నాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Knol
180px
250px
A Knol on knee surgery
చిరునామాknol.google.com
నినాదంKnol, a unit of knowledge
వ్యాపారాత్మకమా?Yes
సైటు రకంReference
సభ్యత్వంYes
లభ్యమయ్యే భాషలుEnglish, Korean, Arabic, German, Dutch, Italian, French, Spanish, Japanese, Russian, Hebrew, Portuguese, Hindi
యజమానిGoogle
సృష్టికర్తGoogle
విడుదల తేదీJuly 23, 2008
ప్రస్తుత పరిస్థితిpublic beta

పలు రకాల అంశాలపై యూజర్లు రాసిన వ్యాసాలను చేర్చే లక్ష్యంతో గూగుల్‌ మొదలు పెట్టిన ప్రాజెక్టే నాల్‌ .[1] ఈ ప్రాజెక్టుకు గూగుల్‌కు చెందిన ఉదీ మాంబర్‌ సారథ్యం వహించారు.[2] 2007 డిసెంబర్‌ 13న ప్రకటించిన ఈ ప్రాజెక్టు చాలావరకు ఆరోగ్య, వైద్య రంగాలకు సంబంధించిన కొన్ని వందల వ్యాసాలతో 2008 జూలై 23న[3] బీటాలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.[2][4] ఆధారాలు, తటస్థ వైఖరి వంటివాటి విషయంలో నాల్‌కు ఎలాంటి విధానాలూ లేవు. నాల్‌లోని కొన్ని పేజీలు ఒకరు, లేదా ఎక్కువమంది రచయితల అభిప్రాయ పత్రాలు. మరిన్నేమో కొన్ని అమ్మకపు ఉత్పత్తులను వర్ణిస్తాయి. ఇంకొన్నేమో 'ఎలా చేయాలి' తరహావి. మరికొన్ని ఉత్పత్తుల వాడకాన్ని వివరిస్తాయి. ప్రతి వ్యాసం కిందా ఇతరులు తమ అభిప్రాయాలు, వ్యాఖ్యలను పోస్ట్‌ చేయవచ్చు. ఇతర అభిప్రాయాలను ఖండించవచ్చు. లేదా సంబంధిత ఉత్పత్తులు చెప్పేవాటిని తిరస్కరించవచ్చు.

నాల్‌ 100,000 వ్యాసాలకు విస్తరించిందని మరియు రోజూ సగటున 197 దేశాల నుండి వినియోగదారులు నాల్‌ను సందర్శిస్తున్నారని 2009 జనవరి 16న గూగుల్‌ ప్రకటించింది.[5] అప్పటి నుంచీ పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌ (పీఎల్‌ఓఎస్‌) కరెంట్స్‌: ఇన్‌ఫ్లుయెంజా [1]హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం స్పాన్సర్‌ చేసిన ఫోరం ఫర్‌ హెల్త్‌కేర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (హెచ్‌ఐటీ) ప్లాట్‌ఫామ్‌ [2]తమ పరిశోధనలను శరవేగంగా పరస్పరం మార్పిడి చేసుకునేందుకు నాల్‌ ఆధారిత సేకరణలను వాడుకున్నాయి.

నాల్‌ అనే పదాన్ని 'జ్ఞానానికి కొలత'గా [6]గూగుల్‌ నిర్వచిస్తుంది. ప్రాజెక్టును, అందులోని వ్యాసాలనూ ఇది సూచిస్తుంది.[1] నాల్‌ను వికీపీడియాతో పోటీ పడేందుకు గూగుల్‌ చేస్తున్న ప్రయత్నంగా పలువురు నిపుణులు చూస్తున్నారు[7]. మరికొందరేమో రెండు ప్రాజెక్టుల మధ్య పలు తేడాలను పేర్కొంటున్నారు.[8]

అంశం[మార్చు]

