Jump to content

నార్వేలో హోలోకాస్ట్

వికీపీడియా నుండి
1941లో ఓస్లోలోని దుకాణ కిటికీలపై యాంటీ సెమిటిక్ గ్రాఫిటీ . (ఈ ప్రదేశం ప్రస్తుత హెన్రిక్ ఇబ్సెన్ వీధి, క్రౌన్ ప్రిన్స్ వీధి కూడలిలో ఉంది.) ఈ చిరునామాను కొందరు "గ్లిట్నే-గార్డెన్" అని పిలుస్తారు.[1]

నార్వేపై జర్మన్ ఆక్రమణ 1940 ఏప్రిల్ 9న ప్రారంభమైంది. 1942 లో, నార్వేలో కనీసం 2,173 మంది యూదులు ఉండేవారు. వారిలో కనీసం 775 మందిని అరెస్టు చేశారు, నిర్బంధించారు, బహిష్కరించారు. జర్మనీలోని శిబిరాల్లో మరణించిన నార్వేజియన్లలో సగానికి పైగా యూదులు.[2] యుద్ధ సమయంలో 742 మంది యూదులు హత్యకు గురయ్యారు. 23 మంది యూదులు చట్టవిరుద్ధమైన ఉరిశిక్ష, హత్య, ఆత్మహత్యల ఫలితంగా మరణించారు. మొత్తం మరణించిన నార్వేజియన్ యూదుల సంఖ్య కనీసం 765 కి చేరుకుంది. ఇందులో 230 పూర్తి కుటుంబాలున్నాయి.[3]

చాలా మంది యూదులు నార్వే నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది తప్పించుకున్నారు. వీరిలో, దాదాపు 900 మంది యూదులను నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమం దేశం నుండి అక్రమంగా రవాణా చేసింది. ఎక్కువగా స్వీడన్‌కు, కొంతమంది యునైటెడ్ కింగ్‌డమ్‌కు కూడా వెళ్ళిపోయారు.[4] బహిష్కరించబడిన వారిలో 28 నుండి 34 మంది [5] శిబిరాల్లో జైలు శిక్ష అయ్యేవరకు జీవించే ఉన్నారు. (వీరిలో) దాదాపు 25 మంది యుద్ధం తర్వాత నార్వేకు తిరిగి వచ్చారు. [4] స్వీడన్‌కు పారిపోయిన దాదాపు 800 మంది నార్వేజియన్ యూదులు యుద్ధం తర్వాత తిరిగి వచ్చారు.

నేపథ్యం

[మార్చు]
యూదు ప్రపంచంలో ఎవరెవరున్నారు. నార్వేలోని యూదులను, అనుమానిత యూదులనూ జాబితా చేసే యాంటీ సెమిటిక్ పత్రికకు ఇది అనుబంధంగా వెలువడింది. మొదటి ఎడిషన్ 1925 లో ముద్రించబడింది.

20 వ శతాబ్దం ప్రారంభం వరకు నార్వేలో యూదు జనాభా చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలో రష్యా, బాల్టిక్ దేశాలలో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా నార్వేతో సహా ఇతర దేశాలలో యూదులు ఆశ్రయం పొందారు. 1930 లలో జర్మనీ లోను, జర్మన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోనూ యూదులు నాజీల హింస నుండి తప్పించుకు పారిపోయినప్పుడు మరొక వలస ఉప్పెన వచ్చింది. నీల్స్ క్రిస్టియన్ డిట్లెఫ్ అనే నార్వే దౌత్యవేత్త, 1930 ల చివరలో పోలాండ్‌లోని వార్సాలో నియమితుడయ్యాడు. 1939 వసంతకాలంలో, అతను చెకోస్లోవేకియా నుండి వచ్చిన యూదు శరణార్థుల కోసం వార్సాలో ఒక రవాణా స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. నాన్సెన్‌జెల్పెన్ అనే సంస్థ స్పాన్సర్‌షిప్ ద్వారా వారిని అక్కడికి పంపాడు. డిట్లెఫ్, ఆ శరణార్థులకు ఆహారం, దుస్తులు అందించి, పోలాండ్‌లోని గ్డినియాకు వెళ్ళేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాడు. అక్కడ వారు నార్వేకు వెళ్లే ఓడల్లో ఎక్కారు. [6] నాన్సెన్‌జెల్పెన్ అనేది 1936లో ఆడ్ నాన్సెన్ స్థాపించిన ఒక నార్వేజియన్ మానవతా సంస్థ. ఇది నాజీ నియంత్రణలో ఉన్న యూరప్ ప్రాంతాల నుండి వచ్చే యూదు శరణార్థులకు నార్వేలో సురక్షితమైన వసతి కల్పించి సహాయం అందించడానికి ఏర్పరచిన సంస్థ. నార్వేలో కల్పించిన ఆ ఆస్రమం, స్వల్పకాలికమే అయింది.

1940 ఏప్రిల్ 9 న నార్వేపై జర్మనీ దండయాత్ర, ఆక్రమణ ప్రారంభమైంది. 1940 జూన్ 7న దండయాత్ర పూర్తి కాకముందే, 1940 ఏప్రిల్ 24 న, జోసెఫ్ టెర్బోవెన్‌ను నార్వేకు రీచ్‌స్కోమిస్సార్‌గా నియమించారు. చట్టబద్ధమైన నార్వేజియన్ ప్రభుత్వం దేశం విడిచి పోయింది. టెర్బోవెన్ ఆధ్వర్యంలోని జర్మన్ ఆక్రమణ అధికారులు నార్వేజియన్ పౌర అధికారులను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఇందులో జిల్లా షెరీఫ్‌లు (లెన్స్‌మన్‌సెటాటెన్), క్రిమినల్ పోలీసులు, ఆర్డర్ పోలీసులతో సహా నార్వేజియన్ పోలీసుల యొక్క వివిధ శాఖలు ఉన్నాయి. SD, గెస్టపోతో సహా నాజీ పోలీసు శాఖలు కూడా నార్వేజియన్ ప్రజలను అణచివేసే నెట్‌వర్క్‌లో భాగమయ్యాయి. [7] ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగా, నార్వేజియన్ జనాభాను లొంగదీసుకోవడానికి జర్మన్ అధికారులను కాకుండా నార్వేజియన్ అధికారులనే ఉపయోగించాలని టెర్బోవెన్ ప్రభుత్వం ప్రయత్నించింది. జర్మన్ పోలీసులు, పారామిలిటరీ దళాలు రీచ్ సెక్యూరిటీ మెయిన్ ఆఫీస్ చైన్ ఆఫ్ కమాండ్ ద్వారా, నార్వేజియన్ పోలీసులు అధికారికంగా కొత్తగా ఏర్పడిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు లోబడి పనిచేసినప్పటికీ, వాస్తవానికి నార్వేజియన్ పోలీసు అధికారులు జర్మన్ RSHA నుండే ఆదేశాలు తీసుకునేవారు.

