నాలుగవ కృష్ణరాజ ఒడయారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలుగవ కృష్ణరాజ వడయార్
మైసూర్ మహారాజు
Maharaja Sir Sri Krishnaraja Wodiyar 1906 by 1906 K Keshavayya.jpg
1906లో కె. కేశవయ్య చిత్రించిన కృష్ణరాజ ఒడయారు చిత్రపటం
పరిపాలన1902 - 1940
జననంజూన్ 4, 1884
జన్మస్థలంమైసూర్
మరణంఆగస్ట్ 3, 1940
మరణస్థలంబెంగుళూర్
ఇంతకు ముందున్నవారుచామరాజ ఒడయారు
తరువాతి వారుజయచామరాజ ఒడయారు బహదూర్
Consortప్రతాప కుమారీ అమ్మాణి
రాజకుటుంబముఒడయారు
తండ్రిచామరాజ ఒడయారు
తల్లిమహారాణి కెంప నంజమ్మన్ని వాణీ విలాస సన్నిధాన

నాలుగవ కృష్ణరాజ ఒడయారు (1884 జూన్ 4 - 1940 ఆగస్టు 3, బెంగుళూరు ప్యాలెస్ లో జన్మించాడు.) (ఈయన నల్వాడి కృష్ణరాజ ఒడయార్ కన్నడ: ನಾಲ್ವಡಿ ಕೃಷ್ಣರಾಜ ಒಡೆಯರುగా సుపరిచితుడు. కన్నడంలో నల్వాడి అనగా నాలుగవ) మైసూర్ రాజ్యానికి తిరుగులేని మహారాజుగా 1902 నుంచి 1940లో చనిపోయేవరకు పాలించాడు. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలోనే అత్యంత విశిష్ట పాలకులలో ఒకరిగా గుర్తించబడ్డాడు. తను చనిపోయే నాటికి, ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరిగా రూపొందాడు. 1940లో ఇతడి సంపద 400 మిలియన్ డాలర్లుగా ఉండేది, 2010 నాటి ధరలతో పోలిస్తే దీని విలువ 56 బిలియన్ డాలర్లు[1].

ఈయన గొప్ప తాత్వికుడు. పాల్ బ్రంటన్ ఇతడిని ప్లాటోతన రిపబ్లిక్‌లో వ్యక్తం చేసిన ఆదర్శాలకు అనుగుణంగా జీవిస్తున్నవాడిగా పేర్కొనాడు. ఇంగ్లీష్ రాజనీతికోవిదుడు లార్డ్ శామ్యూల్ కృష్ణను అశోక చక్రవర్తితో పోల్చాడు. మహాత్మా గాంధీ ఈయనని రాజర్షి లేదా "ఋషి రాజు" అని పిలిచాడు. ఈయన రాజ్యాన్ని తన అనుయాయులు రామరాజ్యంగా వర్ణించారు, ఇది శ్రీరాముడి కాలంలోని ఆదర్శరాజ్యం.

నాలుగవ కృష్ణరాజ ఒడయారు 1899 నుంచి 1950 వరకు మైసూరు రాజ్యాన్ని పాలించిన మైసూరు ఒడయారు రాజవంశంకి చెందిన 24వ రాజు.

ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

కృష్ణరాజ ఒడయార్ ఫోటోగ్రాఫ్ 1895 ఫిబ్రవరి 2న తన పదకొండవ జన్మదినానికి కొన్ని నెలల ముందు తీసినది

కృష్ణ 1884 జూన్ 4న, మైసూరు రాజభవనంలో జన్మించాడు. ఇతడు మహారాజు తొమ్మిదవ చామరాజ ఒడయార్ మహారాణి వాణి విలాస్ సన్నిధాన పెద్ద కుమారుడు. 1894లో తన తండ్రి కలకత్తాలో గతించిన తర్వాత, కృష్ణకు యుక్తవయస్సు వచ్చేవరకు కృష్ణ తల్లి రాజప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించింది.

