Jump to content

నార్వే ఆర్థిక వ్యవస్థ

వికీపీడియా నుండి
నార్వే ఆర్ధిక వ్యవస్థ
Calendar year
Trade organisations
EFTA, OECD, WTO, EEA, తదితరులు
Country group
  • అభివృద్ధి చెందిన దేశం[1]
  • అధికాదాయ ఆర్థిక వ్యవస్థ[2]
Statistics
Population5,367,580 (2020 జనవరి 1)[3]
GDP
GDP rank
GDP growth
  • 3.3% (2022)[4]
  • 2.1% (2023)[4]
  • 1.5% (2024)[4]
GDP per capita
  • Decrease $90,320 (nominal; 2025)[4]
  • Increase $106,540 (PPP; 2025)[4]
GDP per capita rank
  • 4 వ (nominal; 2024)
  • 5 వ (PPP; 2025)
GDP by sector
  • వ్యవసాయం: 1.6%

పరిశ్రమలు: 34.7%

  • సేవలు: 63.5%
  • (2016 అంచనా.)[5]
3.3% (2024 అంచనా.)[4]
Population below poverty line
  • NA[5]
  • 15.8% at risk of poverty or social exclusion (AROPE, 2023)[6]
24.7 low (2023)[7]
Labour force
  • 2.8 million (Q2 2020)[10]
  • Decrease 80.4% employment rate (2023)[11]
Labour force by occupation
  • వ్యవసాయం: 2.1%
  • పరిశ్రమలు: 19.3%
  • సేవలు: 78.6%
  • (2016 అంచనా.)[5]
Unemployment
  • 3.9% (2024 జనవరి) [12]
  • 12.8% యువతలో నిరుద్యోగం (15 to 24-year-olds; June 2020)[13]
  • 129,000 నిరుద్యోగులు (Q2 2020)[10]
Average gross salary
€55,200 annual
€40,500 annual
Main industries
Decrease 9th (very easy, 2020)[14]
External
Exports$102.8 బిలియన్లు (2017 అంచనా)[5]
Export goods
పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, ఓడలు, చేపలు
Main export partners
Imports$95.06 నిలియన్లు (2017 అంచనా.)[5]
Import goods
యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, లోహాలు, ఆహారపదార్థాలు
Main import partners
FDI stock
  • $236.5 బిలియన్లు (2017 డిసెంబరు 31అంచనా)[5]
  • Abroad: $196.3 బిలియన్లు (2017 డిసెంబరు 31అంచనా)[5]
$73.13 బిలియన్లు (2024 అంచనా.)[4]
  • $642.3 బిలియన్లు (31 March 2016 మార్చి 31 చనా)[5]
Public finances
36.5% of GDP (2017 అంచనా.)[5][note 1]
+4.4% (of GDP) (2017 est.)[5]
Revenues217.1 బిలియన్లు (2017 అంచనా.)[5]
Expenses199.5 బిలియన్లు (2017 అంచనా)[5]
Economic aid$4.0 billion (donor), 1.1% of GDP (2017) [1]
Foreign reserves
$65.92 బిలియన్లు (2017 డిసెంబరు 31 అంచనా.)[5]
Main data source: CIA World Fact Book
All values, unless otherwise stated, are in US dollars.

నార్వే ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ యాజమాన్యంతో అత్యంత అభివృద్ధి చెందిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ వాణిజ్యం;లో ఉండే హెచ్చుతగ్గుల వలన ప్రభావితమవుతున్నప్పటికీ, పారిశ్రామిక యుగం ప్రారంభం నుండి నార్వే ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని కనబరిచింది. ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఈ దేశంలో చాలా ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్నాయి. నార్వే, ఆధునిక తయారీ, సంక్షేమ వ్యవస్థ సహజ వనరులను, ముఖ్యంగా ఉత్తర సముద్ర చమురును వెలికి తీయడం ద్వారా ఉత్పత్తైన ఆర్థిక నిల్వపై ఆధారపడి ఉంటుంది.[16][17][18][19][20] OECD దేశాలన్నిటిలోకీ, నార్వేలో సాపేక్షంగా సమర్థవంతమైన, బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ ఉంది. 2022 లో సామాజిక వ్యయం OECD సగటు కంటే తక్కువగా ఉంది. అది GDPలో దాదాపు 20.7%.[21]

చరిత్ర

[మార్చు]

పారిశ్రామిక విప్లవానికి ముందు

[మార్చు]

వైకింగ్ యుగంలో మూడు స్కాండినేవియన్ రాజ్యాలలోనూ (మిగిలినవి డెన్మార్క్, స్వీడన్) నార్వేయే అత్యంత పేదది.[22]

పారిశ్రామిక విప్లవానికి ముందు, నార్వే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం, కలప, చేపలు పట్టడంపై ఆధారపడి ఉండేది. కరువులు పెద్దగా లేనప్పటికీ, గణనీయంగా కొరత పరిస్థితులుండేవి. హెడెమార్కెన్ ఓస్ట్‌ఫోల్డ్‌లోని కొన్ని సారవంతమైన ప్రాంతాలను మినహాయించి, పంటలు ఓట్స్, రై, బార్లీ వంటి గట్టి ధాన్యాలకే పరిమితమై ఉండేది. పశుసంపద గొర్రెలు, మేకలు, పశువులు, పందులు, కోళ్లకు పరిమితమై ఉండేది. కొన్ని ప్రదేశాలలో ఇది వేటతో అనుబంధంగా ఉండేది. మధ్య నార్వే, ఉత్తర నార్వే లోని ప్రాంతాలలో, సామీ ప్రజలు రెయిన్ డీర్ పెంపకంపై ఆధారపడి జీవించేవారు. తీరం వెంబడి చేపలు పట్టడం ప్రమాదకరంగా ఉండేది. అయితే హెర్రింగ్, కాడ్, హాలిబట్, ఇతర చల్లని నీటి జాతుల చేపలు సమృద్ధిగా ఉండేవి. 18వ శతాబ్దంలో కోపెన్‌హాగన్‌లో పూజారులు, రాజు ప్రోత్సహించిన బంగాళాదుంపను నార్వేకు పరిచయం చేయడం గణనీయమైన ఉపశమనాన్ని అందించింది. నార్వేజియన్లకు అది సాధారణ ఆహారంగా మారింది.