యూరప్‌లో సాధారణంగా కనిపించే యూదుల పట్ల పక్షపాతం 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో నార్వేలో కూడా స్పష్టంగా కనిపించింది. నార్వేలోని నాజీ పార్టీ అయిన నాస్జోనల్ సామ్లింగ్ (NS) 1930లలో యూదు వ్యతిరేకతను దాని రాజకీయ వేదికలో భాగంగా చేసుకుంది. యూదులకు వ్యతిరేకంగా పెరుగుతున్న విపరీతమైన ప్రచారానికి హాల్డిస్ నీగార్డ్ ఓస్ట్‌బై ప్రతినిధి అయింది. ఆమె రాసిన 1938 నాటి పుస్తకం జోడ్‌ప్రాబ్లమెట్ ఓగ్ డెట్స్ లోస్నింగ్ (యూదుల సమస్య దాని పరిష్కారం) లో దీని గురించి రాసింది. యుద్ధం ప్రారంభానికి ముందే NS, నార్వేజియన్ యూదుల గురించిన సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది, ప్రధాన స్రవంతి పత్రికలలో అప్పుడప్పుడు సెమిటిక్ వ్యతిరేక కథనాలు ప్రచురించబడేవి.

సన్నాహాలు

[మార్చు]
వాన్సీ సమావేశంలో సమర్పించబడిన యూదుల సంఖ్య అంచనా, ఇది నార్వేలో యూదుల సంఖ్యను 1,300 గా తప్పుగా అంచనా వేసింది.

నాస్జోనల్ సామ్లింగ్ (NS) నార్వేలో యూదులను గుర్తించడానికి, అధికారులు పోలీసులు, టెలిగ్రాఫ్ సేవల నుండి వచ్చిన సమాచారంపై ఆధారపడింది. ఓస్లో, ట్రోండ్‌హీమ్‌లోని సినగోగ్‌లను వాటి సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, వృత్తి, చిరునామాతో సహా పూర్తి జాబితాను సమర్పించాలని ఆదేశించారు. యూదు శ్మశాన సంఘాలు, యువజన సంఘాలను కూడా తమ జాబితాలను తయారు చేయాలని ఆదేశించారు.

ఆగస్టులో, సినగాగ్‌లలో సభ్యులు కాని యూదుల జాబితాలను కూడా తయారు చేయాలని వాటిని ఆదేశించారు. ఆ విధంగా తయారైన జాబితాలను నాస్జోనల్ సామ్లింగ్ గతంలో సంకలనం చేసిన సమాచారంతో, నార్వేజియన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన సమాచారంతో పోల్చి చూసారు. ఇదంతా అయ్యేసరికి, నార్వేలోని ఆక్రమణ అధికారుల దగ్గర, నాజీ పాలనలో ఉన్న ఇతర దేశాల కంటే నార్వేలోనే యూదుల పూర్తి జాబితా ఉంది.[7]

వసంతకాలంలో సంకలనం చేయబడిన జాబితాల ఆధారంగా, న్యాయ శాఖ, కౌంటీ గవర్నర్లు వాణిజ్య హోల్డింగ్‌లతో సహా అన్ని యూదు ఆస్తులను నమోదు చేయడం శరదృతువులో ప్రారంభించారు. 1941 డిసెంబరులో పూర్తి జాబితాను పోలీసు విభాగానికి పంపించారు. ఇందులో యూదు నేపథ్యం ఉన్నట్లు అనుమానించబడిన వ్యక్తులు కూడా ఉన్నారు.

ఆక్రమణ ప్రారంభ నెలల్లోనే అనేక మంది నార్వేజియన్ యూదులను అరెస్టు చేసి రాజకీయ ఖైదీలుగా బహిష్కరించినప్పటికీ, యూదులందరినీ లక్ష్యంగా చేసుకున్న మొదటి చర్య 1941 మే 10 న జరిగింది. ఆ రోజున ఓస్లో పోలీసులు, నగరంలోని యూదులందరి నుండి రేడియోలను జప్తు చేయాలని టెర్బోవెన్ ద్వారా జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక షెరీఫ్‌లకు ఆ ఆదేశాలు వచ్చాయి.

1941 డిసెంబరు 20 న నార్వేజియన్ పోలీస్ డిపార్ట్‌మెంటు 2 సెం.మీ పొడవుతో "J" అని ముద్రించి ఉన్న 700 స్టాంపులను ఆర్డర్ చేసింది. నార్వేలోని యూదుల గుర్తింపు కార్డులపై ముద్ర వేయడానికి అధికారులు వీటిని ఉపయోగించాలి. 1942 జనవరి 10న వీటిని వినియోగంలోకి తెచ్చారు. నార్వేజియన్ యూదులందరూ వెంటనే తమ గుర్తింపు పత్రాలను ముద్రించడానికి స్థానిక పోలీసు స్టేషన్లలో హాజరు కావాలని ప్రధాన స్రవంతి పత్రికలలో ప్రకటనల ద్వారా ఆదేశించారు. వారికి ఒక విస్తృతమైన ఫారమ్‌ను పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం యూదుకు నిర్వచనం ఇలా ఇచ్చారు - కనీసం ముగ్గురు "పూర్తి-యూదు" తాతామామ్మలు ఉన్న ఎవరైనా; ఇద్దరు "పూర్తి-యూదు" తాతామామలు ఉండి, యూదుని వివాహం చేసుకున్న ఎవరైనా; యూదు సమాజంలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా యూదు అవుతారు. ఈ నమోదు ప్రకారం నార్వేలో దాదాపు 1,400 మంది యూదు వయోజనులు నివసిస్తున్నారు.

రచయిత హల్వోర్ హెగ్తున్ ప్రకారం, "యూదుల బహిష్కరణలో నార్వేజియన్ స్టేట్ రైల్వేస్ ఎటువంటి నిరసన లేకుండా సహాయం చేసింది". [8]

1942 లో నార్వేలో 2,173 మంది యూదులు ఉన్నారు. వీరిలో 1,643 మంది నార్వేజియన్ పౌరులు, 240 మంది విదేశీ పౌరులు, 290 మంది ఏ దేశానికీ చెందనివారు అని అంచనా వేసారు.[9]

ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ వెబ్‌సైట్‌లోని ఒక వ్యాసం ప్రకారం, విడ్కున్ క్విస్లింగ్ "నార్వేజియన్ సామీని నార్వేజియన్ జాతి కంటే తక్కువ అని భావించినందున వారిని నిర్మూలించడానికి" ప్రణాళిక వేసాడు.