మహారాజు తన ప్రాథమిక విద్యను పి. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో లోకరంజన్ ప్యాలెస్‌లో పూర్తి చేసుకున్నాడు. పాశ్చాత్య విద్యతో పాటు కృష్ణ కన్నడ మరియు సంస్కృత భాషలలో ప్రావీణ్యం పొందాడు. గుర్రపు స్వారీ, భారతీయ, పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో కూడా శిక్షణ పొందాడు. బాంబే సివిల్ సర్వీసుకు చెందిన సర్ స్టూవర్ట్ ఫ్రేజర్ ఆధ్వర్యంలో పాలనాపరమైన తొలి శిక్షణను పొందాడు. న్యాయ సూత్రాలు మరియు ఆదాయ శాఖ నిర్వహణ పద్ధతులకు సంబంధించిన విషయాలను రాజ్యమంతా విస్తృతంగా పర్యటించి వాటి ద్వారా గ్రహించేవాడు. ఈ పర్యటనల సమయంలోను, ఆ తరువాతి కాలంలో తను పాలించిన రాజ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని విస్తారంగా పొందేవాడు.

వివాహం[మార్చు]

1900 జూన్ 6న, ఇతడు మహారాణి లక్ష్మీవిలాస సన్నిధాన శ్రీ ప్రతాప కుమారి అమ్మణి అవరు (జన్మదినం 1889) ని వివాహమాడాడు. ఈమె ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని కథియవార్ ప్రాంతానికి చెందిన రాణా శ్రీ బానే సింగ్జీ సాహిబ్, రాణా సాహిబ్ ఆఫ్ వనా రాణిల కడపటి కుమార్తె.

రామ రాజ్యం[మార్చు]

నాలుగవ కృష్ణ రాజా ఒడయార్

1876-77 కరువు సమీపిస్తుండగా, మహారాజా చామరాజ ఒడయార్ IX, మరణించిన నేపథ్యంలో ఆనాటికి 11 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణరాజ ఒడయార్ IV 1895లో సింహాసనమెక్కాడు. 1902 ఫిబ్రవరి 8న కృష్ణరాజ ఒడయార్ గద్దె నెక్కేవరకు అతడి తల్లి మహారాణి కెంపరాజమ్మణియవరు రాజప్రతినిధిగా పాలన సాగించింది.[2] 1902 ఆగస్టు 8న జగన్ మోహన్ ప్యాలెస్‌లో (ఇప్పుడు జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ) జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కృష్ణ IVను పూర్తి పాలనాధికారాలతో మైసూరు మహారాజాగా వైస్రాయ్ లార్డ్ కర్జన్ నియమించాడు.

తన పాలనలో, కృష్ణరాజ ఒడయార్ మైసూర్‌ని ఆ కాలంలో అత్యంత ప్రగతిశీలమైన, ఆధునిక రాజ్యాల్లో ఒకటిగా పరివర్తింపజేశాడు. ఇతడి హయాంలో, మైసూర్ రాజ్యం పరిశ్రమ, విద్య, వ్యవసాయం మరియు కళారంగాల్లో అద్భుత పురోగతి సాధించింది. ఈ కాలంలో విద్యాపరమైన మౌలిక సౌకర్యాలలో జరిగిన గొప్ప కృషి ఫలితంగా 20వ శతాబ్ది చివరలో భారతీయ అగ్రగామి టెక్నాలజీ హబ్‌గా కర్నాటక తన స్థానాన్ని స్థిరపర్చుకుంది.[3] రాజు విశిష్ట సంగీతకారుడు, తన వారసుల్లాగే ఇతడు లలిత కళల అభివృద్ధికి బాటలు వేశాడు.[4] ఈ అన్ని కారణాలతో, ఇతడి పాలన తరచుగా 'మైసూరు రాజ్య స్వర్ణయుగం'గా వర్ణించబడింది.[5] మూస:Mysore Rulers Infobox కృష్ణ రాజ ఒడయార్ బనారస్ హిందూ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ మైసూర్ తొలి ఛాన్సలర్‌. వీటిలో మైసూర్ యూనివర్శిటీ భారత ప్రభుత్వం స్వీకరించిన తొలి విశ్వవిద్యాలయంగా పేరుకెక్కింది. బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటుకు రాజప్రతినిధిగా తన తల్లి పాలించిన కాలంలో చొరవ తీసుకున్నారు, తర్వాత 1911లో 371 ఎకరాల బహుమతితో, (1.5 కి.మీ²) భూమి, నిధుల విరాళాలతో ఒడయార్ హయాంలో ఇది ప్రారంభించబడింది. ఇతడు భారతీయ (కర్నాటిక్ మరియు హిందూస్తానీ) మరియు పాశ్చాత్య సాంప్రదాయిక సంగీతాల ప్రధాన పోషకుడిగా ఉండేవాడు.