తీరం వెంబడి, చేపల పెంపకం (కాడ్, హెర్రింగ్, హాలిబట్, ఇతర చల్లని నీటి జాతులు సహా) వ్యవసాయానికి ఒక ముఖ్యమైన అనుబంధంగా ఉండేది. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ప్రాథమిక గృహ జీవనాధారంగా ఉండేది. చేపలు పట్టడం సాధారణంగా పంటల పెంపకం, చిన్న పొలాలలో పశువుల పెంపకంతో అనుబంధంగా ఉండేది.

నార్వేలో ఆర్థిక పరిస్థితులు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటానికి అనుకూలంగా లేవు. అయినప్పటికీ అనేక మంది రాజులు నైట్స్‌గా మారిన విశ్వాసపాత్రులైన ప్రజలకు భూమిని బహుమతిగా ఇచ్చారు. నార్వేజియన్ వ్యవసాయంలో స్వంత భూమి గల రైతులు ప్రధాన పని యూనిట్‌గా ఉండేవారు - ఇప్పటికీ ఉన్నారు. కానీ 19వ శతాబ్దం వచ్చేస్దరికి రైతులకు వ్యవసాయం చేయడానికి అందుబాటులో భూమి లేకుండా పోయింది. కౌలు రైతులుగా అనేక వ్యవసాయ కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపోయాయి. ఉత్తర అమెరికాకు వలస వెళ్ళడానికి ఇవి ప్రేరణగా పనిచేశాయి. ఐర్లాండ్ తర్వాత నార్వే, దాని జనాభాతో పోలిస్తే ఈ వలసల వల్ల అత్యధిక మందిని కోల్పోయిన దేశం.

పారిశ్రామిక విప్లవం

[మార్చు]
రాజధాని నిర్మాణం 1865–2003 మూలం: గణాంకాలు నార్వే

కాంగ్స్‌బర్గ్, రోరోస్, లోకెన్‌లలో మైనింగ్‌తో పాటు, 19వ శతాబ్దం మధ్యలో నార్వేలో నిర్మించిన మొదటి వస్త్ర మిల్లులతో పారిశ్రామికీకరణ వచ్చింది. కానీ వ్యవస్థాపకుల అవసరాలను తీర్చడానికి బ్యాంకుల స్థాపన జరిగినప్పుడు తొలి పెద్ద పారిశ్రామిక సంస్థలు ఉద్భవించాయి.

వ్యవసాయ రంగం నుండి బయటపడ్డ వ్యక్తులకు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉపాధిని అందించాయి. వ్యవసాయం కంటే పరిశ్రమల నుండి వచ్చే వేతనాలు ఎక్కువగా ఉండటంతో, ఈ మార్పు సాగు భూమి లోను, గ్రామీణ జనాభా లోనూ దీర్ఘకాలిక తగ్గుదల ధోరణికు కారణమైంది. నార్వేలో కార్మికవర్గం స్వంత నివాసప్రాంతాలతో, సంస్కృతితో, రాజకీయాలతో ఒక ప్రత్యేక అంశంగా మారింది.

సామాజిక ప్రజాస్వామ్య సంస్కరణలు

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, నార్వేజియన్ లేబర్ పార్టీ, ఐనార్ గెర్హార్డ్‌సెన్ ప్రధాన మంత్రిగా ఉన్నపుడు, ఆదాయంలో అంతరాలను తగ్గించడం, పేదరికాన్ని నిర్మూలించడం, పదవీ విరమణ, వైద్య సంరక్షణ, వైకల్య ప్రయోజనాల వంటి సామాజిక సేవలను అందరికీ అందించడం వంటివి లక్ష్యంగా అనేక సామాజిక ప్రజాస్వామ్య సంస్కరణలను ప్రారంభించింది.

అత్యంత ప్రగతిశీల ఆదాయ పన్నులు, విలువ ఆధారిత పన్ను పరిచయం, అనేక రకాల ప్రత్యేక సర్‌ఛార్జీలు, పన్నులూ నార్వేను ప్రపంచంలోనే అత్యధికంగా పన్ను విధించే ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిపాయి. ప్రత్యేకంగా విచక్షణా వ్యయంపై పన్ను విధించారు. ఆటోమొబైల్స్, పొగాకు, మద్యం, సౌందర్య సాధనాలు మొదలైన వాటిపై ప్రత్యేక పన్నులు విధించారు.

నార్వేలో దీర్ఘకాలిక సామాజిక ప్రజాస్వామ్య విధానాలు, విస్తృతమైన ప్రభుత్వ సమాచార ట్రాకింగు, జనాభా సజాతీయత ఆర్థిక అధ్యయనానికి ప్రత్యేకంగా బాగా ఉపయోగపడ్డాయి. విద్యా పరిశోధన ఈ యుగంలో స్థూల ఆర్థిక రంగానికి గణనీయమైన కృషి చేసింది. నార్వే పెట్రోలియం ఎగుమతి చేసే దేశంగా మారినప్పుడు, ఆర్థిక ప్రభావాలను మరింతగా అధ్యయనం చేసారు.