అరెస్టులు, జప్తు

[మార్చు]
స్టాబెక్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు పిల్లలను వారి తరగతి గదుల నుండి బయటకు తీసుకెళ్లి ఆష్విట్జ్‌కు పంపారు. వారి స్మారక ఫలకం

1941లో జర్మన్, నార్వేజియన్ పోలీసు అధికారులు ఇద్దరూ యూదు జనాభాను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ట్రోండ్‌హీమ్‌కు ఉత్తరాన ఉన్న లెవాంజర్ సమీపంలో ఫాల్‌స్టాడ్ నిర్బంధ శిబిరం స్థాపించారు. అరెస్టైన యూదులు ఆటోమాటిగ్గా పౌరసత్వాన్ని కోల్పోతారు.[10] ఆపరేషన్ బార్బరోస్సాకు సంబంధించి యూదు వ్యక్తులు, ముఖ్యంగా దేశం లేని వారిని కొంతకాలం నిర్బంధించారు. బహిష్కరించబడిన మొదటి యూదు నార్వేజియన్ బెంజమిన్ బిల్డ్. అతను కార్మిక సంఘం కార్యకర్త, విధ్వంసానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెకానిక్. అతను గ్రాస్ రోసెన్‌లో మరణించాడు. [11] మోరిట్జ్ రాబినోవిట్జ్, బహుశా 1941 మార్చిలో హౌగెసుండ్ ప్రెస్‌లో నాజీ యూదు వ్యతిరేకతకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు అరెస్టు చేయబడిన మొదటి వ్యక్తి కావచ్చు. అతన్ని సచ్సెన్‌హౌసెన్ నిర్బంధ శిబిరానికి పంపారు, అక్కడ 1942 డిసెంబరు 27న అతన్ని కొట్టి చంపారు.[12]

జర్మన్ దళాలు 1941 ఏప్రిల్ 21న ట్రోండ్‌హీమ్ సినగోగ్‌ను ఆక్రమించి ధ్వంసం చేశాయి. యుద్ధం ప్రారంభ రోజుల్లోనే టోరా స్క్రోల్స్‌ను భద్రపరచారు. త్వరలోనే ట్రోండ్‌హీమ్‌లోని మెథడిస్ట్ చర్చి యూదుల మత సేవలకు తాత్కాలిక సౌకర్యాలను కల్పించింది. ట్రోండ్‌హీమ్‌లోని అనేక మంది యూదు నివాసితులను అరెస్టు చేసి ఫాల్‌స్టాడ్‌లో నిర్బంధించారు. అలాంటి మొదటి ఖైదీ ఎఫ్రాయిమ్ కొరిట్జిన్స్కీ. అతను ఒక వైద్యుడు, ట్రోండ్‌హీమ్ ఆసుపత్రికి అధిపతి. [13] ఆ తరువాత అనేక మందిని అరెస్టు చేసారు. వీరిలో ఎనిమిది మందిని శిబిరం వెలుపల ఉన్న అడవుల్లో కాల్చి చంపారు. ఇది నార్వేలో చట్టవిరుద్ధమైన మరణశిక్షలకు అపఖ్యాతి పాలైన ప్రదేశంగా మారింది [14] 1942 ఫిబ్రవరి 24 న ట్రోండ్‌హీమ్‌లో మిగిలిన యూదు ఆస్తులన్నింటినీ నాజీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. [15]

మొదటి కాన్సంట్రేషన్ క్యాంప్ ఏర్పాటు తర్వాత

[మార్చు]

1941 జూన్ 18 న 13 మంది మగ యూదులను (కార్మికులుగా పనిచేయడానికి తగిన వయస్సు గలవారుగా వారిని పరిగణించారు) ట్రోమ్సో, నార్విక్‌లలో అరెస్టు చేసి, ఆ తర్వాత సిడ్స్‌పిస్సెన్ (నార్వేలోని మొదటి నిర్బంధ శిబిరం) వద్ద ఖైదు చేశారు.

1942 శరదృతువు నాటికి, దాదాపు 150 మంది యూదులు నార్వే నుండి పారిపోయారు.

టెలావాగ్‌లోని దారుణాలు, 1942లో ట్రోండ్‌హీమ్‌లో మార్షల్ లా మొదలైన వాటి ద్వారా టెర్బోవెన్ పాలన యొక్క క్రూరత్వం వెలుగులోకి రావడంతో, ముఖ్యంగా యూదులపై హింస మరింత స్పష్టంగా కనిపించింది.

వ్యక్తులపై అనేక వేధింపులు, హింస కేసుల తర్వాత, 15 ఏళ్లు పైబడిన యూదు పురుషులందరినీ అరెస్టు చేసి, వారి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని 1942 అక్టోబరు 24, 25 తేదీలలో నార్వేజియన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబరు 26 న అనేక నార్వేజియన్ పోలీసు శాఖలు, జర్మానిక్-SS యొక్క 20 మంది సైనికులు యూదు పురుషులను చుట్టుముట్టి అరెస్టు చేశారు. వారి భార్యలను, పిల్లలనూ వీధిలో వదిలివేసేవారు. ఈ ఖైదీలను ప్రధానంగా దక్షిణ నార్వేలోని బెర్గ్ కాన్సంట్రేషన్ క్యాంప్, దేశంలోని మధ్య ప్రాంతాలలోని ఫాల్‌స్టాడ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఉంచారు; కొంతమందిని స్థానిక జైళ్లలో ఉంచారు. యూదు మహిళలు ప్రతిరోజూ తమ స్థానిక షెరీఫ్‌ల వద్ద హాజర్య్రు కావాలని ఆదేశించారు.

నవంబరు 26 ఉదయం, జర్మన్ సైనికులు, 300 మందికి పైగా నార్వేజియన్ అధికారులు ( స్టాట్స్‌పోలిటియెట్, క్రిమినల్‌పోలిటియెట్, హిర్డెన్, జర్మన్‌స్కే ఎస్ఎస్-నార్జ్‌లకు చెందినవారు) [16] యూదు స్త్రీలను, పిల్లలనూ అరెస్టు చేసి నిర్బంధించడానికి మోహరించారు. వీటిని కార్లు ,రైలు ద్వారా ఓస్లోలోని ఓర్‌కు పంపారు, అక్కడ SS <i id="mw6Q">డోనౌ</i> అనే కార్గో షిప్ వాటిని స్టెట్టిన్‌కు, అక్కడి నుండి ఆష్విట్జ్‌కూ రవాణా చేయడానికి వేచి ఉంది.[17]

నవంబరు 27 నాటికి, నార్వేలోని అందరు యూదులు (ఒకరు [18] తప్ప) బహిష్కరించబడ్డమో, హత్య చేయబడ్డమో, జైలు పాలవడమో స్వీడన్‌కు పారిపోవడమో లేదా నార్వేలోనే దాక్కోవడమో జరిగింది.

యుద్ధం ముగిసే వరకు దాదాపు 70 మంది [19] యూదులు బెర్గ్ నిర్బంధ శిబిరంలో ఖైదు చేయబడ్డారు, ఎందుకంటే వారు "ఆర్యన్లను" వివాహం చేసుకున్నారు. [20]