ఉదీ మాంబర్‌ మాటల్లో చెప్పాంటే, నాల్‌ పేజీలు సంబంధిత సమాచారాన్ని తొలిసారిగా వెదికేవారు చదవాలనుకునే వాటిలో తొట్టతొలి పేజీలు కావాలనే లక్ష్యంతో ఆవిర్భవించాయి.[1] కొత్త నాల్‌ వ్యాసాలను ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు (సొంతం కూడా చేసుకోవచ్చు). అందుకే ఒకే అంశంపై పలు వ్యాసాలు కూడా ఉండవచ్చు. ఒక్కోదాన్నీ ఒక్కో రచయిత రాస్తాడన్నమాట.[9][10] కానీ ఈ పద్ధతి కారణంగా వందలాది పునరుక్తి వ్యాసాలు వచ్చిపడ్డాయని విశ్లేషకులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.[11] ఎందుకంటే భిన్న వ్యాసాలకు కూడా ఒకే శీర్షిక ఉండవచ్చు. దాంతో పాఠకులకు వ్యాసాలు కేవలం శీర్షిక వల్ల మాత్రం కాకుండా, నిశితంగా పరిశీలించడం వల్ల దొరుకుతాయి. తమ వ్యాసాలను పాఠకులు ఎడిట్‌ చేసేందుకు, లేదా సహ రచయితలు మాత్రమే ఆ పని చేసేందుకు, లేదంటే వాటిని పూర్తిగా ఎడిటింగ్‌కు అతీతం చేసేందుకు రచయితలు తమతమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు.[1]

నాల్‌కు వ్యాసాంశాలపై కూడా ఒక విధానముంది. కొన్నిరకాల అంశాలను ప్రాజెక్టుకు అనర్హమైనవిగా ప్రకటించింది. సాదృశ నగ్నత్వాన్ని (చాలా దేశాల్లో)[12] అనుమతించింది. కానీ అశ్లీలత (వాణిజ్యపరంగానూ, ఇతరత్రా కూడా) మాత్రం నిషిద్ధం.[13] వివక్షాపూరిత, ఉల్లంఘనీయ అంశాలు కూడా నిషిద్ధమే. 2008లో నాల్‌ను చర్చా వేదికగా గూగుల్‌ ప్రమోట్‌ చేయసాగింది.[14]

వ్యాపారం, ఉత్పత్తులు, సేవలను ప్రమోట్‌ చేసుకునే కంటెంట్‌ను అనుమతించారు. కానీ పస లేని అంశాలకు, ఫక్తు ఆదాయాన్ని పిండుకునేందుకు ఉద్దేశించిన వ్యాసాలను మాత్రం నిషేధించారు.[13] గూగుల్‌కు చెందిన యాడ్‌సెన్స్‌ ద్వారా తమ పేజీల నుంచి ఏ ప్రకటనలను చేర్చాలో కూడా రచయితలు ఎంచుకోవచ్చు. ఈ లాభ పంపకం స్వీయ ప్రమోషన్‌ను, స్పామ్‌ను బాగా పెంచుతోందని విమర్శలు వచ్చాయి.[11][15][16]

ప్రక్రియ[మార్చు]

నాల్‌ ప్రాజెక్టుకు సాయపడేవారంతా ముందుగా గూగుల్‌ అకౌంట్‌లో సైన్‌ ఇన్‌ కావాలి. తమ అసలు పేర్లనే చెప్పాలి.[2] వారు అనుమతిస్తే, వారి పేరుకు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని వారి క్రెడిట్‌ కార్డులు, లేదా ఫోన్‌ (ప్రస్తుతం అమెరికావాసులైన యూజర్లకు మాత్రమే ఇది పరిమితం) ద్వారా గూగుల్‌ తనిఖీ చేస్తుంది. ఎవరేం రాశారో తెలుసుకోవడం ద్వారా వెబ్‌ కంటెంట్‌ను బాగా మెరుగు పరచవచ్చన్నది తమ విశ్వాసమని గూగుల్‌ పేర్కొంటోంది. తమ ప్రతిష్టను అందరికీ తెలిసేలా ఉంచడం ద్వారా రచయితలు తమ అభిప్రాయాలకు, దృక్కోణాలను మరింత విలువను ఆపాదిస్తారన్నది తమ నమ్మకమని చెబుతుంది.[1]

