నార్వే అంతరిక్ష ఏజెన్సీ
Norsk Romsenter | |
దస్త్రం:Norwegian Space Agency logo.png | |
Agency overview | |
---|---|
Abbreviation | NOSA |
Formed | 1987 |
Type | Space agency |
Headquarters | స్కోయెన్, ఓస్లో, నార్వే |
Official language |
|
Owner | నార్వే ప్రభుత్వం |
నార్వే అంతరిక్ష ఏజెన్సీ (NOSA) అనేది నార్వేలో ప్రభుత్వ అంతరిక్ష కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ. నార్వే పాల్గొనే ఏదైనా అంతరిక్ష కార్యకలాపాల నుండి నార్వే ప్రయోజనం పొందేలా చూడడమే NOSA లక్ష్యం. దీన్ని గతంలో నార్వే స్పేస్ సెంటర్ అనేవారు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో చేరాలనే నార్వే నిర్ణయం తీసుకున్నాక, 1987 లో ఈ ఏజెన్సీని నార్వేజియన్ స్పేస్ సెంటర్‌గా స్థాపించారు. ఇది నార్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ఏజెన్సీగా పనిచేస్తుంది. సమాజానికి ఉపయోగపడే, వ్యాపార అభివృద్ధికి దోహదపడే అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడం దీని ఉద్దేశ్యం. ESA, EU అంతరిక్ష కార్యక్రమాలకు, ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలకూ సంబంధించి నార్వే ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం కూడా ఈ ఏజెన్సీ బాధ్యత. దీని ప్రధాన కార్యాలయం ఓస్లోలో ఉంది.

చరిత్ర
[మార్చు]నార్వే 1960 ల నుండి, ఆ ఏజెన్సీ స్థాపనకు చాలా కాలం ముందు నుండీ, అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది.[1] 1962 ఆగస్టు 18 న నార్వేలోని వెస్టెరాలెన్‌లోని ఆండోయా అంతరిక్ష కేంద్రం నుండి మొదటి రాకెట్‌ను ప్రయోగించారు. అప్పటి నుండి ఈ సౌకర్యం అంతరిక్షంలోకి వెళ్లే వాహనాలకు ప్రయోగ ప్రదేశంగా క్రమం తప్పకుండా వాడుకలో ఉంది.[2] 2012 నాటికి నార్వే నేల నుండి 1,000 కంటే ఎక్కువ సౌండింగ్ రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది.[1] ఇంకా, 1960 ల నుండి నార్వే ఉపగ్రహ సమాచార పరిశోధనలకు క్రమం తప్పకుండా నిధులు సమకూర్చడం ప్రారంభించింది. ధ్రువ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల నుండి డేటాను స్వీకరించడానికి అనుకూలమైన ప్రదేశంగా నార్వే అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడింది.[3] చమురు పరిశ్రమకూ, ఆర్కిటిక్‌లోని మారుమూల ప్రాంతాలకూ మెరుగైన మద్దతు ఇవ్వడానికి వీలు కల్పించే ఉపగ్రహ సమాచార వ్యవస్థను ఉపయోగించిన మొట్టమొదటి దేశం నార్వే.[2]
1987 లో నార్వే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో సభ్యదేశంగా మారింది. [1] అదే సంవత్సరం, నార్వేజియన్ అంతరిక్ష కేంద్రం నార్వేజియన్ అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థగా స్థాపించారు. ముఖ్యంగా ESA తో, ఇతర అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించడం, అలాగే జాతీయ ప్రయత్నాలను సమన్వయం చేయడం దాని పని. [4] అంతరిక్ష రంగానికి అత్యంత సమర్థవంతంగా మద్దతు ఇవ్వడానికి, నార్వే ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చడానికి నిధులను నిర్వహించడం, పంపిణీ చేయడం దాని పాత్రలలో ఒకటి. ఈ సంస్థ తయారుచేసే ప్రతిపాదనలను నార్వే వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.[4][2]
ఏజెన్సీ స్థాపించబడినప్పటి నుండి, నార్వే తన అంతరిక్ష ఆధారిత కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. గెలీలియో గ్లోబల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (GNSS) కోసం అతిపెద్ద గ్రౌండ్ స్టేషన్‌ను ఈ దేశం నిర్వహిస్తోంది.[1][5] ఏరియన్ 5 హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌తో పాటు నార్వేలో నిర్మించిన భాగాలు అనేక ఉపగ్రహాలలో పనిచేస్తున్నాయి. వివిధ అంతరిక్ష-ఆధారిత మిషన్లకు కూడా నార్వే సాంకేతికతలను సమకూర్చింది.[1] స్థానిక పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, అంతరిక్షంలో వాడే పరికరాలను పరీక్షించడానికి కూడా ఈ దేశం ఒక ప్రదేశంగా ఉంది.[1]