బహిష్కరణ, సామూహిక హత్యలు

[మార్చు]
  • నార్వే నుండి యూదుల మొదటి బహిష్కరణ 1942 నవంబరు 19 న జరిగింది. <i id="mwAQQ">మోంటే రోసా</i> అనే ఓడ ఓస్లో నుండి 21 మందితో బయలుదేరింది.  మొత్తం 223 మందిని బహిష్కరించగా వారిలో (లేదా ఖైదీలలో) 21 మంది యూదులు
  • నార్వేలో మిగిలిన యూదులందరినీ 1942 నవంబరు 26న SS డోనౌ అనే ఒకే కార్గో షిప్‌లో రవాణా చెయ్యాలనేది అసలు ప్రణాళిక. కానీ ఆ రోజు 532 [16] ఖైదీలు మాత్రమే SS డోనౌలో ఎక్కారు; అదే రోజు, MS మోంటే రోసా 26 మంది యూదులను తీసుకెళ్లింది. డోనౌ నవంబరు 30న స్టెట్టిన్‌ చేరింది. ఖైదీలు బ్రెస్లావర్ బాన్‌హోఫ్ వద్ద కార్గో రైళ్లలో ఒక్కో బోగీలో 60 మంది ఎక్కి సాయంత్రం 5:12 గంటలకు స్టెట్టిన్ నుండి బయలుదేరారు. ఆష్విట్జ్‌కు రైలు ప్రయాణం 28 గంటలు పట్టింది. ఖైదీలందరూ సజీవంగా శిబిరానికి చేరుకున్నారు. అక్కడ వారిని రెండు వరసల్లో నిలబెట్టారు. 186 మందిని బిర్కెనౌ సబ్‌క్యాంపుకు బానిసలుగా పంపారు. మిగిలిన 345 మందిని ఆష్విట్జ్ గ్యాస్ చాంబర్‌లలో (గంటల్లోనే) చంపారు.[17]
  • నవంబరు 26న డోనౌ నౌకలో ఎక్కి ఓస్లోకు వెళ్ళాల్సిన మిగతా యూదు ఖైదీలు ఆ రోజున్రా అ వడం ఆలస్యం అయింది. బహుశా రెడ్ క్రాస్ వలన, సానుభూతిపరులైన రైల్వే కార్మికుల వ్యూహాల జాప్యం వలనా కావచ్చు. వీరిని తరువాతి రవాణా కోసం వేచి ఉండటానికి ఓస్లోలోని బ్రెడ్‌వీట్ నిర్బంధ శిబిరంలో కఠినమైన పరిస్థితులలో ఖైదు చేశారు.
  • 1943 ఫిబ్రవరి 24 న బ్రెడ్‌వీట్ లోని ఖైదీలు, గ్రిని నుండి 25 మందితో కలిసి, ఓస్లోలో <i id="mwASE">గోటెన్‌ల్యాండ్‌ ఓడలో</i> మొత్తం 158 మంది ఎక్కారు. ఓడ మరుసటి రోజు బయలుదేరి, స్టెట్టిన్‌లో ఆగింది. ఫిబ్రవరి 27న వారు అక్కడికి చేరుకున్నారు. వారు బెర్లిన్ ద్వారా ఆష్విట్జ్‌కు ప్రయాణించి, అక్కడ లెవెట్జోస్ట్రాస్సే సినగోగ్‌లో రాత్రి బస చేశారు. వారు మార్చి 2, మార్చి 3 మధ్య రాత్రి ఆష్విట్జ్‌కు చేరుకున్నారు. నార్వే నుండి వచ్చిన 158 మందిలో, 26 లేదా 28 మంది మాత్రమే మొదటి రోజు ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళను ఆష్విట్జ్‌లోని మోనోవిట్జ్ సబ్‌క్యాంప్‌కు పంపారు.[17]

గోటెన్‌ల్యాండ్ సముద్రయానం తరువాత, బహిష్కరణలు కాస్త తక్కువ స్థాయిలో జరిగాయి. వ్యక్తిగత బహిష్కరణలు జరిగాయి. యుద్ధ సమయంలో నార్వేలోని శిబిరాల్లో కొద్ది మంది యూదు ఖైదీలు మిగిలారు. వీళ్ళు ప్రధానంగా యూదేతర నార్వేజియన్లను వివాహం చేసుకున్న వారు. వీళ్ళపై జల్లో దుశ్చర్యలు చేసారు. ఉదాహరణకు, గ్రినిలోని శిబిరంలో, అత్యంత కఠినంగా వ్యవహరించబడిన సమూహాల్లో హింసాత్మక నేరస్థులు, యూదులు ఉన్నారు.[17]

మొత్తం మీద, నార్వే నుండి దాదాపు 767 మంది యూదులను బహిష్కరించి జర్మన్ నిర్బంధ శిబిరాలకు - ప్రధానంగా ఆష్విట్జ్‌కు - పంపారు. వీరిలో 26 మంది ఆ నరకం నుండి బయటపడ్డారు. శిబిరాల్లో హత్యకు గురైన 741 మందితో పాటు, యుద్ధ సమయంలో చట్టం ద్వారా అమలు చేసిన ఉరిశిక్ష, హత్య, ఆత్మహత్యల ఫలితంగా 23 మంది మరణించారు; మొత్తం నార్వేజియన్ యూదుల మరణాల సంఖ్య కనీసం 764కి చేరుకుంది. ఇందులో 230 పూర్తి కుటుంబాలు ఉన్నాయి. మరణించిన వారిలో 346 మందిని 1942 డిసెంబరు 1 ఒక్క రోజునే హత్య చేసారు. ఆ రోజు అత్యధిక మరణాలు సంభవించిన రోజుగా నిలిచింది.

యూదులను చుట్టుముట్టడం, బహిష్కరించడం గురించి (ముందుగానే) తెలిసిన వ్యక్తులు

[మార్చు]

స్టాట్స్‌పోలిటియెట్ (STAPO) అధిపతి కార్ల్ మార్థిన్సెన్ 1942 నవంబరు 17 నాటి ఒక మెమోలో, [తన వైపు నుండి తగినంత సన్నాహాలు] చేయడానికి సమయం చాలా తక్కువగా ఉందనీ, [యూదులను బహిష్కరించడానికి] ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో అన్ని వారాల సమయం సన్నాహాల కోసం తనకు కావాలనీ రాశాడు. దీనికి విరుద్ధంగా, గున్నార్ సాన్‌స్టెబీ [ఒకసారి, 1970లో] నార్వే నుండి బహిష్కరణల గురించి తనకు మూడు నెలల ముందుగానే తెలిసిందని పేర్కొన్నాడు; అతని వాదనపై సందేహాలలో టోర్ ప్రైజర్ వంటి చరిత్రకారుల అభిప్రాయాలు ఉన్నాయి, "నా దృష్టిలో, సాన్‌స్టెబీ అబద్ధాలు చెబుతున్నాడు. అతను తనకు వాస్తవంగా తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. సాన్‌స్టెబీని ఒక దైవవాదిగా పరిగణించారు, కనీసం ప్రెస్ [కార్ప్స్] కూడా కాదు". [21]

స్వీడన్‌కు పారిపోవడం

[మార్చు]
యూదు శరణార్థులు ఉపయోగించే బ్యాక్‌ప్యాక్, స్వీడన్‌కు సరిహద్దు క్రాసింగ్ వద్ద గేటు అవశేషాల వద్ద ఉంచబడింది.

ప్రవాసంలో ఉన్న నార్వేజియన్ ప్రభుత్వంపై, మిలోర్గ్ పై విమర్శలు

[మార్చు]

ఖండాంతర ఐరోపాలో యూదులకు ఏమి జరుగుతుందో ట్రిగ్వే లైకి 1942 జూన్‌లోనే తెలుసు కాబట్టి, బహిష్కరణలో ఉన్న నార్వేజియన్ ప్రభుత్వం యూదులను హెచ్చరించి (వారిని పారిపోవాలని చెప్పి) ఉండాల్సిందని కొందరు అన్నారు. మరికొందరు [22] "పోలాండ్ నుండి వచ్చిన వార్తలను బ్రిటిషర్లు, అమెరికన్లే నమ్మనప్పుడు లై నుండి ఏమి ఆశించవచ్చు? ఈ దారుణాలు జరిగాయని నార్వేలో కూడా నమ్మడం కష్టమే" అని అన్నారు.