1881లో ప్రజాస్వామ్య వేదికగా ప్రాతినిధ్య అసెంబ్లీని కలిగి ఉన్న తొలి భారతీయ రాష్ట్రంగా మైసూరు పేరుకెక్కింది. కృష్ణరాజ ఒడయార్ IV పాలనా కాలంలో, పెద్దల సభ శాసన మండలి ఏర్పర్చబడటంతో, శాసనసభ విస్తరించి 1907లో ద్విసభగా మారింది మరియు అనేక నూతన శాసనాలు పుట్టుకొచ్చాయి. ఇతడి హయాంలో మైసూరు, ఆసియాలోనే మొట్టమొదటి జలవిద్యుత్ శక్తిని రూపొందించగలిగిన తొలి భారతీయ రాజ్యంగా పేరొందింది మరియు మైసూర్, వీధి దీపాలు కలిగిన తొలి ఆసియా నగరంగా గుర్తించబడింది, 1905 ఆగస్టు 5న మొట్టమొదటిసారిగా ఈ నగరంలో దీపాలు వెలిగాయి.

మహారాజుగా తన 39 సంవత్సరాల పాలనా కాలంలో కృష్ణ IV నేతృత్వంలో కింది ప్రధానమంత్రులు పనిచేశారు (వీరిని దివాన్‌లు అని అంటారు) :

1. పి.ఎన్. కృష్ణమూర్తి (1901-06)

2. వి.పి. మాధవ రావు (1906-09)

3. టి. ఆనంద రావు (1909-1912)

4. సర్ ఎమ్. విశ్వేశ్వరయ (1912-19)

5. సర్ ఎమ్. కాంతా రాజె ఆర్స్ (1919-22)

6. సర్ ఆల్బియన్ బెనర్జీ (1922-26)

7. సర్ మీర్జా ఇస్మాయిల్ (1926-41)

తన హయాంలో, ఇతడు దారిద్ర్యాన్ని నిర్మూలించడం, గ్రామీణ పునర్నిర్మాణం, ప్రజారోగ్యం, పరిశ్రమలు, ఆర్థిక పునరుత్పత్తి, విద్య మరియు లలితకళలను మెరుగుపర్చడంపై కృషి చేశాడు. తన హయాంలో మైసూరు రాజ్యం ఎంత ముందంజ వేసిందంటే, గాంధీజీ స్వయంగా మహారాజును రాజర్షి ("రాజయోగి") అని ప్రకటించేస్థాయిలో స్పందించాడు.[6] పాల్ బ్రంటన్, బ్రిటిష్ తత్వవేత్త మరియు ప్రాచ్య అధ్యయనవేత్త; జాన్ గంథర్, అమెరికన్ రచయిత; బ్రిటిష్ రాజనీతివేత్త, లార్డ్ శామ్యూల్ కూడా రాజును ప్రశంసల్లో ముంచెత్తినవారిలో ఉన్నారు. రౌండ్ టేబుల్ కాన్పరెన్స్ కాలంలో లార్డ్ శాన్‌కీ, మైసూర్ రాజ్యం "ప్రపంచంలోనే అత్యుత్తమ పాలన అందించిన రాజ్యం"గా పేర్కొన్నాడు. భారత్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన రాజకుమారులు పాలనాపరమైన శిక్షణ కోసం మైసూరుకు వచ్చేవారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ మైసూర్ రాజాను "ధార్మికుడు" అని వర్ణించాడు, మైసూరు పారిశ్రామిక అభివృద్ధి అమోఘం అంటూ లార్డ్ వెల్లింగ్టన్ పై మనోభావాన్ని ప్రతిధ్వనించాడు.

