Jump to content

నికర లాభం

వికీపీడియా నుండి

వ్యాపారంలో, అకౌంటింగులో, నికర లాభం అనేది, అకౌంటింగ్ కాలంలో ఒక సంస్థ సాధించిన ఆదాయం నుండి, అమ్మిన వస్తువుల ఖర్చు, వ్యయాలు, తరుగుదల, అమోర్టైజేషన్, వడ్డీ, పన్నులు, ఇతర ఖర్చులను తీసివేసిన తర్వాత వచ్చేది.[1]

దీనిని ఆ కాలానికి సంబంధించిన అన్ని రాబడులు, లాభాల నుండి అన్ని ఖర్చులు, నష్టాలను తీసివేసిన తరువాత మిగిలినదిగా లెక్కిస్తారు. దీనిని ఒక కంపెనీ కార్యకలాపాల ఫలితంగా వాటాదారుల ఈక్విటీలో వచ్చే నికర పెరుగుదలగా కూడా నిర్వచించారు. ఇది స్థూల లాభం కంటే భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే స్థూల లాభంలో రాబడి నుండి అమ్మిన వస్తువుల ఖర్చును మాత్రమే తీసివేస్తారు.

కుటుంబాలు, వ్యక్తులకు, నికరాదాయం అంటే (స్థూల) ఆదాయం నుండి పన్నులు, ఇతర తగ్గింపులను (ఉదా. తప్పనిసరి పెన్షన్ చెల్లింపులు) తీసివేసిన తర్వాత మిగిలినది.

నిర్వచనం

[మార్చు]

నికరాదాయాన్ని సాధారణ స్టాక్ హోల్డర్లకు డివిడెండుగా పంపిణీ చేయవచ్చు. లేదా సంస్థ దాచుకున్న లాభాలకు చేర్చుకోవచ్చు. లాభం, ఆదాయాలు అనేవి ఆదాయానికి పర్యాయపదాలుగా ఉపయోగించబడతాయి కాబట్టి (ఇది UK, US వాడుకపై కూడా ఆధారపడి ఉంటుంది), నికరాదాయాలు, నికర లాభం అనేవి సాధారణంగా నికర ఆదాయానికి పర్యాయపదాలే. తరచుగా, నికర ఆదాయానికి బదులుగా ఆదాయం అనే పదాన్ని ఉపయోగిస్తారు, కానీ ఇందులో అస్పష్టతకు అవకాశం ఉంన్నందున దీనిని విరివిగా వాడరు. సాధారణంగా నికరాదాయం కంపెనీ ఆదాయ నివేదికలో చివరి పంక్తిలో కనిపిస్తుంది కాబట్టి, దీన్ని అనధికారికంగా బాటమ్ లైన్ అంటారు. దీనికి సంబంధించిన పదమే, టాప్ లైన్. అంటే రాబడి, ఇది ఖాతా నివేదికలో మొదటి పంక్తిలో వస్తుంది.

సరళంగా చెప్పాలంటే, ఒక ప్రయత్నానికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బే నికర లాభం. ఆచరణలో, పెద్ద సంస్థలలో ఇది చాలా సంక్లిష్టంగా మారవచ్చు. బుక్‌కీపర్ లేదా అకౌంటెంటు, ఈ పదాన్ని వర్తింపజేసే నిర్దిష్ట పని పరిధికీ సందర్భానికీ అనుగుణంగా ఆదాయాలు, ఖర్చులను సరిగ్గా జాబితా చేసి కేటాయించాలి.

నికరాదాయం సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి, వార్షికంగా లెక్కిస్తారు. తీసివేసే అంశాలలో సాధారణంగా పన్ను ఖర్చు, ఫైనాన్సింగ్ ఖర్చు ( వడ్డీ ఖర్చు ), మైనారిటీ వాటా ఉంటాయి. అదేవిధంగా, ప్రిఫర్డ్ స్టాక్ డివిడెండ్‌లు కూడా, ఇవి ఖర్చులు కానప్పటికీ, తీసివేస్తారు. ఒక వర్తక సంస్థకు, తీసివేయబడిన ఖర్చులలో అమ్మిన వస్తువుల ఖర్చు, అమ్మకాలపై తగ్గింపులు, అమ్మకాల వాపసులు, అలవెన్సులూ ఉండవచ్చు. ఒక ఉత్పత్తి సంస్థ విషయంలో, ప్రకటనలు, తయారీ, రూపకల్పన, అభివృద్ధి ఖర్చులను పరిగణిస్తారు. ఒక కంపెనీ నిర్వహణ ఆదాయానికి నిర్వహణేతర ఆదాయాన్ని కలిపి, ఆపై పన్నులను తీసివేయడం ద్వారా కూడా నికర ఆదాయాన్ని లెక్కించవచ్చు.[2]

నికర లాభ మార్జిన్ శాతం అనేది ఒక సంబంధిత నిష్పత్తి. నికర లాభాన్ని రాబడి లేదా టర్నోవర్‌తో భాగించడం ద్వారా ఈ సంఖ్యను లెక్కిస్తారు. ఇది లాభదాయకతను శాతంలో సూచిస్తుంది.

