Jump to content

నార్వేలో శక్తి

వికీపీడియా నుండి
ఉత్తర సముద్రంలో ఈక్వినార్ సంస్థకు చెందిన ఆయిల్ ప్లాట్‌ఫారం

నార్వే పెద్దయెత్తున ఇంధనం ఉత్పత్తి చేసే దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. దేశంలో అత్యధిక విద్యుత్తు జలవిద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. రవాణా రంగాన్ని విద్యుదీకరించడంలో నార్వే అగ్రగామి దేశం. తలసరి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యలో ఇది ప్రపంచంలోనే అగ్రదేశం.

1960 ల చివరలో నార్వే జలాల్లో నార్త్ సీ ఆయిల్ కనుగొన్నప్పటి నుండి, చమురు, గ్యాస్ ఎగుమతులు నార్వే ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంశాలుగా మారాయి. ఉత్తర సముద్రంలో చమురు ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకోవడం, బారెంట్స్ సముద్రంలో చమురు అన్వేషణపై భేదాభిప్రాయాలు, ఆర్కిటిక్‌లో అన్వేషణ అవకాశాలు, గ్లోబల్ వార్మింగ్‌పై పెరుగుతున్న అంతర్జాతీయ ఆందోళనలు వగైరాల నేఫథ్యంలో ప్రస్తుతం శక్తి పట్ల నార్వే చాలా శ్రద్ధ తీసుకుంటోంది.

గణాంకాలు

[మార్చు]
2020 శక్తి గణాంకాలు
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలు
(బిలియన్ kWh)
రకం మొత్తం
హైడ్రో 309.49
పవన శక్తి 21.51
శిలాజ ఇంధనం 4.03
జీవపదార్థం 1.01
మొత్తం 336.04
విద్యుత్
(బిలియన్ kWh)
వర్గం మొత్తం
వినియోగం 124.29
ఉత్పత్తి 153.67
దిగుమతి 4.50 ఖరీదు
ఎగుమతి 24.97
సహజ వాయువు
(బిలియన్ మీ 3 )
వినియోగం 3.98
ఉత్పత్తి 112.05
ఎగుమతి 107.34
ముడి చమురు
(సంవత్సరానికి బారెల్స్)
వినియోగం 78,800,000
ఉత్పత్తి 739,490,000
దిగుమతి 24,200,000
ఎగుమతి 453,510,000

CO 2 ఉద్గారాలు:36.18 మిలియన్ టన్నులు

శక్తి ప్రణాళిక

[మార్చు]

2008 జనవరిలో ఇతర దేశాల నుండి కార్బన్ ఆఫ్‌సెట్‌లను కొనుగోలు చేసి, 2030 నాటికి కార్బన్ తటస్థంగా ఉండాలనే లక్ష్యాన్ని నార్వే ప్రభుత్వం ప్రకటించింది.

ఇంధన రకాలు

[మార్చు]

శిలాజ ఇంధనాలు

[మార్చు]
సహజ వాయువు నిరూపితమైన నిల్వల వారీగా దేశాలు, 2014
US EIA, 2017 ప్రకారం ప్రపంచ చమురు నిల్వల మ్యాప్

2011 లో, ప్రపంచంలో ముడి చమురును ఎగుమతి చేసే అగ్రదేశాల్లో నార్వే ఎనిమిదవ స్థానంలో (7.8 కోట్ల టన్నులు) ఉంది. శుద్ధి చేసిన నూనె ఎగుమతిదారులలో 9 వ స్థానం (8.6 కోట్ల టన్నులు) లోను, సహజ వాయువు ఎగుమతిలో మూడవ స్థానం లోనూ (9900 కోట్ల క్యూ.మీ) ఉంది. ఉత్తర సముద్రంలో గణనీయమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వెలికితీయదగ్గ బొగ్గు నిల్వలలో నార్వే ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో ఒకటి (నార్వేజియన్ ఖండాంతర షెల్ఫ్ కింద ఈ బొగ్గు ఉంది). ఇటీవల (2017), నార్వేజియన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సహజ వాయువు ఎగుమతిదారుగా రష్యా, ఖతార్‌ల తర్వాత 3వ స్థానంలో నిలిచింది.