పెట్రోలియం, పారిశ్రామికీకరణ అనంతర కాలం

[మార్చు]

చమురు ఎగుమతి చేసే దేశం

[మార్చు]
చమురు ఉత్పత్తి, నార్వేజియన్ రంగం; మూలం: గణాంకాలు నార్వే

963 మేలో నార్వే, తన ఉత్తర సముద్రంలోని సహజ వనరులపై సార్వభౌమ హక్కులను ప్రకటించుకుంది. 1966 జూలై 19న ఓషన్ ట్రావెలర్ తన మొదటి బావిని తవ్వడంతో చమురు అన్వేషణ ప్రారంభమైంది.[23] 1967 లో స్టావాంజర్‌కు పశ్చిమాన 190 కి.మీ. దూరంలో ఉట్సిరా హై పార్శ్వం వద్ద ఉన్న బాల్డర్ చమురు క్షేత్రంలో చమురు మొదటిసారి కనిపించింది.[24] 1969 ఆగస్టు 21న ఓషన్ వైకింగ్ చమురును కనుగొనడంతో ప్రారంభ అన్వేషణ ఫలించింది.[23] 1969 చివరి నాటికి, ఉత్తర సముద్రంలో పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టమైంది. మొదటి చమురు క్షేత్రం ఎకోఫిస్క్. 1980 లో దీని నుండి 427,442 barrels (67,957.8 మీ3) ముడి చమురును వెలికి తీసారు. అప్పటి నుండి, పెద్ద మొత్తంలో సహజ వాయువు నిల్వలు కూడా కనుగొనబడ్డాయి.

యూరోపియన్ యూనియన్‌లో చేరకూడదని నార్వేజియన్ ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో, ఓలా స్క్జాక్ బ్రాక్ నేతృత్వంలోని నార్వేజియన్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ ఇంధన విధానాన్ని ఏర్పాటు చేయడానికి త్వరగా చర్యలు తీసుకుంది. నార్వే OPEC నుండి దూరంగా ఉండాలని, తన సొంత ఇంధన ధరలను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా ఉంచుకోవాలని, "కరెన్సీ బహుమతి"గా పిలువబడే ఆదాయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. నార్వేజియన్ ప్రభుత్వం తన సొంత చమురు కంపెనీ స్టాటోయిల్ (ఇప్పుడు ఈక్వినోర్ అని పిలుస్తారు)ను స్థాపించింది. నార్స్క్ హైడ్రో, కొత్తగా ఏర్పడిన సాగా పెట్రోలియంకు డ్రిల్లింగు, ఉత్పత్తి హక్కులను ఇచ్చింది. పెట్రోలియం ఎగుమతులపై 78% ఉపాంత రేటు (ప్రామాణిక కార్పొరేట్ పన్ను 24%, ప్రత్యేక పెట్రోలియం పన్ను 54%) పన్ను విధించబడుతుంది. [25]

ఉత్తర సముద్రంలో ఉత్పత్తి,, అన్వేషణలకు అనేక సాంకేతిక సవాళ్ళు ఎదురయ్యాయి. నార్వేజియన్ కంపెనీలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సామర్థ్యాలను నిర్మించడంలో పెట్టుబడులు పెట్టాయి. అంతరిస్తున్న నౌకానిర్మాణ పరిశ్రమ అవశేషాల నుండి అనేక ఇంజనీరింగు, నిర్మాణ సంస్థలు ఉద్భవించాయి, స్టావాంజర్, ఓస్లో పశ్చిమ శివారు ప్రాంతాలలో సామర్థ్య కేంద్రాలను సృష్టించాయి. స్టావాంజర్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ పరిశ్రమకు భూ-ఆధారిత స్టేజింగ్ కేంద్రంగా కూడా మారింది. ప్రస్తుతం నార్త్ సీ చమురు ఉత్పత్తి గరిష్ట స్థాయిని దాటింది. స్నోహ్విట్ తో సహా నార్వేజియన్ సముద్రం, బారెంట్స్ సముద్రంలోని పెద్ద నార్వేజియన్ ప్రాంతాలలో కొత్త చమురు, గ్యాస్ క్షేత్రాలను కనుగొని, అభివృద్ధి చేసారు.

యూరోపియన్ యూనియన్ గురించి రిజర్వేషన్లు

[మార్చు]
నార్వే ఎగుమతులు, దిగుమతులు

1972 సెప్టెంబరులో నార్వే, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో చేరాలా వద్దా అనే ప్రశ్నపై నార్వేజియన్ పార్లమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆ ప్రతిపాదన స్వల్ప ఓట్లతో తిరస్కరించబడింది. నార్వేజియన్ ప్రభుత్వం EU తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపగా, నార్వేజియన్ కంపెనీలకు యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశం లభించింది. కాలక్రమేణా, నార్వే ఈ ఒప్పందాన్ని తిరిగి చర్చించి మెరుగుపరిచింది. చివరికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో చేరింది.

నార్వే వాణిజ్య విధానాలు దాని పారిశ్రామిక, వాణిజ్య విధానాన్ని EU విధానాలతో సమన్వయం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 1994 లో జరిగిన ఒక కొత్త ప్రజాభిప్రాయ సేకరణలో 1972 లో మాదిరిగానే ఫలితం వచ్చింది. నార్వే, ఐస్లాండ్ లాగానే EU లో చేరకుండా బయటే ఉండిపోయింది.