కర్నాట సంగీతం మరియు లలితకళల పోషకుడు[మార్చు]

Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf

ముందే చెప్పినట్లుగా, రాజా కర్నాటిక్ మరియు హిందూస్థానీ సంగీతం రెండింటిలోనూ చక్కటి ప్రావీణ్యం కలవాడు, కొంతమంది ఇతడి పాలనను "కర్నాటక్ సాంప్రదాయ సంగీత స్వర్ణ యుగం"గా అభివర్ణించారు

సంస్కృత భాషా సాహిత్యాలను నేర్చుకోవడం మునుపెన్నడూ లేని రీతిలో ప్రోత్సహించబడింది. శ్రీ తిరుమలై కృష్ణమాచార్య ద్వారా యోగాను వెలుగులోకి తెచ్చారు, పెయింటింగ్ (తన గురువు రాజా రవివర్మ ద్వారా) ప్రోత్సహించబడింది. ఇతడు ఎనిమిది వాయిద్యాలపై పట్టు సాధించాడు -- ఫ్లూట్, వయొలిన్, శాక్సాఫోన్, పియానో, మృదంగం, నాదస్వర, సితార్, మరియు వీణా.[ఆధారం చూపాలి] నిజానికి, ప్యాలెస్ వాయిద్యబృందంలో భాగంగా శాక్సాఫోన్‌పై కర్నాటిక్ సంగీతాన్ని వినిపించే లక్ష్మీనరసింహయ్యను ఇతడు కోరి తీసుకువచ్చాడు. కద్రి గోపీనాథ్ శాక్సాఫోన్‌ వాయిద్యంపై నిష్ణాతుడు కావడానికి రాజే ప్రేరణగా నిలిచాడు. నట్టన్ ఖాన్ మరియు ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాన్‌తో సహా ఆగ్రా ఘరానాకు చెందిన అనేకమంది విశిష్ట సభ్యులు మైసూర్ మహారాజా అతిథులుగా వచ్చేవారు. అబ్దుల్ కరీమ్ ఖాన్ మరియు గౌహర్ జాన్ వంటి సంగీత దిగ్గజాలు కూడా ఇతడి అతిధులే. భారతీయ విశిష్ట సితార్ ప్లేయర్లలో ఒకరైన బర్కతుల్లా ఖాన్, 1919 నుంచి 1930లో చనిపోయేవరకు ప్యాలెస్ సంగీతకారుడిగా ఉండేవాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న అతి గొప్ప సంగీతకారులలో కొందరి పేర్లు ఇక్కడ సూచించబడ్డాయి. వీణా షమన్నా, వీణా శేషన్న, మైసూర్ కరిగిరి రావు, వీణా సుబ్బన్న, బిడారమ్ కృష్ణప్ప, మైసూర్ వసుదేవాచార్య, వీణా సుబ్రహ్మణ్య అయ్యర్, డాక్టర్ ముత్తయ్య భాగవతార్, వీణా శివరామయ్య, వీణా వెంకటగిరియప్ప, బెలకవాడి శ్రీనివాస అయ్యంగార్, చిక్క రామారావు, మైసూరు టి. చౌడయ్య, బి.దేవేంద్రప్ప, గొట్టువాద్యం నారాయణ అయ్యంగార్, మరియు తిరువయ్యార్ సుబ్రహ్మణ్య అయ్యర్ తదితరులు.