నార్వేలో జర్మను దురాక్రమణను ఎదుర్కొన్న సంఘర్షణ సమూహమైన మిలోర్గ్, యూదులకు చేసినది ఏమీ లేదని కొందరు అన్నారు. మరికొందరు " కార్ల్ ఫ్రెడ్రిక్సెన్స్ ట్రాన్స్‌పోర్ట్ అనే గొప్ప రెస్క్యూ ఆపరేషన్ మిలోర్గ్ యొక్క టిల్‌బాకెట్రుకెట్ నాయకుడైన ఓలే బెర్గ్ ఆదేశాల ఫలితంగానే జరిగింది, ఆ తరువాత సివోర్గ్ నిధులు సమకూర్చాడు" అని అంటున్నారు.

2014లో జాన్ ఒట్టో జోహన్సెన్ మాట్లాడుతూ, "లండన్‌లోని [బహిష్కరణలో ఉన్న] నార్వేజియన్ క్యాబినెట్, మిలోర్గ్ నాయకత్వం, అలాగే నార్వేజియన్ సమాజంలోని పెద్ద భాగాలు యూదుల గురించి ప్రత్యేకంగా పట్టించుకోలేదు. దీని గురించి సీరియస్ చరిత్రకారులలో ఏకాభిప్రాయం ఉంది. - సామ్యూల్ అబ్రహాంసెన్ రాసిన నార్వేస్ రెస్పాన్స్ టు హోలోకాస్ట్ పుస్తకాన్ని చదవండి. నేను అతనితో దగ్గరగా పనిచేసాను. లండన్‌లోని [నార్వేజియన్] క్యాబినెట్-, మిలోర్గ్స్- నార్వేజియన్ సమాజం యూదుల పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉన్నాయనే విషయాన్ని సందేహించకూడదని, అతని ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేశారో నాకు తెలుసు." అని అన్నారు. [23] ఎలిస్ బారింగ్ బెర్గ్రెన్ [చరిత్ర విద్యార్థిని], చరిత్రకారులు బ్జార్టే బ్రూలాండ్, మాట్స్ టాంగెస్టూయెన్ రాసిన 2020 పుస్తకం ప్రకారం [నార్వేలో] రెసిస్టెన్స్ గ్రూపులలో యూదు వ్యతిరేకత ఉంది.[24]

ప్రభుత్వ రైల్వేల పాత్ర

[మార్చు]

"నార్వేజియన్ స్టేట్ రైల్వేలు యూదులను ఓస్లో నౌకాశ్రయం నుండి బయటికి రవాణా చేశాయి. యూదులకు ఏమి జరుగుతుందో NSB ఉద్యోగులకు తెలియదని బ్జోర్న్ వెస్ట్లీ చెప్పాడు. రైలు ఓస్లో నౌకాశ్రయానికి వెళ్లినందున యూదులను బలవంతంగా దేశం నుండి బయటకు పంపిస్తారని వారు సహజంగానే అర్థం చేసుకున్నారు".[25] ఇంకా, వెస్ట్లీ "NSB నాయకత్వం జర్మన్‌లతో సహకరించినప్పుడు NSB ఉద్యోగులు ఎదుర్కొన్న సందిగ్ధతలను" ఎత్తి చూపారు.[25]

ఆ తరువాత నార్వేజియన్ యూదుల నిర్మూలన గురించి తరువాత వెస్ట్లీ ఇలా అన్నాడు: "NSB ది సహ-బాధ్యత కాకపోతే ఇంకేంటి? నా వరకు, NSB యుద్ధ ఖైదీలను ఉపయోగించడం, ఈ యూదుల బహిష్కరణను ఒకటే: అంటే, నాజీయిజంకు ప్రధాన శత్రువులైన ఈ రెండు సమూహాలపై హిట్లర్ చేసిన హింసలో NSB ఒక ఏజెన్సీగా మారింది. యుద్ధం తర్వాత సంబంధిత NSB నాయకులు అవార్డులు అందుకున్న వాస్తవం, NSB, ఇతరుల దీనిని దాచాలనే కోరికను దీనికి ఋజువులు."[25]

యుద్ధం తర్వాత ఆ సంస్థలపై [NSB పై] ఎటువంటి దర్యాప్తు జరగలేదు.[26] అయితే, మాజీ చీఫ్ విక్ "మళ్ళీ NSB కోసం పని చేయకపోతే" అతనిపై విచారణ జరపకూడదని తేల్చారు.[27]

ప్రతిచర్యలు

[మార్చు]

బహిష్కరణలకు ముందు

[మార్చు]

[కనీసం ఒక నార్వేజియన్] సోగ్నెప్రెస్ట్ (సుమారుగా చర్చిలో పూజారికి సమానం), రెసిస్టెన్స్ సభ్యుడు, తన ప్రసంగాల సమయంలో యూదుల కోసం ప్రార్థనలు చేసాడని, NS సభ్యుడు నాజీ ప్రభుత్వానికి నివేదిక పంపాడు. దాని ప్రకారం; పూజారిని 1942 ఏప్రిల్‌లో గెస్టాపో అరెస్టు చేసి, గ్రిని కాన్సంట్రేషన్ క్యాంప్‌కు పంపి, అతని ఉద్యోగం నుండి తొలగించి, ఒప్లాండ్ కౌంటీలో ఉండకుండా నిషేధించారు.

నవంబరులో (బహిష్కరణలు ప్రారంభానికి ముందు), నార్వే చర్చి యొక్క తాత్కాలిక నాయకత్వం, నిరసన లేఖను జారీ చేసింది: హెబ్రీర్-బ్రెవెట్ . [28]

బహిష్కరించబడిన యూదు నార్వేజియన్ల తిరిగి రాకకు ఆర్థిక సహాయం చేయడానికి నిరాకరించడం

[మార్చు]

"బయటపడిన ఖైదీలను తీసుకురావడానికి బస్సులు [స్కాండినేవియా నుండి దక్షిణం వైపు] వెళ్ళినప్పుడు, యూదులను ఆ బస్సుల్లో ఎక్కేందుకు అనుమతించలేదు. ఎందుకంటే వారిని నార్వేజియన్ పౌరులుగా పరిగణించలేదు. మే 8 [1945] తర్వాత ప్రభుత్వం వారు స్వగృహాలకు వెళ్ళేందుకు దారి ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా నిరాకరించింది.", చరిత్రకారుడు కెర్స్టి డైబ్విగ్ ప్రకారం.[29]

ఐదుగురు బతికి బైటపడిన వారు చేసిన ప్రకటన

[మార్చు]