EU సభ్యత్వం గురించి జరిగిన ప్రజా చర్చ ఆర్థిక సమస్యల కంటే రాజకీయ అంశాలపైనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఇది అనేక ముఖ్యమైన మార్గాల్లో ఆర్థిక విధానాన్ని రూపొందించింది:

చేపల పెంపకం ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్గార ప్రమాణాలు మొదలైన అనేక నిర్దిష్ట అంశాలపై నార్వేజియన్లు రాయితీలను కోరుతున్నారు. కానీ ఇవి EU సభ్యులు కోరుకునే వాటికంటే గణనీయంగా భిన్నంగా ఏమీ లేవు. సభ్యత్వ అంశం ఏదో ఒక సమయంలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణకు దారితీస్తుందని భావిస్తున్నారు.

ప్రభుత్వ యాజమాన్య పాత్ర

[మార్చు]
పబ్లిక్ vs. ప్రైవేట్ వినియోగం మూలం: గణాంకాలు నార్వే

సహజ వనరులు, వ్యూహాత్మక పెట్రోలియం రంగం (ఈక్వినార్), జలవిద్యుత్ శక్తి ఉత్పత్తి (స్టాట్‌క్రాఫ్ట్), అల్యూమినియం ఉత్పత్తి (నార్స్క్ హైడ్రో), అతిపెద్ద నార్వేజియన్ బ్యాంకు (డిఎన్‌బి), టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ (టెలినార్) వంటి కీలక పారిశ్రామిక రంగాలకు చెందిన పరిశ్రమల్లో నార్వే ప్రభుత్వానికి యాజమాన్య వాటాలున్నాయి. ఓస్లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువలో దాదాపు 35% ప్రభుత్వ నియంత్రణ లోనే ఉంది.[26] దాని అతిపెద్ద ఏడు లిస్టెడ్ కంపెనీలలో ఐదు పాక్షికంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. లిస్టెడ్ కాని కంపెనీలను చేర్చినప్పుడు, ప్రభుత్వానికి యాజమాన్యంలో ఇంకా ఎక్కువ వాటా ఉంటుంది (ప్రధానంగా ప్రత్యక్ష చమురు లైసెన్స్ యాజమాన్యం నుండి). మొత్తం వ్యవసాయేతర ఉద్యోగాలన్నింటిలో 9.6% నార్వే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలే కల్పిస్తున్నాయి. మైనారిటీ ప్రభుత్వ యాజమాన్య వాటాలున్న కంపెనీలను కూడా చేర్చినప్పుడు ఈ సంఖ్య దాదాపు 13%కి పెరుగుతుంది. ఇది OECD దేశాలలోకెల్లా అత్యధికం. [27] ప్రభుత్వ యాజమాన్య వాటాలు కలిగిన లిస్టెడ్, నాన్-లిస్టెడ్ సంస్థలు రెండూ మార్కెట్ ఆధారితమైనవి. అత్యంత సరళీకృత మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తాయి. [28]

చమురు, గ్యాస్ పరిశ్రమలు నార్వేజియన్ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్య పాత్ర పోషిస్తాయి. చమురు క్షేత్రాల ప్రత్యక్ష యాజమాన్యం, ఈక్వినార్‌లో దాని వాటాల నుండి డివిడెండ్‌లు, లైసెన్స్ ఫీజులు, పన్నుల ద్వారా నార్వే సంక్షేమ రాజ్యానికి ఆర్థిక వనరును అందిస్తాయి. ప్రభుత్వ ఆదాయం, విలువ ఆధారిత పరంగా చమురు, గ్యాస్ పరిశ్రమ నార్వేలో కెల్లా అతిపెద్దది. ఈ రంగపు వ్యవస్థ, పెట్రోలియం వనరుల అన్వేషణ, అభివృద్ధి, వెలికితీతల ఫలితంగా మొత్తం సమాజానికి పన్నులు, లైసెన్సింగ్. ప్రభుత్వ ప్రత్యక్ష ఆర్థిక ఆసక్తి (SDFI) అనే వ్యవస్థ ద్వారాను ప్రత్యక్ష ప్రభుత్వ యాజమాన్యం ద్వారానూ ప్రజలకు సంపద సృష్టికి దారితీసేలా రూపొందించబడింది. SDFI 1985లో స్థాపించబడింది. అనేక చమురు, గ్యాస్ క్షేత్రాలు, పైప్‌లైన్‌లు, ఆన్‌షోర్ సౌకర్యాలలో ప్రభుత్వ యాజమాన్యంలోని హోల్డింగ్‌లనూ అలాగే ఈక్వినార్‌లోని 67% వాటాలనూ ఇది సూచిస్తుంది. పెట్రోలియం పరిశ్రమ నుండి ప్రభుత్వ ఆదాయాలు ప్రభుత్వ పెన్షన్ ఫండ్ ఆఫ్ నార్వే గ్లోబల్‌కు బదిలీ చేయబడతాయి. ప్రభుత్వం ఈ నిధిని వాడుకోకుండా నిషేధించే వ్యవస్థ ఉంటుంది. ఈ నిధుల నుండి వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వ వ్యయం కోసం ఉపయోగించవచ్చు.[29]