గూగుల్‌ అకౌంటున్న పాఠకులు ఏ వ్యాసానికైనా రేటింగ్‌ ఇవ్వవచ్చు. సవరణలు, సూచనలు చేయవచ్చు. వ్యాసాలను ఎడిట్‌ కూడా చేయవచ్చు. బ్లాగ్‌ ఎంట్రీ తర్వాత వ్యాఖ్యల రూపంలో ఇవన్నీ వీలవుతాయి. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు మాంబర్‌ ఇలా చెప్పారు. గూగుల్‌ ఏ రూపంలోనూ ఎడిటర్‌గా పని చేయదు. ఏ అంశం పట్లా అనురక్తి చూపదు. సంపాదకీయ బాధ్యతలు, నియంత్రణలన్నీ రచయితలవే.[1]

నాల్‌కు వచ్చే చేయూతలన్నీ క్రియేటివ్‌ కామన్స్‌ CC-BY-3.0 లైసెన్సు ద్వారా లైసెన్సు పొంది ఉంటాయి (నిజమైన రచయిత పేరు ఉన్నంత కాలం అందులోని అంశాన్ని ఎవరైనా తిరస్కరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది). కానీ రచయితలు CC-BY-NC-3.0 లైసన్సును గానీ (ఇది వాణిజ్యపరమైన పునర్వినియోగాన్ని నిషేధిస్తుంది), సంప్రదాయిక ఆల్‌రైట్స్‌ రిజర్వ్‌డ్ ‌ అనే కాపీరైట్‌ రక్షణ న్న లైసెన్సును గానీ ఎంచుకోవచ్చు.[2][17][18]

సెర్చ్‌ ఇంజన్‌ ర్యాంకింగులను ప్రభావతం చేసే వీల్లేకుండా ఉండేలా తన వ్యాసాల్లో లింకులను నిరోధించేందుకు ఒక HTML‌ సూచిక ద్వారా నోఫాలో ఔట్‌గోయింగ్‌ లింకులను నాల్‌ వాడుతుంది.[19]

ఆదరణ[మార్చు]

పోటీ[మార్చు]

నాల్‌ను వికీపీడియా, సిటిజన్‌డియం, స్కాలర్‌పీడియా వంటి సైట్లకు పోటీగా,[20] [21]అదే సమయంలో వికీపీడియాకు సంపూరకంగా వర్ణిస్తారు. వికీపీడియాలోని పలు పరిమితులను అధిగమించేలా భిన్నమైన ఫార్మాట్‌ను అది అందిస్తుంది.[22][23][24][25] వికీపీడియా పేరుకు, దాని ప్రాజెక్టు సర్వర్లకు సొంతదారైన లాభాపేక్ష లేని వికీమీడియా ఫౌండేషన్‌ గూగుల్‌ నాల్‌ను స్వాగతించింది. మంచి, మెరుగైన ఉచిత కంటెంట్‌ ఎంత వస్తే ప్రపంచానికి అంత మంచిది అని ఈ సందర్భంగా పేర్కొంది.[26] వికీపీడియా వ్యాసాలు తటస్థ వైఖరితో రాసినవి అయ్యుంటాయి.[27] నాల్‌ మాత్రం రచయిత పేరును చెప్పడం ద్వారా వ్యక్తిగత నైపుణ్యాన్ని బాగా నొక్కిచెబుతుంది.[10] స్క్విడూ, హబ్‌పేజెస్‌, హీలియం డాట్‌కామ్‌, నాల్‌ పేజెస్‌ వంటి వ్యాసాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలకు కూడా చోటిస్తాయి.[1][28]