1997 లో ఆండోయా అంతరిక్ష కేంద్రాన్ని ప్రైవేటీకరించారు. అప్పుడు నార్వేజియన్ అంతరిక్ష కేంద్రం, దానిలో 90% వాటాను సొంతం చేసుకుంది. ఈ కేంద్రం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను వాణిజ్య ప్రాతిపదికన చేపడుతుంది.[2] 2010 లలో ఈ ఏజెన్సీ, న్యూక్లియస్ హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది. దీన్ని మునుపటి మోడళ్ల కంటే సురక్షితమైనదిగా, చౌకైనది, పర్యావరణ అనుకూలమైనదిగా ఉండేలా ఉద్దేశించారు.[6] 2019 ఫిబ్రవరిలో నార్వేజియన్ స్పేస్ సెంటర్‌కు అధికారికంగా నార్వేజియన్ స్పేస్ ఏజెన్సీగా పేరు మార్చారు; కమ్యూనికేషన్ డైరెక్టర్ మరియాన్ మోయెన్ ప్రకారం, సంస్థ పనితీరుపై గందరగోళాన్ని తగ్గించడానికి, ప్రభుత్వ సంస్థగా దాని స్థితిని స్పష్టం చేయడానికీ ఈ మార్పు చేసారు.[7]
స్పేస్ నార్వే
[మార్చు]స్పేస్ నార్వే అనేది 2014 లో స్థాపించబడిన నార్వేజియన్ అంతరిక్ష సంస్థ. అంతరిక్ష మౌలిక సదుపాయాలను సొంతం చేసుకోవడం, లీజుకు తీసుకోవడం, అంతరిక్ష సంబంధిత కార్యకలాపాలలో పెట్టుబడులు పెట్టడం దీని లక్ష్యం. [8] స్పేస్ నార్వే పరిమిత వాణిజ్య సంస్థగా పనిచేస్తున్నప్పటికీ, ఇది పూర్తిగా నార్వే ప్రభుత్వానికి చెందినది.[9] వివిధ ఉపగ్రహ యజమానుల తరపున కక్ష్యలో భూమి పరిశీలన ఉపగ్రహాల నుండి డేటాను చదవడంలో ప్రత్యేకత కలిగిన కాంగ్స్‌బర్గ్ ఉపగ్రహ సేవలలో కంపెనీకి 50% వాటా ఉంది.[8][2] 2019 జూలైలో స్పేస్ నార్వే అమెరికన్ కంపెనీలు నార్త్రోప్ గ్రుమ్మన్, స్పేస్‌ఎక్స్‌లతో దాని రెండు-ఉపగ్రహ ఆర్కిటిక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ (ASBM) వ్యవస్థను నిర్మించడానికి, ప్రయోగించడానికీ ఒప్పందం కుదుర్చుకుంది.[9] ఇది 2024 ఆగస్టులో మొదలైంది.[10]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "50 years of space for Norway". European Space Agency. 17 August 2012.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "The Norwegian space program 50 years". Norway Post. 18 July 2019. Archived from the original on 20 డిసెంబర్ 2023. Retrieved 24 ఏప్రిల్ 2025.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Norwegian Space Agency". norwayexports.no. Retrieved 5 May 2020.
- ↑ 4.0 4.1 "More about the Norwegian Space Agency". Norwegian Space Agency. Retrieved 6 May 2020.[permanent dead link]
- ↑ "UseGalileo – Find a galileo-enabled device to use today". usegalileo.eu. Archived from the original on 13 January 2019. Retrieved 12 January 2019.
- ↑ Ellingsen, Berit (2 October 2018). "First Norwegian hybrid rocket launched from Norway". Norwegian Space Agency. Archived from the original on 5 నవంబర్ 2023. Retrieved 24 ఏప్రిల్ 2025.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ Aasen, Christer. "Name change at the Norwegian Space Centre". Norwegian Space Agency. Archived from the original on 6 మార్చి 2019. Retrieved 5 March 2019.
- ↑ 8.0 8.1 "Space Norway in brief". Space Norway. Retrieved 6 May 2020.
- ↑ 9.0 9.1 "Arctic Satellite Broadband Mission Satellite System demonstrates Northrop Grumman's integrated approach to mission success" (Press release). Northrop Grumman. 3 July 2019. Retrieved 19 November 2021.[permanent dead link]
- ↑ "Viasat's Broadband Arctic Extension Closer as Spacecraft Complete Key Tests" (Press release). 21 November 2023. Retrieved 22 November 2023.