నార్వేలో సమృద్ధిగా ఉన్న ఇంధన వనరులు, జాతీయ ఆదాయానికి గణనీయమైన వనరుగా ఉన్నాయి. 2015 లో దేశపు మొత్తం ఎగుమతుల విలువలో ముడి చమురు, సహజ వాయువుల వాటా 40%. GDP లో చమురు, సహజ వాయువుల ఎగుమతుల వాటా దాదాపు 17%. చమురు ధరలలో హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడిన " డచ్ డిసీస్" నుండి భద్రతకూ, దాని ప్రభావాన్ని తగ్గించడానికీ, నార్వేజియన్ ప్రభుత్వం ఈ ఎగుమతి ఆదాయంలో కొంత భాగాన్ని గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ (GPFG) అనే పెన్షన్ ఫండ్‌లోకి జమ చేస్తుంది. నార్వేజియన్ ప్రభుత్వానికి ఈ నిధులు చమురు పరిశ్రమలలో దానికి మార్కెట్ వాటాల నుండి, ఈక్వినోర్‌లో దాని మూడింట రెండు వంతుల వాటా వంటి వాటి నుండి సమకూరుతాయి. దానిని వారి ప్రభుత్వ-నియంత్రిత దేశీయ ఆర్థిక వ్యవస్థ ద్వారా కేటాయిస్తుంది.[1] ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి సహజ వనరుల సంపదను ప్రధాన భూభాగానికి సంక్షేమ పెట్టుబడులుగా పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తాయి. దేశీయంగా, నార్వే ప్రధాన భూభాగ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో చమురు పరిశ్రమ మార్కెట్లతో సంభవించే సమస్యలను, చెల్లింపుల సమతుల్యతను ఎదుర్కోవడానికీ, ఇంధన భద్రతను పరిష్కరించడానికీ, వీలు కలిగింది.[1]

కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల అభివృద్ధి

నార్వే కార్యకలాపాల వలన పర్యావరణం రీత్యా ఉత్పన్నమయ్యే బయటి అంశాలు, దాని దేశీయ ఆర్థిక చిక్కులతో పాటు మరొక ఆందోళనను కలిగిస్తాయి. నార్వేజియన్ గ్యాస్‌లో ఎక్కువ భాగం యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తారు. 2020 నాటికి, ఐరోపాలో వినియోగించే సహజ వాయువులో దాదాపు 20% నార్వే నుండే వస్తుంది. నార్వే చమురు ప్రపంచ చమురు వినియోగంలో 2% సరఫరా చేస్తుంది. రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురు, 13 లక్షల టన్నుల CO2 ను వాతావరణం లోకి చేరుస్తుందని పరిగణనలోకి తీసుకుంటే, సంవత్సరానికి 47.4 కోట్ల టన్నులు అవుతుంది. ఈ విధంగా నార్వే సహజ వనరుల సరఫరా వలన ప్రపంచ CO2 పై గణనీయ ప్రభావం ఉంటోంది. అయినప్పటికీ, నార్వే దేశీయంగా వినియోగించే శక్తి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ శక్తిని ఎగుమతి చేస్తుంది. నార్వే కార్బన్ ఉద్గారాలలో ఎక్కువ భాగం దాని చమురు, గ్యాస్ పరిశ్రమ (30%), రోడ్డు ట్రాఫిక్ (23%) ల నుండి వస్తుంది. CO2 ఉద్గారాల సమస్యను పరిష్కరించడానికి, నార్వే ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టింది. పెరుగుతున్న ప్రపంచ పర్యావరణ ఆందోళనలకు బదులుగా దాని ఉద్గారాలను తగ్గించడానికి బహుపాక్షిక, ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసింది.[2] [3]

నార్స్క్ పెట్రోలియం నివేదిక ప్రకారం, చమురు, పెట్రోలియంలు నార్వే ఎగుమతుల్లో అత్యంత కీలకమైనవి.[4] 2020 లో నార్వే ఎగుమతుల్లో 40% పెట్రోలియం రంగం నుండి వచ్చాయి.[4] దీని ఎగుమతి విలువ 33300 కోట్ల NOK.[4] ప్రపంచ చమురు వినియోగంలో 2% నార్వే ఉత్పత్తి చేస్తుంది. 2019 లో ఇది ప్రపంచంలో 15వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా నిలిచింది.[4] శిలాజ ఇంధనాలు నార్వేలో ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకంగా పనిచేస్తాయి, అదే సమయంలో దేశీయ ఇంధన ఖర్చులను తగ్గిస్తాయి. నార్వేలో శిలాజ ఇంధనాల కార్యకలాపాలు కూడా నార్వేజియన్ ఉపాధికి పెద్ద వనరుగా ఉన్నాయి.

