Jump to content

నాలుగో ప్రపంచం

వికీపీడియా నుండి

నాల్గవ ప్రపంచం అనేది మూడు ప్రపంచాల నమూనాకు పొడిగింపు. కింద చూపిన వివిధరకాల సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారు.

  1. ప్రపంచ సమాజం నుండి సామాజికంగా మినహాయించబడిన ఉప-జనాభా. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని ప్రజలు ;
  2. ఆధునిక పారిశ్రామిక ప్రమాణాలకు ఆవల జీవిస్తున్న వేటగాళ్ళు, సంచార జాతులు, పశువుల పెంపకందారులు, కొంతమంది జీవనాధార వ్యవసాయం చేసే ప్రజలు.[1]
  3. మొదటి ప్రపంచ దేశంలో ఉంటూనే మూడవ ప్రపంచ దేశాల జీవన ప్రమాణాలతో జీవిస్తున్న ఉప-జనాభా.

ఈ పదాన్ని సాధారణ వాడుకలో పెద్దగా ఉపయోగించరు. "నాల్గవ ప్రపంచం" అనే పదాన్ని మూడు ప్రపంచాల నమూనాకు సంబంధించి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాలను సూచించడానికి కూడా ఉపయోగించారు.

వ్యుత్పత్తి

[మార్చు]

మొదటి ప్రపంచం, రెండవ ప్రపంచం, మూడవ ప్రపంచ దేశాల తరవాత దేశ-రాజ్య హోదా వర్గీకరణను బట్టి నాల్గవ ప్రపంచం వస్తుంది; అయితే, ఆ మూడు వర్గాల మాదిరిగా నాల్గవ ప్రపంచానికి ప్రాదేశిక సరిహద్దుల పరిమితి లేదు. సాధారణంగా ఒక నిర్దుష్ట దేశ-రాజ్యపు పౌరసత్వం ఉన్న ప్రజలను మాత్రమే పరిగణించే ప్రపంచం కాదిది. ఇది సార్వభౌమ రాజ్యం లేని దేశాల ప్రజలను సూచిస్తుంది. ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఉన్న ఆదిమ ప్రాతీయుల గ్రూపుల వంటి ఉన్న జాతిపరంగా, మతపరంగా గుర్తింపు కలిగి, రాజకీయ-ఆర్థిక ప్రపంచ వ్యవస్థ నుండి మినహాయించబడిన ప్రజా సమూహాలను నిర్వచిస్తుంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అన్నెన్‌బర్గ్ స్కూల్ ఫర్ కమ్యూనికేషన్‌కు చెందిన స్పానిష్ సామాజిక శాస్త్రవేత్త మాన్యుయెల్ కాస్టెల్స్ నాల్గవ ప్రపంచం అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించాడు.[2][3]

నాణేల తయారీ

[మార్చు]

ఈ పదాన్ని ఫాదర్ జోసెఫ్ రెసిన్స్కీ, నాయిసీ-లె-గ్రాండ్ (ఫ్రాన్స్) షాంటి టౌన్ కు చెందిన కుటుంబాలతో 1957 లో తాను స్థాపించిన ఛారిటీ పేరును 1969 లో <i id="mwPA">ATD క్వార్ట్ మోండేగా</i> మార్చినప్పుడు ఉపయోగించాడు.

ఈ పదాన్ని 1970 లలో టాంజానియా హై కమిషన్ మొదటి కార్యదర్శి ఎంబుటో మిలాండో, నేషనల్ ఇండియన్ బ్రదర్‌హుడ్ (ఇప్పుడు అసెంబ్లీ ఆఫ్ ఫస్ట్ నేషన్స్ ) చీఫ్ జార్జ్ మాన్యుయేల్‌తో చేసిన సంభాషణలో తిరిగి ఉపయోగించాడు. "స్థానిక ప్రజలు వారి స్వంత సంస్కృతులు, సంప్రదాయాల ఆధారంగా స్వతంత్రంగా వ్యవహరించినపుడు, అది నాల్గవ ప్రపంచం అవుతుంది" అని మిలాండో పేర్కొన్నాడు.

మాన్యుయెల్ రాసిన ది ఫోర్త్ వరల్డ్: ఎన్ ఇండియన్ రియాలిటీ (1974) ప్రచురించబడినప్పటి నుండి, ఫోర్త్ వరల్డ్ అనే పదం ఒక స్థితీ, స్థాయీ లేని, పేద, అట్టడుగు దేశాలకు పర్యాయపదంగా మారింది.[4] 1979 నుండి, సెంటర్ ఫర్ వరల్డ్ ఇండిజీనస్ స్టడీస్ వంటి థింక్ ట్యాంకులు పురాతన, గిరిజన, పారిశ్రామికేతర దేశాలు, ఆధునిక పారిశ్రామిక దేశ-రాజ్యాల మధ్య సంబంధాలను నిర్వచించడంలో ఈ పదాన్ని ఉపయోగించాయి.[5] 2007 లో స్వదేశీ ప్రజల హక్కులపై ఐరాస చేసిన ప్రకటనతో వాణిజ్యం, ప్రయాణం, భద్రత ప్రయోజనాల కోసం ఆదివాసీ దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాల రూపంలో నాల్గవ ప్రపంచ ప్రజల మధ్య కమ్యూనికేషన్లు, నిర్వహణ వేగవంతమయ్యాయి.[6] భారత వామపక్ష ఉద్యమంలో, నాల్గవ ప్రపంచంపై ఎంపీ పరమేశ్వరన్ ప్రకటించిన ఆలోచనలు విస్తృతమైన చర్చకు దారితీశాయి. చివరికి 2004 లో ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నుండి బహిష్కరించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
  • జాతీయ సంపద

మూలాలు

[మార్చు]
  1. "International day of the world's indigenous people". Asian Center for the Progress of Peoples. Archived from the original on 4 December 2008.
  2. Castells, Manuel (2000). "32: The Rise of the Fourth World" (PDF). In Held, David; McGrew, Andy (eds.). The Global Transformations Reader: An Introduction to the Globalization Debate. Cambridge: Polity Press. pp. 348–354. ISBN 978-0745631356. Archived from the original (PDF) on 31 October 2022.
  3. Castells, Manuel (29 January 2010). "2: The Rise of the Fourth World: Informational Capitalism, Poverty, and Social Exclusion". In Castells, Manuel (ed.). End of Millennium. Vol. 3 (Second ed.). doi:10.1002/9781444323436.ch2. ISBN 9781405196888.
  4. Griggs, Richard. "The breakdown of states". Center for World Indigenous Studies.[permanent dead link]
  5. Ryser, Rudolph C. (September 1993). "Toward the coexistence of nations and states". Center for World Indigenous Studies. Archived from the original on 25 July 2008. Retrieved 1 February 2008.
  6. Cloud, Redwing (10 August 2007). "United League of Indigenous Nations formed". Indian Country Today.