ప్రభుత్వ యాజమాన్యం ఇలా అధిక స్థాయిల్లో ఉండడానికి వివిధ కారణాలున్నాయి. ముఖ్యమైనది, సహజ వనరుల వినియోగంపై నియంత్రణ ఉండాలన్న కోరిక. 20వ శతాబ్దానికి ముందు ప్రజా మౌలిక సదుపాయాల కల్పనతో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక తయారీ సంస్థలలో జర్మన్ ఆస్తులను జప్తు చేసుకుని పరిశ్రమ, వాణిజ్య సంస్థలలోకి ప్రభుత్వం బాగా విస్తరించింది. 1972లో స్టాటోయిల్ స్థాపనతో ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద విస్తరణ జరిగింది. ప్రభుత వాటాలను కలిగి ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మార్కెట్ ఆధారితమైనవి. మార్కెటీకరణ పరిశ్రమలలోనే కాకుండా ప్రజా సేవలకు కూడా విస్తరించి ఉంటుంది. [28]

డేటా

[మార్చు]
నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్‌లలో తలసరి GDP అభివృద్ధి

కింది పట్టిక 1980–2021లో ప్రధాన ఆర్థిక సూచికలను చూపుతుంది (2022–2027లో IMF సిబ్బంది అంచనాలతో). ద్రవ్యోల్బణం 5% కంటే తక్కువగా ఉండటం సానుకూలంగా ఉంది. [30]

సంవత్సరం జిడిపి

(Bil. US$PPP)

తలసరి జిడిపి

(in US$ PPP)

జిడిపి

(in Bil. US$nominal)

తలసరి జిడిపి

(in US$ nominal)

జిడిపి పెరుగుదల

(real)

ద్రవ్యోల్బణం

(శాతం)

నిరుద్యోగం

(శాతం)

ప్రభుత్వ ఋణం

(జిడిపి లో శాతం)