పెట్రోలియం వనరుల నిర్వహణ విషయంలో నార్వే అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వాదించారు. మంచి సంస్థలు, వివిధ రకాల పౌర సమాజ ప్రతినిధులతో కూడిన బహిరంగ, క్రియాశీలక చర్చలు నార్వేలో పెట్రోలియం నిర్వహణ విజయవంతం కావడానికి కీలకమైన అంశాలు.[5]

నార్వేలోని శిలాజ ఇంధన పరిశ్రమ భవిష్యత్తులో వివిధ సవాళ్లను ఎదుర్కోవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ 2018 నివేదికలో పేర్కొంది.[6] కొత్త శక్తి వనరులు, షేల్, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ (సాధారణంగా ఫ్రాకింగ్ అని పిలుస్తారు) వంటి ఉత్పత్తి పద్ధతులు చమురు, వాయువులకు ప్రత్యామ్నాయంగా క్మారవచ్చు. పునరుత్పాదక ఇంధనాల వలన, శిలాజ ఇంధనాల ఉత్పత్తిని తగ్గించడంలోనే కాక, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడంలో కూడా పెద్ద ముప్పును కలిగిస్తున్నాయి. శ్రామిక శక్తిలో కొత్త తరం రావడాన చమురు ఉత్పత్తిదారులకు ఎదురుదెబ్బలు ఎదురు కావచ్చు.[6] ప్రపంచ మార్కెట్లో చమురు ధర తగ్గుదల ఎదుర్కొంటోంది. ఇది ప్రపంచ, యూరోపియన్ డీకార్బనైజేషన్‌లో పెద్ద పాత్ర పోషిస్తుంది చమురు వినియోగం తగ్గడం ఆసన్నమైంది, కానీ పునరుత్పాదక ఇంధన వనరులకు మారే వేగం, స్థాయి చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ విషయంలో, చమురు ఉత్పత్తిదారులకు చమురు గరిష్ట డిమాండ్ ఒక పెద్ద చర్చనీయాంశం. చమురు ఉత్పత్తిదారుల గరిష్ట డిమాండ్‌పై ప్రస్తుత, భవిష్యత్తు చమురు ధరలు అమ్మకాల పరిమాణాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. [7] చమురు, గ్యాస్ దాని గరిష్ట డిమాండ్‌ను ఎప్పుడు చేరుకుంటుందో కూడా పండితులు ప్రశ్నిస్తున్నారు, కానీ శిఖరం చేరుకున్న తర్వాత ఏమి జరుగుతుందనే దాని గురించి పండితులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.[7]

చమురు సరఫరాదారుల మధ్య పెరుగుతున్న పోటీ కూడా శిలాజ ఇంధన చర్చలో ఒక సవాలుగా నిలుస్తోంది. పునరుత్పాదక శక్తికి స్పష్టమైన పరివర్తన సరఫరాదారులు మిగిలిన చమురు సరఫరాను త్వరగా పొందేలా చేస్తూ తద్వారా వారి శిలాజ ఇంధన ఆస్తులు లాభదాయకంగా, అభివృద్ధి చెందుతూనూ ఉంటాయి. ఐరోపా సమాఖ్య చమురు ఉత్పత్తులు, కార్బన్-ఇంటెన్సివ్ పన్ను విధించే చరిత్ర కూడా శిలాజ ఇంధనాల నుండి దూరంగా ఉండటానికి మద్దతు ఇస్తుంది.

సహజ వాయువు

[మార్చు]

2022 నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ విధ్వంసం తరువాత, నార్వే ఐరోపా సమాఖ్య‌కు ముఖ్యమైన సహజ వాయువు సరఫరాదారుగా మారింది. యూరోపియన్ పాలసీ అనాలిసిస్ సెంటర్ కు చెందిన ఇంధన భద్రతా నిపుణుడు లుకాస్ ట్రాకిమావిసియస్ ప్రకారం, నార్వే యొక్క ఆఫ్‌షోర్ గ్యాస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా శత్రు నాయకులు ఐరోపా సమాఖ్య సహజ వాయువు భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ప్రమాదం ఉంది. నార్వే యొక్క సబ్‌సీ పైప్‌లైన్‌ల పరిమాణం, దూరం దృష్ట్యా, అటువంటి దాడిని ఆపాదించడం చాలా కష్టం. [8]

ఉత్తర సముద్ర చమురు

[మార్చు]
మూలం: నార్వేజియన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్
నార్వేలో సహజ వాయువు ఉత్పత్తి (ఎరుపు), సహజ వాయువు ఎగుమతులు (నలుపు)