ప్రశంస[మార్చు]

 1. తత్వవేత్త, నిగూఢ మరియు పర్యాటకుడు, పాల్ బ్రంటన్ (1898-1981) మహారాజు సంరక్షణలో చాలా సంవత్సరాల పాటు మైసూరు ప్యాలెస్‌లో గడిపాడు మరియు ది క్వెస్ట్ ఆఫ్ ది ఓవర్‌సెల్ఫ్ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం ద్వారా రాజు పట్ల తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు: "ఆశాభంగం చెందిన వారి ఆశ్రయంగా మాత్రమే ఉండే తత్వశాస్త్రాన్ని ఇతడు కాపాడి, దాన్ని సేవాభావం కోసం, మరింత కార్యాచరణకోసం అత్యున్నత ప్రేరణగా మార్చి చూపాడు. "ప్రపంచ పాలకులు మిమ్మల్ని అనుసరించి, నిజమైన తత్వశాస్త్రంపై వారి అమూల్యమైన సమయంలో క్షణకాలం పాటు వెచ్చించినట్లయితే, దానిద్వారా వారు పొందే ప్రయోజనం తెలివైన రాజకీయాల రూపంలో అపార లాభాలను కొనితెస్తుంది."
 1. మహారాజు పాలకుడిగా ఉన్నకాలంలో తన వృత్తి జీవితం తొలి రోజుల్లో మైసూరు మహారాజా కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజు గురించి ఇలా చెప్పారు. "దివంగత మహారాజు కృష్ణరాజ ఒడయార్ ప్రాచీనుడే కాని మంత్రముగ్ధులను చేసే ఆత్మశక్తిని కలిగి ఉండేవారు, రాజ్యానికి సంబంధించిన నిర్దిష్ట సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా తాను నిగూఢ శిఖరాలపై గడిపేవారు. తనలో అతి చిన్న భాగాన్ని మాత్రమే తాను సమాజానికి అందిస్తున్నట్లుగా వ్యక్తులు భావించేవారు."
 1. మహారాజుకు బాల్యం నుంచి స్నేహితుడిగా ఉండి అతడి వ్యక్తిగత కార్యదర్శిగా తర్వాత అతడి దివాన్‌గా (ప్రధానమంత్రి)పనిచేసిన ముస్లిం సర్ మీర్జా ఇస్మాయిల్ తన జీవితచరిత్రలో ఇలా రాసుకున్నారు. "స్వచ్ఛమైన ఆత్మ, హృదయం నిండా కరుణ, ఇతరులకు ఇవ్వడంలో దయ, సహనం, ఓర్పు, మనషులను చాలా తెలివిగా అంచనా వేయడం వంటి ఉత్తమ గుణాలను మహారాజు కలిగి ఉండేవారు. అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఉన్న లక్షణాలు అతడికి సంక్రమించాయి -- జీవితంలో అందరు శత్రువులను మినహాయించి, మిత్రులను మాత్రమే పొందగలగడం అతడి విశిష్టత భారతీయ చరిత్రలోని అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా చరిత్ర ఈయనను నిలిపి ఉంచుతుందనడంలో నాకే సందేహమూ లేదు."

మహాత్మా గాంధీ, మహారాజు[మార్చు]

మహాత్మా గాంధీ 1925 ఫిబ్రవరి 8నాటి నవజీవన్ పత్రికలో ఇలా రాశారు: "మైసూరు మహారాజు గారు రాట్నాన్ని తీసుకున్నారు. ఈ వార్త నూలు వడకడాన్ని పవిత్ర కర్తవ్యంగా తీసుకున్న వారి హృదయాలను ఉప్పొంగేలా చేసింది ... నేను మహారాజును అభినందించారు, తాను స్వీకరించిన ఈ పనిని తన జీవిత పర్యంతమూ ఆయన కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాను, ఇది ఆయనకూ, తన రాజ్యంలోని ప్రజలకూ ఎంతగానో మంచి చేస్తుంది."