1980 60.6 14,799.8 64.4 15,746.3 Increase4.5% Negative increase10.9% 1.7% 47.7%
1981 Increase67.4 Increase16,399.9 Decrease63.6 Decrease15,484.7 Increase1.6% Negative increase13.6% Negative increase2.0% Positive decrease43.4%
1982 Increase71.7 Increase17,388.9 Decrease62.6 Decrease15,196.3 Increase0.2% Negative increase11.3% Negative increase2.6% Positive decrease38.5%
1983 Increase77.5 Increase18,733.9 Decrease61.6 Decrease14,906.2 Increase4.0% Negative increase8.5% Negative increase3.4% Positive decrease35.4%
1984 Increase85.1 Increase20,527.7 Increase62.1 Increase14,968.8 Increase6.1% Negative increase6.2% Positive decrease3.1% Positive decrease35.2%
1985 Increase92.7 Increase22,281.1 Increase65.4 Increase15,728.2 Increase5.6% Negative increase5.7% Positive decrease2.6% Negative increase36.9%
1986 Increase98.4 Increase23,564.6 Increase78.7 Increase18,853.1 Increase4.0% Negative increase7.2% Positive decrease2.0% Negative increase46.0%
1987 Increase102.6 Increase24,428.7 Increase94.2 Increase22,445.0 Increase1.8% Negative increase8.7% Negative increase2.1% Positive decrease38.5%
1988 Increase105.9 Increase25,091.7 Increase101.9 Increase24,143.1 Decrease-0.3% Negative increase6.7% Negative increase3.1% Positive decrease32.4%
1989 Increase111.2 Increase26,269.0 Increase102.6 Increase24,245.4 Increase1.0% Increase4.5% Negative increase4.9% Positive decrease32.3%
1990 Increase117.6 Increase27,669.5 Increase119.8 Increase28,187.2 Increase1.9% Increase4.1% Negative increase5.2% Positive decrease28.9%
1991 Increase125.3 Increase29,320.7 Increase121.9 Increase28,514.5 Increase3.1% Increase3.4% Negative increase5.5% Negative increase39.2%
1992 Increase132.8 Increase30,878.7 Increase130.8 Increase30,432.9 Increase3.6% Increase2.3% Negative increase5.9% Negative increase45.0%
1993 Increase139.8 Increase32,317.7 Decrease120.6 Decrease27,880.6 Increase2.8% Increase2.3% Steady5.9% Negative increase53.7%
1994 Increase150.0 Increase34,488.5 Increase127.1 Increase29,236.4 Increase5.1% Increase1.4% Positive decrease5.4% Positive decrease50.6%
1995 Increase159.5 Increase36,494.1 Increase152.0 Increase34,790.0 Increase4.2% Increase2.5% Positive decrease4.9% Positive decrease32.7%
1996 Increase170.6 Increase38,828.6 Increase163.5 Increase37,225.3 Increase5.0% Increase1.3% Positive decrease4.8% Positive decrease28.4%
1997 Increase182.7 Increase41,391.4 Decrease161.4 Decrease36,561.4 Increase5.3% Increase2.6% Positive decrease4.0% Positive decrease25.8%
1998 Increase189.6 Increase42,692.1 Decrease154.2 Decrease34,717.1 Increase2.6% Increase2.3% Positive decrease3.2% Positive decrease23.6%
1999 Increase196.1 Increase43,841.6 Increase162.3 Increase36,278.3 Increase2.0% Increase2.4% Positive decrease3.2% Negative increase25.0%
2000 Increase207.0 Increase45,989.4 Increase171.2 Increase38,047.9 Increase3.2% Increase3.1% Negative increase3.4% Negative increase28.7%
2001 Increase216.0 Increase47,803.6 Increase174.0 Increase38,494.7 Increase2.1% Increase3.0% Negative increase3.5% Positive decrease27.3%
2002 Increase222.6 Increase48,948.7 Increase195.5 Increase42,998.0 Increase1.4% Increase1.3% Negative increase3.9% Negative increase34.0%
2003 Increase229.0 Increase50,086.8 Increase228.9 Increase50,046.3 Increase0.9% Increase2.5% Negative increase4.5% Negative increase43.2%
2004 Increase244.5 Increase53,167.4 Increase264.5 Increase57,512.2 Increase4.0% Increase0.5% Positive decrease4.5% Negative increase44.0%
2005 Increase258.8 Increase55,878.3 Increase308.9 Increase66,687.8 Increase2.6% Increase1.5% Negative increase4.6% Positive decrease42.5%
2006 Increase273.2 Increase58,478.9 Increase345.6 Increase73,970.2 Increase2.4% Increase2.3% Positive decrease3.4% Negative increase52.8%
2007 Increase289.0 Increase61,205.9 Increase400.9 Increase84,915.6 Increase3.0% Increase0.7% Positive decrease2.5% Positive decrease49.7%
2008 Increase295.9 Increase61,820.4 Increase462.3 Increase96,563.2 Increase0.5% Increase3.8% Negative increase2.7% Positive decrease47.8%
2009 Decrease292.7 Decrease60,439.5 Decrease386.2 Decrease79,746.9 Decrease-1.7% Increase2.2% Negative increase3.3% Positive decrease42.7%
2010 Increase298.3 Increase60,773.6 Increase428.8 Increase87,356.2 Increase0.7% Increase2.4% Negative increase3.8% Negative increase43.2%
2011 Increase307.5 Increase61,827.8 Increase498.3 Increase100,197.2 Increase1.0% Increase1.3% Positive decrease3.4% Positive decrease29.8%
2012 Increase328.0 Increase65,101.0 Increase509.5 Increase101,129.9 Increase2.7% Increase0.7% Positive decrease3.3% Negative increase31.1%
2013 Increase340.1 Increase66,742.1 Increase522.8 Increase102,576.7 Increase1.0% Increase2.1% Negative increase3.8% Negative increase31.6%
2014 Decrease338.5 Decrease65,647.1 Decrease498.4 Decrease96,657.6 Increase2.0% Increase2.0% Positive decrease3.6% Positive decrease29.9%
2015 Decrease313.3 Decrease60,189.9 Decrease385.8 Decrease74,115.2 Increase2.0% Increase2.2% Negative increase4.5% Negative increase34.5%
2016 Decrease308.5 Decrease58,735.9 Decrease368.8 Decrease70,223.8 Increase1.1% Increase3.6% Negative increase4.7% Negative increase38.1%
2017 Increase332.1 Increase62,782.1 Increase398.4 Increase75,306.7 Increase2.3% Increase1.9% Positive decrease4.2% Negative increase38.6%
2018 Increase343.9 Increase64,590.3 Increase437.0 Increase82,082.1 Increase1.1% Increase2.8% Positive decrease3.9% Negative increase39.7%
2019 Increase352.6 Increase65,829.9 Decrease404.9 Decrease75,594.0 Increase0.7% Increase2.2% Positive decrease3.7% Negative increase40.9%
2020 Increase354.3 Decrease65,804.0 Decrease362.2 Decrease67,265.9 Decrease-0.7% Increase1.3% Negative increase4.6% Negative increase46.8%
2021 Increase383.4 Increase70,796.1 Increase482.2 Increase89,041.6 Increase3.9% Increase3.5% Positive decrease4.4% Positive decrease43.4%
2022 Increase425.6 Increase78,127.6 Increase504.7 Increase92,646.0 Increase3.6% Increase4.7% Positive decrease3.9% Positive decrease40.3%
2023 Increase452.1 Increase82,496.2 Decrease486.4 Decrease88,748.8 Increase2.6% Increase3.8% Positive decrease3.8% Positive decrease39.5%
2024 Increase471.9 Increase85,599.5 Increase495.1 Increase89,809.9 Increase2.2% Increase2.7% Positive decrease3.7% Positive decrease39.2%
2025 Increase488.4 Increase88,050.6 Increase502.8 Increase90,663.8 Increase1.6% Increase2.5% Steady3.7% Positive decrease38.7%
2026 Increase504.0 Increase90,331.6 Increase509.6 Increase91,330.9 Increase1.3% Increase2.0% Steady3.7% Positive decrease38.2%
2027 Increase520.4 Increase92,711.2 Increase522.6 Increase93,107.3 Increase1.3% Increase2.0% Steady3.7% Positive decrease37.7%

కంపెనీలు

[మార్చు]

2022లో, నార్వేలో అత్యధిక సంఖ్యలో, 2,96,849 కంపెనీలు నమోదైన రంగం సర్వీసెస్. ఆ తర్వాత వరుసగా 1,18,411 కంపెనీలతో ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. [31]

ఆర్థిక నిర్మాణం, స్థిరమైన వృద్ధి

[మార్చు]

చమురు ఎగుమతి చేసే దేశంగా నార్వే ఆవిర్భావం నార్వేజియన్ ఆర్థిక విధానానికి అనేక సమస్యలను తీసుకొచ్చింది. నార్వే మానవ మూలధన పెట్టుబడిలో ఎక్కువ భాగం పెట్రోలియం సంబంధిత పరిశ్రమలలో కేంద్రీకృతమై ఉందని ఆందోళన ఉంది. నార్వే ఆర్థిక నిర్మాణం, నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం లేని సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉందనీ, ఈ సహజ వనరులకు డిమాండుపైన, ధరలలో హెచ్చుతగ్గుల పైనా ఆధారపడిన ఆర్థిక వృద్ధి చాలా హాని కలిగిస్తుందని విమర్శకులు ఎత్తి చూపారు. పెట్రోలియం ఆదాయంపై ఆధారపడటాన్ని నివారించడానికి ప్రభుత్వం చేసిన అనేక ప్రయత్నాలలో నార్వే ప్రభుత్వ పెన్షన్ నిధి ఒక భాగం.