1963 మేలో నార్వే ఉత్తర సముద్రంలోని సహజ వనరులపై సార్వభౌమ హక్కులను ప్రకటించింది. 1966 జూలై 19 న ఓషన్ ట్రావెలర్ తన మొదటి బావి తవ్వడంతో అన్వేషణ ప్రారంభమైంది. 1969 ఆగస్టు 21 న ఓషన్ వైకింగ్ చమురును కనుగొనే వరకు తొలి అన్వేషణలు ఫలించలేదు. 1969 చివరి నాటికి, ఉత్తర సముద్రంలో పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టమైంది. మొదటి చమురు క్షేత్రం ఎకోఫిస్క్, 1980 లో 4,27,442 బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసింది. తదనంతరం, పెద్దయెత్తున సహజ వాయువు నిల్వలను కూడా కనుగొన్నారు. ముఖ్యంగా ఉత్తర సముద్రంలో లభించిన ఈ భారీ మొత్తంలో చమురు EU బయటి దేశాల్లో నార్వే ప్రత్యేక మార్గాన్ని సులభతరం చేసింది.[9]

1972 లో ఐరోపా సమాఖ్యలో చేరకూడదని నార్వేప్రజాభిప్రాయ సేకరణ ఫలితం నేపథ్యంలో, ఓలా స్క్జాక్ బ్రాక్ నేతృత్వంలోని నార్వేజియన్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ ఇంధన విధానాన్ని ఏర్పాటు చేయడానికి త్వరగా చర్యలు తీసుకుంది. నార్వే OPEC నుండి దూరంగా ఉండాలనీ, దాని స్వంత ఇంధన ధరలను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా ఉంచాలనీ, "కరెన్సీ బహుమతి" అని పిలువబడే ఆదాయాన్ని నార్వే పెట్రోలియం ఫండ్‌లో ఖర్చు చేయాలనీ నిర్ణయించుకుంది. ఆ సంవత్సరమే నార్వేజియన్ ప్రభుత్వం సొంతంగా స్టాటోయిల్ (తరువాత దానికి ఈక్వినార్ అని పేరు మార్చారు) అనే చమురు కంపెనీని స్థాపించింది.[10] ఈ సంస్థ నార్స్క్ హైడ్రో, సాగా పెట్రోలియంలకు డ్రిల్లింగు, ఉత్పత్తి హక్కులను ఇచ్చింది.

ఉత్తర సముద్రంలో చమురు ఉత్పత్తి, అన్వేషణలకు అనేక సాంకేతిక సవాళ్ళు ఎదురయ్యాయి. నార్వేజియన్ కంపెనీలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన సామర్థ్యాలను సమకూర్చుకోవడంలో పెట్టుబడులు పెట్టాయి. దాదాపుగా అంతరించిన నౌకానిర్మాణ పరిశ్రమ అవశేషాల నుండి అనేక ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థలు ఉద్భవించాయి. స్టావాంజర్ లోను, ఓస్లో పశ్చిమ శివారు ప్రాంతాలలోనూ సామర్థ్య కేంద్రాలను స్థాపించాయి. స్టావాంజర్ నగరం, ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ పరిశ్రమకు భూ-ఆధారిత స్టేజింగ్ ప్రాంతంగా మారింది. వాణిజ్యపరంగా అవసరమైన ప్రత్యేక నూనెలను తయారు చేసే శుద్ధి కర్మాగారాల అవసరాల కోసం నార్వే, 2015 లో NOK 3500 కోట్ల విదేశీ నూనెను దిగుమతి చేసుకుంది. [11]

బారెంట్స్ సముద్ర చమురు

[మార్చు]

నార్వే, రష్యా తీరంలో ఉన్న బారెంట్స్ సముద్రంలో, మిగిలిన ప్రపంచంలో ఇంకా కనుగొనబడని చమురు, వాయువుల మొత్తంలో మూడింట ఒక వంతు దాకా ఉండవచ్చని 2005 మార్చిలో విదేశాంగ మంత్రి జాన్ పీటర్సన్ పేర్కొన్నాడు. [12] అలాగే పర్యావరణ సమస్యల కారణంగా 2001 లో నార్వేజియన్ రంగంలో అన్వేషణపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని 2005 లో ప్రభుత్వం మారాక ఎత్తివేశారు.[13] స్నోహ్విట్ వద్ద ఒక టెర్మినల్, ద్రవీకృత సహజ వాయువు ప్లాంట్లను నిర్మిస్తున్నందున, ఆర్కిటిక్ మహాసముద్రంలో చమురు అన్వేషణకు భవిష్యత్తులో స్నోహ్విట్ ఒక వేదికగా కూడా పనిచేయవచ్చని భావిస్తున్నారు.[14]

పునరుత్పాదక శక్తి

[మార్చు]

పవన శక్తి

[మార్చు]

2021లో, 64 పవన విద్యుత్ కేంద్రాలన్నిటికీ కలిపి మొత్తం 4,649 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. 2021లో 706 మెగావాట్ల ఆన్‌షోర్ విద్యుత్ సామర్థ్యాన్ని జోడించారు. 2021లో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 11.8 TWh. ఇది నార్వే మొత్తం అవసరాలలో 8.5%.[15]

సౌర శక్తి

[మార్చు]

2022 లో సౌర విద్యుత్తు సామర్థ్యం 321 మెగావాట్లు. ఆ సంవత్సరం దాదాపు 0.3 TWh విద్యుత్తును ఉత్పత్తి చేసింది.

