో అత్యంత సాధారణ గ్రేడ్‌ల వ్యవస్థ 1.0 (చెత్త) నుండి 6.0 (ఉత్తమమైనది) వరకు నడుస్తున్న స్కేల్‌పై ఆధారపడి ఉండేది. 4.0 లేదా అంతకంటే ఎక్కువ, ఉత్తీర్ణత గ్రేడ్‌లుగా పరిగణించబడతాయి.

కొత్త బోలోగ్నా వ్యవస్థను ప్రవేశపెట్టినపుడు, పాత వ్యవస్థ అమలులో ఉండగా చదువు ప్రారంభించిన విద్యార్థులు రెండు వ్యవస్థల నుండి (అంటే సంఖ్యలు, అక్షరాలు రెండూ) గ్రేడ్‌లను కలిగి ఉన్న ట్రాన్స్‌క్రిప్ట్‌లతో పట్టభద్రులయ్యారు.

దిగువ స్థాయి విద్య 1 నుండి 6 వరకు ఉండే స్కేల్‌ను ఉపయోగిస్తుంది. 6 అత్యధిక ఉత్తీర్ణత గ్రేడ్, 2 అత్యల్ప ఉత్తీర్ణత గ్రేడ్. నాన్-ఫైనల్ పరీక్షలు, మిడ్-టర్మ్ మూల్యాంకనాల కోసం గ్రేడ్‌లు తరచుగా + లేదా - (6+, 1- తప్ప) లతో సూచించే గ్రేడ్లు కూడా ఉంటాయి. సరిహద్దు గ్రేడ్‌లను సూచించే 5/6 లేదా 4/3 వంటి గ్రేడ్‌లను ఉపయోగించడం కూడా కద్దు. అయితే, విద్యార్థులు తమ చివరి డిప్లొమాలో పొందే గ్రేడ్‌లు 1, 2, 3, 4, 5, 6 0 -ఇవే.

విద్యా సంవత్సరం

[మార్చు]

విద్యా సంవత్సరంలో భాగాలు

[మార్చు]

నార్వే పాఠశాలల్లో, రెండు సెమిస్టర్లు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం ఆగస్టు మధ్యలో ప్రారంభమవుతుంది. మొదటి సెమిస్టర్ ఆగస్టులో ప్రారంభమై డిసెంబరులో ముగుస్తుంది. రెండవ సెమిస్టర్ జనవరిలో ప్రారంభమై జూన్‌లో ముగుస్తుంది.[12]

సెలవులు

[మార్చు]

నార్వే పాఠశాలకు అనేక దీర్ఘకాల సెలవులు ఉంటాయి. ఉదాహరణకు, జూన్‌లో విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత, జూన్ మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు ఎనిమిది వారాల పాటు వేసవి సెలవులు ఉంటాయి. డిసెంబరులో మొదటి సెమిస్టర్ ముగిసిన తర్వాత జనవరిలో రెండవ సెమిస్టర్ ప్రారంభమయ్యే వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. అదనంగా, అక్టోబరు చివరి వారంలో, ప్రాథమిక, దిగువ మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు శరదృతువు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి మధ్యలో మరో వారం రోజుల శీతాకాల సెలవులు ఉంటాయి. విశ్వవిద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయ కళాశాలలలోని విద్యార్థులకు సాధారణంగా శరదృతువు, శీతాకాల విరామాలు ఉండవు.[12]

జాతీయ సెలవులు

[మార్చు]

నార్వేలో, పాఠశాలలను మూసేసే జాతీయ సెలవులు పదమూడున్నాయి. ఏప్రిల్ మధ్యలో, నాలుగు రోజుల ఈస్టర్ సెలవులు ఉంటాయి. నార్వే మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని, మే 17న దాని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మే నెలలో అసెన్షన్ డేను జరుపుకుంటుంది. అసెన్షన్ డే తర్వాత పది రోజులకు, దేశం పెంతెకోస్ట్‌ను, మరుసటి రోజు విట్ సోమవారాన్నీ జరుపుకుంటుంది. ఈ జాతీయ సెలవు దినాలలో విద్యార్థులు పాఠశాలకు హాజరు కానవసరం లేదు. అయితే, కొన్ని సెలవుదినాలు దీర్ఘ కాల సెలవుల్లో కలిసిపోతాయి. ఉదాహరణకు, నూతన సంవత్సర దినోత్సవం, క్రిస్మస్‌లు నార్వేలో జాతీయ సెలవులే గానీ ఆ సమయంలో విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు ఎలాగూ ఉంటాయి. [13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Norway Literacy". indexmundi.com.
  2. 2.0 2.1 "General information about education in Norway". Nokut (in ఇంగ్లీష్). Retrieved 2022-12-02.
  3. (1990). "A New Deal for Norwegian Higher Education?".
  4. "Her bor de med høyest utdanning". Archived from the original on 2016-04-15. Retrieved 2016-05-08.
  5. regjeringen.no (2019-10-14). "The Independent Schools Act". Government.no (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-11-22.
  6. "Norway | Eurydice". eurydice.eacea.ec.europa.eu. Retrieved 2022-11-22.
  7. "Act relating to independent schools (The Independent Schools Act) - Lovdata". lovdata.no. Retrieved 2022-12-01.
  8. "PISA-Programme for International Student Assessment". Archived from the original on 2011-01-20. Retrieved 2010-12-08.
  9. "Statistics Norway: Upper secondary school students by type of study and school ownership". Statistisk Sentralbyrå (Norwegian) - select all regions, all 'studieretning', all 'eierforhold', year 2007 revidert. Click 'vis tabell' ('show table'), compute percentages from result.
  10. "Aldri har så mange fullført videregående skole". 29 August 2017.
  11. "Education – from Kindergarten to Adult Education" (PDF). European Agency for Special Needs and Inclusive Education. Norwegian Ministry of Education and Research. Retrieved 2023-07-21.
  12. 12.0 12.1 "外務省: 世界の学校を見てみよう! ノルウェー". www.mofa.go.jp. Retrieved 2022-12-04.
  13. Ministry of Foreign Affairs of Norway (2016). "Norway Data 2015".