ఆష్విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంప్ నుండి బయటపడిన 5 గురు యూదులు సంతకం చేసిన 1945 మే 30 నాటి డాగ్‌బ్లాడెట్‌లో వేసిన ఒక వార్తలో, కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఖైదు చేయబడిన నార్వేజియన్ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు: "[...] ఈ నిజమైన కామ్రేడ్లు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, నేడు మేం మళ్ళీ నార్వేలో స్వేచ్ఛగా నిలబడగలిగేలా మాకు సహాయం చేశారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు".[30]

వారసత్వం

[మార్చు]

విద్య, స్మారకం

[మార్చు]

2002 నుండి నార్వే, జనవరి 27న అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2003లో నార్వే ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ అలయన్స్ (IHRA)లో సభ్యురాలిగా చేరింది. 2009లో దానికి అధ్యక్షత వహించింది.[31]

స్మారక చిహ్నాలు

[మార్చు]
బహిష్కరణలు జరిగిన ఓస్లోలోని ఓర్ సమీపంలోని ఓర్ యొక్క దృశ్యం. ముందుభాగంలో ఉన్న హోలోకాస్ట్ స్మారక చిహ్నాన్ని 2012 లో ఆవిష్కరించారు. (అతిపెద్ద బహిష్కరణ జరిగిన 67 సంవత్సరాల తర్వాత, 2009 నవంబరు 26 న తీసిన ఫోటో)

బ్రాటిస్లావా నుండి వచ్చి నెస్జెస్ట్రాండాలో నివసిస్తున్న ఇద్దరు బాల శరణార్థులు, నార్వే నుండి బహిష్కరించబడ్డారు - వారి గౌరవార్థం 1946 సెప్టెంబరు 14న వీయ్ చర్చి సమీపంలోని ఒక ఏకశిల (మిన్నెస్టీన్ ) వద్ద జ్ఞాపకార్థం గౌరవించబడ్డారు.

నార్వేలోని మరొక హోలోకాస్ట్ సంబంధిత స్మారక చిహ్నాన్ని 1947లో ట్రోండ్‌హీమ్‌లో నిర్మించారు. [31] తరువాత ఇతర స్మారక చిహ్నాలు వచ్చాయి. హౌగెసుండ్‌లో మోరిట్జ్ రాబినోవిట్జ్ జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం ఎస్ఎస్ డోనౌ ప్రయాణించిన ఓస్లోలోని ఓడరేవు వద్ద నిర్మించబడింది; క్రిస్టియన్‌సుండ్‌లోని ఫాల్‌స్టాడ్ వద్ద; ట్రోండ్‌హీమ్‌లో ( సిస్సీ క్లీన్ మీదుగా); పాఠశాలల్లో కూడా అవగాహన పెంచారు. బహిష్కరణకు ముందు హోలోకాస్ట్ బాధితులు నివసించిన అపార్ట్‌మెంట్ల వెలుపల ఉన్న అనేక నార్వేజియన్ వీధుల్లో స్నుబుల్‌స్టైనర్ ("అడ్డుపడే రాళ్ళు") ఉంచారు.

"సైట్ ఆఫ్ రిమెంబరెన్స్" అనేది 2022లో అకెర్షుస్కియాలో ఖాళీ కుర్చీల ఆకారంలో ఆంటోనీ గోర్మ్లీ నిర్మించిన రక్షిత స్మారక చిహ్నం.[32]

ఓస్లోలోని కార్ల్ బెర్నర్స్ ప్లాస్ సమీపంలోని " డెట్టే ఎర్ ఎట్ ఫింట్ స్టెడ్ " ["ఇది మంచి ప్రదేశం"] అనే పార్క్ అని పిలువబడే ఒక చిన్న ప్రాంతంలో హోలోకాస్ట్ స్మారక చిహ్నం ఉంది. [33]

ఓస్లోలోని " డెట్టే ఎర్ ఎట్ ఫింట్ స్టెడ్ " ["ఇది మంచి ప్రదేశం"] అనే చిన్న ప్రాంతంలో హోలోకాస్ట్ స్మారక చిహ్నం ఉంది. (2017 నాటి ఫోటో)

క్షమాపణ, విచారం

[మార్చు]

2012లో అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే నాడు, నార్వే ప్రధాన మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, బహిష్కరణలలో నార్వే పోలీసులు పోషించిన పాత్రకు గాను అధికారికంగా క్షమాపణలు చెప్పాడు.[34] 1942 నవంబరు 26న నాజీ శిబిరాలకు వెళ్లే SS డోనౌ అనే కార్గో షిప్‌లో 532 మంది యూదులు ఎక్కిన, రాజధాని ఓస్లోలోని రేవు దగ్గర స్టోల్టెన్‌బర్గ్ తన ప్రసంగం చేశాడు. స్టోల్టెన్‌బర్గ్ ఇలా అన్నాడు:

 

1942 నవంబర్ 26 గురువారం నాడు నార్వేకు హోలోకాస్ట్ వచ్చింది. ఆ రోజు అరెస్టు చేయబడిన అనేక మందిలో రూత్ మేయర్ ఒకరు. [...] రూత్ మేయర్ చివరిసారిగా [ఆమె బస చేసిన బోర్డింగ్ హౌస్ వెలుపల] ఇద్దరు పెద్ద నార్వేజియన్ పోలీసులు అమెను ఓ నల్ల ట్రక్కులోకి బలవంతంగా ఎక్కిస్తుండగా కనిపించింది. ఐదు రోజుల తరువాత 22 ఏళ్ల ఆ యువతి చనిపోయింది. ఆష్విట్జ్‌లోని గ్యాస్ చాంబర్‌లో హత్య చేయబడింది. మానవులుగా పుట్టాం కాబట్టి, అదృష్టవశాత్తూ మనం మన తప్పుల నుండి నేర్చుకోగలం. ఆ అవకాశం మనకు ఎప్పుడూ ఉంది. యుద్ధం ముగిసిన 50 పైచిలుకు సంవత్సరాల తరువాత, యూదు ఆస్తుల ఆర్థిక పరిసమాప్తి కోసం సమిష్టిగానూ, వ్యక్తిగతంగానూ ఒక పరిష్కారం చేయాలని స్టోర్టింగ్ నిర్ణయించుకుంది. అలా చేయడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో నార్వేజియన్ యూదులపై జరిగిన నేరాలకు దేశం నైతిక బాధ్యతను అంగీకరించింది. మరి, రూత్ మేయర్‌పై, ఇతర యూదులపై జరిగిన నేరాల సంగతేంటి? ఆ హత్యలను నిస్సందేహంగా నాజీలే చేశారు. కానీ అరెస్టులు చేసింది నార్వేజియన్లే. ట్రక్కులను నడిపింది నార్వేజియన్లే. అది జరిగిందీ నార్వేలోనే.