జల విద్యుత్ శక్తి

[మార్చు]

నార్వే యూరప్‌లో అతిపెద్ద జలవిద్యుత్ ఉత్పత్తిదారు.

అలల శక్తి

[మార్చు]

సముద్రగర్భంలోని తరంగాల శక్తిని ఉపయోగించి వాణిజ్యపరంగా విద్యుత్తును ఉత్పత్తి చేసిన మొదటి దేశం నార్వే. 2003 నవంబరు 13 న హామర్‌ఫెస్ట్‌కు దక్షిణంగా ఉన్న క్వాల్సుండ్ మునిసిపాలిటీలో 300- కిలోవాట్ల ప్రోటోటైప్ టర్బైన్ ఉత్పత్తిని ప్రారంభించింది.[16] [17]

విద్యుదుత్పత్తి

[మార్చు]

నార్వేలో విద్యుదుత్పత్తి దాదాపు పూర్తిగా జలవిద్యుత్ కేంద్రాల నుండే జరుగుతుంది. 2005 లో మొత్తం 137.8 TWh ఉత్పత్తిలో 136 TWh జలవిద్యుత్ ప్లాంట్ల నుండే వచ్చింది. 0.86 TWh థర్మల్ పవర్ నుండి, 0.5 TWh గాలిమరల ద్వారా ఉత్పత్తి అయింది. 2005లో మొత్తం వినియోగం 125.8 TWh

నార్వే, స్వీడన్ గ్రిడ్‌లు చాలా కాలంగా అనుసంధానించబడి ఉన్నాయి. 1977 నుండి నార్వేజియన్, డానిష్ గ్రిడ్లు 500 మెగావాట్ల ప్రసార సామర్థ్యంతో స్కాగెరాక్ విద్యుత్ ప్రసార వ్యవస్థతో అనుసంధానించబడ్డాయి. 2015 నాటికి ఇది 1,700 మెగావాట్లకు పెరిగింది 2008 మే 6 నుండి, నార్వేజియన్, డచ్ విద్యుత్ గ్రిడ్లు 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నార్నెడ్ జలాంతర్గత HVDC (450 కిలోవోల్ట్‌లు) కేబుల్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. [18]

కార్బన్ ఉద్గారాలను అరికట్టడానికి విధానాలు

[మార్చు]

జలవిద్యుత్ ప్లాంట్ల నుండి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, నార్వే 2008 తలసరి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల జాబితాలో 30వ స్థానంలోను, GDP, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల నిష్పత్తి ప్రకారం 2004 నాటి దేశాల జాబితాలో 37వ స్థానంలోనూ ఉంది. నార్వే క్యోటో ప్రోటోకాల్‌పై సంతకం చేసింది, దీని కింద 2012 నాటికి దాని కార్బన్ ఉద్గారాలను 1990 స్థాయిల కంటే 1% కంటే ఎక్కువ తగ్గించాలని అంగీకరించింది.

2007 ఏప్రిల్ 19 న ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ లేబర్ పార్టీ వార్షిక సమావేశంలో, నార్వే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 2012 నాటికి దాని క్యోటో నిబద్ధత కంటే 10 శాతం ఎక్కువగా తగ్గిస్తామనీ, 2020 నాటికి 30% ఉద్గార కోతలను సాధించడానికి ప్రభుత్వం అంగీకరించిందనీ ప్రకటించాడు. 2050 నాటికి నార్వే కార్బన్ తటస్థంగా మారాలని ఆయన ప్రతిపాదించాడు. ఇతర ధనిక దేశాలు కూడా అలాగే చేయాలని కూడా పిలుపునిచ్చాడు.[19] ఈ కార్బన్ తటస్థత పాక్షికంగా కార్బన్ ఆఫ్‌సెట్టింగ్ ద్వారా సాధించబడుతుంది. ఈ ప్రతిపాదనను గ్రీన్‌పీస్ విమర్శించింది. నార్వే చేసే చమురు, గ్యాస్ ఎగుమతుల వల్ల కలిగే 50 కోట్ల టన్నుల ఉద్గారాలకు అది బాధ్యత వహించాలని కూడా పిలుపునిచ్చారు.[20] ప్రపంచ వన్యప్రాణి నిధి నార్వే కూడా కార్బన్ ఆఫ్‌సెట్‌ల కొనుగోలు ఆమోదయోగ్యం కాదని విశ్వసిస్తుంది, "నార్వే విదేశాలలో వాతావరణ కోటాలను కొనుగోలు చేస్తే చైనా చూస్తూ మౌనంగా ఉంటుందనుకోవడం రాజకీయంగా పిండ మరణమే" నని ప్రకటించింది.[21] సంకీర్ణ ప్రభుత్వంలోని ఐరోపా సమాఖ్య వ్యతిరేక సభ్యుల ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి చర్య తీసుకోవలసి వచ్చిందని నార్వేజియన్ పర్యావరణ కార్యకర్త బెల్లోనా ఫౌండేషన్ భావిస్తూ, ఈ ప్రకటనను "సరుకు లేని కబుర్లు" అని వర్ణించింది. [21]