మహాత్మాగాంధీ 1927, 1936లలో మహారాజు ప్రభుత్వ అతిథిగా ఉన్నారు. అనారోగ్యం నుంచి స్వస్థత పొందడానికి ఆయన నంది హిల్స్‌లో బసచేశారు. 1927లో, మహారాజు పట్టాభిషిక్తులయిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను మైసూర్ రాజ్యం ఘనంగా జరుపుకుంది. ఈ ఉత్సవానికి గాంధీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాంధీ 1927 ఆగస్టు 5న మహారాజుకు ఉత్తరం రాసి పంపారు, దాంట్లో ఆయన ఇలా రాశారు: "ప్రియ మిత్రుడా, మీ గొప్పతనాన్ని, స్వచ్ఛతను ప్రశంసించే ప్రతిసారీ నాకు అపరిమితానందం కలుగుతుంటుంది. మీ అన్ని ఆకాంక్షలు సఫలీకృతం కావాలని నేను సోమవారం ప్రార్థిస్తుంటాను. "

హోదాలు[మార్చు]

 • 1884-1894: /యువరాజా శ్రీ కృష్ణరాజ ఒడయార్ బహదూర్, యువరాజ ఆఫ్ మైసూరు
 • 1894-1907: హిజ్‌ హైనెస్ మహారాజా శ్రీ నల్వాడి కృష్ణరాజ ఒడయార్ IV బహదూర్, మహారాజా ఆఫ్ మైసూర్
 • 1907-1910: హిస్ హైనెస మహారాజ శ్రీ సర్ నల్వాడీ కృష్ణరాజ ఒడయార్ IV బహదూర్, మహారాజా ఆఫ్ మైసూర్, GCSI
 • 1910-1917: కల్నల్ హిస్ హైనెస్ మహారాజా శ్రీ సర్ నల్వాడీ కృష్ణరాజ ఒడయార్ IV బహదారు, మహారాజా ఆఫ్ మైసూర్, GCSI
 • 1917-1940: కల్నల్ హిజ్ హైనెస్ మహారాజా శ్రీ సర్ నల్వాడి కృష్ణరాజ ఒడయార్ IV బహదూర్, మహారాజ ఆఫ్ మైసూర్, GCSI, GBE

గౌరవాలు[మార్చు]

 • ఢిల్లీ దర్పార్ గోల్డ్ మెడల్l-1903
 • నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (GCSI) -1907
 • ఢిల్లీ దర్పార్ గోల్డ్ మెడల్-19
 • బాలిఫ్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ (GCStJ) -1911
 • నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (GBE) -1917
 • కింగ్ జార్జ్ V సిల్వర్ జూబ్లీ మెడల్-1935
 • కింగ్ జార్జ్ VI పట్టాభిషేకం పతకం-1937

సూచనలు[మార్చు]

 1. ప్రస్తుత జీవిత చరిత్ర 1940, p833
 2. రమా జోయిస్, M. 1984. లీగల్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఏన్షియంట్ లీగల్ జ్యుడిషియల్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ సిస్టమ్ ఢిల్లీ: యూనివర్సల్ లా పబ్. కో. p597
 3. "The Mysore duo Krishnaraja Wodeya IV & M. Visvesvaraya". India Today. Retrieved 2007-10-23.
 4. ప్రాణేష్ (2003), p. 162
 5. "[Group portrait of] the Maharaja [of Mysore] & his brothers and sisters". British Library. Retrieved 2007-10-23.
 6. పుట్టస్వామయ్య, K., 1980. ఎననమిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ కర్నాటక ఎ ట్రీటైజ్ ఇన్ కంటిన్యుటీ అండ్ ఛేంజ్ న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ & IBH, p. 3