నాళీజంఘుఁడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక బకశ్రేష్ఠుఁడు (కొంగ). మధ్యదేశమునందు గౌతముఁడు అను బ్రాహ్మణుని కొమారుఁగు ఒకడు, వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుఁడు అయి బోయలతో కలసి ధనము ఘటింప తిరుగుచు ఒకనాఁడు నాళీజంఘుని ఒద్దకు పోఁగా అతఁడు తన సఖుఁడగు ఒక దైత్యభర్తవలన వానికి ధనము ఇప్పించెను. ఆధనమును కైకొనిపోవునపుడు ఆక్రూరుఁడు కొంత అయిన నెనరు లేనివాఁడు అయి, నిద్రపోవుచు ఉన్న నాళీజంఘుని తన ఆహారార్థము చంపెను. అంత నాళీజంఘుని చెలికాఁడు అగు దైత్యుఁడు ఇది ఎఱిఁగి ఆ బ్రాహ్మణుని వధించెను. వాఁడు కృతఘ్నుఁడు ఐనందున వాని మాంసమును కుక్కలుకూడ ముట్టవయ్యె. ఆవల నాళీజంఘుడు తన మహనీయత వలన పునర్జీవితుఁడు అయి బ్రాహ్మణుని మరల బ్రదికించి ఇఁక ఇట్లు చేయకుము అని బుద్ధిచెప్పి పంపెను.

...............పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879