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నాయకత్వం, వాతావరణ మార్పుల నుండి ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిణామాలను తగ్గించడం పరంగా నార్వే స్పష్టమైన ఎజెండాను నిర్దేశించుకుంది. వాతావరణ లక్ష్యాల పరంగా, శిలాజ ఇంధనాలను తొలగించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికీ నెదర్లాండ్స్‌తో పాటు నార్వే కూడా కఠినమైన కాలరేఖలను పెట్టుకుంది.[22] అయితే 2030, 2050 లు రెండింటికీ వాతావరణ చర్య, కార్బన్ నుండి ఉద్గారాలను తగ్గించడం వంటి లక్ష్యాలను నార్వే గ్రహించడంలో చాలా దూరంలో ఉందని నార్వేజియన్ ఇండస్ట్రీస్ సమాఖ్య 2021 నివేదికలో పేర్కొంది.[23]

కార్బన్ సంగ్రహణ, నిల్వ

[మార్చు]

1996 నుండి ఈక్వినార్ నిర్వహిస్తున్న స్లీప్నర్ ఆయిల్ ఫీల్డ్‌లో పారిశ్రామిక స్థాయిలో కార్బన్ సంగ్రహణ, నిల్వ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టిన మొట్టమొదటి దేశం నార్వే. అమైన్ ద్రావకాలతో సహజ వాయువు నుండి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి, ఉప్పు రూపంలో నిక్షిప్తం చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ అనేది క్షేత్రంలో జరిగే సహజ వాయువు ఉత్పత్తిలో ఏర్పడే వ్యర్థ ఉత్పత్తి; ఈ వాయువులో 9% CO 2 ఉంటుంది. ఇది సహజ వాయువు పంపిణీ నెట్‌వర్క్‌లో అనుమతించబడిన దానికంటే ఎక్కువ. దీన్ని భూగర్భంలో నిల్వ చేయడం వల్ల ఈ సమస్య నివారించబడి, ఈక్వినోర్‌కు కార్బన్ పన్నుల రూపంలో వందల మిలియన్ల యూరోలు ఆదా అవుతాయి. స్లీప్నర్ సంవత్సరానికి దాదాపు ఒక మిలియన్ టన్నుల CO2 ని నిల్వ చేస్తుంది.[24]

నార్వేలో కార్బన్ సంగ్రహణ, నిల్వ సాంకేతికతలో పెద్ద చమురు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ లైట్స్ ప్రాజెక్ట్ అనేది ఈక్వినాక్స్, షెల్, టోటల్ సంస్థలు కలిసి చేస్తున్న కార్బన్ సంగ్రహణ, నిల్వ ప్రపంచంలోనే మొట్టమొదటి నెట్‌వర్క్ ప్రాజెక్టు. దీని మొత్తం విలువ USD 67ఎ.5 కోట్లు.[22]

కార్బన్ పన్ను

[మార్చు]

1991లో నార్వే ఇంధనాలపై కార్బన్ పన్నును ప్రవేశపెట్టింది.[25] CO2 కి టన్ను గ్యాసోలిన్ పై US$51 చొప్పున పన్ను మొదలైంది. సగటున టన్నుకు US$21 వరకూ పన్ను విధించారు.[26] ఉత్తర సముద్రం వెలికితీత కార్యకలాపాలలో ఉపయోగించే డీజిల్, మినరల్ ఆయిల్, చమురు, గ్యాస్‌లపై ఈ పన్ను వర్తిస్తుంది.[27] 2001లో అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) "1991 నుండి ఇంధనంపై ఎక్సైజ్ పన్నులతో పాటు కార్బన్ డయాక్సైడ్ పన్ను కూడా వర్తింపజేయబడింది" అని పేర్కొంది. ఇది OECD దేశాలలో విధించిన అత్యధిక రేట్లలో ఇది ఒకటి. ఇది ఆఫ్‌షోర్ చమురు, గ్యాస్ ఉత్పత్తికి వర్తిస్తుంది. 2004లో పన్ను ద్వారా వచ్చిన ఆదాయం అంచనాలు 780.8 కోట్ల NOK [28] (2010 నాటి విలువల్లో ఇది దాదాపు $130 కోట్లు).