1970ల నుండి చమురు బూమ్ కారణంగా, ప్రైవేట్ రంగంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయడానికీ, ప్రోత్సహించడానికీ ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివులు చాలా తక్కువగా ఉన్నాయి. స్వీడన్, ముఖ్యంగా ఫిన్లాండ్ వంటి ఇతర నార్డిక్ దేశాల కంటే ఇది భిన్నం. అయితే గత దశాబ్దాలలో అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిన కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి జాతీయ, స్థానిక ప్రభుత్వాల స్థాయిలలో కొంత ప్రోత్సాహకం కనిపించింది. హైటెక్ పరిశ్రమ కోసం ఆకాంక్షలతో పాటు, భవిష్యత్తులో ఉపాధికి మూలంగా చిన్న వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడంపై ఆసక్తి పెరుగుతోంది. 2006 లో నార్వేజియన్ ప్రభుత్వం ఈ వ్యాపార వృద్ధిని సులభతరం చేయడానికి తొమ్మిది "నైపుణ్య కేంద్రాలను" ఏర్పాటు చేసింది.[32] నార్వేలో 80% క్యాన్సర్ పరిశోధనలు ఓస్లోకు సమీపంలోనే జరుగుతాయి. చాలా నార్వేజియన్ బయోటెక్నాలజీ కంపెనీలు క్యాన్సర్‌పై దృష్టి సారించాయి. ఈ రెండు విషయాలను ఉపయోగించుకుని ప్రభుత్వం, 2007 జూన్‌లో నైపుణ్య కేంద్రంగా ఓస్లో క్యాన్సర్ క్లస్టర్ (OCC) ఏర్పాటుకు దోహదపడింది.[32]

నార్వేలో వ్యవసాయం

[మార్చు]

తెగులు నియంత్రణ

[మార్చు]

దేశం మొత్తానికి పురుగుమందుల వినియోగ సమాచారం స్టాటిస్టిక్స్ నార్వే వద్ద అందుబాటులో ఉంది. [33]

యాంటీమైక్రోబియల్ నిరోధకత

[మార్చు]

మొత్తంమీద ఆహార సరఫరా గొలుసులలో యాంటీమైక్రోబయల్ నిరోధకత ప్రమాదం "దాదాపుగా లేనట్లే". ముఖ్యంగా పశువులు, పాలు/పాల ఉత్పత్తులు, చేపలు, సముద్ర ఆహారం, తాగునీరు, పంది మాంసాల వలన ముప్పు బహు స్వల్పం. మరోవైపు, జీవించి ఉన్న పందులు (వాటి పెంపకం, ప్రాసెసింగ్), జీవించి ఉన్న కోళ్ళ నుండి కోళ్ల మాంసం వలన ప్రమాదం చాలా తక్కువ.[34]

వాతావరణ మార్పు వలన ఆర్థిక ప్రభావాలు

[మార్చు]

వ్యవసాయం

[మార్చు]

వెచ్చని వాతావరణం నార్వే వ్యవసాయానికి లాభాలు, నష్టాలు రెండూ తెచ్చిపెడుతుంది. తేలికపాటి వాతావరణానికి అనుగుణంగా ఉండే కొత్త రకాల మొక్కలతో కలిసి అధిక ఉష్ణోగ్రతలు, మంచి పంటలను అందిస్తాయి. సంవత్సరానికి రెండు పంటలు పండించవచ్చు. వాతావరణ మార్పుల ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది, ఇప్పటికే అవపాతం మొదలైన వాటిలో స్థానికంగా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో మంచు కరగడం వల్ల పంటలు ఎండిపోయి చనిపోవచ్చు. తడి ప్రాంతాలలో, అవపాతం మరింత పెరిగితే పంటలు ఫంగస్ దాడికి లోనౌతాయి.

అడవులు

[మార్చు]

వాతావరణ మార్పుల కారణంగా నార్వేలో ఉత్పాదక అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ దీని వలన సమస్యలూ లేఖపోలేదు. తేలికపాటి శీతాకాలాల్లో చెట్ల నిరోధకత, మంచును తట్టుకునే శక్తీ తగ్గిపోతుంది. తేలికపాటి శీతాకాలాల్లో గడ్డకట్టడం, కరగడం అనే చక్రీయ స్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చెట్లను దెబ్బతీస్తాయి. కొత్త తెగుళ్లు వేగంగా ఉత్తరం వైపు కదులుతాయి కాబట్టి తెగుళ్ల దాడి, వ్యాధులూ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో కీటకాలు ఒక తరాన్ని పునరుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు యూరోపియన్ స్ప్రూస్ బార్క్ బీటిల్ వేసవిలో అదనపు దాడితో స్ప్రూస్ చెట్లను దెబ్బతీస్తుంది.