వికీమీడియా గతంలో ఈ మేరకు స్పందించినా, రెండింటి కంటెంట్లో తేడాలున్నా, వికీపీడియాకు నాల్‌ తెచ్చిపెట్టగల పోటీని గురించి వికీమీడియా ఫౌండేషన్‌ మాజీ చెయిర్‌ ఫ్లారెన్స్‌ డివొయార్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.[29] నాల్‌ బెటా వచ్చిన తర్వాత, నాల్‌ నిజానికి వికీపీడియాను నిర్మూలించేలా ఉండాలని గూగుల్‌ భావిస్తోందని వచ్చిన అభిప్రాయాలపై ఆ సంస్థ ప్రోడక్ట్‌ మేనేజర్‌ సెడ్రిక్‌ డ్యూపాంట్‌ ఇలా స్పందించారు. వికీపీడియా ఇంత విజయవంతం అయినందుకు గూగుల్‌ చాలా సంతోషంగా ఉంది. వికీపీడియాను నిర్మూలించేందుకు ప్రయత్నించే వారెవరైనా మాకు కూడా చాలా హాని చేస్తారు.[4] నాల్‌, వికీపీడియాల డిజైన్‌లో ఒకే రకమైన ఫాంట్‌ వంటి పలు సారూప్యతలను ద న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.[4] అది కేవలం యాదృచ్ఛికమేనని, ఆ ఫాంట్‌ అందరూ మామూలుగా వాడేదేనని డ్యూపాంట్‌ దీనిపై స్పందించారు.[4]

నాల్‌ ఫార్మాట్‌ కారణంగా అది వికీపీడియా కంటే అబౌట్‌.‌కామ్‌ మాదిరిగా అవుతుందని పలువురు అన్నారు.[21] డైలీ టెక్‌ రచయిత వూల్ఫ్‌గాంగ్‌ హాన్సన్‌ అభిప్రాయంలో నాల్‌ను 'వాస్తవానికి అబౌట్‌ డాట్‌కామ్‌ కోసం అది వేలానికి వచ్చిన సందర్భంగా డిజైన్‌ చేసి ఉంటారు'. కానీ గూగుల్‌ అబౌట్‌ డాట్‌కామ్‌ మోడల్‌ నుంచి పక్కకు జరిగి వికీ మోడల్‌కు మారేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు ముందే తెలుసు. About.com తరహాలో ఉండే 500, ఆ పై చిలుకు గైడ్‌లను తీసేయడానికి కూడా బహూశా అదే కారణం కావచ్చు.[30]

ప్రయోజనాల సంఘర్షణ[మార్చు]

ఈ ప్రయోజనాల సంఘర్షణ ఫలితంగా గూగుల్‌ సెర్చ్‌ ఫలితాలు తటస్థంగా ఉండగలవా అన్నదానిపై బాగా చర్చ జరిగింది.[31][32] సెర్చ్‌ ఇంజన్‌ ల్యాండ్‌ ఎడిటర్‌ డానీ సులివాన్‌ అభిప్రాయంలో, నాల్‌ పేజీలను సెర్చ్‌ ఇంజన్లలో తేలిగ్గా దొరికేలా చేయాలన్న గూగుల్‌ లక్ష్యం కాస్తా, తటస్థంగా ఉండాలన్న ఆ సంస్థ లక్ష్యాలకు విఘాతకారి కాగలదు.[32] సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ డెమాక్రసీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ జెఫ్‌ చెస్టర్‌ కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేశారు. చివరికి చూస్తే గూగుల్‌ సామాజిక లక్ష్యాలకు, అది ఉన్న వ్యాపారానికి మధ్య మౌలిక సంఘర్షణ ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక్కటే. గూగుల్‌ నెమ్మదిగా ప్రకటనల ఆధారిత పద్ధతిని అక్కున చేర్చుకుంటోంది. అందులో ప్రజలు చూడాలనుకునే దానిపై డబ్బు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అన్నారు.[33] ఇలాంటి ఆందోళనకు స్పందనగా, గూగుల్‌ సైట్స్‌, యూట్యూబ్‌, బ్లాగర్‌, గూగుల్‌ గ్రూప్స్‌ వంటి పలు సైట్లలో గూగుల్‌ ఇప్పటికే చాలా సమాచారాన్ని ఉంచుతోందన్న విషయాన్ని ఎత్తిచూపడం,[24][31] ఈ విషయంలో దానికి పెద్ద తేడాలేమీ లేవని వివరించడం జరిగింది. ఫలితాలను తారుమారు చేసేందుకు గూగుల్‌ ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాలను టెక్నాలజీ వ్యాఖ్యాత నికోలస్‌ జి.కార్‌ కొట్టిపారేశారు. నాల్‌ పేజీల్లో అత్యంత పాఠకాదరణ ఉండేవి సెర్చ్‌ ఫలితాల ద్వారా వాటంతటవే సహజంగా పైకి వస్తాయన్నది గూగుల్‌ ఆకాంక్ష అని ఆయనన్నారు. తద్వారా వికీపీడియాను సవాలు చేస్తాయని, గూగుల్‌కు తన ప్రకటనలను ఇచ్చుకునేందుకు మరో వేదికను అవి ఏర్పాటు చేస్తాయని వ్యాఖ్యానించారు.[34][35]