IEA 2005 లో చేసిన సమీక్ష ప్రకారం,[28] నార్వేలో CO 2 పన్ను దాని అతి ముఖ్యమైన వాతావరణ విధాన పరికరం. ఇది నార్వేజియన్ CO2 ఉద్గారాలలో 64%, మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 52% ను కవర్ చేస్తుంది. కొన్ని పరిశ్రమ రంగాలకు వాటి పోటీ స్థానాన్ని కాపాడుకోవడానికి మినహాయింపు ఇచ్చారు. 1990 లలో జరిగిన వివిధ అధ్యయనాలు, స్టాటిస్టిక్స్ నార్వే చేసిన ఆర్థిక విశ్లేషణల ప్రకారం నార్వేజియన్ ఉద్గారాలలో 2.5–11% తగ్గింపు జరిగినట్లు అంచనా వేసారు. అయితే, 2008 నాటికి నార్వే తలసరి ఉద్గారాలు మాత్రం 15% పెరిగాయి. [29]

CO2 ఉద్గారాలను పెద్ద మొత్తంలో తగ్గించే ప్రయత్నంలో నార్వే, 2005 లో ఉద్గారాల వ్యాపార పథకాన్ని అమలు చేసింది.[30] 2008 లో ఐరోపా సమాఖ్యకు చెందిన ఉద్గారాల వ్యాపార పథకం (EU ETS) లో చేరింది.[31] 2013 నాటికి, నార్వేలో దాదాపు 55% CO2 ఉద్గారాలపై పన్ను విధించారు. మినహాయింపు ఉద్గారాలను EU ETSలో చేర్చారు.[31] ఖండాంతర షెల్ఫ్‌లో పెట్రోలియం కార్యకలాపాల ఫలితంగా వచ్చే ఉద్గారాలకు కొన్ని CO2 పన్నులు వర్తిస్తాయి.[32] ఈ పన్ను, ఉత్పత్తైన చమురు, సహజ వాయువు ద్రవాలకు, అలాగే మండే లేదా విడుదలయ్యే ప్రామాణిక క్యూబిక్ మీటర్ గ్యాస్‌కూ వసూలు చేస్తారు.[32] అయితే, ఈ కార్బన్ పన్ను పెట్రోలియం ఉత్పత్తికి పన్ను మినహాయింపు పొందిన నిర్వహణ వ్యయం.[32] 2013 లో ఖనిజ నూనె, సహజ వాయువు లీటరుకు/ప్రామాణిక క్యూబిక్ మీటర్‌కు కార్బన్ పన్ను రేట్లు రెట్టింపై 0.96 NOKకి చేరుకున్నాయి.[32] 2016 నాటికి ఈ రేటు 1,02 NOK కి పెరిగింది.[33] ఉద్గారాలను తగ్గించడానికి CO2 పన్నులు అత్యంత ముఖ్యమైన సాధనమని నార్వేజియన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.[34]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • పీక్ ఆయిల్
  • నార్వేలో పునరుత్పాదక శక్తి