ప్రాంతీయ వైవిధ్యం

[మార్చు]
ప్రాంతం 2015 తలసరి GDP
యూరోలలో EU-28 సగటులో %
 European Union 29,000 డాలర్లు 100%
 Norway 46,300 రూపాయలు 160%
అత్యంత ధనవంతమైనది ఓస్లో, అకర్షస్ 51,800 (51,800) 178%
అగ్డర్, రోగలాండ్ 40,600 140%
వెస్ట్‌ల్యాండెట్ 39,400 (39,400) 136%
ట్రాండెలాగ్ 35,500 122%
నోర్డ్-నార్జ్ 33,500 115%
సోర్-ఓస్ట్‌లాండెట్ 30,000 డాలర్లు 103%
అత్యంత పేద హెడ్‌మార్క్, ఆప్లాండ్ 29,100 (రూ. 29,100) 100%

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • యూరప్ ఆర్థిక వ్యవస్థ
  • నార్డిక్ మోడల్

గమనికలు

[మార్చు]
  1. data cover general government debt and include debt instruments issued (or owned) by government entities other than the treasury; the data exclude treasury debt held by foreign entities; the data exclude debt issued by subnational entities, as well as intragovernmental debt; intragovernmental debt consists of treasury borrowings from surpluses in the social funds, such as for retirement, medical care, and unemployment; debt instruments for the social funds are not sold at public auctions

మూలాలు

[మార్చు]
  1. "World Economic Outlook Database, April 2024". IMF.org. International Monetary Fund.
  2. "World Bank Country and Lending Groups". datahelpdesk.worldbank.org. World Bank. Retrieved 29 September 2019.
  3. "Population on 1 January". ec.europa.eu/eurostat. Eurostat. Retrieved 13 July 2020.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 "World Economic Outlook (October 2024)". imf.org. International Monetary Fund.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 "The World Factbook". CIA.gov. Central Intelligence Agency. Retrieved 29 June 2019.
  6. "People at risk of poverty or social exclusion". ec.europa.eu/eurostat. Eurostat.
  7. "Gini coefficient of equivalised disposable income – EU-SILC survey". ec.europa.eu/eurostat. Eurostat.
  8. "Human Development Index (HDI)" (PDF). hdr.undp.org. HDRO (Human Development Report Office) United Nations Development Programme. Retrieved 13 March 2024.
  9. "Human Development Reports: Norway. IHDI–Inequality-adjusted HDI". hdr.undp.org. UNDP. Retrieved 13 March 2024.
  10. 10.0 10.1 "Labor Force Survey". ssb.no. Statistics Norway. Retrieved 29 September 2020.
  11. "Employment rate by sex, age group 20-64". ec.europa.eu/eurostat. Eurostat. Retrieved 20 July 2024.
  12. "Arbeidsledighet i Norge".
  13. "Unemployment rate by age group". data.oecd.org. OECD. Retrieved 8 September 2020.
  14. "Ease of Doing Business in Norway". Doingbusiness.org. Archived from the original on 4 November 2017. Retrieved 2017-11-21.
  15. 15.0 15.1 SSB, https://www.ssb.no/utenriksokonomi/utenrikshandel/statistikk/utenrikshandel-med-varer/artikler/norges-viktigste-handelspartnere, 2023
  16. The economic effects of north sea oil on the manufacturing sector Archived 2 ఫిబ్రవరి 2014 at the Wayback Machine Hilde Christiane Bjørnland
  17. Overview of the Norwegian oil and gas sector Archived 23 మే 2013 at the Wayback Machine Embassy of Denmark, Oslo
  18. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 20 June 2013. Retrieved 2012-12-28.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  19. The Oil Industry and Government Strategy in the North Sea Øystein Noreng
  20. "The rich cousin". The Economist. 1 February 2013. Archived from the original on 1 February 2013. Retrieved 1 February 2013.
  21. "Social Expenditure – Aggregated data". Organisation for Economic Co-operation and Development.
  22. Bagge, Sverre (2010). From Viking Stronghold to Christian Kingdom: State Formation in Norway, c. 900-1350 (in ఇంగ్లీష్). Museum Tusculanum Press. p. 70. ISBN 978-87-635-0791-2.
  23. 23.0 23.1 "Norway's petroleum history". www.norskoljeoggass.no (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2022. Retrieved 2022-04-12.
  24. Riber, Lars; Dypvik, Henning; Sørlie, Ronald (2015). "Altered basement rocks on the Utsira High and its surroundings, Norwegian North Sea" (PDF). Norwegian Journal of Geology. 95 (1): 57–89. Retrieved 3 February 2018.
  25. "Norway – Corporate – Taxes on corporate income". Archived from the original on 14 January 2018. Retrieved 2018-01-14.
  26. Lie, Einar (6 April 2016). "Context and Contingency: Explaining State Ownership in Norway". Enterprise & Society. 17 (4): 904–930. doi:10.1017/eso.2016.18. S2CID 157325276.
  27. Korin Kane (17 September 2018). "The Size and Sectoral Distribution of State-Owned Enterprises" (PDF). oecd.org. Retrieved 3 October 2019.
  28. 28.0 28.1 "Norway – Marketisation of Government Services State-Owned Enterprises" (PDF). oecd.org. 2003. Retrieved 3 October 2019.
  29. "The Government's Revenues". Norwegian Petroleum. 15 May 2019. Retrieved 3 October 2019.
  30. "Report for Selected Countries and Subjects".
  31. "Industry Breakdown of Companies in Norway". HitHorizons.
  32. 32.0 32.1 Aldridge 2008
  33. "Pesticide use". Statistics Norway. 2016-09-27. Retrieved 2021-07-22.
  34. Yazdankhah, Siamak; Grahek-Ogden, Danica; Hjeltnes, Brit; Langsrud, Solveig; Lassen, Jørgen; Norström, Madelaine; Sunde, Marianne; Eckner, Karl; Kapperud, Georg (3 November 2014). Assessment of Antimicrobial Resistance in the Food Chains in Norway (Rep. No. 2015:29). Norwegian Scientific Committee for Food and Environment [Vitenskapskomiteen for mat og miljø]. ISBN 978-82-8259-184-3. {{cite book}}: |work= ignored (help)