Jens Stoltenberg, prime minister, 27 January 2012

దాదాపు అదే సమయంలో, జాతీయ పోలీసు కమిషనర్ ఆడ్ రీడర్ హమ్లెగార్డ్ డాగ్సావిసెన్‌తో మాట్లాడుతూ "నార్వేజియన్ పోలీసుల తరపునా, నార్వేజియన్ యూదులను నిర్బంధ శిబిరాలకు బహిష్కరించడంలో పాల్గొన్న వారి తరపునా నేను విచారం వ్యక్తం చేస్తున్నాను" అని అన్నాడు. [34]

2015 లో, నార్వేజియన్ స్టేట్ రైల్వేస్ ప్రజా సంబంధాల చీఫ్, ఏజ్-క్రిస్టోఫర్ లుండెబీ ఇలా అన్నాడు: "బహిష్కరించబడిన యూదుల రవాణా, నార్డ్‌ల్యాండ్ లైన్‌లో యుద్ధ ఖైదీలను ఉపయోగించడం NSB చరిత్రలో ఒక చీకటి అధ్యాయం". [35]

"యూదుల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేసినందుకు కాథలిక్ చర్చి చింతించిన యాభై సంవత్సరాల తర్వాత, [ఇప్పుడు] నార్వే చర్చి నుండి అధికారిక క్షమాపణ [...] వైపు అడుగులు వేస్తున్నట్లు" 2021లో మీడియా పేర్కొంది.

సాహిత్యం, సినిమా, ఇతర దృశ్య కళల్లో

[మార్చు]

నార్వే నుండి యూదుల హింస, అపహరణ, బహిష్కరణ గురించి ప్రత్యక్షంగా వివరించిన మొదటి పుస్తకం మోరిట్జ్ నాచ్‌స్టెర్న్ యుద్ధకాల జ్ఞాపకాలు. ఇది 1949లో ఫాల్స్‌మింటర్ ఐ బ్లాక్ 19 అనే శీర్షికతో ప్రచురించబడింది, తరువాతి సంచికలలో ఫాల్స్‌మింటర్ ఐ సాచ్‌సెన్‌హౌసెన్‌గా ప్రచురించబడింది. హోలోకాస్ట్‌కు సంబంధించిన సమస్యల గురించి కథనాలు ఉన్నప్పటికీ, అది 1978లో ప్రచురించబడిన హెర్మాన్ సాచ్నోవిట్జ్ రాసిన "ఇది మీకు కూడా సంబంధించినది" [36] అనే పుస్తకం,[37] నార్వేజియన్ చరిత్రపై గణనీయమైన ప్రజా దృష్టిని ఆకర్షించి<ది. [38]

పర్ ఓలే జోహన్సెన్ రాసిన ఓస్ సెల్వ్ నార్మెస్ట్ ["మనకు అత్యంత సన్నిహితులు"] 1984లో ప్రచురించబడింది.

యూదుల ఆస్తిని [దొంగతనం లేదా] దోపిడీకి సంబంధించి 1995లో డాగెన్స్ నేరింగ్స్లివ్‌లో బ్జోర్న్ వెస్ట్లీ రాసిన కథనాలు హోలోకాస్ట్ పరిధి, భాగస్వామ్యంపై ప్రజల్లో ఆసక్తిని సృష్టించాయి.

ఎస్పెన్ సోబై రాసిన పుస్తకం కథే - ఆల్వేస్ బీన్ ఇన్ నార్వే, 2003 లో ప్రచురించబడింది. జర్మన్, ఇంగ్లీషులోకి అనువదించబడింది (2019). 1945 తరువాత ప్రచురించబడిన రెండవ ఉత్తమ నార్వేజియన్ జీవిత చరిత్రగా ఇది 2017 లో పేరుపొందింది. 2018 లో 2000 తరువాత ప్రచురించబడిన 10 ఉత్తమ స్కాండినేవియన్ నాన్-ఫిక్షన్ పుస్తకాలలో ఒకటిగా ఎంపికైంది.

2014 పుస్తక రచయిత ( Den største forbrytelsen ) బ్రేజ్ బహుమతిని అందుకున్నారు. ఈ పుస్తకం గొప్ప సమీక్షలను అందుకుంది. అలాగే ఓస్లోలోని జోడిస్క్ మ్యూజియంలోని చరిత్రకారుల నుండి - మాట్స్ టాంగెస్టూయెన్, టోరిల్ టోర్ప్-హోల్టే నుండి కూడా విమర్శలను అందుకుంది - దుండగులెవరో, సహాయకులెవరో చిత్రించడంలో ముఖ్యమైన సూక్ష్మ నైపుణ్యాలను విస్మరించినందుకు ఈ విమర్శలు వచ్చాయి.[39]

బ్జార్టే బ్రూలాండ్ రాసిన హోలోకాస్ట్ ఐ నార్జ్ 2017 లో ప్రచురించబడింది; దీనిని "ఓ నార్వేజియన్ చరిత్రకారుడు పుస్తకంగా ప్రచురించిన ఏకైక ప్రధాన అధ్యయనం" అని పిలుస్తారు.

2021లో ఎస్పెన్ సోబ్యే ["చరిత్రకారులకు ఏమి తెలుసు"] హ్వా వెట్ హిస్టోరికెర్నె? అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

బెరిట్ రీసెల్ పుస్తకం హ్వోర్ బ్లే డెట్ ఆవ్ ఆల్ట్ సమ్మెన్? [ఇదంతా ఎక్కడికి పోయింది?], 2021లో ప్రచురించబడింది. [40]

సైన్ కోరెల్ పుస్తకం లొక్విడాస్యోనెన్ ["ది లిక్విడేషన్ "], 2021లో ప్రచురించబడింది.

2022లో ప్రచురించబడిన హ్యారీ రోడ్నర్ పుస్తకం స్వికెట్, అతని కుటుంబ చరిత్రను నార్వేజియన్ ప్రభుత్వ బహిష్కరణ విధానాలపై తన దర్యాప్తు ఫలితాలతో మిళితం చేస్తుంది. నార్వేలో జరిగిన హోలోకాస్ట్ గురించి వార్తలతో హాకాన్ VII తో ఎలా వ్యవహరించాడనేదానితో సహా.[41]

1950లోనే, ఐమీ సోమర్‌ఫెల్ట్ నార్వేలో హోలోకాస్ట్ సమయంలో ఒక కుటుంబం గురించి మిరియం అనే నవల రాశాడు.