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Archived copy". Archived from the original on 2016-11-14. Retrieved 2016-11-14.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. ↑ Environmental Defense Fund; International Emissions Trading Association (May 2015). NORWAY: AN EMISSIONS TRADING CASE STUDY (2015 ed.). pp. 1–11.
  3. ↑ Moe et al. (eds.), E.; Godzimirsk, Jakub M. "6: The Norwegian Energy Security Debate". The Political Economy of Renewable Energy and Energy Security (2014 ed.). Palgrave Macmillan, a division of Macmillan Publishers. {{cite book}}: |last1= has generic name (help)
  4. 1 2 3 4 "Exports of Norwegian oil and gas".
  5. ↑ Indra Overland (2018) ‘Introduction: Civil Society, Public Debate and Natural Resource Management’, in Overland, Indra. (2018). Introduction: Civil Society, Public Debate and Natural Resource Management. doi:10.1007/978-3-319-60627-9_1.
  6. 1 2 "World Energy Outlook 2018 – Analysis". 13 November 2018.
  7. 1 2 Froggatt, A., Stevens, P., Bradley, S., Canzi, E. G., & Burton, A. (2020). Expert Perspectives on Norway’s Energy Future. 98.
  8. ↑ Trakimavicius, Lukas (31 March 2023). "Protect or Perish: Europe's Subsea Lifelines". Center for European Policy Analysis. Retrieved 26 July 2023.
  9. ↑ Baten, Jörg (2016). A History of the Global Economy. From 1500 to the Present. Cambridge University Press. p. 30. ISBN 978-1-107-50718-0.
  10. ↑ Einar Lie (18 January 2017). "The History of Statoil, 1972-2022 (Project)". Department of Archaeology, Conservation and History, University of Oslo. {{cite web}}: Missing or empty |url= (help)
  11. ↑ "Statoil hemmeligholder oljeimport". Stavanger Aftenblad. Archived from the original on 25 May 2016. Retrieved 24 May 2016.
  12. ↑ Petersen, Jan (2005-03-05). "Transatlantic Efforts for Peace and Security". Speech to Carnegie Institution, Washington D.C. Minister of Foreign Affairs, Norway. Retrieved 2010-08-05. The Barents Sea also contains huge energy resources – perhaps as much as one third of the world's remaining undiscovered oil and gas resources are to be found in this area
  13. ↑ Acher, John (2005-11-16). "Norway Takes Oil Bids For Barents Sea Frontier". World Environment News Planet Ark. Archived from the original on 2011-05-20. Retrieved 2010-08-05.
  14. ↑ Krauss, Clifford; Myers, Steven Lee; Revkin; Romero, Simon (2005-10-10). "As Polar Ice Turns to Water, Dreams of Treasure Abound". New York Times. Retrieved 2010-08-05.
  15. ↑ "Wind Energy in Norway". Retrieved 17 August 2023.
  16. ↑ "Tidekraft". Archived from the original on 2008-05-16. Retrieved 2021-05-03.
  17. ↑ Penman, Danny (2003-09-22). "First power station to harness Moon opens". New Scientist. Retrieved 2018-04-23.
  18. ↑ "TenneT - Project description". Archived from the original on 2007-11-09. Retrieved 2008-07-04.
  19. ↑ "Speech to the congress of the Labour Party". Office of the Prime Minister of Norway. 2007-04-19. Retrieved 2010-06-20.
  20. ↑ "ABC News - ABC News". ABC News. Archived from the original on 2011-06-29. Retrieved 2007-04-27.
  21. 1 2 "The Norway Post : Labour Party aims for 30 % cuts in greenhouse gases". www.norwaypost.no. Archived from the original on September 29, 2007.
  22. 1 2 "Best Countries for Green Living". U.S. News. U.S. News & World Report.
  23. ↑ Energy Transition Norway 2021 (PDF) (Report). DNV. 2021.[permanent dead link]
  24. ↑ "SACS". www.sintef.no.
  25. ↑ IEA (2005). "Energy Policies of IEA Countries – Norway- 2005 Review". International Energy Agency's website. p. 208. Archived from the original on 15 June 2010. Retrieved 21 April 2010.
  26. ↑ Bruvoll, Annegrete; Bodil Merethe Larsen (2002). "Greenhouse gas emissions in Norway Do carbon taxes work?" (PDF). Statistics Norway, Research Department. p. 28. Archived (PDF) from the original on 24 November 2004. Retrieved 15 September 2011.
  27. ↑ OECD (1998). "Economic/Fiscal Instruments: Taxation (i.e., carbon/energy) Annex I Expert Group on the United Nations Framework Convention on Climate Change" (PDF). Organisation for Economic Co-operation and Development website. p. 94. Archived (PDF) from the original on 26 February 2005. Retrieved 21 April 2010.
  28. 1 2 IEA (2005). "Energy Policies of IEA Countries – Norway- 2005 Review". International Energy Agency's website. p. 204. Retrieved 4 August 2010.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  29. ↑ Sumner, J; Bird, L; Smith, H (December 2009). "Carbon Taxes: A Review of Experience and Policy Design Considerations" (PDF). National Renewable Energy Laboratory. Archived (PDF) from the original on 17 October 2011. Retrieved 6 June 2011.
  30. ↑ "Norway: An Emissions Trading Case Study" (PDF). International Emissions Trading Association. May 2015. Archived (PDF) from the original on 17 August 2016. Retrieved 14 November 2016.
  31. 1 2 "Putting a Price on Carbon With A Tax" (PDF). World Bank. Archived (PDF) from the original on 18 April 2015. Retrieved 14 November 2016.
  32. 1 2 3 4 "IEA – Norway". iea.org. Archived from the original on 15 November 2016. Retrieved 15 November 2016.
  33. ↑ "The government's revenues – Norwegianpetroleum.no – Norwegian Petroleum". Norwegian Petroleum (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 November 2016. Retrieved 15 November 2016.
  34. ↑ "Norway's Fifth National Communication under the Framework Convention on Climate Change – Status report as of December 2009" (PDF). Norwegian Ministry of the Environment. December 2009. Archived (PDF) from the original on 15 November 2016. Retrieved 14 November 2016.