2007 డిసెంబర్‌లో నాల్‌ ప్రకటితమైన నాటి నుంచీ గూగుల్‌ ఉద్దేశాలు, ఆర్గనైజర్‌గా కాకుండా కంటెంట్‌ నిర్మాతగా దాని వైఖరిని గురించి రకరకాల ఊహాగానాలు విన్పిస్తూ వస్తున్నాయి. ద గార్డియన్‌కు చెందిన జాక్‌ షోఫీల్డ్‌ దీనిపై ఇలా వాదించారు. నాల్‌ మొత్తం మీడియా పరిశ్రమ మీదనే జరుగుతున్న దాడికి ప్రతీక. [36]

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Manber, Udi (2007-12-13). "Encouraging People to Contribute Knowledge". Official Google blog (06:01:00 PM). Google. Retrieved 2008-07-23.
 2. 2.0 2.1 2.2 2.3 Levy, Steven (2008-07-23). "Google Throws Open Rival for Wikipedia — Anon Authors Discouraged". Wired News. Archived from the original on 2012-12-09. Retrieved 2008-07-23.
 3. Mills, Ellis (2008-07-23). "Google's Wikipedia rival, Knol, goes public". CNET News. Retrieved 2008-07-23.
 4. 4.0 4.1 4.2 4.3 Helft, Miguel (2008-07-23). "Wikipedia, Meet Knol". The New York Times. Retrieved 2008-07-23.
 5. Dupont, Cedric (2009-01-16). "100,000th knol published". Official Google blog (02:26:00 PM). Google. Retrieved 2009-01-16.
 6. Monaghan, Angela (2007-12-14). "Google's 'knol' may challenge Wikipedia". The Daily Telegraph. Retrieved 2007-12-15.
 7. "Google debuts knowledge project". BBC. 2007-12-15. Retrieved 2007-12-15. Many experts see the initiative as an attack on the widely used Wikipedia communal encyclopaedia.
 8. "Google Knol Released. It's Not Wikipedia".
 9. Schofield, Jack (2008-07-23). "Google opens up Knol, its Wikipedia-for-cash project". The Guardian. Retrieved 2008-07-26.
 10. 10.0 10.1 Blakely, Rhys (2007-12-15). "Google to tackle Wikipedia with new knowledge service". The Times. Retrieved 2007-12-15.
 11. 11.0 11.1 Anderson, Nate (Jan 19, 2009). "Google Knol six months later: Wikipedia need not worry". Ars Technica. Retrieved 2009-01-21.
 12. "Breast Augmentation". Knol.
 13. 13.0 13.1 "Content Policy". knol.google.com. Google. Retrieved 2008-07-23.
 14. Ghering, Matt (7 November 2008). "Knol debates: See both sides, get involved". Google Inc.
 15. Arthur, Chris (7 August 2008). "Google attacked over Knol's spam potential". The Guardian. Retrieved 2009-01-21.
 16. Manjoo, Farhad (September 22, 2008). "Chuck Knol". Slate. Retrieved 2008-09-23.
 17. నాల్‌ హెల్ప్‌ ఆన్‌ లైసెన్సెస్‌, నాల్‌.గూగుల్‌.కామ్‌. గూగుల్ 2008-07-25న గ్రహించబడినది.
 18. మైక్‌ లింక్‌స్వాయర్‌, గూగుల్‌ కోడ్‌ యాడ్స్‌ కంటెంట్‌ లైసెన్సింగ్‌: గూగుల్‌ నాల్‌ లాంచెస్‌ విత్‌ సీసీ బై డిఫాల్ట్‌. క్రియేటివ్‌ కామన్స్‌ బ్లాగ్‌, 2008 జూలై 23