డెన్ స్టోర్స్టే ఫర్బ్రిటెల్సెన్ ["గొప్ప నేరం"] అనే చిత్రం 2020 డిసెంబరు 25 న విడుదలైంది.[42] [43]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Holocaust i Norge". Store Norske Leksikon (in నార్వేజియన్). Retrieved June 6, 2021.
  2. Michelet, Marte (15 November 2014). "Bare en detalj". Dagbladet.no.
  3. These numbers do not include Jewish Soviet or Polish prisoners of war that died in captivity as a result of murder or mistreatment in Norwegian camps, nor Allied Jewish soldiers killed in action in Norway. There is some evidence that prisoners of war who were found to be Jewish were singled out and were abused. Mendelsohn 1986.
  4. 1 2 "Norway". encyclopedia.ushmm.org.
  5. Ottosen, Kristian (1994). "Vedlegg 1". I slik en natt; historien om deportasjonen av jøder fra Norge (in నార్వేజియన్). Oslo: Aschehoug. pp. 334–360. ISBN 82-03-26049-7.
  6. Cohen, Maynard M. (1997). A Stand Against Tyranny: Norway's Physicians and the Nazis. Detroit: Wayne State University Press. ISBN 081432603X. 63-82.
  7. 1 2 Dag Roard Fosnes (2006). "Politiets rolle i det norske Shoah" (in నార్వేజియన్). University of Bergen Faculty of Law. Archived from the original on 2019-07-31. Retrieved 2008-01-11.
  8. Halvor Hegtun (2015-02-27). NSB sa ja til slavedrift - Disse russerfangene ble tvunget til å bygge Nordlandsbanen. Så skulle de glemmes. Aftenposten A-magasinet. p. 26. Archived from the original on 1 March 2015.
  9. "The Jewish group in Norway in 1941-1942 consisted, prior to escape and deportation, of 2173 persons. The majority of these came to the country around 1905. Between 1918 and 1940 additional Jewish refugees from the continent were added to this group, see the majority's report chapter 3.1. In all, 530 persons were not Norwegian citizens. Of these, 290 were stateless." From Skarpnesutvalget (1997).
  10. "Article in the Norwegian newspaper Aftenposten by Bernt H. Bull (Norwegian)". Aftenposten.no. Retrieved 2012-08-22.
  11. Ottosen, Kristian (1994). i Slik en natt: historien om deportasjonen av jøder fra Norge [Such a night: the history about deportation of Jews from Norway] (in నార్వేజియన్). Oslo: Aschehoug. p. 32. ISBN 8203260497.
  12. Austad, Lene. "He was never invited to anyone; "Us" and "Them" in the Man Who Loved Haugesund". Dictum. Archived from the original on 29 August 2007. Retrieved 2008-01-13.
  13. "Ephraim Wolff Koritzinsky". Safon (in నార్వేజియన్). Archived from the original on 4 July 2008. Retrieved 2008-02-23.
  14. Komissar, Gerson (1997-08-24). "Den oversette premiss". Dagbladet (in నార్వేజియన్). Archived from the original on 2012-04-19. Retrieved 2008-01-13.
  15. Reitan 2005.
  16. 1 2 "Aldri mer 26. november". Klassekampen.
  17. 1 2 3 4 Mendelsohn 1992.
  18. Holmlund, Jan Thomas (25 August 2009). "Edgar Brichta var nazisjefens jødiske fostersønn". Dagbladet.no.
  19. "Quislings hønsegård" (PDF). Archived from the original (PDF) on 2015-07-12. Retrieved 2025-04-29.
  20. Johannessen, Simen Tveitereid Foto: Jan (3 July 2015). "Det siste vitnet". www.dn.no.
  21. Pedersen, Bernt Erik (November 25, 2020). "Fagkonsulentene om Marte Michelet-debatten: Kritikken må tas alvorlig" (in నార్వేజియన్). Retrieved June 6, 2021. Min mening er at Sønsteby bløffet. Han ville gi inntrykk av han visste mer enn han gjorde. Sønsteby ble behandlet som et orakel, ikke minst i pressen
  22. Pryser, Tore. "Mange varslet jødene" [Many warned the Jews]. Aftenposten. Retrieved 2014-11-22.
  23. Jahn Otto Johansen (2014-11-06). "Jødene ble ikke prioritert!" [The Jews were not prioritized]. Aftenposten. p. 11.
  24. Golombek, Rolf; Kohn, Ervin (November 30, 2020). "Marte Michelet stiller de viktige spørsmålene". Aftenpoften (in నార్వేజియన్). Retrieved June 6, 2021.
  25. 1 2 3 Bjørn Westlie (6 March 2015). "Å fortie historien". Klassekampen. p. 19.
  26. Guri Kulås (2015-02-27). "Fleire bøker viser korleis offentlege etatar og private selskap tente på den tyske okkupasjonen av Noreg: Slavane som bygde Noreg". Klassekampen. p. 21.
  27. Halvor Hegtun (2015-02-27). NSB sa ja til slavedrift - Disse russerfangene ble tvunget til å bygge Nordlandsbanen. Så skulle de glemmes. Aftenposten A-magasinet. p. 31. Archived from the original on 1 March 2015.
  28. "– Kirken må si unnskyld til jødene". www.vl.no. Retrieved 2 November 2021.
  29. AS, TV 2 (27 January 2012). "Historiker forventer holocaust-unnskyldning". TV 2.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  30. "Jødene ble ikke sviktet av de norske studentene i Buchenwald | Arnfinn Moland". www.aftenposten.no (in నార్వేజియన్ బొక్మాల్). 2017-03-22. Retrieved 2025-04-29.
  31. 1 2 "Holocaust Education, Remembrance, and Research in Norway". International Holocaust Remembrance Alliance. Archived from the original on April 14, 2013. Retrieved June 6, 2021.
  32. "Norway: Holocaust Education, Remembrance, and Research in Norway". Holocaust Remembrance. Retrieved June 6, 2021.[permanent dead link]
  33. "Del 3 Kartlegg spor av fortiden i nærmiljøet" (PDF) (in నార్వేజియన్). Retrieved June 6, 2021.[permanent dead link]
  34. 1 2 "Skamplett for rettsvesenet". dagen.no. 2 October 2014. Archived from the original on 9 ఆగస్టు 2020. Retrieved 29 ఏప్రిల్ 2025.
  35. Halvor Hegtun (2015-02-27). NSB sa ja til slavedrift - Disse russerfangene ble tvunget til å bygge Nordlandsbanen. Så skulle de glemmes. Aftenposten A-magasinet. p. 32. Archived from the original on 1 March 2015.
  36. "Det angår også deg (VG3) – Larvik Museum". Archived from the original on 2019-02-24. Retrieved 2025-04-29.
  37. "Månedens gjenstand i januar] [Item of the month, for January". Archived from the original on 2016-04-06. Retrieved 2025-04-29.
  38. "Nå forstår vi med hjertet" [Now we understand with the heart]. Vårt Land (in నార్వేజియన్). Oslo. April 6, 1979.
  39. Midttun, Lasse (28 November 2014). "Skottelåven og holocaust". Morgenbladet. p. 48.
  40. Smilden, Jan-Erik (January 26, 2021). "Nye avsløringer om norske jøder". Dagbladet (in నార్వేజియన్). Retrieved June 6, 2021.
  41. Rødner, Harry (November 24, 2022). "Sviket mot de norske jødene". VG (in నార్వేజియన్). Retrieved December 29, 2022.
  42. Vestmo, Birger (December 12, 2020). "Den største forbrytelsen". NRK (in నార్వేజియన్). Retrieved June 6, 2021.
  43. Malini Gaare Bjørnstad (August 12, 2020). "Det Skammer Jeg Meg Virkelig Over". KK (in నార్వేజియన్). Retrieved June 6, 2021.

వనరులు

[మార్చు]
  • Mendelsohn, Oskar (1986). Jødenes historie i Norge gjennom 300 år: Bind 2 1940-1985 (in నార్వేజియన్) (2nd ed.). Universitetsforlaget. pp. 13–262. ISBN 82-00-02524-1. A comprehensive treatment of the Holocaust in Norway.
  • Mendelsohn, Oskar (1992). Jødene i Norge: Historien om en minoritet (in నార్వేజియన్). Universitetsforlaget. ISBN 82-00-21669-1.
  • Reitan, Jon (2005). Jødene fra Trondheim (in నార్వేజియన్). Trondheim: Tapir akademisk forlag. ISBN 82-519-2044-2.