నికరాదాయానికి ఒక సమీకరణం

[మార్చు]

నికర లాభం: ఒక సంస్థ (కంపెనీ, విభాగం లేదా ప్రాజెక్ట్ వంటివి) నికర లాభాన్ని లెక్కించడానికి, స్థూల ఆదాయాలు లేదా టర్నోవర్ నుండి మొత్తం కార్పొరేట్ ఓవర్‌హెడ్స్‌లో సముచితమైన వాటాతో సహా అన్ని ఖర్చులను తీసివేయాలి.[3]

నికరాదాయ గణనకు సంబంధించిన వివరణాత్మక ఉదాహరణ:

నికర లాభం అనేది ఒక సంస్థ ప్రాథమిక లాభదాయకతకు కొలమానం. "ఇది కార్యకలాపాల ఆదాయాల నుండి ఆ కార్యకలాపాలకు అయిన ఖర్చులను తీసివేయగా వచ్చేది. ఇందులో ప్రధాన సంక్లిష్టత ఏమిటంటే... దీనిని వివిధ సంస్థలకు కేటాయించవలసి వచ్చినప్పుడు". "దాదాపు నిర్వచనం ప్రకారం, ఓవర్‌హెడ్ ఖర్చులు అనేవి ఏ నిర్దుష్ట" ప్రాజెక్టు, ఉత్పత్తి లేదా విభాగానికి నేరుగా ముడిపెట్టలేని ఖర్చులు. "ప్రధాన కార్యాలయ సిబ్బంది ఖర్చు దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ". "ఒక ఉత్పత్తి లేదా ప్రాంతం వంటి ఏదైనా ఉప-సంస్థకు (సంస్థకు) లాభాలను సిద్ధాంతపరంగా లెక్కించడం సాధ్యమైనప్పటికీ, ఓవర్‌హెడ్ ఖర్చులను కేటాయించవలసిన అవసరం కారణంగా తరచుగా ఈ లెక్కలు సందేహాస్పదంగా మారతాయి." ఓవర్‌హెడ్ ఖర్చులు సాధారణంగా స్పష్టమైన ప్యాకేజీలలో రానందున, వాటిని వివిధ సంస్థలకు కేటాయించడం అనేది ఒక కచ్చితమైన శాస్త్రం కాదు.

ఉదాహరణ

[మార్చు]

లాభ నష్టాల (P & L) ఖాతాలో నికర లాభం:

  1. అమ్మకాలపై రాబడి = ధర (ఉత్పత్తి యొక్క) × అమ్మిన పరిమాణం
  2. స్థూల లాభం = అమ్మకాల రాబడి − అమ్మకాల ఖర్చు, ఇతర ప్రత్యక్ష ఖర్చులు
  3. నిర్వహణ లాభం = స్థూల లాభం − ఓవర్‌హెడ్‌లు, ఇతర పరోక్ష ఖర్చులు
  4. EBIT (వడ్డీ, పన్నులకు ముందు ఆదాయం) = నిర్వహణ లాభం + వడ్డీ ఆదాయం + ఇతర నిర్వహణేతర ఆదాయం
  5. EBT (పన్నుకు ముందు లాభం, పన్నులకు ముందు ఆదాయాలు) = EBIT − వడ్డీ ఖర్చులు − ఇతర నిర్వహణేతర ఖర్చులు
  6. నికర లాభం = పన్నుకు ముందు లాభం − పన్ను
  7. నిలుపుకున్న ఆదాయాలు = నికర లాభం − డివిడెండ్లు

నికర ఆదాయాన్ని లెక్కించడానికి మరో సమీకరణం:

నికర అమ్మకాలు (ఆదాయం) - అమ్మిన వస్తువుల ఖర్చు = స్థూల లాభం - SG&A ఖర్చులు (కంపెనీని నిర్వహించడానికి అయ్యే మొత్తం ఖర్చులు) - పరిశోధన, అభివృద్ధి (R&D) = వడ్డీ, పన్నులు, తరుగుదల, అమోర్టైజేషన్‌కు ముందు ఆదాయాలు (EBITDA) - తరుగుదల, అమోర్టైజేషన్ = వడ్డీ, పన్నులకు ముందు లాభం (EBIT) - వడ్డీ ఖర్చు (డబ్బు అప్పుగా తీసుకోవడానికి అయ్యే ఖర్చు) = పన్నులకు ముందు లాభం (EBT) - పన్ను ఖర్చు = నికర ఆదాయం (EAT)

ఇతర పదాలు

[మార్చు]
నికర అమ్మకాలు = స్థూల అమ్మకాలు – (కస్టమర్ డిస్కౌంట్లు, రిటర్న్‌లు, అలవెన్సులు)
స్థూల లాభം = నికర అమ్మకాలుఅమ్ముడైన వస్తువుల ఖర్చు
నిర్వహణ లాభం = స్థూల లాభം – మొత్తం నిర్వహణ ఖర్చులు
నికర లాభం = నిర్వహణ లాభం – పన్నులు – వడ్డీ
నికర లాభం = నికర అమ్మకాలుఅమ్ముడైన వస్తువుల ఖర్చునిర్వహణ ఖర్చు – పన్నులు – వడ్డీ
నికర అమ్మకాలు = స్థూల అమ్మకాలు – (కస్టమర్ డిస్కౌంట్లు, రిటర్న్‌లు, అలవెన్సులు)
స్థూల లాభം = నికర అమ్మకాలుఅమ్ముడైన వస్తువుల ఖర్చు
నిర్వహణ లాభం = స్థూల లాభം – మొత్తం నిర్వహణ ఖర్చులు
నికర లాభం = నిర్వహణ లాభం – పన్నులు – వడ్డీ
నికర లాభం = నికర అమ్మకాలుఅమ్ముడైన వస్తువుల ఖర్చునిర్వహణ ఖర్చు – పన్నులు – వడ్డీ  

మూలాలు

[మార్చు]
  1. "IAS 1 Presentation of Financial Statements" (PDF). IFRS Foundation. 2012. Retrieved April 14, 2012.
  2. "Net Income Formula". New Business Playbook. Archived from the original on 2013-10-19.
  3. "Gross Profit vs. Net Income: What's the Difference?". Investopedia.
"https://te.wikipedia.org/w/index.php?title=నికర_లాభం&oldid=4908876" నుండి వెలికితీశారు