 19. Lenssen, Philipp (2008-07-24). "Knol's Nofollowing Of Links". Google Blogoscoped. Retrieved 2008-07-30.
 20. Riley, Duncan (2007-12-14). "Google Knol: A Step Too Far?". TechCrunch. Retrieved 2007-12-14.
 21. 21.0 21.1 Frederick, Lane (2007-12-14). "Death Knell Sounds for Wikipedia, About.com". NewsFactor Network. Retrieved 2007-12-14.
 22. Masnick, Mike (2007-12-14). "Google Decides Organizing The World's Information Is Easier If That Info Is Online". Techdirt. Retrieved 2007-12-14.
 23. Manjoo, Farhad (2007-12-14). "Truthiness showdown: Google's "Knol" vs. Wikipedia". Salon.com. Retrieved 2007-12-14.
 24. 24.0 24.1 Hof, Rob (2007-12-14). "Google's Knol: No Wikipedia Killer". Businessweek. Retrieved 2007-12-14.
 25. ఫ్రెంచ్‌ నాల్‌ను చూడండి: పౌర్‌క్యూ నాల్‌ ఎట్‌ వికీపీడియా నే సోంట్‌ పస్‌ కంకరెంట్స్‌
 26. Levy, Ari (2007-12-14). "Google Starts Web Site Knol to Challenge Wikipedia". Bloomberg. Retrieved 2007-12-15.
 27. "Wikipedia:Neutral_point_of_view".
 28. Murrell, John (2007-12-14). "Google's philosophy: Knol thyself". SiliconValley.com. Retrieved 2007-12-14.
 29. పిపెర్మెయిల్/ఫౌండేషన్-l/2007-December/036209.html [Foundation-l [Announcement] update in board of trustees membership]
 30. Hansson, Wolfgang (2007-12-14). "Google Announces Knol Wikipedia-like Service". DailyTech. Retrieved 2007-12-14.
 31. 31.0 31.1 Greenberg, Andy (2007-12-14). "Google's Know-It-All Project". Forbes. Retrieved 2007-12-16.
 32. 32.0 32.1 Helft, Miguel (2007-12-15). "Wikipedia Competitor Being Tested by Google". New York Times. Retrieved 2007-12-15. Some critics said that shift could compromise Google’s objectivity in presenting search results.
 33. Schiffman, Betsy (2007-12-14). "Knol Launch: Google's 'Units of Knowledge' May Raise Conflict of Interest". Wired. Retrieved 2007-12-15.
 34. Carr, Nicholas (2007-12-13). "Google Knol takes aim at Wikipedia". Retrieved 2007-12-14.
 35. Morrison, Scott (2007-12-14). "Google Targets Wikipedia With New 'Knol' Pages". The Wall Street Journal. Retrieved 2008-07-24.
 36. Schofield, Jack (2007-12-15). "Google tries Knol, an encyclopedia to replace Wikipedia". The Guardian. Retrieved 2007-12-15.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Google Inc.

"https://te.wikipedia.org/w/index.php?title=నాల్&oldid=1512065" నుండి వెలికితీశారు